కం.మతిగతితప్పినపశుపతి సతిసతి యనిచతి కిలపడు సంగతితెలియన్ సుతసంభవముకుబూనిన రతిపతి మన్మథుఁడు గాఁడు, బ్రహ్మయె తలఁపన్. ********************************************************** note: కుమారసంభవము జరుగడానికి మన్మధుడు ఆహుతి అయి కారకుడయ్యాడు .కావున అతడు మన్మధుడు కాదు చూడగా చూడగా బ్రహ్మ అనిపించాడు అన్న అర్ధం లో వ్రాసాను.మిత్రులు ఏమంటారో.?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిరతి యని పలుకుచు నుంటివి
సతతము "భా" వదలి తప్పు చదువకు బాబూ
రతిపతి మదనుడు, మరి భా
రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
1.ఆ.వె:సతతము గొల్చెదను సర
రిప్లయితొలగించండిస్వతిని సకల విద్యలిచ్చు శారిక పాణిన్
పతి హితమును కోరెడి భా
రతి;పతి మన్మథుడు కాడు బ్రహ్మయె తలపన్..
2.ఆ.వె: చతురవదను డాతడనవ
రతమును సుజియించు చుండు రహితో జగముల్
సతియౌ విద్దెల ఝరి,భా
రతి,;పతి మన్మథుడు కాడు బ్రహ్మయె తలపన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువుగారికి నమస్కారం. నాకు తోచిన విధంగా పూరణ చేసి పంపుతున్నాను. తగు సూచనలిచ్చిన శ్రీమతి ఉమాదేవి గారికి నా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసతతము నుదిటిని రాతలు
బతుకుల గతుకుల గతులను బలమున రాసే
పితువననాతడె యాభా
రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మయె తలపన్
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిశృతి నీవని గతి నీవని
కృతికర్తలు పొగడి రంత గేయము లందున్
మతిమంతు లిడిరి హా
రతి, పతి మన్మథుఁడు గాఁడు, బ్రహ్మయె తలఁపన్.
క్షితిపై జంటల కలయిక
రిప్లయితొలగించండిగతియై సంతానమంద, జ్ఞానుల మదిలో,
మతికిన్ కోరిక నొసఁగెడు
రతిపతి మన్మధుండు గాడు బ్రహ్మయె తలఁపన్
యతులను రక్కసులను భూ
రిప్లయితొలగించండిపతులను ప్రజలను సమస్త ప్రాణులనెల్లన్
సతతముసృష్టించెడు భా
రతిపతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలపన్ !!!
నేటి సమస్య నాకో సందేహం కలిగిస్తోంది.
రిప్లయితొలగించండిలక్ష్మీపతి, గౌరీపతి, వాణీపతి అని దీర్ఘంతో అంటాముగానీ, లక్ష్మిపతి, గౌరిపతి,వాణిపతి అని హ్రస్వముగా అనముకదా
అలాగే అంబాసుతుడు అంటాముగాని అంబసుతుడు అనముకదా. మరి రతిపతి అనడం ఎంతవరకు సమంజసం? పూరణలో భారతీ పతి అనకుండా భారతిపతి అనడం సబబేనా?? శంకరయ్యగారూ కాస్త వివరిస్తారా??
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుదేవులకు ప్రణామములుమీసూచనలతో సవరించిన నిన్నటిపద్యము
రిప్లయితొలగించండిమనసిజ పుష్ప బాణములు మాటికి గ్రుచ్చగ దేహమందు కా
మన దహియించి వైవ నభిమానము,లజ్జయు లేక జీవుల౦
దున మతి కోలుపోవగను తుంటరులై చరియి౦త్రు ప్రాజ్ఞులున్
గనరిక ఉచ్చ నీచలను కామినులన్ బలిమిన్ రమించుచున్
నేటి సమస్య రతిపతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలపన్
పూరణ:అతులిత సంపద లొసగెడి
సతి కోడలు సకల వేదసారము వీణన్
శ్రుతులుగ వినిపించెడి భా
రతి పతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలపన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారికి కవిమిత్రులెల్లరులకు ప్రణామములతో
తొలగించండిరతి కార్యమె మూలమది, జ
గతికాధారమ్ము సృష్టి కర్తయె శ్రీభా
రతిపతి యైనన్ మరియా
రతిపతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలవన్
రతిపతి మన్మథుడని సతి
పతి శివుడని యెరుగనట్టి వాడెవ్వడు, శ్రీ
పతి నారాయణుడే భా
రతిపతి మన్మధుడు గాదు బ్రహ్మయె తలవన్
రతిపతి పుత్రుండట శ్రీ
రిప్లయితొలగించండిపతికిన్ కోడలట వాణి వరుసలు జూడన్
మతిఁదప్ప బోకు మా భా
రతిపతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలవన్
చతురాననుడు ప్రజాపతి
రిప్లయితొలగించండిపితువు విరించనుడు కర్త వేలుపుబెద్దన్
శతదళసంభవుడే భా
రతి పతి,మన్మధుడుగాడు, బ్రహ్మయె తలపన్!!!
సుతుడగు గణపతి శివునకు
రతిపతి మన్మధుడు గాడు, బ్రహ్మయె తలపన్
పతియగు వాణికి సతతము
రతినాధ జనకు డగునుగ లక్ష్మీపతియే!!!
రిప్లయితొలగించండిఅతివా ! వినుమీ మాటను
రతిపతి మన్మధు డు గాడు ,బ్రహ్మయె తలప
న్సతి భా రతికి న్బెనిమిటి
సతి పతుల న్నెంచ వలయు సరియగు రీతిన్
సతి వాణి చతుర్ముఖహృది
రిప్లయితొలగించండిరత శుకవారిజ విమల కరాంబుజ బ్రాహ్మీ
శృతి సూక్తి వివిక్త ట భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
[మన్మథుఁడు = అందగాడు]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇతరుల మాటలు నమ్మకు
రిప్లయితొలగించండిమతిగా వాగుదురు కొంద రఖిల జగతి భా
రతిపతియే సృష్టించును
రతిపతి మన్మథుఁడు గాఁడు, బ్రహ్మయె తలఁపన్.
అతివరొ! వెతికిన వరుడల
రిప్లయితొలగించండిరతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె. తలఁపం
డె, తెలుపు జుత్తని తలుపకు.
అతిధనవంతుడు, సుధి, మృదులాంత్రనిపుణుడున్.
హితమును బంచెడిదేభా
రిప్లయితొలగించండిరతి పతి మన్మథుడు గాడు-బ్రహ్మయె తలపన్
హితమతి శృతిలయ లుంచెడి
బ్రతుకే జేకూర్చువాణి పలుకులరాణి |
గతితాను జదువులకు భా
రిప్లయితొలగించండిరతి, పతిమన్మథుడుగాదు, బ్రహ్మయె, తలపన్
మతిచెఱపగ, క్రోధముతో
సతి పెనిమిటియైన శివుడు చంపె రతీశున్
శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ
రిప్లయితొలగించండిరతి భారతులకు భేదము
మతి పోయిన బాలకుండు మతి గలుగననెన్
రతిపతి మన్మధుడే , భా
రతిపతి మన్మథుఁడు గాఁడు, బ్రహ్మయె తలఁపన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉదయం నుండి ప్రయాణంలో ఉన్నాను. ఇప్పుడుకూడా బస్సులో ఉన్నాను.
రిప్లయితొలగించండిఅందరి పూరణలు బాగున్నవి. అందరికి అభినందనలు.
ప్రస్తుతం సమీక్షించలేను. మన్నించండి.
కం.మతిగతితప్పినపశుపతి
రిప్లయితొలగించండిసతిసతి యనిచతి కిలపడు సంగతితెలియన్
సుతసంభవముకుబూనిన
రతిపతి మన్మథుఁడు గాఁడు, బ్రహ్మయె తలఁపన్.
**********************************************************
note: కుమారసంభవము జరుగడానికి మన్మధుడు ఆహుతి అయి కారకుడయ్యాడు .కావున అతడు మన్మధుడు కాదు చూడగా చూడగా బ్రహ్మ అనిపించాడు అన్న అర్ధం లో వ్రాసాను.మిత్రులు ఏమంటారో.?
వెతగొని మూడవ కంటిని
రిప్లయితొలగించండిసతమతమై యీశ్వరుండు చప్పున విప్పన్
చితిలో భస్మపు రూపున
రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్
రిప్లయితొలగించండిఅతిగా వాగకు తెలియక
పతికి కొమరునికి భిదము సభకు తెలియదకో?
మతిపోయినదా చెలి? భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
జిలేబి
అతిగా ప్రేమను గూర్చును
రిప్లయితొలగించండిరతిపతి మన్మథుఁడు; గాఁడు బ్రహ్మయె తలఁపన్
రతిపతి; భారతి పతియే!
ఉతికెదరు ప్రజలు! పలికిన నుత్తితి మాటల్!