11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1785 (అనుభవ మ్మనరానిది యనుభవమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అనుభవ మ్మనరానిది యనుభవమ్ము.
ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు. 

25 కామెంట్‌లు:

  1. కాంచితి పరమ పురుషులఁ గాంచితి మువు
    రమ్మలన్ గాంచితి గణేశుఁ నాది దేవుఁ
    వైభవమ్మును గాంచితి స్వప్న మందు
    అనుభవమ్మనరానిది అనుభవమ్ము

    రిప్లయితొలగించండి
  2. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. కె. ఈశ్వరప్ప గారి పూరణలు.....

    పక్షి గూటినిగట్టును పట్టుబట్టి
    అనుభవమ్మనరానిది యనుభవమ్ము
    నేర్వబూనిన మానవుల్ నేర్పుగలుగ
    నేర్వకున్నను పక్షుల నేర్పు గనుమ!

    సహజ మైనట్టి కళలను సాకగలుగు
    జంతుజాలము చూడగ వింతగాదె?
    అంతులేనట్టి యవనిలో వింతలెన్నొ
    అనుభవమ్మనరానిది యనుభవమ్ము!

    రిప్లయితొలగించండి
  4. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  5. రాధ కై వెత జెందిన మాధవు౦డు
    మాధవుడు జాగుజేసిన రాధ బాధ
    అనుభవ మ్మనరానిది. యనుభవమ్ము
    విరహిణులకు దక్క నొరులకు నెరుగ వశమె

    రిప్లయితొలగించండి
  6. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. దైవ విత్తకనక సముదాయముల య
    పహరణకు పూను కొన్నట్టి పాప నరున
    కిల నొనగురు శునకజన్మ మిది శుభతర
    మను భవమ్మనరానిది యనుభవమ్ము.
    [భవము= పుట్టుక]

    రిప్లయితొలగించండి

  8. స్వప్న మందున గాంచితి స్వామి శివుని
    పార్వ తీదేవి శ్రీరాము డుర్వి సుతను
    నేమి భాగ్యము నాయది యిదియ యరయ
    య నుభవ మ్మున రానిది యనుభ వమ్ము

    రిప్లయితొలగించండి
  9. 11.09 .2015 శంకరాభరణము
    సమస్య:అనుభవ మ్మనరానిది. యనుభవమ్ము
    పూరణ ;రాధ కై వెత జెందిన మాధవు౦డు
    మాధవుడు జాగుజేసిన రాధ బాధ
    అనుభవ మ్మనరానిది. యనుభవమ్ము
    విరహిణులకు దక్క నొరుల కెరుగ వశమె

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమః

    కర్మపాశము బంధమౌ కాల గతిన
    స్వానుభవమున నొకపరి సాధ్యమగును
    జనన మరణము లన్నవి జన్మలోన
    యనుభవ మ్మనరానిది యనుభవమ్ము

    రిప్లయితొలగించండి
  11. పాపకర్మలు జేయకు పట్టుకొనుము
    బాలకృష్ణుని పాదముల్ పట్టుబట్టి
    జన్మముండదు నీకింక సతతము హరి
    యను, భవమ్మ నరానిది యనుభవమ్ము.

    రిప్లయితొలగించండి
  12. నీవు నన్నుఁగనుచు నిన్నునీవెరుగుచుఁ
    గర్మనొనరించగా నీవుకర్తఁగావు
    తామరాకును నీరమ్ముఁదడపనట్లు
    ననుభవమ్మనరానిది యనుభవమ్ము

    రిప్లయితొలగించండి
  13. కవిత్రులందరకు నమస్కారములు.
    గీతాసందేశఘట్టమును పురస్కరించుకొని సమస్యను పూరించితిని.

    రిప్లయితొలగించండి
  14. ఈ రోజు కవి మిత్రులు సమస్యాపూరణ ప్రయత్నంలో వేదాంతాన్ని బాగా పలికించారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  15. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒనగురు’...?
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అనుభవ మ్మనరానిది... టైపాటు వల్ల ‘అనుభవమ్మున రానిది’ అయింది.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జన్మలోన| ననుభవ మ్మనరానిది’ అనండి.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    అనుభవ మనగ కుడుచుటె యనగ జెల్లు ,
    కుడుచుటకు యోగ మబ్బుట పుడమి పూర్వ
    కర్మల ఫలిత మెంతయు కారణ మవ
    ననుభవ మ్మనరానిది యనుభవమ్ము.

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఒనగూడు ని ఒనగురు గా వాడవచ్చు అనుకున్నాను(సిద్దించు అనే అర్ధము లో). ఒనర్చు గా సవరించితిని. మీకు కృతజ్నతలు.

    దైవ విత్తకనక సముదాయముల య
    పహరణకు పూను కొన్నట్టి పాప నరున
    కిల నొనర్చు శునకజన్మ మిది శుభతర
    మను భవమ్మనరానిది యనుభవమ్ము.

    రిప్లయితొలగించండి
  18. కన్న బిడ్డను తండ్రియే కాంచు చుండ
    ఆమ్ల దాడికి పాల్పడి హాని జేయ
    సాగి పోయెడు వానిని చంప ధర్మ
    మను భవమ్మనరానిది యనుభవమ్ము!
    (భవము = పాపము)

    రిప్లయితొలగించండి
  19. ఎన్ని జన్మము లున్నవో నెవ్వరెరుగు?
    కష్టసుఖముల కలనేత గాదె బ్రతుకు
    దినము దినమొక ననుభూతి మనుజ జన్మ
    మను భవమ్మనరాని ది యనుభవమ్ము!!!

    రిప్లయితొలగించండి
  20. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    కవుల కావ్యాల పేర్లను గని తికమక
    గను "వసువు" "మను"వని తెల్పి, కంటిని యవ
    మాన! మటులె "స్వారోచిషమనుచరిత్ర"
    "మనుభవ" మ్మనరా నిది యనుభవమ్ము!

    రిప్లయితొలగించండి
  22. దైవ చింతన మందున ధార్మికుండు
    జపము తపములో నర్చిచు శాంతి తోడ
    మనము లోనెతా ధ్యానాన మాధవు గనె
    నను భవమ్మన రానిది యనుభవమ్ము.

    రిప్లయితొలగించండి
  23. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి