16, డిసెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 767 (మోహినీ భస్మాసుర)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    మోహినిభస్మాసురునిచె
    మోహంబునుపెంపుజేసిమోసముజేయన్
    సాహసిగనిలచెనక్కడ
    ఆహాయనుచున్ననతనినాకర్షణతో

    రిప్లయితొలగించండి
  2. భవుడు మెచ్చి భస్మాసురు ప్రార్థనలకు
    నిచ్చె కోరిన వరముల నిచ్చ తోడ
    నెవరితలపైన రక్కసుండిడిన కుడి
    చేయి రయమున భస్మంబు చెందు నటుల
    వరపు గర్వము తోవాడు హరుని పైన
    చేయి పెట్టెదనంచును చెంత చేర
    భయము తోడను శంభుండు పాఱు చుండ
    కాంచి విష్ణువు శంకరున్ కావ నెంచి
    మోహినిగ మారి యసురుతో ముచ్చటించె
    పెండ్లి యాడు మనుచు వాడు వెంట పడగ
    నాట్య మొనరించి నాభంగి నన్ను గెలువ
    నిన్ను చేపట్టెదనటంచు నియతిఁ బెట్టె
    కామమడరగ దైత్యుడు కాంత తోడ
    నృత్య మొనరించె నత్యంత నేర్పు తోడ
    నామె తలపైన చేయిడ ననుసరించి
    భస్మ మయ్యెనా యసురుండు విస్మయముగ
    వాడు దీసిన గోతిలో వాడె పడెను

    రిప్లయితొలగించండి
  3. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భస్మాసురునిచె’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘భస్మాసురునకు’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అతివకు ప్రేమను బంచిన
    చితికైనను తోడు రాగ సిద్ధముఁ గాదే?
    మితిమీర దానవత్వము
    పతనముఁ జేయక వదలెనె భస్మాసురునిన్?

    రిప్లయితొలగించండి
  5. వేసిననుచ్చులోబడినపెద్దపులట్లుగగాకనేత-నో
    దాసునివోలెదండనకుదగ్గరజేరెనుమోజుచేత-భ
    స్మాసురుదొట్టిమూర్ఖుడనిమైమరుపందునమోహినీకడన్
    వసుకివోలెత్రిప్పతలభంధమెభస్మముజేసెచూడగా

    రిప్లయితొలగించండి
  6. దీని వలన
    కం.తప్పుడు వరములు తమకే
    ముప్పును కలిగించుననెడు ముత్తెపు పలుకే
    యెప్పటికైనను నది కను
    విప్పును కలిగించు ననుట విశదంబగుగా!

    రిప్లయితొలగించండి
  7. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పశుప తిగురిచి తపమును భస్ము డనెడు
    నసురు జేయగ సంతసిం చిశివు డతని
    కీయ వరమును , భస్మము జేయ దలచ
    విష్ణు డంతట మోహిని వేషమునన
    వచ్చి యసురుని గావించె భస్మ మటుల

    రిప్లయితొలగించండి
  9. భస్మాసురాఖ్యుడు భక్తితో మెప్పించి
    ప్రసన్ను గావించి పరమ శివుని
    తన జేయి నెవ్వరి తలపైన నుంచిన
    భస్మమగునటుల వరముబొందె
    వరపుమహిమజూడ పరమేశ్వరుని పైన
    తా బ్రయోగింపగ దలచెనతడు
    శివునిరక్షింపగ శేషశయనుడెంచి
    మోహినిగ నసురు మోహపరచె

    దరికి జేరు ముందు తలస్నాన మునుజేయు
    మంచు పంపె భామ యసురు నదికి
    తలను జేయి నిడుచు తలనంట బోవగ
    భస్మ మయ్యె నతడు వరమువలన

    రిప్లయితొలగించండి