19, డిసెంబర్ 2014, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 25

కవిమిత్రులారా,
అంశం- ఉగ్రవాదము
నిషిద్ధాక్షరములు - కవర్గ (కఖగఘఙలు)
ఛందస్సు - తేటగీతి.

23 కామెంట్‌లు:

  1. మానవత్వము మదిలోన మరచిపోయి
    పిచ్చి సిద్ధాంత ములతోడ రెచ్చిపోయి
    మృత్యు దేవత దూతల మించినావు
    తీరు యెపుడైన మారునా తీవ్రవాది

    రిప్లయితొలగించండి
  2. తీవ్ర వాదము ధ్యేయమై తీవ్ర వాదు
    లుర్వి బ్రజలను హింసించు టొప్పటంచు
    చంపు చున్నారు దయలేమి సామి ! వారు
    ప్రభుత మీదున్న రోషా న ప్రబలి పోయి

    రిప్లయితొలగించండి
  3. మనిషి మనిషిని చంపెడు మమత లేని
    పదవు లుండిన చాలును యెదను మెండు
    తీవ్ర వాదులు నిండిన తేరు పైన
    సాహ సంబున పయనించి సమసి పోవ

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పాకిస్థాన్ లో ఉగ్రవాద చర్యకు బలైన చిన్నారులకు ఆత్మశాంతి కలుగు గాక !

    ఉగ్రవాదము - ఉగ్రవాదులు :

    01)
    _________________________________

    మారణాయుధము లనిన - మమత తోడ
    హింస చేయుట యందదె - హితము హెచ్చి
    బేలలైనట్టి వారల - వేటలాడి
    యముని భటులను తలపించు - నట్టివారు
    తీవ్రవాదులమను పేర - తిరుగుచుంద్రు !
    పట్టి నిలబెట్టి తల తీయ - వలెను వారి
    శాంతి భువిపైన స్థాపించ - సత్వరంబు
    _________________________________

    రిప్లయితొలగించండి
  5. ఆరువిధముల బలమైన యరులపాలి
    బడినవారౌచు జనులను బాధవెట్టి
    బడయుసంపదలవియెల్ల పాపమంచు
    నేర్వలేని తనమ్మున నిపుణులయ్యొ!

    రిప్లయితొలగించండి
  6. మానవత్వము నశియించి మతియె దప్పి
    దానవత్వము ప్రబలెను ధరణి లోన
    మమత దయలను బూయించి మట్టి మీద
    తీవ్రవాదము సమయించు తిరుమలేశ!!!

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    1విలువలుంచెడివలువలువలదటంచు
    విడచినడచెడిరీతిగా'విద్యయుండి
    తీవ్రవాదంబునెంచెడితీరుజూడ
    సప్త-వ్యసనాలవంటిదేసాధనంబు
    2మానవాళియుతెలివంతమయమేన
    అడవులందుననివశించునదురుయేల
    పడవులుండియులంచాలుబట్టినపుడె
    వాదనాదంబుబుట్టునుపాపమదియె

    రిప్లయితొలగించండి
  9. చల్లా రామలింగ శర్మ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో, మూడవ పాదంలో ‘వేడ్క’ అన్నచోట కవర్గాక్షరముల ప్రయోగించడం వలన నిషిద్ధాక్షరి నియమోల్లంఘన జరిగింది. సవరించండి.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అసుర నాధుని సైన్యమ్ము లనెడు రీతి
    మంచి మర్యాద లన్నింటి మరచి నేడు
    నిరప రాధుల తరిమి వధించు చున్న
    తీవ్ర వాదుల నిర్జించు ధీరు డెవడొ

    రిప్లయితొలగించండి
  11. చల్లా రామకృష్ణ శర్మ గారూ,
    మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    గురుమూర్తి ఆచారి గారి పూరణలో ఒక పాదం తప్పిపోయింది.

    రిప్లయితొలగించండి
  12. మట్టిలో మానవత్వము మట్టుపెట్టి
    హీన హింసా ప్రవృత్తిని పూనినట్టి
    తీవ్రవాదుల అభిలాష తీరదెపుడు
    మెచ్చ డల్లాహె వారల తుచ్చ చర్య.

    రిప్లయితొలగించండి
  13. మతపు మత్తులో తూలుచున్ మదము తోడ
    బుడతలను సైతము తునుము మూడ జనుల
    విశ్వ మందలి జనులంత విధి యటంచు
    నంత మొందించ వలయును చింత తోడ

    రిప్లయితొలగించండి
  14. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    భీష్మవాదులుమతముపై పిచ్చ తోడ
    లేద,ధనముపై పిచ్చతో రెచ్చిపోయి
    రుధిర పాతమ్మొనర్చెద రధము లౌచు
    మేలు చేయలేరెన్నడు మేలు పడరు

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికివందనములు

    తీవ్ర వాదమ్ము నశియింప తేవలయును,
    “పేద శ్రీమంతుల నడుమ భేదములను
    మరచి, ప్రజల రక్షణ ధ్యేయమ[ తనరుచు ”
    చట్టముల్, జేయ నవ సమాజమ్ము బడయు





    రిప్లయితొలగించండి
  17. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘మరచి జనరక్షణమె ధ్యేయమై తనరుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. తీవ్రవాదుల చర్యలు తీవ్రమయ్యె
    మానవత్వమును మరచి మానవులను
    సంహరించుట నాపగ సింహములయి
    ఉద్యమించుడు భారత యోధులార!

    రిప్లయితొలగించండి
  19. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. Kandi Sankarayya Guruvu gariki namaskaramu.

    Monna pakistanlo amayakulaina letha vayasu mukku pachchalaarani chinna pillalani chaalaa dharunamugaa champaaru. Chaala bhadakaramaina vishayamu. Paapamu chinna pillalu emi chesaaru.

    Guruvu garu mee blog chaalaa chaalaa bagundi. Mee blog choosi anandamu vesindi.

    Guruvu garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

    http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

    Guruvu garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment in english language.

    రిప్లయితొలగించండి
  21. తోటి జీవుల జంపెడు దురితమేల?
    జనలు లేని శ్మశాన నిశ్శబ్ద మందు
    పొంద వలసిన దేమీటో బోధ పడునె?
    చేరి మరుభూమిఁ జూచిన సిసలుఁ దెలియు!

    రిప్లయితొలగించండి
  22. డొక్కా శ్రీనివాస్ గారూ,
    మీ బ్లాగు వీక్షించాను. మీ కృషి ప్రశంసనీయం. మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ కంది శంకరయ్య గారికి నమస్కారములు
    నిన్న వ్యస్తాక్షరిలో పాల్గొని - నిబంధనలు సరిగా గమనించక ఒక పద్యం పోస్ట్ చేశాను. అందుమీద మీరు స్పందించారు కూడా.
    నాకు ఈ బ్లాగుల్లో పొస్ట్ చేయడం కొత్త కావడం వల్లనో యేమో, ఆ పద్యం తీసివేసినట్లున్నాను. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూసిన పద్యమే!
    *********
    నేడు నరరూప రాక్షస నేత లగుచు
    కరకు గుండెల కినిసి నిష్కారణముగ
    నిరప రాధుల వేడ్క వధించి చంపు
    ఉగ్రవాదుల నిరసింతు రూరు వాడ
    *********

    రిప్లయితొలగించండి