21, డిసెంబర్ 2014, ఆదివారం

న్యస్తాక్షరి - 20

అంశం- సావిత్రిని యముఁడు భయపెట్టుట.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల చివరి యక్షరములు వరుసగా ‘న, ర, క, ము’ ఉండవలెను.
(పద్యంలో ఎక్కడా ‘నరకము’ అన్న పదాన్ని ప్రయోగించకండి)

26 కామెంట్‌లు:

  1. సుదతి నాదు మాట వినుము సుంత యైన
    నడువగలవె నీవిట్టి కారడవినౌర
    నీవు నావెంట వచ్చుట నిరయమునక
    సాధ్యము వలదీ పంతము సాధ్వివిడుము

    రిప్లయితొలగించండి
  2. సుమతి యైనట్టి సావిత్రి ! సుంత యైన
    వినుము నామాట యోయమ్మ ! వినక ,నౌర
    యె టుల వత్తువు నాతోడ నిదియ నీక
    సాధ్యము గద మ ఱి యిక నీ శంక విడుము

    రిప్లయితొలగించండి
  3. సాద్వ్హి మరలుము నీవింక సంత సమున
    ప్రియుని ప్రాణము కోరుచు ప్రేమ మీర
    భీక రంబైన యడవుల భీతి లేక
    మనుజ కాంతలు జొరలేరు మాట వినుము

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. బుద్ధిగా నింటి కేగుము! పో! రయమున
    చూడలే వెవరిని కనుచూపు మేర
    వనచరము లుండు నడవిలో పడకు వెనుక
    కాకులైనను దూరని కఠిన వనము!

    రిప్లయితొలగించండి
  6. ఇటుల నావెంట రాలేవు నిందువదన!
    నాదు మాటల నాలించు నయము మీర
    భీకరమ్మైన బిద్దెకు ప్రియుని వెనుక
    నడువ సాధ్యమా? సావిత్రి నన్ను విడుము!!!

    రిప్లయితొలగించండి
  7. లలన! రావలదిటుపైన ఫలముఁ గాన
    లేవిక, వినుము. నా మాటలింక మీర
    వలదు, కోపమాగునె యిక పైన శంక
    వీడి నిన్ను శపించెదన్! వేగఁ జనుము.

    రిప్లయితొలగించండి
  8. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రాలేవు + ఇందువదన’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘రాకూడ దిందువదన’ అనండి.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. యముని పాశంబు తప్పించ నలవియగున
    వెంటవచ్చిన నీకును వెతల భార
    మగును దారి కానవచట అరుగుమింక
    కలికి ఆత్రోవ రుధిర కంకాలమయము

    రిప్లయితొలగించండి
  10. భైరవభట్ల శివరామ్ గారూ,
    అద్భుతమైన పూరణతో ‘శంకరాభరణం’ బ్లాగులో అడుగుపట్టారు. అభినందనలు.
    మీకు మహదానందంతో స్వాగతం పలుకుతున్నాను.

    రిప్లయితొలగించండి
  11. పదును రంపాలు కోసెడు పాపి కతన!
    కాల్చి పెట్టెడు సూదులు కనుల దూర!
    మరగఁ గాచిన నూనెలో పొరలు కేక!
    చూడలేవమ్మపాపుల సోదెఁ !జనుము!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. వెంటబడకుము సావిత్రి యంటి, వినిన
    దానవైతివి చూడగా దారి బెదర
    గొట్టు సాగదు ముందునకు మరి నడక
    బ్రతకబోడిక పతి, నాదు పలుకు వినుము.

    రిప్లయితొలగించండి
  14. మల్లెలవారి పూరణలు
    1.ప్రాణమది వోవ తప్పదే ప్రాణికైన
    భయము గల్గించు దారియౌ,భార మౌర
    పాము,తేళ్ళను,రాళ్ళను వలను గాక
    యుండు,నింకను పతి గొను నూసువిడుము
    2.వెనుకకునిడను పతిని నే వీరయాన!
    నాదు వెంటను బడకుము నడకదీర
    భయముగొల్పును నిటపైన దారి లేక
    యుండు.పతి ప్రాణ మాసను నుడుగ భయము

    రిప్లయితొలగించండి

  15. పూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములు
    కంటకావృత మగు ఘోర కాననమున
    ఎలుగు తోడేళ్ళుసి౦హము లేన్గులు వర
    హశరభములు పులులు తిరుగాడును నిక
    మరలిపొమ్ము సావిత్రి నామాట వినుము

    డిసెంబర్ 21, 2014 3:09 [PM]

    రిప్లయితొలగించండి
  16. కెయెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ఈవు వదలుమా ఆశ ప్రాణేశు పైన
    మరల ననుసరించితి వేని మద్భయకర
    పాశబంధము తీయు నీ ప్రాణమునిక
    మాట వినుమిక సావిత్రి మరలి చనుము

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కొండగుట్టలుదాటినగుండెనయిన
    మండుసూర్యునిదాటంగమనసుజేర
    బూడిదౌదువుసావిత్రిపూర్తి;గనుక
    పట్టువిడనాడివెళ్లుముగుట్టుగాను

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కాకులు చొరబడగలేని కారడవిన
    పద్మపత్రనేత్ర వినుము పయనము నర
    జాతికి నసాధ్యము మరలు సాధ్వి! లతిక
    కోమలాంగి యొకవరము కోరుకొనుము

    రిప్లయితొలగించండి
  20. 2గాలివెలుతురులేనట్టిగమనమైన
    కళ్ళకగుపించకన్-దారికంటకమె,ర
    జస్సునందేళ్ళసావిత్రిజడ్డు,గనుక
    యమునినాజ్ఞగమరలుమునాశవిడుము


    3ఎదురుపడనపడనట్టిబాధలునెంచుటగున
    చూడలేనట్టివెతలిటచూడు,విసర
    కష్టనష్టాలబాటలోకలసిరాక
    వెళ్లిపొమ్మికసావిత్రీవేగవినుము

    రిప్లయితొలగించండి
  21. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మరణ పతిని కాపాడంచు మంకు తగున
    ప్రేతపురి దారి కంకాళ ,భూత, క్రూర
    జంతు, కింకర మయము రా జనదు నీక
    రిష్టము కలుగు మరలిపో నిజము వినుము

    రిప్లయితొలగించండి
  23. మరణ పతినాదు కొమ్మను మంకు తగున
    ప్రేతపురి దారి కంకాళ ,భూత, క్రూర
    జంతు, కింకర మయము రా జనదు నీక
    రిష్టము కలుగు మరలిపో నిజము వినుము

    రిప్లయితొలగించండి
  24. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి