24, డిసెంబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1568 (శంకరుఁ డనఁ బార్థసారథి కద)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శంకరుఁ డనఁ బార్థసారథి కద.

19 కామెంట్‌లు:

 1. చంద్రశేఖరుండు జడముడి జంగము
  శంకరుడన, పార్థసారథిగద
  పాంచజన్యధరుడు వసుదేవ తనయుడు
  శ్యామసుందరునకు చాగిలింత

  రిప్లయితొలగించండి
 2. సత్యపథము లోన సతతము మసలుచు
  నార్తి సేవ సలిపి యనవరతము
  మోక్షపథము కోరు ముఖ్య భక్తులకు వ
  శంకరుడన పార్థసారథి కద

  రిప్లయితొలగించండి
 3. వరము లొసగు నతడు భక్త కోటికినిల
  శంకరుడన , బా ర్ధ సారధి గద
  కదన రంగ మందు గాండీవి కిని మఱి
  రధము నడిపి నతడు రంజి లంగ

  రిప్లయితొలగించండి
 4. శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  శంకరుణ్ణి వశంకరుణ్ణి చేసుకున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ఈ పద్యాన్ని చూసి ఎవరనగలరు?... మీరు మొన్నమొన్ననే పద్యాలు వ్రాయడం ప్రారంభించారని!
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మిత్రులు కంది శంకరయ్యగారికి, సుకవిమిత్రులందఱకును నమస్కారములు! అనారోగ్యకారణముచే నేను మన బ్లాగునకుఁ గొంత కాలము దూరముకావలసివచ్చినది. మన్నింపుఁడు.

  నా పూరణము:

  వాసుదేవుఁడు హరి బకవైరి మురవైరి
  కంసఘస్మరుండు కైటభారి
  శ్యామసుందరుండు శకటారి దైత్య నా
  శంకరుఁ డనఁ బార్థసారథి కద!

  రిప్లయితొలగించండి
 6. శంకరుడన?పార్థసారధిగద|మన
  రక్షగుర్చనెంచితక్షనంబె
  శాంతిసౌఖ్యములను,సౌభాగ్యవిద్యను
  నూత్నవత్సరాననొసగుగాక
  శంకరుడు=శుభంకరుడు
  2యుద్ధసమయమందుబద్దకమునుమాన్ప
  అర్జునుండునమ్మినాయుధములు
  చేతబట్టెకృష్ణచేయూతనిచ్చెడి
  శంకరుడనబార్థసారధికద|

  రిప్లయితొలగించండి
 7. గుండు మధుసూదన్ గారూ,
  మీ పునరాగమనం ఆనందదాయకం.
  పార్థసారథిని దైత్యనాశంకరుణ్ణి చేసిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి.అభినందనలు.
  డుప్రత్యయం లేక కృష్ణ అంటే ద్రౌపది అనే అర్థం వస్తుంది. కనుక ‘చేతబట్టె హరియె’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. కొండ వలె మీరు సతతము నండనివ్వ
  సాగు చుండె పద్యరచన చక్కగాను
  తమరి సూచనలఁగనని సమయమందు
  తపన పడు చుందును వలయు తృప్తిలేక

  రిప్లయితొలగించండి
 9. యుద్ధ మందు జేరి బుద్ధి మరల్చఁగన్

  సందియముల దీర్చి శాంతి నొసఁగి

  గీత బోధ జేసె పోత! యజ్ఙాన నా
  శంకరుఁడన పార్థ సారధి కద

  రిప్లయితొలగించండి
 10. తనను శరణువేడ తా వచ్చి గజరాజు
  రక్షసేసె గాదె రయము,వాడె
  కాచె చీరలిచ్చికమలాక్షి-భక్తవ
  శంకరుడన పార్ధసారధికద!

  భీమ బాణ తతిని భీష్ముడేయంగను
  వాని చంపుదనెను,పార్ధు డడ్డు
  పడగ,వీడెపట్టు,పాండవులను గాచు
  శంకరుడన పార్ధసారధి గద!
  (శంకరుడు=శుభము గూర్చువాడు)
  రాయబారియౌచు రయము నా సభకేగి
  రమ్య భాషణముల రాజరాజు
  వినగతెల్పి,వినమి విశ్వరూపము జూపె
  శంకరుడన పార్ధసారధి కద!
  (శివాయ విష్ణురూపాయ)
  శివుడు విష్ణువొకడె చింతింప మదిలోన
  చిత్రమైనరీతి చెలగు విభుడు
  నాది మధ్యమంత మరయంగ లేనట్టి
  శంకరరుడన పార్ధసారధి కద!

  ఈశు,డేశు,*నల్లని నిలలోన కొలువ *(అల్లాని)
  వేరువేరు పేర్ల పిలుతురంతె
  మతమదేది యైన మానవుడొక్కడే
  శంకరుడన పార్ధసారధి కద!

  రిప్లయితొలగించండి
 11. విజయవాడ యన్న బెజవాడ యే గాదె!
  బందరౌను మచిలిపట్నమనగ!
  భక్తులెందరైన పరమాత్మ యొక్కడే
  శంకరుడన పార్ధసారధి కద!

  రిప్లయితొలగించండి
 12. అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
  సంతోషం! మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
  చివరిపాదంలో యతి తప్పింది. ‘తృప్తి’ని ‘తనివి’ అంటే సరి!
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  అజ్ఞాన నాశంకరునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ సాస్త్రి గారూ,
  మీ ఐదుపూరణలు బాగున్నవి. అభినందనలు.
  చివరిపద్యం మొదటి పాదంలో యతి తప్పింది.‘ఈశు నేసు నల్ల నిలలోన కొలువగా’ అనండి.
  ****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  ‘ఏకం సత్, బహుధా వదన్తి విప్రాః’ అన్నభావంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. కాచె గోకల నిడి కాంత పాంచాలిని
  అటుకులనిడి కాచె నతని సఖుని
  సామజమును గాచె జంపి నక్రంబును
  శంకరుఁ డనఁ బార్థసారథి కద.

  రిప్లయితొలగించండి


 14. కదన రంగ మందు క్లైబ్యము కలిగిన
  విజయునకును గీత విశద ముగను
  బోధ పరచి శిష్యు బ్రోచిన భక్త వ
  శంకరుడన పార్థ సారథి కద

  రిప్లయితొలగించండి
 15. కె యెస్ గురుమూర్తి ఆచారి పూరణ
  అహము నెల్లవీడి ఆత్మశుద్ది గలిగి
  దిక్కు నీవె యనుచు మ్రొక్కు లిడుచు
  శరణు వేడ,బ్రోచు శౌరి యే;భక్త వ
  శంకరుడన పార్థసారథి కద

  రిప్లయితొలగించండి
 16. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  భక్తవశంకరుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  పాథసారథిని భక్తవశంకరుని చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. బ్రహ్మ,విష్ణు,శివునిభాధ్యతలొక్కటే
  పేర్లువేరుగాని?పెదవినొకటె|
  రాక-జేయగలరురాగలకష్టాలు
  శంకరుడనబార్థసారథికద|

  రిప్లయితొలగించండి
 18. యద్ధరంగమందు యోధులను జయించ
  పాశుపతమునిడి యభయమునొసగి
  హృదయ రధమునిలచి ఇంద్రసూను నడిపె
  శంకరుడన బార్ధ సారధిగద

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  పార్థహృదయరథసారథిగా శంకరుణ్ణి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి