6, సెప్టెంబర్ 2015, ఆదివారం

పద్య రచన - 1000

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. రాసలీలలెన్నొరాచరికమ్మున
  చెలఁగి యనుభవించి చిన్నవోయి
  పుట్టినపుడు లేని బట్టలనొప్పక
  యైహికమ్ము లేహ్యమనియె వేమ!

  రిప్లయితొలగించండి
 2. అటవెలదు లన్ని యలవోకగావ్రాసి
  ఖ్యాతి నంది నట్టి కవివరేణ్యు
  ప్రస్తుతించు చుంద్రు పాఠకు లెల్లరు
  వేమనార్యు నిలను వేయి నోళ్ళ.

  రిప్లయితొలగించండి
 3. వేమన పద్యము లన్నియు
  నా మూలము జదువు నెడల నాతని వోలె
  న్బా మరుడు గూడ నౌనుగ
  నీ మహిలో గొప్ప యోగి యీ శుని గరుణన్

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  అర్థకామములను ననుభవించియుఁ దాను
  లోక రీతి నెఱిఁగి రోఁతపుట్టి
  జనుల మేలుకొలుపఁగను నాటవెలఁదుల
  నాశువుగనుఁ జెప్పెనయ్య వేమ!

  రిప్లయితొలగించండి

 5. ఆ.వె: ఆటవెలది కతన యాత్మ చింతనఁ గల్గి
  బట్ట బయట నెరుక గుట్టుఁదెలిసి
  గుర్తు విడిచి పెట్టి గురినిఁ గంటివి నీవు
  వేల వంద నాలు వేమనార్య


  రిప్లయితొలగించండి
 6. నోటు చూప గానె ఓటు వేయకు మోయి
  చెడ్డ నాయకులను చేరవద్దు
  ఝషము కోరి యెరను - చావదా గిలగిల
  విశ్వదాభిరామ. వినుర వేమ

  రిప్లయితొలగించండి
 7. అలతి అలతి పదములతో
  సలలితమగు భావములను సమ్మోహముగన్
  నలుగురు సులువుగ చదవగ
  పలికిన వేమన్నకవికి ప్రణతుల నిడెదన్!!!

  రిప్లయితొలగించండి
 8. ఆటవెలది తోడ నద్భుతములు జేసి
  పాట వోలె వ్రాసి పద్యములను
  మీటి నావు మదిని మేటి వేమనకవి!
  సాటి లేరు నీకు సార్వభౌమ!!!

  రిప్లయితొలగించండి
 9. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. విశ్వమందు ఘనము వేమనార్యుఁ చరిత
  యెరుగ నట్టివాడు ధరణిఁ లేడు
  భోగి కనులు తెరచి యోగియై వెలసెను
  నీతి సుధలు పంచి ఖ్యాతి నొందె

  రిప్లయితొలగించండి
 11. పడచు తనమునందు పరమభోగి పడుపు
  పడతి గూడి పరువు బాసి విత్త
  మెల్ల వెలతి కిచ్చి మేనలయమదము
  వీడి నేటి యోగి వేమ నాయె.

  రిప్లయితొలగించండి
 12. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. నీతి వాక్యతతుల నిశ్చయంబుగ దెల్పె
  ధర్మ సూక్ష్మ గతుల మర్మమరసె
  జాతిపోకడలకు సారూప్యములఁ జెప్పె
  విశ్వకవియటన్న వేమ సుకవి

  భాగవతము దెలిపె పౌరాణికముదెల్పె
  కామభోగగతుల కథలు దెలిపె
  తాను చెప్పనట్టి తత్త్వమ్ము ధర లేదు
  విశ్వకవియటన్న వేమ సుకవి

  కఠినభావములను కడు రమ్యముగ మేటి
  సరళ వాక్యముల విచారణమున
  తెలుగుజాతికెల్ల తేటతెల్లముఁ జేసె
  విశ్వకవియటన్న వేమ సుకవి

  ఆటవెలది తోటి యవమానమును బొంది
  యాటవెలదులల్లి యచిరకీర్తి
  సాధకుండునయ్యె సాటియెవ్వరు నీకు
  విశ్వకవియటన్న వేమ సుకవి

  "సోహమ"నుచు నెఱిగి దేహాభిమానంబు
  వీడి యైహికములు విడివడంగ
  దేహమెల్ల దేవదేవళంబని జెప్పె
  విశ్వకవియటన్న వేమ సుకవి

  రిప్లయితొలగించండి
 14. భోగము లమునిగి వేమన
  యోగిగ తామారె నంట యుక్తము నందున్
  రాగములకు దూర మగుచు
  సాగెను మోక్షమును కోరి సౌమ్యు డనంగా

  రిప్లయితొలగించండి
 15. .వేమనయోగి పద్యములె వేదపు సారము |”లోకరీతులున్
  పామర పండి తాళికినిపట్టును బెంచెడి సూక్తి రత్నముల్”|
  ఏమదికైన నాట వెల దెంతగ చూపుల కంది పోవునో
  సోమరి భావమందు మనసొప్పగ వ్రాసెను పద్యమాలికల్

  రిప్లయితొలగించండి
 16. సూటిగా జెప్పె వేమన నోటి మాట
  తర తరాలకు తరగని ఝరుల తేట
  తెలుగు వారల కదియేను వెలుగు బాట
  మనిషి మారుట కామాట మంచి మూట

  రిప్లయితొలగించండి
 17. విశ్వదాభిరామ వినుర వేమ యనుచు
  నాటవెలది పద్య బాట పట్టి
  అనుభవాల వార్థి నందించె వేమన
  తేనెలొలుకు నటుల తెలుగులోన!

  రిప్లయితొలగించండి
 18. భోగ భాగ్యముల్ తోడుతఁ బుట్టినట్టి
  వేమనాఖ్యుడు తుచ్ఛమౌ వేశ్య కొరకు
  ధనమునంతయు రయమున ధారపోసి
  భోగముల విడి దిశమొల యోగియయ్యె
  ఆటవెలది పద్యములతో నలరజేసె

  రిప్లయితొలగించండి
 19. 1000వ చిత్రానికి పద్యరూపం
  ********************

  వేమనార్యు పలుకు వేదంబు వంటిదై

  సంఘమందు నిలిచె సన్నుతముగ ;  మూఢ నమ్మకాల మూలాల పెకలించ

  ''వేమ నాట వెలది'' వెలుగు జూచె.

  విద్వాన్ ,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు 7396564549

  రిప్లయితొలగించండి
 20. నేర్చు కొంద్రు తెనుగు నేలపై బాలలు
  కనగ వేమన శతకమును దొలుత
  నిలుచు నవియె మదిని నేస్తమై వెన్నంటు
  వృత్తి లోన దీర్చు వెతల నెన్నొ

  రిప్లయితొలగించండి
 21. వేయి పద్యములను వ్రాసి విద్య నేర్వ
  గలుగ శంకరార్యుని గురుకులమునందు
  రాకయుంటి బడికి నేను వ్రాయకుంటి
  వ్రేళులగణియింపగనైన వెఱ్ఱివాఁడ!

  రిప్లయితొలగించండి
 22. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ వేమన ఖండిక బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  డా. మూలె రామముని రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  ఊకదంపుడు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. కట్టు బట్ట వీడి కవిత చెప్పెడివారు
  చెట్టు నీడ కడకు చేరు వారు
  పిట్ట రెట్ట పాలు పేరు మోసినవారు
  విశ్వదాభిరామ వినుర వేమ

  రిప్లయితొలగించండి


 24. తాత జీవితమును తరుణి మరణమది
  మార్చె వేద సార మదియె విశ్వ
  మంత వెల్గుగాంచె మదిలోని దీప్తిగ
  విశ్వదాభి రామ విభుని గాధ

  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. తేటగీతి.
  అల్ప బుద్ధిని వీడగ నాత్మనందు
  సత్య సంధత నిల్పిన చాలు ననుచు
  వేమ నార్యుఁడు బల్కెను వేదమల్లె
  వినుర వేమయనంచును వినుతికెక్కె

  రిప్లయితొలగించండి