30, ఏప్రిల్ 2016, శనివారం

పద్యరచన - 1210

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. వంటలు జేయుట కంటెను
    నింటరు నెట్టే నయమట నేర్పుగ మెప్పున్
    గంటలు గంటలు హాయిగ
    వంటింటికి సెలవు బెట్టి బహుసుఖ మంచున్

    రిప్లయితొలగించండి
  2. చక్కని రూపము గల్గియు
    చిక్కితివంటగదిలోన శ్రీవారికతన్
    దక్కునుస్వర్గ సుఖమ్ములు
    నిక్కముగాబ్లాగు తెరువ నీవలె, నాకున్

    రిప్లయితొలగించండి

  3. అంతర్జాలపుటవసర మంతటయిపుడావహించియతివలునచట
    న్వింతగబలుకుచునుండిరి
    యంతర్జాలమునుజూతుమనుటనువింటే?

    రిప్లయితొలగించండి
  4. నేటిని నడిపే యింటర్
    నెటులం దామాశ్రయించి నెలతలు మెలగం
    గిటులాయె నిచట నతివలు
    పటుతరముగ బ్లాగు జూచి వంటలు జేయున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      మొదటిపాదాన్ని గురువుతో ప్రారంభించారు. ‘కటకట యిపుడీ యింటర్...’ అనండి.
      ‘మెలగంగ+ఇటులాయె=మెలగంగ నిటులాయె’ అవుతుంది. ‘మెలగ |న్నిటులాయె...’ అనండి.

      తొలగించండి
    2. కటకట యిపుడీ యింటర్
      నెటులం దామాశ్రయించి నెలతలు మెలగ
      న్నిటులాయె నిచట నతివలు
      పటుతరముగ బ్లాగు జూచి వంటలు జేయున్!

      తొలగించండి
  5. ఎప్పుడు వంటింటగరిట
    తిప్పుడు లేనా బయటెటు తిరుగక నింటన్
    ముప్పూటల పని చేయక
    నప్పటముగ నొక్కసారి నెట్టును చూతున్.
    అంతర్జాలము నందున
    వింతలు యెన్నో గలవట వేడుక లలరన్
    చెంతనె కూర్చొని సారం
    బంతయు నరయుదము రావె యతివరొ నీవున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పద్యాలు బాగున్నవి.
      ‘తిరుగక యింటన్, వింతలె యెన్నో’ అనండి.

      తొలగించండి
  6. వంట వార్పును దలచిరి కంటకముగ
    ఆటలాడగ నేర్చిరి యాడువారు
    ఫేసు బుక్కును నెట్టును పేర్మి దలవ
    ఇంటి విషయము పట్టదు ఇంతికిపుడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘పట్టదు+ఇంతికి=పట్ట దింతికి’ అని సంధి నిత్యం. ‘పట్టదే యింతి కిపుడు’ అనండి.

      తొలగించండి
  7. 🌺🙏🌺

    అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.


    చిత్రానికి తగిన పద్యం.



    కం*
    వంటలు జేయుచు నెప్పుడు,
    వంటిం టిలబడి మెసలుచు వగచుట కంటే !
    తంటల బడియో బ్లాగును,
    గంటల తరబడి నెరపిన ఘనమగు నాకున్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది.
      'వంటింటం బడి మెసలుచు... వగచుట కంటెన్'అనండి.

      తొలగించండి
  8. అట్టాదులు కన్పట్టవు
    నట్టింటను బట్టు మనుచు నాలుగు రోజుల్
    పట్టణ కాంతల లీలలు
    కట్టా నాగరికతం గగనముం దాకున్
    [శంకరాభరణాలంకృతనారీమణులుందక్క]

    రిప్లయితొలగించండి
  9. సవరించిన పద్యం .....
    అంబటి భానుప్రకాశ్.
    గద్వాల.


    చిత్రానికి తగిన పద్యం.



    కం*
    వంటలు జేయుచు నెప్పుడు,
    వంటిం టిలబడి మెసలుచు వగచుట కంటెన్.!
    తంటల బడియో బ్లాగును,
    గంటల తరబడి నెరపిన ఘనమగు నాకున్ !!

    రిప్లయితొలగించండి
  10. . అంతర్జాలము నందున
    చింతను మాన్పేటి విషయ చిత్రము లెన్నో
    కంతులుగా గనిపించును
    పంతమునన్ పతికినివ్వ?పనిగుదురుగదా|

    రిప్లయితొలగించండి
  11. వంట యింటి లోనె బతుకు గడిపి నాను
    బ్లాగు యొకటి యున్నబాధ లుండ
    వనుచు పలువురిపుడు పల్కుచు నున్నారు
    బ్లాగు తెరచి నాదు బాధ తీర్చు.

    రిప్లయితొలగించండి
  12. నందమె డాట్కామ్ బ్లాగులుఁ!
    నందగ నుపశమనమింట నభిరుచులగుచున్
    విందేమి చేసి పెట్టవు!
    చిందెందుకె వండిపెట్ట శ్రీవారికిలన్!

    రిప్లయితొలగించండి
  13. గురుదేవుల సమీక్షకు నోచుకొనని నిన్నటి పద్యరచన:

    9
    పప్పుకట్టులోన పండు మాగినయట్టి
    యీ టమాట పళ్ల గోట చిదిమి
    రసముఁ గలిపి చేయు రసపూరితమ్మైన
    చారుఁ దినగ లేని జన్మమేల?

    రిప్లయితొలగించండి

  14. గంటెను బట్టుట కన్నను
    ఇంటరు నెట్టున్న చాలు, యిదివరకటిలా
    వంటింట్లో మగ్గక తమ
    కంటూ గుర్తింపువచ్చు కాంతలకిపుడున్!!!

    రిప్లయితొలగించండి
  15. డాటు.కము. బ్లాగు లన్నియు
    నేటి వనితలకిక నప్ప నేరవు గుమ్మా!
    వాటముగ వంట మానగ
    నీటుగ నాన్లైను బువ్వ నేరుగ వచ్చున్!

    రిప్లయితొలగించండి