4, డిసెంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1558 (కరివరదుని సేవ సేయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. హరహర శంభో శంకర !
    కరి వరదుని సేవ సేయ గలుగు నిడుములే
    గరముగ, ననుచును బలికిరి
    సరియా ? మఱి జెప్పు సామి ! సరికా దనుచున్

    రిప్లయితొలగించండి
  2. వరములనిచ్చును భక్తిన్
    కరివరదుని సేవ సేయఁ -గలుగు నిడుములే
    మురియుచు సుఖభోగంబుల
    పరమాత్ముని మరచినట్టి పాపాత్ములకున్

    రిప్లయితొలగించండి
  3. అరమరిక లేని దైవము
    కరములు జోడించి గొలువ కరుణా మయుడౌ
    నిరతిశయ భక్తి లేనిదె
    కరివరదుని సేవ సేయ గలుగు నిడుములే

    రిప్లయితొలగించండి
  4. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. తెరవెనుకొక భాగవతము
    తెరముందుకొటియు నడిపిన తేలును నిజమే
    భరియించిన దుర్గుణముల్
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.

    రిప్లయితొలగించండి
  6. తొరలన్నియు దొలగించును
    కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
    నిరతము భక్తిని గొల్వక
    దురితమ్ములు సేయునట్టి దుర్మార్గులకున్!!!

    రిప్లయితొలగించండి
  7. మరి నేనే గొప్పనుచును
    విరివిగ పాపాలు భువిని - విజ్ఞత లేకన్
    సరి వదలుచు హరి ! హరి ! హరి
    కరివరదుని సేవ - సేయఁ గలుగు నిడుములే.

    రిప్లయితొలగించండి
  8. సురలోక ప్రాప్తి గలుగును
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే
    హరిదూషణమ్ముఁ జేయుచు
    పరిపరివిధముల పరులను వంచించినచో

    రిప్లయితొలగించండి
  9. నిరతము తననే గొలువగ
    పరీక్ష జేయంగ నెంచి పరిపరి విధముల్
    గురిజేయగ కష్టములకు
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే!

    రిప్లయితొలగించండి
  10. కరుణాకరు సుర ,నర,ముని
    కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే
    సరవిన నున్న దొలగు శ్రీ
    హరి నామము మరవ బోకు మయ్యా! మదిలో.

    రిప్లయితొలగించండి
  11. పరధనము దొంగిలించుచు
    కరివదనుని సేవ సేయఁ గలుగు నిడుములే
    నిరతము సత్యము పలుకుచు
    సరసిజ గర్భుని గొలిచిన స్వర్గము కలుగున్

    రిప్లయితొలగించండి
  12. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణలో మూడవపాదాన్ని ‘హరభక్తు లందు రిట్టుల’ అని మార్చితే అన్వయం కుదిరి ఇంకా బాగుంటుందని నా సలహా.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గొప్పయనుచు’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ

    అరయగ నున్నతమగు నా
    పరమ౦బును జేరునట్టి వాంఛ గలిగినన్
    వరమగు నధిరోహిణియౌ
    కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే

    రిప్లయితొలగించండి

  14. పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వ౦దనములు
    పరమ పద పటము నందున
    వరుసగ నిచ్చెనలు యుండు పాములె యధిక
    మ్మరయగమ్రింగును పాములు
    కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములతో.....
    గురువు గారు పరీక్షలు ముగిసినవి కాస్త ఖాళీ సమయము దొరకినదండి. తప్పులు దొరలునన్న భయముతో ఇన్ని రోజులు క్షణమొక యుగము వలె గడచినదండి.
    అందరికి వినమ్రవందనములతో..
    ==============*============
    నరులు చెప్ప నలవి గాని సిరులు గురియు
    చిత్తమున కరి వరదుని సేవ సేయ,
    గలుగు నిడుములే నన్నిట ఖలుని జెంత
    జేరి కాటి కాపరి వంటి సేవ జేయ!

    రిప్లయితొలగించండి
  16. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కందుల వరప్రసాద్ గారూ,
    చాలా సంతోషం.
    కందపాద సమస్యకు తేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. కె ఈశ్వరప్పగారి పూరణ

    హరి భజనను విడనాడీ
    తరుణమున౦ దీవు తండ్రి దండించు సుమా
    గురువనె ప్రహ్లాదునితో
    కరి వరదుని సేవ సేయ, గలుగు నిడుములే

    రిప్లయితొలగించండి
  18. గురుదేవులకు ధన్యవాదములు.
    గురువు గారు కందము లోని ప్రాస కన్న తేట గీతి లో త్వరగా వ్రాయగలనని పించింది అంతే

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కరి వరదుని సేవ మఱచి
    వరదుని బేకరిని జేర వరపుత్రుని తా
    నరహరి తండ్రియనెను బే-
    కరి వరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.

    రిప్లయితొలగించండి
  21. ‘శీనా’ గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో :

    01)

    ________________________________

    కరుణాత్ముడు శితికంఠుడు
    కరిచర్మము గట్టువాడు ♦ గంగాధరుడే
    కరుణించును ప్రార్థించిన !
    కరివరదుని సేవ సేయఁ ♦ గలుగు నిడుములే !
    ________________________________

    రిప్లయితొలగించండి
  23. వరులౌ త్యాగయ పోతన
    కరమౌ ప్రహ్లాదు డిలను కలిగిన భక్తిన్
    కరమౌ కష్టము లందరె
    కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే

    గరువము వీడిన యపుడే
    శరణమ్మను వారి గాచు సర్వేశు డిలన్
    కరిబల ముడుగన్ గాచెను
    కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే

    హరి భక్తు లెలమి కోరరు
    సిరులను,హరియే శరణని చెందగ నార్తిన్
    హరి వారి గాచు కడకును
    కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే

    నరులే కొలువగ హరినే
    హరి వారి పరీక్ష జేసి,యంతము నందున్
    వరదుడు గాచును కనగా
    కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే
    నరులిల భక్తిని యాత్రల
    కరమగు కష్టముల నంది కాంతురు హరినే
    తిరముగ కాచును నపుడే
    కరివరదుని సేవ సేయ కలుగు నిడుములే

    రిప్లయితొలగించండి
  24. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. పరుగున వేంచేయు నతని
    కరుణల నాశించువారి కాచెడు వానిన్
    సిరిమా తల్లికి పతియౌ
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే?

    రిప్లయితొలగించండి
  26. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

    నిరతము కడు భక్తి గలిగి
    కరి వరదుని సేవజేయ కడతే రిడుముల్
    మరి యెట్టుల నుడివెదరే
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే?

    రిప్లయితొలగించండి
  28. పరగడుపు పూజ చేయక
    విరివిగ దోశెలు తినుచును వినకయె కథలన్
    పరిపరి గుంజీలిడకయె
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే

    రిప్లయితొలగించండి
  29. కరచుచు తల్లిని తండ్రిని
    బరువుగ పెండ్లాముకిడగ బంగరు గాజుల్
    తరచుగ జేయుచు నప్పుల్
    కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే

    రిప్లయితొలగించండి