22, ఏప్రిల్ 2016, శుక్రవారం

సమస్య - 2011 (రోకలికి కాలు జాఱె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.. 
రోకలికి కాలు జాఱె తె మ్మాకుమందు.

43 కామెంట్‌లు:

  1. వర్షమున పోవుచుండ గ, వర్ధనమ్మ
    రో, కలికి కాలుజారె తెమ్మాకుపసరు
    పసుపుతోడుత మర్థించ పాదమునకు
    తగ్గిపోవును నెప్పులు త్వరితముగాను

    రిప్లయితొలగించండి
  2. ముసురు పట్టిన వేళలో ముంగిలి కడ
    పాచి పట్టె, ముగ్గును వేయ పడతి వచ్చె
    గుమ్మమునకు ముందర ముద్దు గుమ్మ యమ్మ
    రో!
    కలికి కాలు జాఱె తె మ్మాకుమందు!!

    రిప్లయితొలగించండి
  3. పాచి పట్టిన వాకిలిన్ పాదమిడగ
    చిమ్మ చీకటిన్ తూలె కాంతమ్మ నిశిని;
    పసరు పూయంగ వలె గద పార్వతమ్మ
    రో! కలికి కాలు జాఱె, తెమ్మాకుమందు.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు నమస్సులు!

    [మగనిపైఁ గోపముతో రుసరుస లాడుచు బోవుచు బురదలో కాలుజాఱి పడిన యొక పడతికై మందు తెమ్మని యొకతె తన చెలియను గోరు సందర్భము]

    "చెలియ! మగనిపైఁ గోపించెఁ, జేరఁ బిలువఁ,
    జిర్రు బుర్రులాడుచుఁ బోయె శీఘ్రముగను!
    పుడమిఁ తడిసి రొచ్చయె, నట్టి బురద, నతివ

    రో! కలికి కాలు జాఱెఁ! దె మ్మాకుమందు!!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణముతో...

      "చెలియ! మగనిపైఁ గోపించెఁ, జేరఁ బిలువఁ,
      జిర్రు బుర్రులాడుచుఁ బోయె శీఘ్రముగను!
      పుడమిఁ దడిసి రొచ్చయె, నట్టి బురద, నతివ

      రో! కలికి కాలు జాఱెఁ! దె మ్మాకుమందు!!"

      తొలగించండి
  5. ఇద్దరి మూర్ఖుల గొడవ:
    పిచ్చి కుదిరెను రోకలి తెచ్చి తలకు
    చుట్టు మనెనొక మూర్ఖుడు, చోద్య మనుచు
    తెలివి తక్కువ దద్దమ్మ చెప్పె నిట్లు
    రోకలికి కాలు జాఱె తె మ్మాకుమందు!

    రిప్లయితొలగించండి
  6. పచ్చిపాలను మీగడ వచ్చి వేడి
    పాలవెన్నను జూపగ పట్టి కొరవి
    కోడలాయని యడుగుచు గుమ్మముకడ
    రో! కలికి కాలు జాఱెఁ దె మ్మాకుమందు!

    రిప్లయితొలగించండి
  7. అరటి తొక్కను జూడక నడుగు వేసి
    జారి పడిపోయె దబ్బున జానకమ్మ
    లేవ దీయుచు బిల్చెనో లేమ, నమ్మ
    రో !కలికి కాలుజారె తెమ్మాకు మందు!!!

    రిప్లయితొలగించండి
  8. పెళ్లి కూతును జేయుచు పెద్దలంత
    పసుపు కొమ్ములు దంచగనన్ పాడిగాను
    తరుణి కట్టఁగ బోవుచుఁ దమలపాకు
    రోకలికి, కాలు జాఱె తెమ్మాకుమందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది, వివిధ్యంగా ఉన్నది. అభినందనలు.
      ‘దంచగనన్’ అన్నచోట గణదోషం. బహుశా ‘దంచగ’కు టైపాటు కావచ్చు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. టైపాటును సవరించిన పద్యం:

      పెళ్లి కూతును జేయుచు పెద్దలంత
      పసుపు కొమ్ములు దంచగన్ బాడిగాను
      తరుణి కట్టఁగ బోవుచుఁ దమలపాకు
      రోకలికి, కాలు జాఱె తెమ్మాకుమందు.

      తొలగించండి
  9. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    సామి ! శివుడ ! వివాహ నిశ్చయ మది౦క
    కుదిరె | ని౦తలో ప్రేమికున్ గూడి , యమ్మ
    రో ! కలికి కాలుజారె ! తెమ్మాకు మ౦దు !
    కావలయును గర్భచ్యుతి క్షణము న౦దె !
    కానిచో - కలియు పరువు గ౦గ లోన !
    నెట్టులో ముడి వేయుచు నీడ్చ వలయు

    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అమ్మరో ! = ఆకుమ౦దు దెచ్చు ఓ

    యమ్మా !
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ‘కాలు జారడానికి’ ఉన్న విశేషార్థంతో మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

      తొలగించండి
  10. బావి చెంతను చేరుచు భామ లెల్ల
    నీరు చేదుచు తామెల్ల నెనరు తోడ
    కబురు లాడుచు నుండంగ కాంచు డమ్మ
    రో!కలికు కాలు జారె తెమ్మాకు మందు.

    రిప్లయితొలగించండి

  11. దారికడ్డముగానుంటతగిలినాకు రోకలికి,కాలుజారెతెమ్మాకుమందు లేపగష్టముగానుండెలేపలేను
    తేజ!వేవేగబూయుదుతిమ్మిరాయె

    రిప్లయితొలగించండి
  12. నీటి యెద్దడి కతమున నీరజాక్షు
    లంత బావి చుట్టునుజేరి హాస్యమొదవ
    నెవ్వరెచ్చట పెనగుచు నెట్టిపోయి
    రో!కలికి కాలుజారె తెమ్మాకుమందు.

    రిప్లయితొలగించండి
  13. నీతి ,నియమము లేని దుర్నీతి పరుడు
    ఆరవసతిని పెళ్ళాడ?అందుచూడ
    రో|కలికికాలుజాఱె|తెమ్మాకు మందు
    యనుట వింతగ దోచులే మనుగడందు|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘మందు+అనుట’ అన్నపుడు యడాగమం రాదు. ‘మనుగడ+అందు’ అన్నపుడు సంధి లేదు. ‘మంద| టంచు చెప్పుట వింతయే మనుగడకును’ అనండి.

      తొలగించండి
  14. 1.
    తొందర పడి నీదు సుతయె యందగాడ
    నంచు భ్రమలోనను మునిగె నాలకించు
    వంచకుండత డెంతయొ గాంచు మమ్మ
    రో కలికి కాలుజారె తెమ్మాకు మందు.

    2.
    సూర్యుడస్తమించిన వేళ సుదతి యొకతి
    పంక మయమైన పథమందు జంకుతోడ
    కటిక చీకటిన వెడలె గాంచు మమ్మ
    రో కలికి కాలు జారె తెమ్మాకు మందు

    3.
    రాస క్రీడల కొరకంచు రమ్మనియన
    వెడలె దొంగచాటుగ నింతి భీతి లేక
    మంచి చెడులతా మరచెను కాంచు మమ్మ
    రో కలికి కాలు జారె తెమ్మాకు మందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘అందగా డ|టంచు’ అనండి అన్వయం కుదురుతుంది.

      తొలగించండి
  15. వాసుదేవుని సన్నిధి వ్రజలలనలు
    చలికమొనరింప సకియరో!కలికి కాలు
    జారె,తెమ్మాకు మందు, రసమ్ము పూసి
    యంగమర్దన జెసి వైద్య మ్మొనర్చ

    రిప్లయితొలగించండి
  16. తళుకు బెళుకుల చేలపు కళలు మెరయ
    చెంగు చెంగున గంతులు భంగ మైన
    భామ కంత కాలు బెణికె నేమొ యయ్య
    రో కలికి కాలు జాఱె తె మ్మాకుమందు.

    రిప్లయితొలగించండి
  17. సరస సల్లాపములఁ దేలు సమయ మందు
    పరుగు లంఘించ నే కొంగుఁ బట్టఁ బోగ
    నంద కుండను పోయెఁ దానంత, నమ్మ
    రో! కలికి కాలు జాఱెఁ! దె మ్మాకుమందు

    రిప్లయితొలగించండి
  18. అందపువధువుజేయు తావందుజేరి
    విందుకు వనితలు కనువిందుజేయ
    మందపు పసుపున్నూరు చామంతి జూడ
    రోకలికి కాలుజారె తెమ్మాకుమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్ర గారూ (మీరు మన తెలుగు చంద్రశేఖర్ గారేనా, మరొకరా?)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చంద్ర గారూ (మీరు మన తెలుగు చంద్రశేఖర్ గారేనా, మరొకరా?)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. నెల్లూరు నెఱజాణ:

    రెడ్డి చేష్టలు గాంచుచు రేగ కినుక...
    నడ్డి విరిచెద నేనిక నాగు మనుచు
    వెడలు చుండగ రాత్రిని వెదుక బోయి
    రోకలికి; కాలు జాఱె తెమ్మాకుమందు!

    రిప్లయితొలగించండి


  20. బాకు తో పొడిచితి పద్య భావమరయ
    గా గురు వర! చట్టని తట్టె గా తిరమ్ము
    గా తలమ్ము దొరకక‌, నగరము లో గు
    రో, కలికి, కాలు జాఱె తెమ్మాకుమందు‌ !

    కలికి - చక్కని ఆడుది


    జిలేబి

    రిప్లయితొలగించండి