25, డిసెంబర్ 2014, గురువారం

దత్తపది - 61 (యేసు-చర్చి-సిలువ-మేరీ)

కవిమిత్రులారా!
యేసు - చర్చి - సిలువ - మేరీ
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ మతసామరస్యం గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

31 కామెంట్‌లు:

  1. ఎన్ని మారులు చర్చించ నేమి, దేవు
    ననెద మేరీతి జూచిన నాతడొకడె
    నరుడు గాసిలు వసుధను నమ్మకున్న
    చూడ నమ్మిన వారికే సుఖము గలుగు.

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    సమతయే సుఖశాంతులు మమత లొసఁగు
    ననియ చర్చిలుౘు మతపెద్దలంద ఱిటులె
    యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
    పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
    (చర్చిలుౘు=చర్చింౘుౘు, రీఢ=అవమానము, తిరస్కారము)

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వరను జూచి’ అర్థం కాలేదు. ‘వర’ ఏ అర్థంలో వాడారు? ‘..గురియు + ఏసుకొను = ..గురియు నేసుకొను’ అవుతుంది కదా.. అక్కడ ‘దయఁ గురియడె| యేసుకొను...’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. ప్రణామములు గురువుగారు...భూమి కి వర అనే పేరుందని వాడాను..మీ సూచన ననుసరించి సవరించాను..

    మతముగురియించి చర్చించి మనుజులంత
    బాగు కనరాక గాసిలు వరను జూచి
    దైవ మేరీతి గొలిచినా దయ గురియడె
    యేసుకొనుటలు యెందుకో నెరుక లేదె!!!

    రిప్లయితొలగించండి
  6. మిత్రులు కంది శంకరయ్యగారికి,

    నా పూరణమందు రెండవపాదమున (నేరుగా టైపుచేయుటచే) గణభంగమైనది. నేను గమనింపకయే ప్రచురించితిని. దానిని ఈ దిగువరీతినిఁ బఠింపఁగలరని మనవి.

    సమతయే సుఖశాంతులు మమత లొసఁగు
    ననియ చర్చిలు మతపెద్దలంద ఱిటులె
    యెపుడు నడువ, భాసిలు వక్తలే యగుదురు!
    పర మత జన మే రీఢయు ౙరుప దెపుడు!!
    (చర్చిలు=చర్చింౘు, రీఢ=అవమానము, తిరస్కారము)

    రిప్లయితొలగించండి
  7. కవిమిత్రులు గుండు మధుసూదన్ గారూ,
    ఈరోజు దత్తపది ఇచ్చాను కదా! పూరణలను పరిశీలించే సమయంలో నా దృష్టి అంతా దత్తపదాలను అన్యార్థంలో ఎలా ప్రయోగించారా అన్న విషయంపైనే ఉంటుంది. కనుక గణయతి దోషాలు నిర్లక్ష్యం చేయబడతాయి.
    సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  8. గతమేరీతి గడచె ఛ
    ర్చిత మది మానుచు విలసిలు వర్తనముననే
    మతసామరస్యమొదవును
    హితమిదియే సుమ విలాతి వృద్ధినిజెందన్

    రిప్లయితొలగించండి
  9. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    చిత్తము గుణ సుగంధ ఛర్చితము గాక
    భువి జనులుశాంత మేరీతి పొందగలరు
    పరమత సహనభావనల్ భాసిలు వడి
    యే సుమతమైనబోధించు నిదియె సుమ్మ

    రిప్లయితొలగించండి
  10. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏ సుగతి మార్గమైనను నింపుగాను
    వేగ చర్చించి యన్నిట పెద్దగాను
    మంచి మతమేరిన యపుడు మానవతయె
    మాసిలు వచనాలను చెప్పు మతము మతమె?

    ఏ సుగమమిడు బోధన నింపువినియు
    నందు మేలును చర్చించి యందు మనిషి
    ఏది గాసిలు వంతల దింపువిడిచి
    సాధు మతమేరి కైనను చల్లనిదగు

    రిప్లయితొలగించండి
  12. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పదరచు చర్చిలకన్యుల
    ముదమేరీతి నొనగూడు మూర్ఖత్వముతో
    మెదలిన? హృదియే సుమ గుడి
    మదిలో భాసిలవలె పరమతసహనమురా

    రిప్లయితొలగించండి
  14. జాతిపురోభివృద్ధికిసజావుగచర్చిడిమంచిమార్గ,మే
    రేతిగబంచ?గాసిలు,వరించకమీమదిసమ్మతించునో
    నీతిగ,యేసుశీలమునునిల్పెడిదే|మతమంచునెంతువో
    మీతరమందుబంచుమనిమిమ్ములగోరెదశాంతచిత్తమున్

    రిప్లయితొలగించండి
  15. సతము చర్చించి యేసుమ్మ సర్వ మతము
    లనొక త్రాటిపై నడపుచు రమణ తోడ
    సంఘ మేరీతి గానైన సాగవలయు
    గాసిలు వచనముల తోడ కందు గలుగు

    రిప్లయితొలగించండి
  16. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    దత్తపదం సిలువ అయితే మీరు సిలవ అన్నారు. ‘మదిలో భాసిలు వరపరమతసహనమురా’ అందాం.
    ****
    కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. హిత-మేరీతిగబుట్టెను
    మతమునచర్చించిమనసుమరిమరిదెలిపే
    స్మృతియేసుభదాయకమని
    మతియే? గా సిలువకననుమానముమాన్పున్

    రిప్లయితొలగించండి
  18. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
    ‘శుభ’మును ‘సుభ’మన్నారు. ‘స్మృతియే సుఖదాయకమని’ అందామా?

    రిప్లయితొలగించండి
  19. ఏ మతమైనా తక్కువెలా అవుతుంది?
    దైవాన్ని గురించే అవన్నీ చర్చిస్తున్నపుడు!

    ఏ సుప్రభాత మైనను
    భాసిలు వర్ణాగమమ్ము ప్రాగ్దిశ వెలయన్
    గీసర మేరీతిగనౌ
    తాసించగ దైవ చర్చితములె మతములై!

    రిప్లయితొలగించండి
  20. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ఎంత చర్చిచ ఫలములు సుంత యైన
    గాన మేరీతి గావున కలిసి మెలిసి
    యే సు ఖముగనుం డుకొరకు నిమ్ము నీదు
    ఆశి సు లుమాకు గా సిలు వడయ కుండ

    రిప్లయితొలగించండి
  22. మానవత్వము చర్చించు మనుజ దరికి
    దానవత్వమే రీతిగ పూని చేరు
    వాస్తవము సదా విలసిలు వసుధలోన
    పాడియే సుప్రజా మత పరపు తగవు

    రిప్లయితొలగించండి
  23. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. మేలు కీళ్ళను చర్చించి శీల మెంచి
    భాసిలు వదనమున జన వంద్యులగుచు
    సుగుణ మేరీతియో దెల్పి ప్రగతి జూపి
    ఇద్దియేసుకరముగ వర్తింప వలయు .
    మద్దూరి రామమూర్తి.
    కర్నూలు .

    రిప్లయితొలగించండి
  25. మేలు కీళ్ళను చర్చించి శీల మెంచి
    భాసిలు వదనమున జన వంద్యులగుచు
    సుగుణ మేరీతియో దెల్పి ప్రగతి జూపి
    ఇద్దియేసుకరముగ వర్తింప వలయు .
    మద్దూరి రామమూర్తి.
    కర్నూలు .

    రిప్లయితొలగించండి
  26. మద్దూరి రామమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి