11, ఏప్రిల్ 2016, సోమవారం

సమస్య - 2000 (పినవానికిఁ జూడ రెండు...)

కవిమిత్రులారా,
నేటితో మన బ్లాగులో సమస్యల సంఖ్య 2000 అయింది. ఇందులో నేను స్వయంగా సిద్ధం చేసినవి, మిత్రులు పంపినవి, వివిధ మాధ్యమాల నుండి సేకరించినవి ఉన్నాయి. ఈ బ్లాగు ఇలా నిరాటంకంగా కొనసాగటానికి మీ సహకారమే మూలకారణం. ఎప్పటికప్పుడు నాకు ధైర్యాన్ని ఇస్తూ, నా అనారోగ్య పరిస్థితుల్లో నా మేలు కోరుతూ, అవసరమైనపుడు అన్నివిధాల ఆదుకొంటూ నన్ను ప్రోత్సహించారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 

శరణం పండితమానసాపహరణం, శశ్వద్యశఃకారణం,
సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థసంపూరణమ్|
చరదత్యద్భుత సత్కవీశ్వరగణం, సాలంబనం, శంకరా
భరణం నిత్య మహం స్మరామి విలసద్వాగ్దివ్యసింహాసనమ్|| (డా. విష్ణునందన్ గారికి కృతజ్ఞతలతో...)

ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది...
పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

84 కామెంట్‌లు:

  1. ధనహీనుండేరీతిన
    తనకొమరుని వైద్యఖర్చు తాసమకూర్చున్
    మనమే దానగుణము జూ
    పిన వానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  2. తెలుగు వెలుగే వెలుగు !



    లోకానికి పంచ దశ లోకం లో రెండు వేల సమస్యా పూరణముల పేర్చి రాబోవు తరానికి మార్గదర్శి అయిన శ్రీ కంది శంకరయ్య గారికి,

    ఆ సమస్యా పూరణ లలో పాల్గొని నిత్యమాసక్తికరం గా సమస్య లని పూరిస్తూ వస్తోన్న ఈ శంకరాభారణ కవి పండితుల కందరికీ శుభాకాంక్షల తో !


    మనవాడు కంది శంకరు
    డను మేష్టరు నెక్కుపెట్టె డంగగు రీతిన్ !
    అనుదినము సమస్యలు సలి
    పినవానికిఁ జూడ రెండు వేలొక లెక్కా?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమండీ !! ఇది సామాన్యమైన విషయం కాదు.. మీకూ ఇక్కడి మిత్రులకూ అభినందనలు

    రిప్లయితొలగించండి
  4. సాహితీ ప్రపంచంలో అనితర సాధ్యమైన దూరానికి నడుస్తూ మమ్ము నడిపిస్తూ ఉన్న గురువర్యులకు అభినందన పూర్వక "రెండువేల" నమస్సులు.


    తన బాగులు లెక్కించక
    మన బ్లాగున " పోస్ట్లు " వేయ మంచిసమస్యల్
    దినదినమున శ్రద్ధనుజూ
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      ధన్యవాదాలు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. ఈ శుభసందర్భంలో తెలుగు వెలుగు వారు కోరిన విధముగా తగిన సమాచారము పంపి మన బ్లాగునకు మరింత ఉత్సాహము కవులకు ప్రోత్సాహము గలుగునట్లు చూడవలసినదిగా కోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      వారికి (కొద్దిగా) నా వివరాలు, (ఎక్కువగా) బ్లాగు వివరాలు అందించాను. వారేమో నన్ను ఇంటర్వ్యూ చేస్తామన్నారు. నాకు ఈ ఇంటర్వ్యూలు, స్టేజీలు ఎక్కి మాట్లాడడం అలవాటు లేదు. పేపర్లలో నా పేరు, ఫోటో చూసుకోవాలన్న ఆసక్తి అసలే లేదు.

      తొలగించండి

  6. అనయముదానముజేయుచు వినయముతోమెలగుచుండివేయింతలుగా మనసునజాలినిగడుజూ
    పినవానికిజూడరెండువేలొకలెక్కా?

    రిప్లయితొలగించండి
  7. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    మన " పోలేరమ " జాతర

    కు నొసగెను విరాళము , దిన కూలి బ్రతుకు " రా

    మన " || పేదయయిన - మన సో

    పిన వానికి జూడ రె౦డు వేలొక లెక్కా ?


    { పోలేరమ = పొలేరమ్మ ; రామన =రామన్న. ె
    మనసు + ఓపిన వానికి = మనసు అ౦గీకరి౦చిన
    వానికి } ి

    రిప్లయితొలగించండి
  8. గు రు వు గా ర గు శ్రీ క౦ ది శ౦ క ర య్య

    గా రి కి స౦ పూ ర్ణా యు రా రో గ్యా న౦ ద

    ము ల ను ప్ర సా ది౦ చ మ ని ఆ. రా మ

    చ౦ ద్ర మూ ర్తి ని ప్రా ర్థి స్తు న్నా ను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      ధన్యవాదాలు!
      మొదటి పంక్తి చూసి తేటగీతి కదా యతి తప్పిందనుకున్నాను. రెండవపంక్తికి వచ్చేసరికి ఇది వచనం అని తెలుసుకున్నాను.

      తొలగించండి
  9. సమస్యా పూరణలు 2000 అయిన శుభసందర్భంలో శంకరాభరణం ను నిరంతరాయంగా నడిపించే అలుపెరుగని పూజ్యగురుదేవులకు... కవిమిత్రులందరికీ ...అభినందన వందనము లర్పిస్తూ మన బ్లాగు మరింతగా యశము నార్జించాలని కోరుకుంటున్నాను..



    ఘనమగు సమస్యల నిడుచు
    మనమున వాగ్దేవి సేవ మరువక నెపుడున్
    అనయము పద్యరచన గఱ
    పినవానికి జూడ రెండువేలొక లెక్కా!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      ధన్యవాదాలు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మరువక’ అన్నది కళ. కనుక ‘మరువక యెపుడున్’ అనాలి.

      తొలగించండి
  10. నన పుట్టిననాడే తా-
    విని చాటినయట్లు బ్లాగు పెట్టిన నాడే
    మనలో పద్యరచన రే-
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

    రిప్లయితొలగించండి
  11. 'ద్విసహస్రకైపదులు' గురువుగారికి అభినందనచందనము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు!
      ‘సహస్రకైపదులు’ అనడం దుష్టసమాసం కదా! ‘ద్విసహస్ర సమస్యల’ అనండి. ఎట్లాగూ రోజూ వివిధ సమస్యలతో సతమతమౌతూ ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. శ్లేష భాసిస్తుంది.

      తొలగించండి
  12. అనవరతమ్ము శ్రమించుచు
    తన యారోగ్య మ్ము గూర్చి తలచక నెపుడున్
    ఘనముగ వాణి కొలువు సలి
    పినవానికి జూడ రెండువేలొక లెక్కా!

    రిప్లయితొలగించండి
  13. అనితరసాధ్యమనురీతిని నిరాఘాటంగా వైయక్తిక, శారీరిక మానసికార్థిక స్తితిగతులతో సంబంధంలేకుండగా “బ్లాగు”ను నిర్వహించుచు ద్విసహస్ర “సమస్యా” ప్రసాదులైన ఆర్య శంకరార్యకు మనఃపూర్వకాభినందన వందనములతో
    అన్న మిస్సన్న గారి ప్రేరణతో
    తెనుగు జనాళికి పద్యపు
    ఘనకీర్తి దిగంతరాల ఘంటాపథమై
    చనునటు లచేవ లన్ జూ
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తమ్ముడూ సుబ్రహ్మణ్య శర్మా! చిరకాలదర్శనం! సంతోషం. పద్యం చాలా బాగుంది.

      తొలగించండి
    2. అన్నా! ధన్యుడను.మీ యదార్థ హృద్య పద్యమే ప్రేరణ

      తొలగించండి
    3. టి.బి.యస్. శ్రర్మ గారి మరొక పూరణ....
      పని తనమంతయు జూపుచు
      తన మాటల గారడిన్ నితాంతము సల్పన్
      పనిగొని పదిమందిని మా
      పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

      తొలగించండి
    4. శర్మాజీ! బాగున్నావా! చిరకాలదర్శనం.కామేశ్వరరావుమాతమ్ముడే.

      తొలగించండి
    5. పద్మనాభ సహాధ్యాయి బ్రహ్మశ్రీ పోచిరాజు సుబ్బారావుగార్కి నమస్సులు. బాగున్నారా! వారు మీతమ్ముడని తెలిసి మరీ ఆనందముగానున్నది. వారు సంస్కృత పదసమాస సంపదను ఎక్కువగా వాడుతారు. చాల సంతోషము.

      తొలగించండి
    6. పద్మనాభ సహాధ్యాయి బ్రహ్మశ్రీ పోచిరాజు సుబ్బారావుగార్కి నమస్సులు. బాగున్నారా! వారు మీతమ్ముడని తెలిసి మరీ ఆనందముగానున్నది. వారు సంస్కృత పదసమాస సంపదను ఎక్కువగా వాడుతారు. చాల సంతోషము.

      తొలగించండి
    7. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.
      మన బ్లాగు పూర్వ పరిచయాలను గుర్తుకు తెచ్చి కలిపినందుకు సంతోషం.

      తొలగించండి
  14. అనవర తాశేష నిబిడ
    ధనార్జ నైకైక లక్ష్య తప్తాత్మునకున్
    జనపతుల లక్షలం దని
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్ర కవులు పోచిరాజు కామేశ్వర రావుగారూ!నమస్తే. సంస్కృత పద సమాసయుక్త మీపద్యం బాగున్నది. ద్వితీయ పాద ప్రథమ గణం “జ” గణము వాడరాదు. ఒకసారి పరిశీలించండి. నాకున్న పరిజ్ఞానంతో వ్రాస్తున్నా.అన్యథా భావింపవలదు.

      తొలగించండి
    2. శర్మ గారూ,
      కామేశ్వర రావు గారి ప్రయోగంలో దోషం లేదు.
      కందపద్యంలో మొదటి రెండు పాదాలను ఒక భాగంగా, మిగిలిన రెండు పాదాలను మరొక భాగంగా స్వీకరించినప్పుడు ప్రతి భాగంలో బేసి గణం జగణం కాకూడదు. ఆ లెక్కన మొదటి భాగంలో నాల్గవగణం (సరిగణం) జగణం కానక్కరలేదు. అలా కాక నాలుగు పాదాలను విడివిడిగా గ్రహిస్తే 1వ,3వ పాదాలలో బేసిగణంగాను, 2వ,4వ పాదాలలో సరిగణం గానూ జగణాన్ని ప్రయోగించరాదు. అందుకే ప్రతిభాగంలో 6వ (సరి) గణంగాను లేదా 2వ, 4వ పాదాలలో 3వ (సరి) గణంగా జగణం కాని నలం కాని ఉండాలన్న నియమం ఉంది.
      మీరన్నట్లు రెండవపాదంలో బేసిగణంగా జగణాన్ని ఉంచరాదంటే అదే పాదంలో 3వ (బేసి) గణంగా తప్పక జగణాన్ని ప్రయోగించాలన్న నియమానికి విఘాతం కలుగుతుంది. గమనించండి.

      తొలగించండి
    3. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారములు. నాపద్యాన్ని సమీక్షించినందులకు మిక్కిలి కృతజ్ఞున్ని. పూజనీయులు గురువు గారి వివరణ తో మీ సందేహము తీరినట్లు భావిస్తాను. కందపద్యము 8 గణములతో ద్విపద గా భావింప బడుతుంది. లేనిచో 6 వ గణపు ప్రసక్తియే యుండదు కదా! [ సామాన్యముగా కనబడే 1, 3 పాదాలలో 3 గణములు. 2, 4 పాదాలలో 5 గణములు కదా మరి 6 వ గణమెక్కడది? 6 వ గణము “జ”´కానీ “నల” గాని తప్పనిసరియనే నియమముంది మరి.]
      పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ వివరణకు ధన్యవాదములు.

      తొలగించండి
    4. పోచిరాజు కామేశ్వర రావుగారూ!నమస్తే. గురువుగారి యొక్క మీ యొక్క వివరణతో నా అజ్ఞానం తొలగినది. ఇరువురకు కృతజ్ఞుడను. మీ అన్నగారు బ్రహ్మశ్రీ పోచిరాజు సుబ్బారావుగారు మా తండ్రిగారు మోడేకుఱ్రులో సహాధ్యాయులు.

      తొలగించండి
    5. పోచిరాజు కామేశ్వర రావుగారూ!నమస్తే. గురువుగారి యొక్క మీ యొక్క వివరణతో నా అజ్ఞానం తొలగినది. ఇరువురకు కృతజ్ఞుడను. మీ అన్నగారు బ్రహ్మశ్రీ పోచిరాజు సుబ్బారావుగారు మా తండ్రిగారు మోడేకుఱ్రులో సహాధ్యాయులు.

      తొలగించండి
    6. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మీ పరిచయానికి చాలా సంతోషము కలిగినది.

      తొలగించండి
    7. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    8. నా వివరణలో 3వ (బేసి) గణంగా... అని చదువుకొనండి.

      తొలగించండి
  15. గురుదేవులకు మరియు కవిమిత్రులెల్లరకు అభినందనలు.
    తనలో నంకిత భావ
    మ్మణుమాత్రము సడలకుండు నాశయ 'సిరి'తోఁ
    దొణకక, సమస్య లిడ నొ
    ప్పిన వానికిఁ జూడ రెండువేలొక లెక్కా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      ధన్యవాదాలు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. దినమునకొకటిగమరిపం
    పినవానికిజూడరెండువేలొకలెక్కా!
    వినుమాయీరెండువేలు
    పనుపుగనగువేలువేలుపావని!యికపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది.
      మూడవపాదంలో గణదోషం. ‘వినుమా రెండగు వేలును...’ అందామా?

      తొలగించండి
  17. శ్రీ కంది శంకరయ్యగురువు గారికి వందన చందనాలతో.తమరుఇప్పటిదాకా2000సమస్యలుఇవ్వటము
    చాలాగొప్పవిషయము.సాహిత్యాభిలాషకువందనము.
    అనవరతము పద్యరచన|
    వినలేని సమస్య లెన్నొ వివరణ చేతన్
    ఘనమైన పూరణలు జూ
    పిన వానికిజూడ రెండు వేలొక లెక్కా|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      ధన్యవాదాలు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. గురుదేవులకు నమస్సుమాంజలి.
    నిరాఘాటంగా ఎన్నెన్నో ప్రయాసలకోర్చి బ్లాగు నిర్వహణ అనే యజ్ఞమును నిర్వహిస్తున్న మీకు ఎన్నివేల ప్రణామాలను సమర్పించినా అది తక్కువే అవుతుంది. అనారోగ్యముతో ఉన్నా, లేదా ఇతర వ్యక్తిగత కార్యాలాతో సతమతమవుతున్నా కూడా బ్లాగును కొనసాగించి తీరాలనే మీ తపన ఎందరికో ఆదర్శము.

    బ్లాగును కొనసాగించడములో సహాయపడుతున్న ఇతర కవిమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు.

    ఎనలేని ధైర్యసాహస
    మున రాక్షసకోటినెల్ల మున్నీటను ద్రో
    సిన హనుమ, లంకిణిని జం
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      ధన్యవాదాలు!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. వినయుండు శంకరార్యుడు
    జనవంద్యుడు, కవిజనములు జైజై యనుచున్
    ఘనమగు సహకారముజూ
    పిన వానికిజూడ రెండు వేలొకలెక్కా

    అనికేగిన యభి మన్యుడు
    ఘనశౌర్యము జూపెనయ్యె కదనము నందున్
    ఇనుడై జృంభించిన యా
    పినవానికి జూడరెండువేలొక లెక్కా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ధన్యవాదాలు!
      ‘కవిజనములు జైజై యనగా’ అంటే అన్వయం బాగుంటుంది.
      ‘ఘనశౌర్యము జూపినాడు..’ అనండి.

      తొలగించండి
  20. ఘన ధర్మ కార్యములు జరి
    పిన వానికిఁ జూడ రెండువే లొకలెక్కా
    తన వెంట రాదు ధనమని
    ధన హీనుండడి గినపుడు తప్పక నిచ్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తప్పక’ అన్నది కళ. కనుక ‘తప్పక యిచ్చున్’ అనండి.

      తొలగించండి
  21. ధనమును విచ్చలవిడిగా
    ననవరతంబువ్యయపర్చునవివేకుండున్
    పనిపాటలులేకతిరుగు
    పినవానికి జూడ రెండువేలొకలెక్కా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి మీ పూరణ వచ్చింది. అంటే బహుశా మీరు నాంపల్లి స్టేషన్‍లో ఉన్నప్పుడు పంపినట్టున్నారు. సంతోషం!

      తొలగించండి
  22. ఎనిమిది వేలున్నవి మరి
    యును రెండుండినను చాలు నోషధి కొరకై
    తనయుండేకరు ణనుజూ
    పిన వాడికి జూడరెండు వేలొక లెక్కా

    రిప్లయితొలగించండి
  23. గురువు గారికి అభినందనలు
    మీ సారధ్యములో మీ .....మన బ్లాగు నిరాటంకముగా రెండువేల సమస్యలు పూర్తిచేసుకున్న....సందర్భములో ప్రత్యేక అభినందనలు ....నాలాంటి నిరక్షర కుక్షి తెలుగు పద్యాన్ని వ్రాయగల గడం అనేది పరిపూర్తిగా మీరు పెట్టిన భిక్షయే గాని మరియొకటి కాదు ....అందులకు ధన్యవాదాలు ......మీ ఋణం తీర్చుకోలేనిది మన బ్లాగు ఇంకా యెన్నెన్నో ఉత్తమోత్తమ సమస్యలతో పదివేల సమస్యలను పూర్తిచేసుకోవాలని ఆశిస్తూ.........
    చదువులతల్లి పరిపూర్ణ కృపాకటాక్షములతో పరిపూర్ణాయురారోగ్యాలను కలిగి కురుక్షేత్రంలోని కృష్ణసారధ్యంలా సాహితీ క్షేత్రంలో మీసారధ్యం దిగ్విజయతీరాలకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంజనేయ శర్మ గారూ,
      ధన్యవాదాలు!
      నన్ను కృష్ణుణ్ణీ చేశారు. అంటే మన బ్లాగు అర్జునుడన్నమాట! కానీ ఇక్కడ గెలిపించడానికి పాండవులు (వీళ్ళు ఐదుగురు కాదు, చాలామంది!) ఉన్నారు కాని, ఓడించడానికి ఒక్క కౌరవుడూ లేడు. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుణ్ణి కదా!

      తొలగించండి
    2. ఒక్క నిరక్షకుక్షి అనే పదాన్ని తప్పిస్తే విరించి గారి అభిప్రాయం సరైనదే. ఇలా ఎందఱో ఔత్సాహికులు పద్యరచనలో మంచి పట్టు సాధించారు శంకరాభరణం చలువతో. నేనూ, మనందరికీ పెద్దక్కయ్య గారు రాజేశ్వరి గారూ, శైలజ గారూ, బల్లూరి ఉమాదేవి గారూ, పోచిరాజు సుబ్బారావు గారూ, అంతెందుకు తమాషాగా వచన కవిత్వంలా వ్యాఖ్యలు పెడుతూ ఉండే జిలేబీ గారూ యింకా ఎందఱో ఎందఱో శంకరయ్య గారి ప్రోత్సాహం వలననే పద్యాలు వ్రాయడం మీద ఆసక్తిని ఇనుమడింప జేసుకొని కృతకృత్యు లవుతున్నారు.

      సంవత్సరాల తరబడి అకుంఠీత దీక్షతో యిలా బ్లాగును నిర్వహించడం నిజంగా అనితర సాధ్యమే.

      తొలగించండి
    3. గురువు గారూ! మీరు ముమ్మాటికీ కృష్ణులే బ్లాగనే పార్థునకు సరధులై తెలుగు పద్యాన్ని బతికిస్తూ భావితరాలకందించాలనే ధర్మ దీక్షతో మాలోనీ అజ్ఞానాన్నీ తునుమాడుతూ విజయ యాత్రచేస్తున్నారు......

      తొలగించండి
  24. కనివిని ఎరుగని రీతిని
    ఘన పదములుగల "సమస్య" కవుల కిడుచునే
    తన ప్రతిభను జూపగ తెలి
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

    తన దేశములో చాలక
    తన రాబడి గుప్త ధనము దాచగ పాశ్చా
    త్య నగర వాసికి రుసుమం
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ మొదటి పూరణ బాగుంది. ధన్యవాదాలు!
      రెండవ పూరణ కాలానుగుణమై వైవిద్యమై మరింత బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    "శంకరాభరణం" బ్లాగు ద్విసహస్ర సమస్యలను పూరణములకై యిచ్చిన సందర్భముగ మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారికి శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  26. [ఎన్నియో ప్రక్రియలనుఁ బూరణములకై యిచ్చిన సమర్థులగు శ్రీ కంది శంకరయ్యగారికి రెండు వేల సమస్యలనుఁ జేరుకొనుట యొక లెక్కా?]

    ఘనమగు ప్రక్రియ లెన్నియొ
    దినదినమును నిచ్చియిచ్చి స్థిర పూరణముల్
    గొనుచు సమీక్షింపఁగ నో

    పినవానికిఁ జూడ రెండువే లొక లెక్కా?

    రిప్లయితొలగించండి
  27. మనమున ప్రేమను నింపుచు
    తనవార లకనెడు ప్రీతి తనరుచు నేర్పన్
    ఘనమగు తెలుగను వెలుగుజూ
    పినవానికిఁ జూడ రెండువే లొకలెక్కా ?

    నమస్కారములు
    నిన్న మాఇంట్లో గణపతి హోమం జరిగింది.అందుకనే బ్లాగు చూడ్లేకపోయాను
    చాలా ఆనందముగా ఉంది. పద్య రచన తెలియని నేను గురువుగారి దయవలన అణుమాత్రం నేర్చుకో గలిగినందులకు కృత్జతలు. పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం కృషిచేస్తూనె ఉన్న గురుదేవులకు గురుదక్షణ గా ఏమివ్వగలను ? .నాకంటే చిన్నవారుగనుక ఇలా వేలకువేలు మనందరితో వ్రాయంచాలని ఆశ్రీర్వదించి అక్క .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
      మూడవపాదంలో గణదోషం. ‘ఘనమగు తెలుగు వెలుగు జూ’ అనండి.

      తొలగించండి
  28. గురువు గారూ! మీరు ముమ్మాటికీ కృష్ణులే బ్లాగనే పార్థునకు సరధులై తెలుగు పద్యాన్ని బతికిస్తూ భావితరాలకందించాలనే ధర్మ దీక్షతో మాలోనీ అజ్ఞానాన్నీ తునుమాడుతూ విజయ యాత్రచేస్తున్నారు......

    రిప్లయితొలగించండి



  29. కనివిని యెరుగని జాడ్యము
    ఘనముగ పీడించుచుండ కలవర పడకన్
    ధనమును దానమొసగు యా
    పినవానికి జూడ రెండువేలొక లెక్కా.

    ఘనుడీశంకరు డొసంగు
    ననవరతంబును మనలకు నడుగడుగున తా
    ననయము సమస్యలిట జూ
    పినవానికి చూడ రెండువేలొక లెక్కా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి.
      మొదటిపూరణలో ‘దాన మొసగు నా...’ అనండి.
      రెండవపూరణ మొదటి పాదంలో మూడవ గణంగా జగణాన్ని వేశారు. ‘ఘనుడై యొసంగు శంకరు...’ అనండి.

      తొలగించండి
    2. ‘ఘనుడీ శంకరు డొసగుచు...’ అన్నా బాగానే ఉంటుంది.

      తొలగించండి
  30. అనుదిన మొక పూరణతో
    మనమున ఘర్షణ పడుచును మార్పుల నందన్!
    ఘనమగు పద్యపు రుచి జూ
    పిన వానికి జూడ రెండు వేలొక లెక్కా?

    రిప్లయితొలగించండి
  31. అనుదిన మొక పూరణతో
    మనమున ఘర్షణ పడుచును మార్పుల నందన్!
    ఘనమగు పద్యపు రుచి జూ
    పిన వానికి జూడ రెండు వేలొక లెక్కా?

    రిప్లయితొలగించండి



  32. కనివిని యెరుగని జాడ్యము
    ఘనముగ పీడించుచుండ కలవర పడకన్
    ధనమును దానమొసగు యా
    పినవానికి జూడ రెండువేలొక లెక్కా.

    ఘనుడీశంకరు డొసంగు
    ననవరతంబును మనలకు నడుగడుగున తా
    ననయము సమస్యలిట జూ
    పినవానికి చూడ రెండువేలొక లెక్కా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి