23, డిసెంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 774

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. అందాల బొమ్మలనగా
    ముందుగనీ కొండపల్లి బొమ్మలె మదిలో
    నందరికి మెదలునికనీ
    సుందరమగు బొమ్మలనిడు షోకేసులలో

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. కొండపల్లి బొమ్మ క్రొత్త క్రొత్తగ రంగు
    లలదుకొనుచు నెంతొ యందమలర
    కొలువుఁదీరె గనుడు, కొనుడు సొబగులతో
    నింటఁ జేర్చుకొనుడవెల్లవారు!

    రిప్లయితొలగించండి
  4. కొండ పల్లి లోన కుటీరములఁ జేయు
    బొమ్మ లన్నియు కడు యిమ్ము గూర్చు
    వివిధ ప్రాంతములను విఖ్యాతి గాంచుచు
    తెలుగువారి బొమ్మ వెలుగు చుండె

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘కుటీరముల’ అన్నచోట గణదోషం. కుటీర శబ్దానికి గుడిసె అన్న అర్థం ఉంది కదా... అక్కడ ‘గుడిసెలలోఁ జేయు’ అందామా? కానీ ‘కుటీరపరిశ్రమ’ అన్న భావానికి న్యూనత వస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. బొమ్మలకొల్వుజూచుటచెపూర్వపుసంస్కృతిగోచరించుచున్
    నెమ్మదిగూర్చిపెట్టిమననేస్తులరీతిగమానసంబుకున్
    సొమ్ములషోకులైనిలచుజూడగనందపుహాయిబంచు,కో
    పమ్మునులేకజేయు-పరిపాటిగసంతసమందజేయులే
    2మాటరానట్టి-బొమ్మలుమాటువేసి
    కొలువుదీరియుసంస్కృతికోలుకొనగ
    చెవులువిననట్టిబోధలుజెప్పలేక
    కనులకందించె:కథలెన్నొకళలచేత

    రిప్లయితొలగించండి
  7. పండుగసంబరమందున
    నిండుగకొలువున్ననిల్లు-నిత్యోత్చవమై
    అండగనానందమ్మున
    గుండెకుసమకూర్చుబొమ్మకొలువులుజూడన్
    ౪కొలువుదీరినబొమ్మలుకోరికొనగ?
    సంతసంబునుసాకగసాయపడును
    వింతవింతలబొమ్మలసంతవోలె
    వాటికథలెన్నొ,నీతులుచాటిజెప్పు

    రిప్లయితొలగించండి
  8. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ఉత్పలమాలలో ‘చూచుటచె’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాశారు. ‘చూడగను’ అనండి. ‘మానసంబునకున్’ అనడం సాధువు. అక్కడ ‘మానసంబునన్’ అందాం.

    రిప్లయితొలగించండి
  9. బొమ్మయ్య జేసి నంతనె
    బొమ్మలుగా పుట్టి నట్టి పోలికదేమో?
    బొమ్మలనే యిష్ట పడఁగ
    నమ్మయినను బొమ్మనిచ్చు నాడించుటకై!

    రిప్లయితొలగించండి
  10. Respected sir,
    కొండపల్లిలో చిన్న చిన్న యిండ్లలో కూడా బొమ్మలు చేయటం చూచిన గుర్తు. మొదటి పాదం యిలా మార్చాను.
    కొండ పల్లి లోన కుటములందున జేయు
    బొమ్మ లన్నియు కడు యిమ్ము గూర్చు
    వివిధ ప్రాంతములను విఖ్యాతి గాంచుచు
    తెలుగువారి బొమ్మ వెలుగు చుండె

    రిప్లయితొలగించండి
  11. కొండ పల్లి బొమ్మలన్ని గొలువు దీరె నచ్చటన్
    దండిగాను కొందమంటె ధరలు జూడ నెక్కువే
    బండి రాజు రాణి భామ భవ్యమైన బొమ్మలే
    నిండి పోవు సంతసమ్ము నిజము గనవి జూడగన్!!!

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం!
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి