20, ఏప్రిల్ 2016, బుధవారం

ఖండ కావ్యము – 5 (జన్మ రాహిత్యము)

జన్మ రాహిత్యము
రచన : పోచిరాజు సుబ్బారావు

పూర్వజన్మమందు పూర్ణము కానట్టి
మిగులు పాపతతులు మిగుల కుండ
ననుభవించవలెను నాజన్మ మిలలోన
జీవులెల్ల విధిగ జేయు నిదియ.

పాపమంతయు జీవిని బాయు వరకు
జీవి జన్మించుచుండును జేతనముగ
పుణ్య కార్యాల వలననే బోవు నఘము
జన్మ రాహిత్యమున కది సత్పథ మగు.

గిట్టు మనుజుడు దప్పక పుట్టు మరల
నతని పాపము విడివడు నంత వరకు
పుణ్య మార్జన జేయగ బోవు నఘము
కాన జేయుము పుణ్యము గలుగు పనులు.

పాప ఫలితము గష్టాలు వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములఁ బొందఁజేయు
పాపముల జోలి  కేగక బ్రదుకునంత

కాల ముపకృతి జేయంగ  వలయు సుమ్ము.

9 కామెంట్‌లు:

  1. బాగుందండి. పుణ్యం వల్ల పాపం పోతుందన్న భావం రెండు సార్లు వచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. అంబటి భానుప్రకాశ్.

    బాగున్నాయి సర్ పద్యములు.

    రిప్లయితొలగించండి
  3. . పోచిరాజు సుబ్బారావు” పూర్వజన్మ
    పాప పుణ్యాల విషయ ప్రవర్తనలను
    జన్మ రాహిత్య విషయాల చర్చలాగ
    పద్యకుసుమాలు బూయించ?పరవసంబె|

    రిప్లయితొలగించండి
  4. పాపపుణ్యాలను తెలియ జేస్తూ సాగే మీ పద్యములు చాలా బాగున్నాయి సర్..

    రిప్లయితొలగించండి
  5. జన్మరాహిత్యమన్న మీ ఖండకృతి చక్కగా నున్నది. మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. జన్మ రాహిత్యమునకునై జంతు తతియ
    చేయదగినట్టి కార్యాలు చెప్పినారు.
    సుబ్బరాయకవివర్యా!సగుణనిలయ!
    సరస కవిమిత్ర!సారస సాంద్రతేజ!

    రిప్లయితొలగించండి
  7. జన్మ రాహిత్యమునకునై జంతు తతియ
    చేయదగినట్టి కార్యాలు చెప్పినారు.
    సుబ్బరాయకవివర్యా!సగుణనిలయ!
    సరస కవిమిత్ర!సారస సాంద్రతేజ!

    రిప్లయితొలగించండి
  8. జన్మరాహిత్యమనుగృతిజదివిమిగుల
    సంతసముతోడతమతమసమ్మతినిట
    తెలియజేసినకవులకుదెలుపుచుంటి
    వందనములనుగరుణతోనందుకొనుడు

    రిప్లయితొలగించండి