17, డిసెంబర్ 2014, బుధవారం

పద్యరచన - 768

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. కాకి పిల్ల ముద్దు కాకికి యటులనె
    నుడుత పిల్ల ముద్దు నుడుత కహహ
    చూడ చిత్ర మచట చోద్యము గానుండె
    నెంత జాగ రూక తెంత ముద్దు ?

    రిప్లయితొలగించండి
  2. కడు పదిలమ్ముగ నాపసి
    యుడుతను హత్తుకుని తల్లి యుడుత మురిసె నా
    యొడియే బిడ్డకు స్వర్గము
    పుడమిని యమ్మదనమంత మోదము గలదే

    రిప్లయితొలగించండి
  3. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    మమతలమాధుర్యంబే
    సమతలనాహరమట్లుసంతుకుబంచే
    అమరినబంధమెనుడుటది
    కమనీయపుదృశ్యమెంతకామితమేగా
    2ఉడుతనూహలునుయ్యాలలూపుచుండ
    అమ్మబడిలోననొడిలోననమ్మకాన
    పిల్లబ్రతుకేంచధన్యమేకల్లగాదు
    మమతమాధుర్యమంతయుమలచుతల్లి

    రిప్లయితొలగించండి
  5. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నరజాతి మొదలు గాగల
    చిరుత ,యుడుత, మిడుత,చీమ,జీవుల కెల్లన్
    నిరతము తమతమ సంతతి
    మురిపెముగా హత్తు కొనుట మోదము గాదే?

    రిప్లయితొలగించండి
  7. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఉడుత బిడ్డను చేబట్టి యొప్పుగాను
    కాంచు చున్నది కరమగు కాంక్ష తోడ
    లింగ భేదముఁ జూపక రేయిఁ బగలు
    కాచి కాపాడు పెట్టుచు ఖాద్యములను

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి