4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

పద్య రచన - 998

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

 1. ఫలితము దెలియని బాలుడు
  విలసిత ముగవెడలె నంట వేలుపు మ్రోలన్
  ఫలమని గోరుచు మురియగ
  బలారి వామహ నువున బలముగ గొట్టెన్

  బలారి = ఇంద్రుడు

  రిప్లయితొలగించండి
 2. 1.ఆ.వె:ఆంజనేయుడచట నర్కునిగని
  ఫలము యనుచు తాను పట్ట బోగ
  వజ్రి చేతి దెబ్బ వడిగ తగలగానె
  హనువు విరిగి యతడు హనుమ యయ్యె.
  2.ఆ.వె:భాను బింబము గని పండని భ్రమనొంది
  పట్ట బోయె నంట పవన సుతుడు
  హరియు పవిని విసర హనువు దెబ్బతినగ
  వాయు దేవు డలుగ వాయు వాగె.
  3.ఆ.వె:అంజనా సుతుండు యాకలి కోర్వక
  తల్లిఁ కాన లేక తపన పడుచు
  రక్తవర్ణమందు రంజిల్లు ఫలమని
  భాను బింబము గని పరుగు దీసె.

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 4. వెయి యుగ యోజనపు దూరమౌ యినుగని
  బాలకుండాంజనేయుందు ఫలమనుకొని
  లీల మింటి కెగసె కబళింప బోయె
  నితని సత్వ సంభ్రమముల నెన్న తరమె

  రిప్లయితొలగించండి
 5. తొలిజాములో చీకట్లను చీల్చుకుంటూ వెలుగులను ప్రసాదించే సూర్యుడు

  నీలాకాశపు పళ్ళెరంబున తమో నిర్వాణసంధాయకుం
  డై లావణ్య ఫలంబుగాగ వెలుగన్, హస్తంబులన్ సాచి దృ
  గ్జాలాతీత రయంబునొందు హనుమత్స్వామిన్ ప్రశంసించి వే
  వేలన్ సన్నుతులన్ ఘటించెద బృహత్విద్యార్థ లక్ష్యంబుతోన్.

  రిప్లయితొలగించండి
 6. భూసారపు నర్సయ్య గారి పద్యం.....

  బాలభానుని ఫల మని వాయుసుతుఁడు
  భ్రమసి భక్షింప నెంచఁగన్ రశ్మి వోయె
  వజ్రఘాతము బాధింప వాసె హనువు
  కర్మగతి దాట నేరికిఁ గాదు తరము.

  రిప్లయితొలగించండి
 7. ఇనబింబము ఫలమనుకొని
  వినువీధిని సాగు బాలవీరుడు గురిగా
  నినుచగ హరి నిర్ఘాతము
  హనవున్ బడ నుపశమించ నవి గురువాయెన్
  (అవి=సూర్యుడు)

  రిప్లయితొలగించండి
 8. ఫలమ యనుకొని సూర్యుని బట్ట బోవ
  కాలి నీ మూతి యె ఱ్ఱగ గంది పోయె
  నంత సాహసం బదియేల హనుమ !నీకు ?
  పట్టు కొంటివి చివరకు పగటి ఱేని

  రిప్లయితొలగించండి
 9. అరుణుని నింగిని గనుచున్
  పరమోత్సాహమున హనుమ పండని భ్రమసెన్
  సరగున నోటను బెట్టగ
  పురుదంశుని హనువు దగిలి పుడమిని గూలెన్!!!

  రిప్లయితొలగించండి
 10. ఏమిది నింగినున్న ఫల మెఱ్ఱగ దోచెడి నెంత వింతయో
  యీమహి చెట్టు, కాండమును, నింపగు కొమ్మలు లేక వ్రేలెడిన్
  నాముఖరీచి నూరెడిని నవ్యరసమ్ములు దీని జూడగా,
  గోముగ కోసి తిందునిక గుమ్ముగ నా కెదురేది ధాత్రిలో?

  ***

  ఏమిది మర్కటంపు శిశువివ్విధి భీతము లేక నాపెడన్
  గోముగ జాచి హస్తముల కూడని రీతిని వచ్చుచున్నవా
  డేమగునో మదీయఝషహేతితతుల్ తనుసోక హావిధీ!
  సోమలతీక్ష్ణ మింతయును సోకదు వీనికిదేమి చిత్రమో!

  ***

  దండము మారుతీ! సకల దైత్య విభంజన! దుఃఖ భంజనా!
  దండము ధాత్రిజా హృదయ తాపనివారణ! పాపవారణా!
  దండము వానరేశ్వరవ్యధాంధనిరంజన! రామరంజనా!
  దండము పంక్తికంఠ బలదర్ప వినాశన! శత్రునాశనా!

  రిప్లయితొలగించండి
 11. అమిత బలవంతు డైనట్టి అనిలసుతుడు
  భాస్కరునిజూచి భావించె ఫలము యంచు
  మిన్నుకెగసెను ఇనుడను మ్రింగదలచి
  అంజనిసుతుని లీలలే రంజితమ్ము

  రిప్లయితొలగించండి
 12. బాల్యమునందె మారుతి దివాకరు బండుగ నెంచి పార కౌ
  టిల్యము తోడ దేవపతి డింభకు వజ్రమువేగవేయ గా
  మూల్యము నిచ్చె గాదె హను మున్విరుగన్ననిలాత్మజుండు వా
  త్సల్యమునం బితామహుడు శస్త్రభయంబును బాపె వానికిన్.

  రిప్లయితొలగించండి
 13. 998వ చిత్రానికి పద్యరూపం

  మధుర ఫలమనుకొని మార్తాండు దరిజేర

  వాయు వేగమునను వాయుసుతుడు;

  భానుకాంతి జూడ భ్రమలు తొలగిపోవ


  మారుతాత్మజుండు మరలె తిరిగి.

  విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549

  రిప్లయితొలగించండి
 14. కవి మిత్రులకు నమస్కారములతో..
  గురుమూర్తి ఆచారి,

  పద్య రచన


  వాయుసుతుండు బాల్యమున బాల రవిన్ గనుచున్ ఫలంబు+ఇదే
  దో యని మ్రింగబూనగ నహో! పటు తేజిత మూర్తియయ్యె; రా
  మాయణమందు వీర హనుమంతుడతండె శివాంశ భూతుడౌ
  ఆయన రూపమున్ గొలువ హర్షము పొందును రామచంద్రుడే!!


  రిప్లయితొలగించండి
 15. బాలాంజనేయ శక్తిని
  కాలానికి బంచిపెట్ట కరుగదు గనుకే
  తేలుచు సూర్యుని జేరియు
  వాలెనులే పండుయనుచు భానుని చెంతన్.
  2బాలుడు పండుగా దలచి భానుని బట్టగ నెంచె వింతగా
  కాలుని నైన నిల్పగల కారణ జన్ముడు .ఆంజనేయుడే
  తేలిక వాయునందనుని తేజము గాంచగ చంద్ర కాంతిగా
  పోలికలుండె బాధ్యతల పోరున?సంతస మౌనట నెంచి చూడగా

  రిప్లయితొలగించండి
 16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. మూలె రామమునిరెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీగురుభ్యోనమ:

  ఫలమని భ్రాంతి నొందుచును భానుని బట్టగ నాత్మ నెంచుచున్
  సులువుగ మారుతాత్మజుడు సూర్యదిశన్ గని యేగునంతలో
  కులిశము తాకి మూర్చిలగ గోపము నొందెను వాయువంతటన్
  ఫలముగ నిచ్చిరా సురులు భద్రవరమ్ములు దివ్య శక్తులన్

  రిప్లయితొలగించండి
 18. శ్రీ మిస్సన్న గారి పద్యములను చదువుతున్నప్పుడు మధువును గ్రోలిన అనుభూతి కలుగుచున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి