27, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణం - 1801 (వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

39 కామెంట్‌లు:

 1. ఘనమౌ క్రేనుకు డ్రైవరు
  మనమున పరమత సహనము మంచికి తోడై
  జనజీవనంబున కలసి
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్!!

  రిప్లయితొలగించండి
 2. మనమగు వాహన మొక్కటి
  నొనగూర్చిరి విఘ్ననాథు నూరేగింపన్
  ఘనవాహనచో దకుడై
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  దారులు వేరైనా గమ్యమొక్కటే
  పేరులు వేరైనా దేవుడొక్కడే

  యని నమ్మే అద్వైతమూర్తి-రహీమ్‌లా
  మనుషులంతా మారిపోతే-వహీ సమయ్

  యిలకు స్వర్గమే దిగిరాదా
  వెలను తీసికట్టౌ గాదా

  01)
  __________________________________________

  గణపతి , యల్లా యొకటని
  మనుషుల హితమే జగతిని - మతమని దలచున్
  మనది, పరుల దనిన వినక
  వినాయకుని సాగనంప - విచ్చేసె రహీమ్ !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 4. రాముడే రహీము - రహీమే రాముడు :

  02)
  __________________________________________

  తన పేరేమో రాముడు
  సినిమాలో వేష మేమొ - చిత్రమ్ము, రహీమ్ !
  తనకా పేరే స్థిరమవ
  వినాయకుని సాగనంప - విచ్చేసె రహీమ్ !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 5. పదేళ్ళ రహీమ్‌ కదో సరదా :

  03)
  __________________________________________

  దిన దినమును దినకరు వలె
  గణనాయకు నుత్సవంపు - ఘనతల గనుచున్
  కనువిందుగ గదలిన , తుది
  వినాయకుని సాగనంప - విచ్చేసె రహీమ్ !
  __________________________________________

  రిప్లయితొలగించండి
 6. జనహితమే మతమనుకొని
  తన పర భేధమ్ము లేవి దలచక మదిలో
  మనసారా వేడుకొనుచు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్!!!

  రిప్లయితొలగించండి
 7. శ్రీగురుభ్యోనమః

  మనమున కల్మష మెరుగక
  పనులందున సాయబడుచు బరహితు డగుచున్
  మనలో నొకనిగ దిరుగుచు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

  రిప్లయితొలగించండి
 8. .మనుషుల మమతే మతమని
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్
  తనలో బ్రాంతిని మాన్పును
  అనవరతము వూరివారి యనుబంధంబే|

  రిప్లయితొలగించండి
 9. అనుదినము పేదల కొరకు
  పని చేసెడు నేత కొడుకు పల్లెకు రాగా
  తన వెతల దెలిపి యా భా
  వి నాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి
 10. ఘనమగునిమజ్జనదినము
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్
  వినసొంపగు వాద్యమ్ముల
  వినిపించి ప్రజలకు కరము ప్రీతిని గూర్చన్

  రిప్లయితొలగించండి
 11. చక్కని పూరణ చేసిన మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. ధన్యవాదాలు A.Satyanarayana Reddy గారూ...మాష్టారు పాస్ మార్కులు వేయాలిగా

  రిప్లయితొలగించండి

 13. అనుదినము బూజ జేసియు
  ననువుగ నిక దశమి రోజు హాహా యనుచు
  న్ననుపమ సారధి తోడుగ
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా పద్యము లో “చంపగ” పదము మా అమ్మాయికి నచ్చ లేదు. తన్ను కాపాడమని కోరుకోవాలి కాని ఎదుట వానిని చంప మనడము ఏమిటి అని చిరాకు పడింది. తరువాత భాగవతము లో చూశాను ఎక్కడ దీన కరి రాజు ప్రార్ధనా పద్యాలలో చంపమని లేదు. దైన్యములో రోషానికి తావు లేదనుకుంటా. అందుకే పద్యాన్ని సవరించాను. తిలకించ గోర్తాను.

  ఎక్కడ కేగువాఁడ నిపు డెవ్వని వేడుదు నార్త త్రాత దా
  నెక్కడ లోకనాధు డన నెవ్వడు దీనజనోద్ధరుండు దా
  నెక్కడ భక్తపాలుడన నెవ్వడు దానిట నన్ను పేరిమిన్
  మక్కువ జూపినిమ్మకరి మత్తుని వేతన బాప రాగదే

  రిప్లయితొలగించండి
 15. మునివ్యాసుని భారతమును
  వినివ్రాసిన శూలిసుతుడు విజ్ఞుడు విద్యా
  ధనుడు గణేశుడు తొమ్మిది
  దినరాత్రులు పూజలందె దిగ్విజయముగా ,

  ఘనమౌ వేడ్కలు ముగియగ
  జనులందరు సంతసమున జైజైయన రా
  బినుతో ,మహేశుతోడుత
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్!!!

  రిప్లయితొలగించండి

 16. ఘనమౌ సోదర భావ
  మ్మును బోధి౦చగ మహమదు ముగ్దు౦డై కీ
  ర్తన పాడుచు,లారీలో
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి
 17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  మననాయకుడు కలామే
  మన దేశమునందు జన్మమందగ మరలన్
  జని పరమేష్ఠిని వేడగ
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి

 18. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణను పరిశీలించి దోషములు చెప్పగలరు.
  కం. చినవాడుపుట్టెచవితిన
  గణపతియెగదననిచెల్లిగొమరునిగాంచీ!
  యనుగునతండ్రికడకునా
  వినాయకునిసాగనంపెవిచ్చేసెరహీం

  రిప్లయితొలగించండి
 19. “వినాయకుడు”: బొజ్జలు పెంచిన చిరు నాయకుడు అని హాస్యార్ధముగా వ్రాసాను. ఎవరినీ కించ పరచే ఉద్దేశము లేశ మాత్రము లేదు. మన్నించ గలరు.
  అనునయ వాక్యముల నుడివి
  పనులన నేకము లజేయ వాక్దానములిడు
  వినయాన్వితు డందొక చిరు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

  రిప్లయితొలగించండి
 20. కామేశ్వర రావు గారూ, "లిడు" లో డు గురువు కావటంలేదు కదా

  రిప్లయితొలగించండి
 21. వనపర్తి గ్రామమున యువ
  జనసంఘంపు నవరాత్రి సంబరములలోఁ
  గనఁ దాను సభ్యుఁ డగుటను
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

  రిప్లయితొలగించండి
 22. తను చిత్రనాయకు డగుట
  జనాళిలో మంచిపేరు సంపాదింపన్
  ఘన మార్గముగా నెంచియె
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

  రిప్లయితొలగించండి
 23. ఊకదంపుడు గారు ( క్షమించాలి మీ పేరు తెలియదు.) ధన్యవాదములు. మీరు చెప్పినది సత్యమే.
  నేను గమనించ లేదు. సవరించ గలను.

  రిప్లయితొలగించండి
 24. సవరించిన పద్యము:

  అనునయ వాక్యముల నుడివి
  పనులన నేకము లజేయ వాక్దానములన్
  వినయాన్వితు లందొక చిరు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

  రిప్లయితొలగించండి
 25. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మనుషుల’ అనరాదు.‘మనుజుల...’ అని ప్రారంభించండి. ‘మాన్పును+అనవరంబు’ అని విసంధిగా వ్రాసారు. ఊరును వూరు అన్నారు. ‘మానుపు| ననవరత మ్మూరివారి....’ అనండి.
  ******
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  సన్నాయి వాద్యగానిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  ముందుగా మీ అమ్మాయి ఔచిత్యదృక్పథాన్ని ప్రశంసిస్తున్నాను. మీ సవరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కొద్దిగా అన్వయలోపం ఉన్నట్టుంది.
  *****
  వేదుల సుభద్ర గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొన్ని లోపాలున్నాయి.
  ‘చవితిన’ అనరాదు, ‘చవితిని’ అనండి. రెండవపాదంలో యతి తప్పింది. ‘...గాంచీ’ అనడం గ్రామ్యం. మీ పద్యానికి నా సవరణ.....
  చినవాడు పుట్టె చవితిని
  గణపతియే యనెను చెల్లి కని బాలునిఁ దా
  ననుగునతండ్రి కడకు నా
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీం.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ఊకదంపుడు (రామకృష్ణ) గారి సూచనతో పద్యాన్ని సవరించినందుకు సంతోషం.
  *****
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. మన భారత దేశమ్మునఁ
  గనఁగా నెన్నికల వేళ గ్రామ సభన్ దా
  మనసార నీత కల్ ద్రా
  వి - నాయకుని సాగనంప విచ్చేసె రహీం !

  రిప్లయితొలగించండి
 27. డా. విష్ణునందన్ గారూ,
  వైవిద్యమైన విరుపుతో చక్కని పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 28. జనతతితో మత సహనుడు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్
  కనులకు విందు నొసగుచు
  న్న నిమజ్జనమును గనుగొని నటనము జేసెన్.

  రిప్లయితొలగించండి
 29. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 30. సమస్య. గురుమూర్తి ఆచారి
  .
  కవిమిత్రులకు నమస్కరిస్తు
  మనరాష్ట్రమ౦త్రియైన బి.
  వి. నాయకుని సాగన౦ప
  విచ్చేసె రహీ
  మ్మను డీ.యస్.పీ. - గుమి చే
  రిన జనముల వైదొల౦గు
  రీతి గ. జే య న్ ్

  .
  సమస్య. గురుమూర్తి ఆచారి
  .
  కవిమిత్రులకు నమస్కరిస్తు
  మనరాష్ట్రమ౦త్రియైన బి.
  వి. నాయకుని సాగన౦ప
  విచ్చేసె రహీ
  మ్మను డీ.యస్.పీ. - గుమి చే
  రిన జనముల వైదొల౦గు
  రీతి గ. జే య న్ ్

  .

  ి

  ి

  రిప్లయితొలగించండి
 31. తను బక్రీదున శుభకా
  మనలన సాయంత్రమున నిమజ్జనమునకున్
  ' ఫణిభూషణు ' వెంటనడచి
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్!
  ( రహీము, ఫణిభూషన్ స్నేహితులు )
  * కర్నూలు నగరంలో బక్రీదు పర్వదినము మరియు గణేశ నిమజ్జనము ఒకే రోజు జరిగాయి.

  రిప్లయితొలగించండి
 32. మిత్రులందఱకు నమస్సులు!

  (స్వాతంత్య్ర సంగ్రామ తొలి ఖైదీ మౌల్వీ సయ్యద్ అల్లాఉద్దీన్‍ను కారాగారమున నుంచుటకుం దీసుకొని వెడలుచుండ సాఁగనంపుటకై యతని యనుచరుఁడు రహీమ్ విచ్చేసిన సందర్భము)

  ఘనముగ స్వాతంత్ర్యమ్మును
  గొన సమరము సేయ, దొరలు కోరి చెఱనిడన్
  బనుపఁగ, వెడలెడు, నా మౌ
  ల్వి నాయకుని సాఁగనంప విచ్చేసె రహీమ్!

  రిప్లయితొలగించండి
 33. వినయము తోడను నాతడు
  అనయము గణపతి ప్రతిమల నమ్ముచు నుండెన్
  ఘనముగ భుక్తిని యెసగెడి
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

  రిప్లయితొలగించండి
 34. గురుమూర్తి ఆచారి గారూ,
  ‘బి.వి.’ అనే నాయకుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘రహీం+అను=రహీ మను’ అవుతుంది. రహీమ్మను కాదు. ‘రహీమ్| ఘన డీ.యస్.పీ....’ అనండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  ‘మౌల్వి’ అన్న నాయకుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఆతడు+అనయము’ అని విసంధిగా వ్రాసారు. అక్కడ ‘...నాతం|డనయము...’ అనండి. ‘భక్తిని+ఒసగెడి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘భక్తి నొసంగెడి’ అనండి.

  రిప్లయితొలగించండి
 35. నమస్కారములు
  గురువులు క్షమించాలి
  ప్రవరాఖ్యుడి సమస్యను మొత్తం సవరణజేసి పద్యం వ్రాసి నందులకు కృతజ్ఞతలు
  రెండు మూడు రోజులుగా ఇంట్లో హడావుడి .ఎందుకంటే " నిన్న వేంకటేశ్వర కళ్యాణం చేసాము 60,70, మందిని లంచికి పిలిచాము . ఇంట్లోనే కోడళ్ళు వంట ఏదో ఉడతా భక్తిగా కొంచం సాయం చేయాలిగా మరి .అందుకని నేను పూరణలు మిస్సు అయ్యాను . కనీసం ధన్యవాదములుకుడా చెప్పలేక పోయాను . మన్నించ గలరు

  రిప్లయితొలగించండి
 36. గురువుగారికి నమస్కారం. నా పద్యాన్ని సవరించినందుకు నా ధన్యవాదాలు. తిరిగి మీరు చెప్పిన విధంగా రాసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 37. ఘనమగు త్రొక్కుడు త్రోపుడు
  కనుగొని పోలీసు శాఖ కానిస్టేబుల్
  వినయమ్మున సరిజేయుచు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి
 38. తినుచును పొగాకు జరదన్
  పనికాగనె లైట్లనాపి బల్బులతోడన్
  వినయముగా వైరు గొనుచు
  వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్

  రిప్లయితొలగించండి