5, ఏప్రిల్ 2016, మంగళవారం

సమస్య – 1994 (అధికారాంతమునఁ జూడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.
(ద-ధ-థ ప్రాస నిషేధం! ‘అధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్/భోగమ్ములన్’ అని మత్తేభ పాదంగా ప్రసిద్ధమైన ఈ సమస్యను కందపాదంగా మార్చాను)
(జ్వరం వల్ల నీరసం ఇంకా ఉంది. సంపూర్ణ ఆరోగ్యం చిక్కగానే ‘పద్యరచన’ శీర్షికను ప్రారంభిస్తాను)

51 కామెంట్‌లు:

  1. బుధులగు వారలు నిరతము
    విధులను సక్రమము గాను వేయి విధమ్ముల్
    పదుగురి మెప్పును పొందగ
    అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్

    రిప్లయితొలగించండి


  2. బధిరుడొకడు తీవ్రముగా
    విధిగన యేండ్లన తపస్సు విరివిగ జేయన్
    అధిపుడయినాడు కలిగెను
    అధికా రాంతమున జూడ నగు భోగమ్ముల్


    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘విధిగన+ఏండ్లన’ అన్నపుడు యడాగమం రాదు. ‘విధిగా పెక్కేండ్లు తపసు విరివిగ...’ అనండి.

      తొలగించండి
  3. అధములు కొందరు పరిపరి
    విధముల వంచనలు చేసి విజయములందన్
    బుధులగు వారలు తమతమ
    యధికారాంతమున జూడనగుభోగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారికి నమస్కారములు

    బుధులగు వారలు పోలీ
    సధికారులుగాను జేరి సమయము నంతన్
    విధినిర్వహణము జేసిన
    యధికారాంతమున జూడనగు భోగమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘...జేసిన| నధికారాంతమున...’ అనండి.

      తొలగించండి

  5. విధులనునేమియుజేయరు అధికారాంతమున,జూడనగుభోగమ్ము ల్లధికారముండునెడలను
    నధికారములేనియెడలనన్నియుసున్నే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది.
      ‘...జేయరు+అధికారాంతమున’ అన్నపుడు సంధి నిత్యం కదా! ‘...జేయరె| యధికారాంతమున...’ అనండి.

      తొలగించండి
  6. ద-ధ-థ ప్రాస నిషేధం!.......ఇదేమిటో అర్థం కాలేదండీ.

    రిప్లయితొలగించండి
  7. సుకవి మిత్రులు మిస్సన్న గారికి మిత్రులందఱకు నమస్సులు!

    ఇచ్చిన సమస్యలో ప్రాసాక్షరము ’ధ’ మాత్రమే యుపయోగించవలెను. ఇతరములైన ద-థ లను వాడరాదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. అధికారములో వెలిగెడు
    యధికారులు సుఖము లనక నార్జించుచు నా
    విధులన్నిర్వర్తించిన
    నధికారాంతమునజూడనగు భోగమ్ముల్

    అధికారమున్న చాలు వి
    విధరూపమ్ముననధములు విత్తము నొందన్
    విధులలొ మునిగిన నేమిక
    అధికారాంతమున జూడ నగు భోగమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి.
      రెండవపూరణలో ‘విధులలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘విధులను మునిగిన (షష్ఠ్యర్థంలో ద్వితీయ)’ అనండి.

      తొలగించండి
  9. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు .ఆరోగ్యం సహకరించకున్నా, పద్యరచన పై మీకుగల మక్కువతో
    వివిధ కవుల పద్యరచనలను సమీక్షిస్తున్న, అభినందనలిడుతున్న మీకు ధన్యవాదాలు .

    పద్యరచనల సమీక్ష
    న్నుద్యమముగ జరిపి నిరతముప్పొంగంగా
    హృద్యమ మయ్యెను కద, కవి
    కాద్యంతము కంది శంకరార్యా గనుమా !

    నా పూరణ

    అధికారము గలదని, తమ
    విధి నిర్వహణము జరుపక, వివిధరకములన్
    వ్యధలకు గురి చేయు, కుమతి
    కధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు భాగవతుల వారూ...మీరు ప్రయోగించిన ’వ్యధ’ అసాధువు. సాధువు...’వ్యథ’. ఇందులో ద-థ-ధ ప్రాస నిషేధింపబడినది. కావున ...సవరించగలరు. అన్యథా భావింపవలదని మనవి.

      తొలగించండి
    2. మిత్రులు భాగవతుల వారూ...మీరు ప్రయోగించిన ’వ్యధ’ అసాధువు. సాధువు...’వ్యథ’. ఇందులో ద-థ-ధ ప్రాస నిషేధింపబడినది. కావున ...సవరించగలరు. అన్యథా భావింపవలదని మనవి.

      తొలగించండి
    3. భాగవతుల కృష్ణారావు గారూ,
      ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. మధుసూదన్ గారూ,
      వ్యధ, వ్యథ రెండూ సాధువులే. ‘వ్యధ’ శబ్దాన్ని ‘శబ్దరత్నాకరం, వావిళ్ళ వారి సంస్కృతాంధ్ర నిఘంటువు’ పేర్కొన్నాయి.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. అధికార దుర్మదమ్మున
      విధి వంచిత నరు లనాథ విహ్వల మతు లి
      వ్విధి బాధించిన దుష్టుల
      నధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.


      విధి కృత్యమ్ములు సర్వ సమ్మతముగన్ వీక్షింప నేర్వంగకన్
      బధిరుండై జనవాక్య సంహతికి వ్యాపారాకృతిం దాల్చియు
      న్నధికాదాయము సంతతమ్ము గొను భ్రష్టాచార సందోహము
      న్నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర భోగమ్ములన్

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వృత్తంలో పూరించినందుకు ప్రత్యేక ప్రశంసలు.
      ‘నేర్వంగకన్’ శబ్ద ప్రయోగమే చింత్యం. ‘వీక్షింపగా నోడియున్’ అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు ధన్యవాదములు. నేర్వకన్; నేర్వంగ కు వ్యతిరేకార్థములో నేర్వంగకన్ వాడవచ్చనుకున్నాను.

      విధి కృత్యమ్ములు సర్వ సమ్మతముగన్ వీక్షింప గానోడియున్
      బధిరుండై జనవాక్య సంహతికి వ్యాపారాకృతిం దాల్చియు
      న్నధికాదాయము సంతతమ్ము గొను భ్రష్టాచార సందోహము
      న్నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర భోగమ్ములన్

      తొలగించండి
  11. విధిగా పోవు విభవములు
    అధికారాంతమునఁ, జూడ నగు భోగమ్ముల్
    అధికారము లో నుండగ
    మధుసూధన! బొందునయ్య మానవుడిలలో!!!



    విధులను నెరవేర్చుటలో
    అధికారులు తాము కీర్తి నార్జించంగా
    విధిగా దక్కును వారికి
    అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణలో ‘విభవములు అధికార’మని విసంధిగా వ్రాశారు. ‘పోవును విభవము| లధికారాంతమున...’ అనండి.

      తొలగించండి
  12. విధి వెక్కిరించి నట్లగు
    సుధ చేజారిన విధమ్ము సోలును తనువున్
    వ్యధ పెరిగెడి నెద బరువై
    యధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్!!

    రిప్లయితొలగించండి
  13. బుధులగు వారలు కొందరు
    విధులందు ప్రతిభను జూపి విజయంబంద
    న్నధిపులమెప్పుల బడయుచు
    నధికారాంతమున జూడనగగు భోగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  14. బుధులగు వారలు కొందరు
    విధులందు ప్రతిభను జూపి విజయంబంద
    న్నధిపులమెప్పుల బడయుచు
    నధికారాంతమున జూడనగగు భోగమ్ముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. విధి నాల్కన్ బయలుంచి మాటికిని వెవ్వే యంచు కేరున్ గదా
    సుధలం జుర్రెడి వేళ పాత్ర నెవరో చూఱాడి నట్లే సదా
    వ్యధతో గుండెలు మండిపోయి జనముల్ వైరాళియౌ సర్వదా
    అధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్

    రిప్లయితొలగించండి
  16. వ్యధలే తప్పవునింటన్
    విధిగా పరుగెట్టి రాదు పెళ్లామైనన్
    మధురములాడరు మనుమలు
    నధికారాంతమున జూడనగు భోగమ్ముల్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు గుండా వారూ...నమస్సులు! వ్యధ సాధువుకాదు. సరియైన రూపము వ్యథ. కావున ప్రాసనియమ భంగమగును. సవరించగలరు.

      తొలగించండి
    2. మిత్రులు గుండు వారికి నమస్సులు మరియు ధన్యవాదములు. సవరించిన పద్యము:

      విధములు మారున్ గృహమున
      విధిగా పరుగెట్టి రాదు పెళ్లామైనన్
      మధురములాడరు మనుమలు
      నధికారాంతమున జూడనగు భోగమ్ముల్!!!

      తొలగించండి
    3. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ రెండు విధాల పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘వ్యధ, వ్యథ’ రెండూ సాధువులే.

      తొలగించండి
  17. జ్వరమును మాన్పెడి మందే
    పరిశీలన,పద్యరచన|పత్యము జేయన్?
    దరిజేరక పరుగెత్తును
    శరవేగము నందుకొనుచు శారద కృపచే|

    రిప్లయితొలగించండి
  18. అధిపతి నేనను అహమున
    బుధుడను కొనె |”బుద్దిలేని పుట్టుక విడువన్
    నిధులగు నిర్మల తత్వము
    అధికారాంతమున జూడ నగుభోగమ్ముల్|”.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      ధన్యవాదాలు.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. వ్యధలే తప్పవు నింట గోపములు శాపమ్ముల్! సదా మౌనమే!
    విధిగా తా పరుగెట్టి రాదు సతి! నీవీడేర్చ లేదేమిటన్
    విధమున్ , పౌత్రులు మేలమాడుదురు , ప్రావీణ్యమ్ము లంతంతలే!
    నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలు శ్రీ సుబ్బారావు గారికి మరియు గుండు వారలకు ధన్యవాదములతో సవరించిన పూరణ:

      బధిరత్వమ్మున నింట గోపములు శాపమ్ముల్! సదా మౌనమే!
      విధిగా తా పరుగెట్టి రాదు సతి! నీవీడేర్చ లేదేమిటన్
      విధమున్ , పౌత్రులు మేలమాడుదురు , ప్రావీణ్యమ్ము లంతంతలే!
      నధికారాంతమునందుఁ జూడవలె నాయయ్యండ్ర వైభోగముల్

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ప్రాసస్ధానములో ద-ధ-థ లువాడరాదు.అన్నిప్రాస స్ధానములలో"ధ"యే ఉండవలెను

    రిప్లయితొలగించండి
  21. అధికార విధులు సమ్య
    గ్విధమున నిర్వహణ సేయ భృతిగొని నాపై
    నిధి ధనమును పింఛను తో
    నధికారాంతమున జూడనగు భోగమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      ప్రస్తుతం నేను అనుభవిస్తున్న పింఛను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. అధికారాన్ధులు, పదవుల
    బధిరులు కని వినగ లేని పాలకు లేలే
    విధిలేని జనులు, వీరల
    అధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  23. అధికార విధులు సమ్య
    గ్విధమున నిర్వహణ సేయ భృతిగొని నాపై
    నిధి ధనమును పింఛను తో
    నధికారాంతమున జూడనగు భోగమ్ముల్

    రిప్లయితొలగించండి
  24. విధురుండై పెండ్లికి జన
    వధువే రోయగ పొగాకు పదుగురి లోనన్
    మధురపు మాటలు కరువగ
    నధికారాంతమునఁ జూడనగు భోగమ్ముల్!

    రిప్లయితొలగించండి