డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘తిరిగేటి, నించో’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ, మీ పద్యంలో కవితాకన్యక నాట్యం కనిపించి కనువిందు చేసింది. అభినందనలు. ధన్యవాదాలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. శైలజ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
మాష్టారూ!ఈ చిత్రానికి ఫేస్ బుక్ లో నేను వ్రాసిన పద్యం
రిప్లయితొలగించండిపట్టీలను నీ కాలికి
పెట్టితివా ముద్దుగుమ్మ వినిపించునికన్
నట్టింటను ఘల్లుమనుచు
గట్టిగ వయ్యారి నీదు గజ్జెల మ్రోతల్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిచక్కని పద్యం. బాగుంది. అభినందనలు.
నేను మీరు పెట్టిన చిత్రాన్నే స్వీకరించాను. ధన్యవాదాలు.
పసిడి కాంతు లీను పట్టు పావడ గట్టి
రిప్లయితొలగించండిఘల్లు ఘల్లు మనెడి గజ్జె లుంచి
అటునిటు దిరిగేటి యందాల సుందరీ
యెవరి కోస మమ్మ యెదురు చూపు.
2.పట్టు పరికిణిన్ గట్టుచు
పట్టీలను కాళ్ళకుంచి పరుగులు పెట్టన్
పట్టిని గని యమ్మ పలికె
గట్టిగ నించో మనుచతి గారాబముతోన్.
నట్టింటను నడయాడగ
రిప్లయితొలగించండిపట్టీలను బెట్టినట్టి పాపల పదముల్
చిట్టీ ! ఘల్లను సవ్వడి
తట్టునుగా ప్రేమను మది తడవతడవకున్.
రిప్లయితొలగించండిపట్టీలను నేజూచితి
బిట్టుగ నవి మెఱయు చుండె వెండివి కతన
న్బ ట్టీ ల తోడ పదములు
చిట్టీ ! మఱి యందగించె జి గిజిగి వోలెన్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘తిరిగేటి, నించో’ అని వ్యావహారికాలను ప్రయోగించారు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
లేత తమలముల రీతి చెన్నొందెడి
రిప్లయితొలగించండి........పాదముల్ గనినంత మోదమగును
మోదమ్ము కలిగించు పాదాల చుట్టుక
........వెండి నూపురములు వేడ్క జేయు
వేడ్కను కలిగించు వెండి యందెల పైన
.......పట్టుపావడ సౌరు వన్నె లద్దు
వన్నెల నద్దెడు పట్టుపావడకున్న
.......బంగరు టంచులు భ్రాంతి గొలుపు
భ్రాంతి గొలిపెడి సొగసుల పదిలమైన
యడుగులకు రమ్ము పారాణి నలదుకొమ్ము!
అలరు పారాణి పదముల తెలుగు బిడ్డ!
నర్తనప్రియవై నీవు నాట్యమాడు.
పట్టు పావడ ముద్దాడి పరవశించు
రిప్లయితొలగించండికొమ్మ చరణాలవి కుసుమ కోమలమ్ము
వెండి పట్టాలకే శోభ వెల్లువెత్తు
తేజ మొలికెడి యందాల తెలుగు పదము
మాంజిష్టపు టంచు నెఱిక
రిప్లయితొలగించండిరంజిల్లగ కాళ్ళపైన రాభస్యముతో
మంజీరము లను జూపుచు
కంజముఖియె గూర్చొనెనట కమనీయముగన్!!!
నెఱిక = పరికిణి
పట్టు పరికిణీ గట్టుకు
పట్టీలను బెట్టుకొనుచు ప్రహ్లాదముగన్
నట్టింటను నడయాడెడు
పట్టిని జూడంగ సిరియె పరుగున రాదే !!!
కవిమిత్రులందరికి నమస్కారములు.
రిప్లయితొలగించండినావయసురీత్యా చిత్రములోనిపాదములుచిన్నపాపవిగానె కనపడుచున్నవి.
అందుకేయిలా వ్రాయుచున్నాను.
పట్టుపరికిణిఁగట్టిన చిట్టిపాప,
కాళ్ళగజ్జెలన్నట్టింట కదలియాడ
సర్వ సంపదలొనగూరు సత్యమిద్ది;
యాడబిడ్డచేనింటికి యశముఁగలుగు.
గజ్జె లతిసుంద రమ్ములు గడుముదములు
రిప్లయితొలగించండిపాద కుసుమంబు లవిజూడ పసిడి ఛాయ
గజ్జె లవలన పదములు గజ్జెలకు ను
పాద ములొకరి కొక్కరు వంతు లాడె
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యంలో కవితాకన్యక నాట్యం కనిపించి కనువిందు చేసింది. అభినందనలు. ధన్యవాదాలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
నుదిటి బొట్టును కొందరే నుంచవచ్చు
రిప్లయితొలగించండిచేతిగాజులు వనితలు చేర్చకున్న?
కాలియందెలు మగువల కామితంబు
హంస గమనాన తాళమై నలరుచుండు|
ఎవరిగృహమునఁబుట్టెనో యీమిటారి?
రిప్లయితొలగించండిలేతతమపాకులుసుమ్మ లేమకాళ్ళు
పట్టుపరికిణిఁగట్టెను బెట్టుగాను
వెండిపట్టీలు పదముల వెలుగుచుండ
పట్టు పావడగట్ట?బెట్టుజేయగ కాళ్లు
రిప్లయితొలగించండి-----వెండిపట్టీలతో వెసలుబాటు
కన్య ఆశలు చెంత కనకంబు కరువైన
------కాలి గొలుసులున్న మేలటంచు
ఊహ నూయల లూగ మొహపాశము బాడ
-------తాళమౌ పట్టీల తళుకు బెళుకు
వెండి నండగ నున్న?వేదన మాన్పెడి
------రోగనిరోధక భాగమగును
అబలయందము జేకూర్చు ప్రభలముగను
నాట్య మందున లయల విన్యాసమయ్యు
పరుల నాకర్షితంబగు విరులవోలె
కానుపించును కన్యల కలల పట్టి
గురువుగారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండికె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కొందరే యుంచవచ్చు’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.