6, డిసెంబర్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1559 (సానిపొందు మోక్ష)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సానిపొందు మోక్షసాధకమ్ము.

24 కామెంట్‌లు:

  1. సన్య సింతు ననుచు సాహసించుట కంటె
    కష్ట మైన గాని నిష్ట పడుతు
    మూడు ముళ్ళ తోన మురిపించి గెలిపించు
    సాని పొందు మోక్ష సాధ కమ్ము

    ఇక్కడ సాని = భార్య

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ప్రణయ సామ్రాజ్య పట్టమహిషి :

    01)
    ____________________________________

    సమధిహార ప్రణయ ♦ సామ్రాజ్య మందున
    భార్యయె దొరసాని ♦ భర్త కెపుడు !
    మధుర మంజులంబు ♦ మగనికి, తన దొర
    సాని పొందు, మోక్ష ♦ సాధకమ్ము !
    ____________________________________
    దొరసాని = మహారాణి

    రిప్లయితొలగించండి
  3. వలదు వలదు నీకు వగలాడి యైనట్టి
    సాని పొందు ,మోక్ష సాధకమ్ము
    శివుని నామ జపము జేయుట యేయిల
    నెంత మంచి జేయ నంత మేలు

    రిప్లయితొలగించండి
  4. *
    *
    పాప పంకిలంబు వలదురా నీకేల 
    సానిపొందు - మోక్షసాధకమ్ము
    భక్తిమార్గమేర - పరమేశ్వరుని నీవు
    శక్తి కొలదికొలువ ముక్తికలుగు


    రిప్లయితొలగించండి
  5. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గము
    కామి, మోక్షగామి ఆ పై ఆసామి
    పంచ దశ విభావరి యే 'నెర
    సాని'పొందు మోక్ష సాధకమ్ము !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. కష్ట నష్ట మందు ఇష్ట సఖి వెరసి
    ప్రేమ పంచి యిచ్చు ప్రియము గాను
    కంటి పాపగ నను కనిబెట్టు నాదొర
    సాని పొందు మోక్ష సాధ కమ్ము

    రిప్లయితొలగించండి
  7. కష్ట కారణమ్ము కరివరదుని దొర
    సాని పొందు, మోక్ష సాధనమ్ము
    చక్ర పాణి పూజ సంతత మిలలోన
    మరువ వలదు హరిని మాన్యు లార

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    జిలేబీ గారూ,
    _/\_
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. వృత్తియందు గలుగి వెగటును దానిని
    మానివైచి వేడి మాన్య వరుల
    హరిని జేరు విధము నడిగిన యార్తితో
    సాని పొందు, మోక్ష సాధ కమ్ము

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  11. కె.ఈశ్వరప్ప గారి పూరణ
    కామి గాక మోక్ష గామి గాడనియెడి
    మూర్ఖచిత్తు డొకడు మొ౦డి గాను
    సానిపొందు మోక్ష సాధకమ్ము యనగ
    నరకమందు జచ్చె తిరుగు లేక

    రిప్లయితొలగించండి

  12. కెయెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    జ్ఞానధవము వలన సాధ్యమౌ మోక్షమ్ము
    జ్ఞానమొసగు జనని శారదాంబ
    అందువలన కవివరా ఆనలువదొర
    సాని పొందు మోక్ష సాధ కమ్ము

    రిప్లయితొలగించండి
  13. కష్టసుఖములందు కలికి మాలక్ష్మియై
    నీడవోలె పతిని వీడి పోక
    నర్ధ భాగమగుచు ననుసరించెడి దొర
    సాని పొందు , మోక్ష సాధకమ్ము


    కాకులందున కల కాలమ్ము మసలిన
    కోకిలమ్మ వగచి గొలిచె హరిని
    పంక మందు నుండ పద్మమ్ము కేమౌను
    సాని పొందు, మోక్షసాధకమ్ము

    రిప్లయితొలగించండి

  14. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    విష్ణుపాదజనిత విశ్వేశు దొరసాని
    జడల వీడి దొరలె జగము నందు
    పాపములను బాపు పావన గంగ యా
    సాని పొందు మోక్ష సాధకమ్ము

    రిప్లయితొలగించండి
  15. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సాధకమ్ము + అనగ’ అన్నచోట సంధి నిత్యం. యడాగమం రాదు. ‘సాధక మ్మని చెప్పి/ సాధకమ్మటంచు’ అనండి.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. భాగవతముఁ దెలిపి భక్తిప్రపత్తులఁ
    కలుఁగఁజేసి మదిని వెలుఁగఁజేయు
    నట్టిదగు ప్రసంగ మంధించి నదె మేడ
    సానివిందు మోక్షసాధకమ్ము.

    అవధాని శ్రీమేడసాని మోహన్ గారినుద్దేశిస్తూ వ్రాసినాను.

    రిప్లయితొలగించండి
  17. గుండు మధుసూదన్ గారి పూరణము

    కవిమిత్రులకు నమస్కారములు!

    భోగములను విడచి, యోగసాధనమున
    నిత్యసక్తుఁడైన నిర్మలునకు
    నశ్వరరహితాపునర్భవమనియెడి
    సాని పొందు మోక్ష సాధకమ్ము!

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సంతసమ్ము నిచ్చు సతము గృహపు దొర
    సాని పొందు, మొక్ష సాధనమ్ము
    లార్తి జనుల సేవ లనుదిన మిలలోన
    మాధవు దరి జేర మార్గ మద్ది

    రిప్లయితొలగించండి
  20. పేరుకు తగు వాడు పెద్దన మాకును
    మనుచరిత్ర వ్రాసి మాకునిచ్చె
    ధీబలుండు! కృష్ణ దేవరాయునకల్ల
    సానిపొందు మోక్షసాధకమ్ము!!

    రిప్లయితొలగించండి
  21. వనిత తోడి పొందు వలయు జీవికినెంతొ
    భార్య యందు ధర్మ బద్ధ మదియ
    సాని పొందు తెచ్చు చావు ముందే కాన
    సాని పొందు మోక్ష సాధకమ్ము

    వేమనందె గాన విపుల విజ్ఞానంబు
    బిల్వమంగళుండు వేగ ముక్తి
    దేవదేవి వలన దివిని నారాయణ
    సాని పొందు మోక్ష సాధనంబు

    సాని యన్న వేశ్య,సాననన్ భార్యయౌ
    సానినొకతె గలుగు సకల పాపాలవే
    సాని తానునైన సహధర్మచారిణే
    సాని పొందు మోక్ష సాధకమ్ము

    సాని యన్న నగును స్వామికే భార్యదే
    స్వామి భార్య గూడ పాప మబ్బు
    ధర్మబద్ధమైన దారిని పెండ్లాడు
    సాని పొందు మోక్ష సాధకంబు

    సాని యనగ భార్య సాధనం బదిగదా
    వంశ మదియ పెరుగు భాగ్యముగన
    పెండ్లియాడు దాని ప్రేమను పొందునా
    సానిపొందు మోక్ష సాధకంబు

    రిప్లయితొలగించండి
  22. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణలో ‘సాని +అనన్’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘సాని యనగ భార్య’ అనండి. రెండవ పాదంలో ‘పాపాలవే’ అన్నచోట గణదోషం.

    రిప్లయితొలగించండి