13, ఏప్రిల్ 2016, బుధవారం

సమస్య – 2002 (మరణము లేనట్టివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్.

64 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు అభినదనలు

    పరుషపు మాటలనాడక
    పుర హితమును గోరువాడు పురజన మదిలో
    స్థిరమై నిలుచున్నవ్విధి
    మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్

    నరజన్మమె దుర్లభమని
    యెరుగుచు స్వార్థమ్ము వీడి యెల్లరి హృదీలో
    మరణించకతా నిల్చును
    మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్

    రిప్లయితొలగించండి
  2. నిరతము భయ కంపితుడై
    మరణము మదిలోన తలచు మనుగడ కంటెన్
    అరయన్ మృతిగూర్చి యను
    స్మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. చిరకాలము యశము మిగుల
    పరహితమును కోరువాడు పరమేశు డనన్
    నరుడై బుట్టిన పరిణతి
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ .

    రిప్లయితొలగించండి
  4. స్ఫురియించె విగ్రహమువలె
    ధరపై మూర్తీభవించి ధర్మము తానై
    హరి తానేననియెడు సం
    స్మరణము లేనట్టి వాడె మర్త్యుఁడన దగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తానే యనియెడు’ అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:


      స్ఫురియించె విగ్రహమువలె
      ధరపై మూర్తీభవించి ధర్మము తానై
      హరి తానే యనియెడు సం
      స్మరణము లేనట్టి వాడె మర్త్యుఁడన దగున్!

      తొలగించండి

  5. స్మరణను జేసెను రాముని
    నరులకు నేర్పెను నహింస నాతడు గాంధీ !
    చిరకాలము మది నిలచే
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ !

    రిప్లయితొలగించండి

  6. ఒరులకుజేయుచునుపకృతి నిరవుగదూషించకెపుడునీప్సితములదా నెరవేర్చుచుమరిమదిసం స్మరణములేనట్టివాడెమర్త్యుడనదగున్

    రిప్లయితొలగించండి
  7. శరణాగత రక్షకుడగు
    కరుణాకరు రామచంద్రు కమలాక్షుని సం
    బరముగ నుతి యించు నతడె
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  8. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { నీ తి - స ౦ దే శ ము }
    …………………………….......


    హరి c దలచెడు వాడే , యే
    మరకన్ బోషి౦చు వాడె > మాతా పితలన్ ,
    నిరతమ్ము ధర్మ పథ - వి
    స్మరణము లేనట్టివాడె మర్త్యు డన దగున్

    రిప్లయితొలగించండి
  9. సన్మతులయందుశ్రేష్ఠుడ!
    సన్మానమునొందితీవుసరసులుసేయన్
    దన్మయముకలిగెనాకది
    జన్మంబున్నీదియికనుసార్ధకమయ్యెన్

    రిప్లయితొలగించండి

  10. 1.పరునింద చేయకుండగ
    పరుల హితంబు కొరకు పాట్లును పడుచున్
    త్వరగా మరణంబొందినఁ
    మరణము లేనట్టివాడె మర్త్యుడనదగున్.

    2.కరుణను జూపుచు నొక్కడు
    చిరకాలంబు జీవనంబు చేయుచు ఖ్యాతిన్
    నిరతము నందెను జగతిన్
    మరణము లేనట్టివాడె మర్త్యుడనదగున్.

    3.ధరనెందు వెదకిజూచిన
    పరోపకార మొనరించి బ్రతికినదాతల్
    నెరవేర్చుచు కోర్కెల నిల
    మరణమ లేని వాడె మర్త్యుడనదగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటిపూరణ రెండవపాదంలో గణదోషం. ‘పరహితమును జేయుకొరకు...’ అనండి.
      రెండవపూరణ రెండవపాదంలో గణదోషం. ‘చిరకాలము జీవనంబు...’ అనండి.

      తొలగించండి
  11. అరయన్ దేవత యనినన్
    మరణము లేనట్టివాఁడె; మర్త్యుఁ డనఁ దగున్
    నిరతము శ్రీహరి నామ
    స్మరణము మోక్షార్ధియగుచు సలిపెడు వానిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తొపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. తరచి జూడ జీవ తత్త్వము వెదుకంగ
    జగతి యందు జనుల జనన కార
    కుండు, సకల జీవ కోటి జ నకుడను
    తండ్రు లిద్ద ఱతని తల్లి యొకతె.
    ............షేక్ అమీర్ భాషా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. షేక్ అమీర్ బాషా గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. చిరజీవుడు పవన సుతుడు
    మరణము లేనట్టివాఁడె;,మర్త్యుఁ డనఁ దగున్
    మరణము స్వాభావికమౌ
    నరజాతి,సమస్తసృష్టి నాశము నొందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. .నిరతము-స్వాతంత్ర్యంబుకు
    శరముగ నుపయోగబడిన శాంతియె|గాంధీ
    వరముగ జయమును నిలుపగ?
    మరణము లేనట్టి వాడె మర్త్యుడన దగున్|

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. . కరుణా భావము గలుగుటె
    వరమని భావించి మసల ?వసుధకుమార్గం
    బరయికగౌతమ బుద్దుడు
    మరణము లేనట్టి వాడె| మర్త్యుడనదగున్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ‘స్వాతంత్ర్యంబుకు’ అనరాదు. ‘స్వాతంత్ర్యంబునకు’ అనాలి. అక్కడ ‘స్వాతంత్ర్యమునకు’ అనండి.

      తొలగించండి
  17. కరుణాంతరంగ తత్త్వము
    పర బాధల బంచుకొనుచు ప్రాపున జేరున్
    వరదునిగా ఖ్యాతిగనిన
    మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్.

    రిప్లయితొలగించండి
  18. కరుణాంతరంగ తత్త్వము
    పర బాధల బంచుకొనుచు ప్రాపున జేరున్
    వరదునిగా ఖ్యాతిగనిన
    మరణము లేనట్టి వాడె మర్త్యుడనదగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సత్యనారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. హరిహరులను మది దలచుచు
    దరుమముగా నడచుకొనుచు ధారుణి లోనన్
    నిరతము పరహితమును వి
    స్మరణము లేనట్టివాడె మర్త్యుఁ డనఁ దగున్!!!

    రిప్లయితొలగించండి
  20. నిరతమ్ముండుట కామా
    తురుడై పురుషునకు జాల దోషము సుమ్మీ
    సరసుడ! హృదయస్థలి కా-
    మ రణము లేనట్టివాడె మర్త్యుఁ డనఁ దగున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ! భేష్ ! ఎంత చక్కని పద్యం? ఇదే భావం మరియు విరుపుతో - మోహ ముద్గరం నేపథ్యంలో పూరించాలని అనుకుంటూ తక్కిన పూరణలు చదవడం మొదలు పెట్టి , మీ పూరణ చూచిన తరువాత ఆ ప్రయత్నం అనవసరం అనిపించి మానివేస్తున్నాను .

      భావ ప్రకటన సౌలభ్యం కోసం , శయ్య కోసం మీ పద్యాన్ని ఇలా మారిస్తే మరింత స్పష్టంగా ఉంటుందని సూచన.

      "నిరతము కామాతురుఁడై
      వరలుట పురుషునకుఁ జాల పాపము సుమ్మీ! "

      తొలగించండి
    2. డాక్టర్ విష్ణునందన్ గారూ! మీ సౌజన్యతకు కడుంగడు ధన్యవాదములు. మీ బోటి ఉద్దండపండితుల ప్రశంసను పొందగలగటం నా అదృష్టం గా భావిస్తున్నాను. మీ సూచన నాకు శిరోధార్యం.

      మీ పూరణ కూడా దయచేస్తే మాకు మార్గదర్శకం గా ఉండగలదని భావిస్తున్నాను.

      తొలగించండి
    3. డా.విష్ణునందనుల సూచన మేరకు సవరించిన పూరణ:

      నిరతము కామాతురుఁడై
      వరలుట పురుషునకుఁ జాల పాపము సుమ్మీ!
      సరసుడ! హృదయస్థలి కా-
      మ రణము లేనట్టివాడె మర్త్యుఁ డనఁ దగున్!!!

      తొలగించండి
    4. మిస్సన్న గారికి,
      వైవిధ్యమైన మీ పూరణ విష్ణునందన్ గారి ఆమోదాన్ని పొందింది. అంతకంటె అదృష్టమేమున్నది? అభినందనలు.

      తొలగించండి
    5. గురువుగారికి, హనుమఛ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

      తొలగించండి
    6. గురువుగారికి, హనుమఛ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  21. పోచిరాజు కామేశ్వరరావుగారి రచనలు

    నిన్నటిపద్యము
    ప్రాణమిత్రుడడుగబయనించెదోడ్తేర
    బట్నమునకుదనదుపల్లెనుండి
    ముచ్చటగనుంతముగ్గురదనతల్లి
    తండ్రులిద్దరతనితల్లియొకతె

    నేటిపద్యము
    వరకట్నాశావిహ్వల
    నరాధములునిజసతులనునరకవ్యధలన్
    గురిసేయుటఘోరదురిత
    మరణములేనట్టివాడెమర్త్యుడనదగున్

    రిప్లయితొలగించండి
  22. మరణము స్థిరమని తెలిసి ని
    కరముగ మృతిలేని ఖ్యాతికై తగు సం
    స్కరణలు సలుపుచు జనుచో
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      రెండవపాదంలో గణదోషం. ‘ఖ్యాతికై యోగ్యపు సం...’ అందామా?

      తొలగించండి
  23. నరుడై పుట్టియు సతతము
    పరుల సుఖము కోరునతడె భగవంతుడిలన్!
    చిరకాలము తన కీర్తికి
    మరణము లేనట్టి వాడె మర్త్యు డనదగున్!

    రిప్లయితొలగించండి
  24. మరణము తప్పదు ప్రాణికి
    మరణము లేదయ్య భువిని మనచేతలకే
    మరువక మంచిని సలుపుచు
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ !

    రిప్లయితొలగించండి
  25. స్వరముల యభిషేకముతో,
    స్థిరమగు శీలమునునిల్పి శివునిగ మారన్,
    సురలోకము చూపి cఇచట
    మరణము లేనట్టి వాcడె మర్త్యు c డన c దగున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  26. స్వరముల యభిషేకముతో,
    స్థిరమగు శీలమునునిల్పి శివునిగ మారన్,
    సురలోకము జూపి cఇచట
    మరణము లేనట్టి వాcడె మర్త్యు c డన c దగున్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జూపి’ తరువాత అరసున్నా ఎందుకు? ‘జూపి యిచట’ అంటే సరి!

      తొలగించండి
    2. స్వరముల యభిషేకముతో,
      స్థిరమగు శీలమునునిల్పి శివునిగ మారన్,
      సురలోకము జూపి యిచట
      మరణము లేనట్టి వాcడె మర్త్యు c డన c దగున్
      కొరుప్రోలు రాధా కృష్ణ రావు

      తొలగించండి
  27. నరునిగ, నున్నత జీవిగ,
    ధరపై నున్నట్టి జీవతతి రక్షకుడై,
    స్థిరునిగ, తన చేతల నే
    మరణము లేనట్టి వాడు, మర్త్యుడనదగున్!

    రిప్లయితొలగించండి
  28. ఎరుగుచు జననము మరణము
    నరయగ కాయమ్మునకని నందము మీరన్
    పరిపరి జననము పునరపి
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్

    రిప్లయితొలగించండి
  29. కిరికిరి జేయుచు నెప్పుడు
    కరివరదుని నమ్మ కుండ కమ్మగ తనవౌ
    నరిషడ్వర్గమ్ములనున్
    మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్

    రిప్లయితొలగించండి