12, డిసెంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1562 (కమలాప్తుం డగుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్.

29 కామెంట్‌లు:

  1. సమయంబు జూడ కవిదట
    బ్రమలు కలుగజేయ పలుకు పండితచయముల్
    సముడై నిజమును దెలపగ
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్!!

    రిప్లయితొలగించండి
  2. కమలము వికసిత జేసెను
    కమలాప్తుం డగుచు, శీత కరుడుద యించె న్
    హిమగిరి తనయాధీ శుని
    భ్రమ మగు నాజడ లనుండి భాసితు డగుచున్

    రిప్లయితొలగించండి
  3. మమతల సంధ్యయె వీడగ
    నిముసము లేకుండ రవిని నిర్దయ తోడన్
    శ్రమమును మరపించ దలచి
    కమలాప్తుం డగుచు శీత కరుడుద యించెన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కమల ప్రియునితో కబుర్లాడుకుంటూ యున్నప్పుడు :

    01)
    __________________________________

    కమలకు కమఠలు కలువలు
    కమనీయపు కౌముది యన ♦ కడు నిష్టంబౌ !
    కమనుని కలసిన సమయము
    కమలాప్తుం డగుచు శీత ♦ కరుఁ డుదయించెన్ !
    __________________________________
    కమఠ = తాబేలు
    కమనుడు = beloved(ప్రియుడు)

    రిప్లయితొలగించండి

  5. పూజ్యులుగురుదేవులుశంకరయ్యగారికివందనములు
    పూరణ:అమర నదీ జలములలో
    కమలమునా యనగ తార కనిపించగ దా
    నిముఖ కమలము జూడగ
    కమలాప్తు౦ డగుచు శీతకరుడుదయి౦చెన్

    రిప్లయితొలగించండి
  6. తమమను దుప్పటి కప్పెడి
    సమయ మ్మాసన్నమాయె, చదలున నక్ష
    త్రములు మెఱయ నస్తంగత
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  7. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణలో ఉత్తరార్ధం బాగుంది. పూర్వార్థంలో అన్వయం. అర్థం లోపించాయి. సవరించండి.
    ****
    అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాకుంటే ‘నిర్దయతోడన్| శ్రమమును మఱపింప దలచి’ అన్వయం కుదరడం లేదు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. కొమరుడు చిత్రము నందున
    కమలమ్మను గీసె కలువ కాంతకు బదులున్!
    ధుమధుమలఁ దండ్రి యనెనిటు
    "కమలాప్తుండగుచు శీతకరుడుదయించెన్"

    రిప్లయితొలగించండి
  9. తిమిరము లల్లగ దెసలన్
    సుమమున విరియంగవేల చుక్కల పూలే
    శమియించెడి సమయమ్మని
    కమలాప్తుండగుచు శీతకరుడుదయించెన్!!!

    రిప్లయితొలగించండి
  10. కమలమ్ములు ముకుళించెను
    తమ మెల్లెడ గ్రమ్ముకొనెను తారలు మెరసెన్
    తమకమ్మున రోహిణి ముఖ
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కే*ఈశ్వరప్పపంపుసమస్యాపూరణ
    కమలమునకుసూర్యుండును
    విమలంబగుపద్మమందువెన్నెలరేడూ
    అమరినత్రీడీజూడగ
    కమలాప్తుండగుచుశీతకరుడుదయించెన్

    రిప్లయితొలగించండి
  12. తమము హరించి రవి వెలిగె
    కమలాప్తుండగుచు, శీతకరుడుదయించెన్
    విమలాకాశము నందున
    కుముదములకు ప్రీతిఁ గూర్చు కోరిక తోడన్

    రిప్లయితొలగించండి
  13. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మిస్సన్న గారూ,
    ‘రోహిణీముఖకమలాప్తుం’ డన్న మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెన్నెలరేడు| న్నమరిన...’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. సుమనస్కుఁడతండా భువ
    నమునందు వెలుగుల నింపనదొ, చీకటులన్
    కమిలిన ధరియిత్రీముఖ
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  15. సుమనస్కుఁడతండీ భువ
    నమునందు వెలుగుల నింపనదొ, చీకటులన్
    కమిలిన ధరియిత్రీముఖ
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధరియిత్రి’ అన్న పదం లేదు. అక్కడ ‘కమిలిన విశ్వంభరముఖ...’ అందామా?

    రిప్లయితొలగించండి
  17. తమమును హరియించుచు వి
    ​శ్వమున దిరిగి తిరిగి ​​​సూర్య భగవానుడు వి
    ​శ్రమమును గోరెను మాపున​
    కమలాప్తుండగుచు​;​ శీతకరడుదయించెన్​!​

    రిప్లయితొలగించండి
  18. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  19. కె .యెస్.గురుమూర్తి ఆచారి గారిపూరణ
    కమలాప్తు౦డుదయి౦చును
    కమలముల వికస మొనర్ప,కానీ అటుచూ
    డుమ ప్రేమికజనమానస
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్!!

    రిప్లయితొలగించండి
  20. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    ‘ప్రెమికజనమానస|కమలాప్తుం’ డనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారు,
    మన్నించండి. ధరిత్రి, జనయిత్రి విన్నాను. ధరియిత్రి కూడా ఉందనుకున్నాను.
    మీ సూచన బాగుంది.ధన్యవాదాలు.
    సుమనస్కుఁడతండీ భువ
    నమునందు వెలుగుల నింపనదొ, చీకటులన్
    కమిలిన విశ్వంభరముఖ
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్

    రిప్లయితొలగించండి
  22. తిమిరం బులు దొలగించెను
    కమలాప్తుం డగుచు, శీత కరుడుద యించె న్
    హిమగిరి తనయాధీ శుని
    భ్రమ మగు నాజడ లనుండి భాసితు డగుచున్

    రిప్లయితొలగించండి
  23. 1.విమలపు రశ్మిని వెలిగెను
    కమలాప్తుండగుచు శీతకరుడుదయించెన్
    తమసము చేరెడి వేళకు
    తమవిధి సలుపరె యిరువురు తప్పక నెపుడున్
    2.కమలానన లెల్ల ప్రియుల
    తమకము తోడను కలియగ తహతహలాడన్,
    సమయమునకు నస్తమయుడు
    కమలాప్తుండగుచు శీతకరుడుదయించెన్
    3.కమలకు సోదర చంద్రుడు
    కమనీయంబగుచు రాత్రి కనబడెనుగ, తా
    కమలయె హరినే చేరగ
    కమలాప్తుండగుచు శీతకరుడుదయించెన్
    4.కమలానన వికసించెను
    యమలిన కాంతిని పగటిని,నామెయె రాత్రిన్
    విమలపు శృంగారమిడగ
    కమలాప్తుండగుచు శీతకరుడుదయించెన్

    రిప్లయితొలగించండి
  24. కమలముల వంటి బాలలు
    కములుచు జీవించు చుండె కార్మికు లగుచున్ ,
    విమలుడు "సత్యార్ధి" రవిగ
    కమ లా ప్తుండగుచు శీత కరు c డుదయించెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  25. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. శంకరార్యా - భళా !
    నస్తంగత/కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్.

    రిప్లయితొలగించండి
  27. లక్ష్మీ పూజ రాత్రి:

    అమలమ్మీ బంధముగద!
    కమనీయమ్మైన యనుజ గారపు రాత్రిన్
    మమతలు మాయని తీరుగ
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్

    కమల = లక్ష్మీ దేవి

    రిప్లయితొలగించండి
  28. ధమధమ కొట్టగ స్పీచులు
    విమలపు నెన్నికల రాత్రి విడ్డూరముగా
    కమలగ రాహులుని ముఖము
    కమలాప్తుం డగుచు శీతకరుఁ డుదయించెన్

    కమలము = భాజపా చిహ్నము

    రిప్లయితొలగించండి