1, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1099 (ఉవిదకు నుంగరమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.

30 కామెంట్‌లు:

Pandita Nemani చెప్పారు...

వివిధౌషధముల గైకొని
నవల యొకతె సన్నబడెను నాజూకులతో
యువతులు భళి! పొగడగ నా
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

కంది శంకరయ్య చెప్పారు...

పండిత నేమాని వారూ,
నాజూకైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

జవరాలి ముద్రికను నొక
నవసాలియె మార్చె నొడ్డియానము గాఁగన్!
రవణించు నగ ధరించిన
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

(అవసాలి=స్వర్ణకారుఁడు; ఒడ్డాణము>ఒడ్డియానము...రూపాంతరము "తెలుగు పర్యాయపద నిఘంటువు"న నున్నది)

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కవి వర్ణించెను కథలో
యువరాణిని పట్టి తెచ్చె నొక రాక్షసుడే
జవరాలి కతడు పెట్టగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్


సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

నవలావణ్యఁపు మెఱుఁగుల
కివిసాటియె యంచు ప్రియుఁడునీప్సిత మనమున్
స్తవమొనరించగ పొంగెడు
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...


జవరాలి యాటలందున
నవలామణి రూపమందు నటియించెడు బొ
మ్మ వధువయినచో మరి యా
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణమయెన్/ణమ్మౌ

గురువుగారు,
విష్ణునందన్ గారు ఒకసారి అయెన్ వ్యాకరణ రూపము సరికాదని చెప్పినట్టు జ్ఞాపకం.

మంద పీతాంబర్ చెప్పారు...

నవ వధువౌ సీత వరుడు
రవికులతిలకుని ప్రతిమలు రమణీయమ్మై
నవమిన ధగధగ మెరియ
న్నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !!!

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మహాకాయుడైన రాక్షసుడి ఉంగరము మానవకాంతకు ఒడ్డాణమైనదన్న మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ రన్నది నిజమే... ధన్యవాదాలు.
మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

Seena చెప్పారు...


రవి చంద్రులు తాటంకము
లు,వసుధ తానాయె నాభి, లోకేశ్వరి కా
దివియే నడుమట, శివుని
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ (దివి = ఆకాశము )

Seena చెప్పారు...

రవి చంద్రులు తాటంకము
లు,వసుధ తానాయె నాభి, లోకేశ్వరి కా
దివితానె నడుమట, శివుని
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ (దివి = ఆకాశము )

మూడవ పాదము లో గణ దోషము సవరించి పంపు చున్నాను. మన్నించ గలరు .

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
కరిష్మా కపూర్ జిరో సైజ్ పై
====+====
వివిధ విధముల నడుము ప్రా
భవమును బెంచిన నటి పొందె వైభవమును, సా
ధువు నొసగెనుంగర మొకటి,
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
మీ ప్రయోగము వివిధ విధముల అనుట సాధువు కాదు. వివిధ అంటేనే అనేక విధములైన అనే అర్థము. స్వస్తి.

కందుల వర ప్రసాద్ చెప్పారు...

క్రికెట్ లో,టివిలో బహుమతిగా పెద్దవి ఇచ్చెదరు.అటు వంటి బహుమతి ఉంగరమును ధరించగ సుందరి
=====*======
కవితలు జక్కగ వ్రాయగ
యువిదకొసగె నుంగరమ్మునొక బహుమతిగన్,
వివరము మరచి ధరించిన
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

కందుల వర ప్రసాద్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
మంద బుద్ధికి మరి మరి వెదకిన పదములు దొరకుట లేదు,పదమును సూచించి తప్పును సరిజేయగలరు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నవ మల్లిక నడుము సొగసు
నవ విధి వర్ణింతు రెపుడు నాజూకనుచున్ !
కవనమున కవుల కల్పన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !

కంది శంకరయ్య చెప్పారు...


అతిశయోక్తితో చెప్పిన పూరణము (సరదాగా)

ధవు నెడఁబాసియు మోదము
లవలేశము నందకుండ లంకాపురిలో
నవయు ధరాత్మజ యగు న
య్యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.
(నవయు = కృశించు)

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

maasTaru gaaroo ! seetaaadEvi digulutO chikkina vishayaanni cakkagaa ceppaaru.... baaguMdi.

Unknown చెప్పారు...

కవిత కరగించి తన పా
త విలువగల యుంగరమును దనయకు జేయిం
చె వెడద యొడ్డాణముగన్ -
ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

కంది శంకరయ్య చెప్పారు...

‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో నేమాని వారి అభ్యంతరమే కాక గణదోషం కూడా ఉంది. ఆ పాదాన్ని ‘స్తవనీయ మగు నడుము ప్రా...’ అందాం. రెండవ పాదంలోనూ గణదోషం. ‘పెంచిన నటి’ని ‘పెంచి నటి’ అంటే సరి.
రెండవ పూరణలో ‘వ్రాయగ / నువిద కొసగె..’ అనండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

Rao S Lakkaraju చెప్పారు...

@రాజేశ్వరి నేదునూరి గారూ

నవ మల్లిక నడుము సొగసు ----- వావ్

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు
నా తప్పులకు మన్నించగలరు.
శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారూ మీ మల్లిక ---అదుర్స్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ లక్కరాజు గారికీ . వర ప్రసాద్ గారికీ ! ధన్య వాదములు మాతమ్ముడి పేరుకుడా ఈశ్వర వర ప్రసాద్ .నా ఇద్దరి చెల్లెళ్ళ తర్వాత ఒక్కడే తమ్ముడు

జిగురు సత్యనారాయణ చెప్పారు...

ధవుడొప్పుకొనెను బటువుకు
నవనికి పసిడి ధరలు దిగి యాశలు పెంపై
సవరులు హెచ్చుగఁ బెట్టిన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

కంది శంకరయ్య చెప్పారు...

జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

బొడ్డు శంకర్ చెప్పారు...

జవరాలి నడుము తీవని
సవినయముగ తెలియజేసి సంబరపెడుతూ
కవనము లల్లుచు నిచ్చిన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

సవరలు మూడని తెలియగ
నవనిజ మూర్తికి సరియని యవ్వవి నగల
న్నవలీలగ కరిగించగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

Zilebi చెప్పారు...



భవబంధములను జూచుచు
భువనంబందు నెలతుకకు భూమాతవలెన్
కవనంబుల రింగులమర
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

అవలీలగ నేనిచ్చిన
యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
జవరాలే కరిగించుచు
భవబంధమ్ములను త్రుంచు భగవతికిడగా