శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ముఖులు+అలుపు, అట్లు+అభ్యాసము’ అన్నచోట్ల సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. ‘ముఖ్యులె| యలు పెరుగక బాలునట్టు లభ్యాసమునే’ అనండి. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
పిట్టను గొట్టగ బాలుడు
రిప్లయితొలగించండిగట్టిగ గురిచూసి విడచె గరువము తోడన్
చెట్టుకు తగులగ పక్షులు
రెట్టలు విప్పుకు భయమున రివ్వున నెగిరెన్
నేదునూరి రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కలియుగ పార్థుని చేతిన
రిప్లయితొలగించండిగులేరు గాండీవమయ్యె, గురితప్పనిచో
విలవిల లాడును పక్షులు
వలదంటినియల్ప జీవి ప్రాణము దీయన్
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
ఉండేలు బద్ద జేకొని
రిప్లయితొలగించండిమొండిగ నట బాలుడొకడు మోదము తోడ
న్ఖండిత రాళ్ళను దరువున
వెండియు వెంవే యుచుండె బిట్టల కొఱకున్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాలుడొకండతి నేర్పున
రిప్లయితొలగించండిపొలము చెంతన నిలబడి పోరుచునుండన్
బిలబిలాక్షులు భయమున
ఫలాయనమంత్ర మునుడివినవకటా
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో తప్ప మిగిలిన పాదాలలో గణదోషం. చివరిపాదంలో యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ.....
బాలుడొకండతి నేర్పున
పొలమ్ము చెంతన నిలబడి పోరుచునుండన్
బిలబిలనేత్రులు భయమున
ఫలాయనపు మంత్రమును వెస పఠియించె కటా!
కాటిల్ బారును బట్టుకు
రిప్లయితొలగించండివేటాడుచునుండె బుడుత వేడుక తోడన్
సూటిగ పక్షులకు దగల
వాటంబుగ గురి నిజూచి వదలుచు నుండెన్!!!
శంకరయ్య గారు మీ సవరణకు కృతజ్ఞతాభివందనములు. పొరపాటున “న” గణం వాడాను కంద పద్యము లో.
రిప్లయితొలగించండివడిసెలఁ బట్టుకు కొట్టన్
రిప్లయితొలగించండిపడునేమో పిట్టపిల్ల ప్రాణము లెగురన్
పడగొట్టిన 'యంత్రము' తా
వడమిడు నో ద్రౌపది! నిరుపమ లక్ష్యమునన్
బాలుడొకండతి నేర్పున
రిప్లయితొలగించండిచేలంచెంతన నిలబడ చిచ్చర పిడుగై
బేలగ బిలబిల నేత్రులు
మేలెంచి యెగసి నిలిచిరి మేటి తరులపై
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండవ పద్యం బాగుంది. అభినందనలు.
.విలువిద్యయందు ముఖ్యులు
రిప్లయితొలగించండిఅలుపెరుగక బాలునట్లు అభ్యాసమునే
సలుపగ రాణించిరి మన
కలుషితభావాలునిండ?కలువదువిద్యే
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిలక్షించుచు తీక్షణముగ
వీక్షించుచు గులకరాయి విసరగనెంచెన్
పక్షిని బెదిరించకనే
తక్షణమా ఫలము పడగ దలచుచు మదిలో
చేను లోన పంటఁ చిందర పరచేటి
రిప్లయితొలగించండిపిట్టఁగొట్ట నెంచి పిల్లవాడు
నేర్చు చుండె తాను నేకాగ్రతను బూని
భయము తోడ పిట్ట పారి పోయె/పరుగు దీసె.
భూసారపు నర్సయ్య గారి పద్యం.....
రిప్లయితొలగించండిలాగి యా గులేట లావుకమునుఁ గొట్ట
గంతులేసి పడె ని దెంత చింత?
యెడమచేతి దెబ్బ లెప్పుడుఁ దప్పవు
కన్ను మూసి గురినిఁ గంటి వౌర!
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ముఖులు+అలుపు, అట్లు+అభ్యాసము’ అన్నచోట్ల సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. ‘ముఖ్యులె| యలు పెరుగక బాలునట్టు లభ్యాసమునే’ అనండి.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
997 వ చిత్రానికి పద్యరూపం
రిప్లయితొలగించండి=+=+=+=++==++==++==+
997వ చిత్రానికి పద్య రూపం
+++++++=====+++++++
ఏకలవ్యు వోలె ఎనలేని దీక్షతో
సాధనంబు(జేస్య సాధ్యు డయ్యె
గురిని పెట్టి కొట్టి గువ్వల గుంపును
కాచు కొనియె తనదు కలలపంట .
విద్వాన్ ,డాక్టర్ ,మూలె రామమునిరెడ్డి ప్రొద్దటూర్ కడప జిల్లా 7396564549
డా. మూలె రామముని రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘చేసి+అసాధ్యు’డన్నచోట యణదేశం చేశారు. అక్కడ యడాగమం వస్తుంది. ఆ పాదాన్ని సవరించండి.
డా. మూలె రామముని రెడ్డి గారి పద్యం రెండవ పాదాన్ని
రిప్లయితొలగించండి'సాధనము సలిపి యసాధ్యుఁడయ్యె ' అంటే సరిపోతుంది...
డా. విష్ణునందన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.