26, జులై 2013, శుక్రవారం

పద్య రచన – 414 (పేదరాసి పెద్దమ్మ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పేదరాసి పెద్దమ్మ”

15 కామెంట్‌లు:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ప్రాత కథలకు నామెయే పట్టుగొమ్మ
బాటసారుల కామెయే పూట కూళ్ళు
పేదరాలయ్యి పోయెగా పెద్దదయ్యి
ఆదరించెడు కథలేక నయ్యొ రామ !

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ఆమెయే పూటకూళ్ళు’ అనడం కంటే ‘బాటసారులకును బెట్టు పూటకూళ్ళు’ అంటే బాగుంటుందేమో?

Pandita Nemani చెప్పారు...

పెద్దమ్మ, యాదరించుచు
పెద్దమనసు తోడ కూడు బెట్టుచు నెంతో
నొద్దికతో కథ చెప్పుచు
తద్దయు పులకింపజేయు తల్లికి జేజే

కంది శంకరయ్య చెప్పారు...

పండిత నేమాని వారూ,
పెద్దమ్మ పెద్దరికాన్ని వివరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.

subbarao చెప్పారు...

బాటసారులకు మిగుల బంధు వయ్యి
కూడువెట్టును బ్రియమున కొసరి కొసరి
గ్రామ వార్తలు సెప్పును గధలు గాను
పేదరాసి పెద్దమ్మ నా బేరు వడసి .

కంది శంకరయ్య చెప్పారు...

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. "బంధువయ్యి" అనే ప్రయోగము సాధువు కాదు. బంధువగుచు అని గానీ బంధు వనగ అని గానీ అనవచ్చు నేమో? స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మనిషి పేదైన కాదామె మనసు పేద
ఆద రించును పాంధుల సేద దీర
విపిన మందైన దినిపించు కపిల గోవు
కధలు కావ్యాలు వినిపించి కరుణ తోన !

Unknown చెప్పారు...

ముగ్గురమ్మల వరమున పుట్టినమ్మ
ఈగ మొదలుగ ఎల్లరి బాగు కొరకు
తెలుగునాతను కథలలో వెలుగుయమ్మ
పేదరాసింటి పెద్దమ్మ విందులమ్మ

దేశదేశాలవారికాతిద్యమిచ్చి
కష్టసుఖములనన్నియు ఇష్టగోష్టి
పంచుకొనుచును సాయమందించుతల్లి
విశ్వశాంతిని గోరిన ప్రేమమూర్తి

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పాదాలూ బాగున్నవి. అభినందనలు.
‘వెలుగుయమ్మ’ను ‘వెలుగునట్టి’ అనండి.

కందుల వర ప్రసాద్ చెప్పారు...

చిన్న నాడు జెప్పుకున్న చిన్న కథను పద్య రూపమున
======*======
బిడ్డలు లేకను నొక్క -పేదరాసి పెద్దమ్మ బెంచె
గడ్డములున్న మేకలను - గారాబముగ,పెద్ద మేక
యడ్డ బొట్టుల తోడ సంత- నందు దిరిగి దెచ్చె ధనము
గడ్డి జాటున,జూచిన నొక- కలికి శునకమును బంపె
గడ్డి తోడను దెచ్చెనునొక- కంపు గొట్టెడి మాంసమునను.

బొడ్డు శంకర్ చెప్పారు...

బాట సారుల ఆకలి బాధ దీర్చు
నలసి వచ్చిన వారిని ఆదరించు
విడిది చేసిన వారికి విడియ మిచ్చు
పేదరాసి పెద్దమ్మది పెద్దమనసు!

కంది శంకరయ్య చెప్పారు...

వరప్రసాద్ గారూ,
చిన్నప్పటి కథకు పద్యరూపాన్ని ఇచ్చారు. సంతోషం.
కానీ కథలో స్పష్టత లోపించింది.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
ఒక సూచన... పద్యం మధ్యలో అచ్చులు వ్రాయడం సంప్రదాయం కాదు. అక్కడ యడాగమ, నుగాగమాలు చేసి వ్రాస్తే బాగుంటుంది.

బొడ్డు శంకర్ చెప్పారు...


శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు, మీర సూచించిన నియమాలతో పద్యాన్ని సవరిస్తూ.....
బాట సారుల యాకలి బాధ దీర్చు
నలసి వచ్చిన వారల నాదరించు
విడిది చేసిన వారికి విడియమిచ్చు
పేదరాసి పెద్దమ్మది పెద్దమనసు