27, డిసెంబర్ 2014, శనివారం

నిషిద్ధాక్షరి - 26

కవిమిత్రులారా,
అంశం- గుఱ్ఱం జాషువా

నిషిద్ధాక్షరములు - శ, ష, స, హ.
ఛందస్సు - తేటగీతి.

25 కామెంట్‌లు:

  1. యెదను కదలించు కవనము మదిని పొదిగి
    గబ్బి లమ్మును రచియించి గణన కెక్కె
    చిన్న కులమున బుట్టియు మిన్న గాను
    మకుట మైనట్టి కవియగు మాన్యు డనగ

    రిప్లయితొలగించండి
  2. గబ్బిలమును రచించిన ఘనుడతండు
    కరుణ జిమ్ము మృదు మధుర కవిత లల్లి
    కరుడు గట్టిన యెదలను కదిపి లేపి
    వర్ణ ధర్మమ్ము నెదిరించి వాడి జూపి
    నవ్య ధర్మ ప్రవచనకు నడుము కట్టె

    రిప్లయితొలగించండి
  3. కాకిగ తలచిన వారికి
    కాకను తాజూపినాడు గబ్బిల కవితన్
    లోకంబంతయు నన కవి
    కోకిలగా నిలచి నాడు గొప్పగనితడే.

    రిప్లయితొలగించండి
  4. కలము|కదిలెడిగుర్రమై,కాలగమన
    మందుపరుగెత్తెపద్యాలుమనసునందె
    ముందుతరములవారికివిందులాగ
    పంచగలిగినకవివర|వందనాలు
    పరుగుదీసెడిగుర్రమేపద్యమనగ
    గబ్బిలాలనుదేవునికడకునంపి
    రాయబారమునడిపినరచనలన్ని
    కవులమదిలోనపండెనుకలముపంట

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యాన్ని యడాగమంతో ప్రారంభించారు. ‘ఎదను’ అంటే సరిపోయేదికదా!
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గబ్బిల కవితన్’ దుష్టసమాసం. ఇక్కడ సవరణను సూచించలేకపోతున్నాను.
    ****
    కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘విందువోలె’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. తెలుగు పద్య వైభవమును తెలియజెప్పి
    కులమతమ్ముల గోడలు గూలు నటుల
    ఖండ కావ్యముల్ రచియించి మెండుగాను
    పదము పదమున మధురిమ పదిల పరచి
    కవిత తూటాల నొదిలిన కవికి నతులు!!!

    రిప్లయితొలగించండి
  7. కె.యెస్. గురుమూర్తి ఆచారి గారి పూరణ
    వెంకటావధాని తొడుగ పెండెరమును
    కుదిరె కవిచక్రవర్తి బిరుదముమతనికి
    వ్రేల్చెకులపు మైల యను గబ్బిలము నెంతొ ఆమహాకవి నుతియింప నగునె తరము

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒదిలిన’ అనడం గ్రామ్యం. ‘తూటల వదలిన’ అనండి.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బిరుదము మతనికి’ అన్నచోట ‘బిరుదమె యతనికి’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. గబ్బిలంబును గుర్తించె ఘనముగాను
    వల్లకాడున నైక్యంబు బాగజూపె
    కవికి విఖ్యాతి గల్పించు కావ్యమల్లె
    కరుణ వెలయించి కావ్యాల ఘనుడు నయ్యె

    దళితుడైనట్టి యాతడు ధన్య కవియు
    నార్తి కావ్యాల నిండియు నమరుడయ్యె
    మానవత్వంబు మేల్కొల్పె మాన్యమూర్తి
    ఖండకావ్యాల గుఱ్ఱంబు కదనుదొక్కె

    తెలుగు కైతల దీనులతీర్చి,తాను
    వల్లకాటను ఘనమైన వారులేరు
    నంచు,బాలలె దైవాలు ననగ పలికె
    పంచముడునైన నందె ప్రపంచ ఖ్యాతి

    రిప్లయితొలగించండి
  10. ఇంటగెలుపు,నేను,చదువు,ఇంటిగుట్టు
    పంచముడు,ధర్మహింధూర,పత్రికలును
    భరతవీరుడు,రచయుతభారతాన
    పద్యభావనపండించెభాగ్యమటుల|

    రిప్లయితొలగించండి

  11. కవితలల్లెను గుఱ్ఱము కవివరుండు
    పవనజవమున నత్యంత ప్రతిభ మెరయ
    నవ కవుల్ జనుల్ మెచ్చుచు "నవయుగ కవి
    చక్రవర్తి"గా పట్టము చక్క నిడిరి

    రిప్లయితొలగించండి
  12. గబ్బి లమ్మును రచియించి కవుల యందు
    అగ్ర గణ్యు డ వైతివి యార్య ! నీవు
    దళిత కులమున బుట్టిన ధరణి పుత్ర !
    అందు కొనుమయ్య వందనా లందుకొ నుము

    రిప్లయితొలగించండి
  13. మాస్టరుగారూ ! ధన్యవాదములు...చిన్నమార్పు చేశాను..

    కాకిగ తలచిన వారికి
    కాకను తాజ్మహలు జూపె గబ్బిలమున, నీ
    లోకము మెచ్చునటుల కవి
    కోకిలగా నిలచి నాడు గొప్పగనితడే.

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సవరణ బాగుంది.సంతోషం!

    రిప్లయితొలగించండి
  15. అతడు వీరయ్య కాలింగ మాంబ గర్భ
    మందున జనియించెను కడు మధుర కృతుల
    నేకము రచించె బిరుదుల నేకము కొనె
    భూరి కృతి గబ్బిలము దాని సూరి యతడె

    రిప్లయితొలగించండి
  16. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కాని... ‘సూరి’ అని నియమోల్లంఘన చేసారు.

    రిప్లయితొలగించండి
  17. గుఱ్ఱముజాష్వనో"కవిగగుర్తేరిగించెనుకావ్యబంధు"వై
    అర్రులుజాచుగా"భవితనాదరనంబునుపంచబూన"గా
    సర్రునపద్యముల్"రచనజాగృతినింపెనురాజువోలె"తా
    ఉత్పలమర్రియువృక్షమై"మసలెమనవతత్వముమార్పుచేర్పు
    "నన్
    ఉత్పలమాలలోతేటగీతి

    రిప్లయితొలగించండి
  18. కాటిలో హరిశ్చంద్రుని పాటులన్ని
    కన్నులకు గట్టినట్టుల కవితలల్లి
    తెలుగు వారి హృదయముల వెలిగె నతడు
    యిట్టి కవిచంద్రుడిలమరి పుట్టబోడు

    రిప్లయితొలగించండి
  19. లలితంపు పదములెల్లను
    జలజల మల్లియలు రాలు చందమునందున్
    పులకలు రేకెత్తు గతిని
    సులువుగఁ గూర్చుచును వ్రాయు సొబగీతనిదే.

    రిప్లయితొలగించండి
  20. మన్నించండి. నిషిద్ధమన్నది గమనించలేదు.

    లలితంపు పదములెల్లను
    జలజల మల్లియలు రాలు చందమునందున్
    పులకలు రేకెత్తు గతిని
    పలు కవితల వ్రాయునితడు, పండితుడు గదా!

    రిప్లయితొలగించండి