1, డిసెంబర్ 2014, సోమవారం

నిషిద్ధాక్షరి - 22

కవిమిత్రులారా,
అంశం- శ్రీవేంకటేశ్వర స్తుతి
నిషిద్ధాక్షరములు - దీర్ఘాక్షరములు.

(ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్నవి గురువులే కాని దీర్ఘాలు కావని గమనించండి)
ఛందస్సు - తేటగీతి.

17 కామెంట్‌లు:

  1. సరసిజ నయన! విషధర శయన! గరుడ
    గమన! దురిత శమన! గిరి రమణ! దుష్ట
    దనుజ దమన! భయ హరణ! వినుత చరిత!
    సప్త గిరి నిలయ! వరద! శరణు శరణు!

    రిప్లయితొలగించండి
  2. కొండ పైనుండు వెంకన్న !కొమరు మిగుల
    మమ్ము రక్షించ దిగిర మ్ము మంగయుతము
    ముసలి పండుల మైతిమి ముదిమి వలన
    సప్త గిరులందు నివసించు చక్క నయ్య !

    రిప్లయితొలగించండి
  3. శ్రీగురుభ్యోనమ:

    వరములనునిచ్చు దైవము పద్మపతియె
    పిలచి నంతనె రయమున పలుకు ననగ
    స్థిరముగను నిల్చె తిరుమల గిరులపైన
    ప్రణతు లర్పింతు వెంకటరమణు గొలచి

    కరుణన్ ప్రజలను గనుచున్
    వరముల నొసగంగ వచ్చె వరదుండగుచున్
    తిరుమల నగమున నిలచిన
    సిరిపతినిన్ గొలచినంత సిద్ధులు కలుగున్

    రిప్లయితొలగించండి
  4. గిరులఁ గొలువుతమకు కృపయునంతదె యని
    నమ్మిఁ గొల్తుమయ్య నడచి వచ్చి
    కురులనిచ్చు జనుల కొండంత దయగని
    నెమ్మదియగు బ్రదుకు నియ్యవయ్య!

    రిప్లయితొలగించండి
  5. బ్రహ్మ కడిగిన పదములన్ బట్టి నంత
    గంగ పొంగిన నఘములు భంగ పడవె?
    కరుణ గురిపించు శరణన కమల నయన!
    హృదయ సిరిమందిర! కొలతు ముదము నియ్య!

    రిప్లయితొలగించండి
  6. పూజ్యులుగురుదేవులు శ౦కరయ్య గారికి వ౦దనములు

    సప్త గిరులనిద్దరి ప్రియ సతుల కలసి
    వెలసె తిరుమల విభుడు.మొక్కులను గొనుచు
    వరములిచ్చును తన భక్త వరుల కెల్ల
    స్తుతి నొనర్చెద నఘములు తొలగు కొరకు

    రిప్లయితొలగించండి
  7. కొండలందున వెలుఁగుచునుండి జనుల
    కమితవరములఁగురిపుంచు విమల చరిత
    భవగుణంబుల నుతియించి వందనముల
    నిత్తు గొనుమయ్య భక్తుల హృన్నిలయుఁడ

    రిప్లయితొలగించండి
  8. సప్త గిరులందు వెలసిన చక్కనయ్య
    భక్త జనులను కరుణించు వకుళ తనయ
    పిలిచినంతనె పలికెడి విభుని గొలిచి
    నతుల నిడెదను వెంకన్న సతము దలచి!!!


    నిన్ను తిలకించి నగరున సన్నుతించి
    పదసుమమ్ముల గొల్చితి పరమ పురుష
    రిక్త హస్తంబు లివియని భక్తవరద
    తలచ వలదయ్య హరి నన్ను దయను గనుమ!!!


    వరద! వెంకట రమణుడ! వందనములు
    సప్తగిరినిలయ !ముకుంద !శరణు శరణు
    పద్మగర్భుడ! సిరిదొర ! ప్రణతి ప్రణతి
    సంకట హరణ! హరి !కృష్ణ! టెంకటనము!!!

    రిప్లయితొలగించండి
  9. కె.ఈశ్వరప్ప గారిపూరణ

    శరణు జొచ్చితి వెంకన్న కరము బట్టు
    కొండలెక్కను గుండెకు నండగుండి
    రక్ష నిడు మయ్యనిన్నెంతు దక్షుడుగను
    భక్త భగవంత శక్తిని యుక్తి నిమ్ము


    రిప్లయితొలగించండి
  10. పన్నగశయనంబుజ పత్ర నయన!
    సతతము కరము భక్తిన సన్ను తింతు
    కమల గర్భు డసిత వర్ణ! కనుము నన్ను
    నచ్యుత! గరుడ ధ్వజ! దయ నండనిమ్ము!

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ హుస్నాబాద్ నెట్ సెంటర్‌లో ఉండి మిత్రుల పూరణలను, పద్యాలను (నిన్నటివి, ఈరోజువి) చూశాను. సంతోషం. సమయాభావం వల్ల ప్రస్తుతం సమీక్ష చేయలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  12. కలియుగ విభుడు నగుచును కలుము లిచ్చి
    తిరుమల వెలిగి,జనములు తిరము భక్తి
    కొలుచు చుండగ మ్రొక్కులు గొనుచు వెనుక
    కటము లిడకను నెపుడు వెంకన్న కనడె

    అర్క,చంద్రుల,గరుడుని,హనుమ,సింహ
    ములను నెక్కియు తిరుగును ముఖ్య తిథుల
    కొండ వెలుగును మలయప్ప గొప్ప నచట
    వడ్డి యలక పతికి నిడు దొడ్డ ప్రభువు

    అభయ,కటిహస్త వరదుడు నభయ మిడును
    జుట్టు చెల్లించి జనులల శుద్ధ మతిని
    దర్శనంబును సలుపంగ తధ్య మిడును
    విమల తిరుమల వెంకన్న పెద్ద సిరులు

    రిప్లయితొలగించండి
  13. తిరుమ లందున వెలసిన దివ్యశక్తి
    సర్వ జనముల రక్షించు చల్లనయ్య
    కుల మతంబుల గననట్టి కొండలయ్య
    అభయ ముద్ర నొసంగుచు శుభము లిచ్చు.

    రిప్లయితొలగించండి
  14. సప్త గిరులను నిలచిన శక్తివి గద
    హరిగ హరునిగ తలపుల గురి కుదిర్చి
    కురులనిచ్చిన దరగని సిరులనిచ్చి
    భక్త జనులను రక్షించు పరమ పురుష.


    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    సప్తగిరివాస - శ్రీవేంకటేశ - నమః

    01)
    ____________________________

    తిరుపతి గిరిపై వెలసిన ♦ దివ్య పురుష
    భక్త వరదుడ వగునిన్ను ♦ ప్రస్తుతింప
    నల్పులకు శక్య మగునయ్య ♦ యమర వినుత
    సకల జగముల కిరవైన ♦ సర్వ వినుత
    మమ్ము కరుణించి రక్షించు ♦ మయ్య యెపుడు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  16. సప్త గిరులందు వెలిసిన సజ్జు c డనగ
    వరద హస్తము నొసగెడు వరదు డనగ
    "కురువరతనంబి "కొసగెను వరములనగ
    అన్న మయ్యకు నగుపించే అత్తు కొనుచు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి