1, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1099 (ఉవిదకు నుంగరమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.

30 కామెంట్‌లు:

  1. వివిధౌషధముల గైకొని
    నవల యొకతె సన్నబడెను నాజూకులతో
    యువతులు భళి! పొగడగ నా
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    నాజూకైన భావంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. జవరాలి ముద్రికను నొక
    నవసాలియె మార్చె నొడ్డియానము గాఁగన్!
    రవణించు నగ ధరించిన
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

    (అవసాలి=స్వర్ణకారుఁడు; ఒడ్డాణము>ఒడ్డియానము...రూపాంతరము "తెలుగు పర్యాయపద నిఘంటువు"న నున్నది)

    రిప్లయితొలగించండి
  4. కవి వర్ణించెను కథలో
    యువరాణిని పట్టి తెచ్చె నొక రాక్షసుడే
    జవరాలి కతడు పెట్టగ
    నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్


    రిప్లయితొలగించండి
  5. నవలావణ్యఁపు మెఱుఁగుల
    కివిసాటియె యంచు ప్రియుఁడునీప్సిత మనమున్
    స్తవమొనరించగ పొంగెడు
    నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.

    రిప్లయితొలగించండి

  6. జవరాలి యాటలందున
    నవలామణి రూపమందు నటియించెడు బొ
    మ్మ వధువయినచో మరి యా
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణమయెన్/ణమ్మౌ

    గురువుగారు,
    విష్ణునందన్ గారు ఒకసారి అయెన్ వ్యాకరణ రూపము సరికాదని చెప్పినట్టు జ్ఞాపకం.

    రిప్లయితొలగించండి
  7. నవ వధువౌ సీత వరుడు
    రవికులతిలకుని ప్రతిమలు రమణీయమ్మై
    నవమిన ధగధగ మెరియ
    న్నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !!!

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మహాకాయుడైన రాక్షసుడి ఉంగరము మానవకాంతకు ఒడ్డాణమైనదన్న మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రన్నది నిజమే... ధన్యవాదాలు.
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  9. రవి చంద్రులు తాటంకము
    లు,వసుధ తానాయె నాభి, లోకేశ్వరి కా
    దివియే నడుమట, శివుని
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ (దివి = ఆకాశము )

    రిప్లయితొలగించండి
  10. రవి చంద్రులు తాటంకము
    లు,వసుధ తానాయె నాభి, లోకేశ్వరి కా
    దివితానె నడుమట, శివుని
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ (దివి = ఆకాశము )

    మూడవ పాదము లో గణ దోషము సవరించి పంపు చున్నాను. మన్నించ గలరు .

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
    శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    కరిష్మా కపూర్ జిరో సైజ్ పై
    ====+====
    వివిధ విధముల నడుము ప్రా
    భవమును బెంచిన నటి పొందె వైభవమును, సా
    ధువు నొసగెనుంగర మొకటి,
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రయోగము వివిధ విధముల అనుట సాధువు కాదు. వివిధ అంటేనే అనేక విధములైన అనే అర్థము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. క్రికెట్ లో,టివిలో బహుమతిగా పెద్దవి ఇచ్చెదరు.అటు వంటి బహుమతి ఉంగరమును ధరించగ సుందరి
    =====*======
    కవితలు జక్కగ వ్రాయగ
    యువిదకొసగె నుంగరమ్మునొక బహుమతిగన్,
    వివరము మరచి ధరించిన
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    మంద బుద్ధికి మరి మరి వెదకిన పదములు దొరకుట లేదు,పదమును సూచించి తప్పును సరిజేయగలరు

    రిప్లయితొలగించండి
  15. నవ మల్లిక నడుము సొగసు
    నవ విధి వర్ణింతు రెపుడు నాజూకనుచున్ !
    కవనమున కవుల కల్పన
    నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ !

    రిప్లయితొలగించండి

  16. అతిశయోక్తితో చెప్పిన పూరణము (సరదాగా)

    ధవు నెడఁబాసియు మోదము
    లవలేశము నందకుండ లంకాపురిలో
    నవయు ధరాత్మజ యగు న
    య్యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.
    (నవయు = కృశించు)

    రిప్లయితొలగించండి
  17. కవిత కరగించి తన పా
    త విలువగల యుంగరమును దనయకు జేయిం
    చె వెడద యొడ్డాణముగన్ -
    ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

    రిప్లయితొలగించండి
  18. ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో నేమాని వారి అభ్యంతరమే కాక గణదోషం కూడా ఉంది. ఆ పాదాన్ని ‘స్తవనీయ మగు నడుము ప్రా...’ అందాం. రెండవ పాదంలోనూ గణదోషం. ‘పెంచిన నటి’ని ‘పెంచి నటి’ అంటే సరి.
    రెండవ పూరణలో ‘వ్రాయగ / నువిద కొసగె..’ అనండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. @రాజేశ్వరి నేదునూరి గారూ

    నవ మల్లిక నడుము సొగసు ----- వావ్

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు
    నా తప్పులకు మన్నించగలరు.
    శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారూ మీ మల్లిక ---అదుర్స్.

    రిప్లయితొలగించండి
  22. నమస్కారములు
    శ్రీ లక్కరాజు గారికీ . వర ప్రసాద్ గారికీ ! ధన్య వాదములు మాతమ్ముడి పేరుకుడా ఈశ్వర వర ప్రసాద్ .నా ఇద్దరి చెల్లెళ్ళ తర్వాత ఒక్కడే తమ్ముడు

    రిప్లయితొలగించండి
  23. ధవుడొప్పుకొనెను బటువుకు
    నవనికి పసిడి ధరలు దిగి యాశలు పెంపై
    సవరులు హెచ్చుగఁ బెట్టిన
    నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

    రిప్లయితొలగించండి
  24. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. జవరాలి నడుము తీవని
    సవినయముగ తెలియజేసి సంబరపెడుతూ
    కవనము లల్లుచు నిచ్చిన
    నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

    రిప్లయితొలగించండి
  26. సవరలు మూడని తెలియగ
    నవనిజ మూర్తికి సరియని యవ్వవి నగల
    న్నవలీలగ కరిగించగ
    నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

    రిప్లయితొలగించండి


  27. భవబంధములను జూచుచు
    భువనంబందు నెలతుకకు భూమాతవలెన్
    కవనంబుల రింగులమర
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. అవలీలగ నేనిచ్చిన
    యువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
    జవరాలే కరిగించుచు
    భవబంధమ్ములను త్రుంచు భగవతికిడగా

    రిప్లయితొలగించండి