5, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యాపూరణ - 1779 (అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా)

కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా.

28 కామెంట్‌లు:


  1. శ్రీగురుభ్యోనమ:

    అధ్యయనము జేయించక
    నధ్యాహారముల నెంచి యాతుర తోడన్
    మధ్యస్థులనున్ బిలచెడి
    యధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా.

    రిప్లయితొలగించండి
  2. విద్యా బోధన జేయును
    అధ్యాపకుఁ డనఁగ , నెవ్వఁడ జ్ఞానికదా
    అధ్యయ నములేని గురువట
    పద్యము గద్యము తెలియక ప్రాజ్ఞు డటంచున్

    రిప్లయితొలగించండి
  3. అఙ్ఞానంబును బాపుచు
    విఙ్ఞానమొసంగును యోజ్జ;విశదముగా తా
    ప్రఙ్ఞావంతుల చేయుచు
    సుఙ్ఞానమొసగు గురువుకు జోతలొ సగుదున్.
    2 తే.గీ:.ముగురు మూర్తుల బోలెడి ముఖ్య వ్యక్తి
    తల్లి తరువాత యంతటి తాన మీత
    నిదిల వినయాదికంబుల నొసగు నట్టి
    గురువు కంటెను వసుధలో గొప్ప యెవరు?.

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ******
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కొద్దిగా అన్వయక్లేశం ఉంది.
    మూడవపాదంలో గణదోషం. 'అధ్యయన రహిత గురువట' అనండి.
    *******
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపద్యం రెండవపాదంలో గణదోషం. '...మొసంగు నొజ్జ...' అనండి.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి ప్రణామములు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

    విద్యను బోధించు గురువు
    స్వాధ్యయనము మరచిపోయి స్వార్థము పెరగన్
    విద్యాధికులనరే యిల
    అధ్యాపకుడనగ నెవ్వ డజ్ఞాని గదా

    రిప్లయితొలగించండి
  6. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. పూజ్యులు శంకరయ్య గారికి వందనములతో, ( నిన్నటి) చంధోబద్ద కవిత్వం అని చూశాను కాని ఛందస్సు ఇతివృత్తం గా ఉండాలి అని తట్టలేదు. ఈ పద్యాన్ని దయతో చూడ గోర్తాను.

    యతి చతుర్ధ గణంబుననాది దినప
    తిగణమొండురెండుసురపతినపతులును
    ప్రాసనియమంపు బాధలు పరగకుండు
    సరస తేటగీతి యనగ సాగుచుండు.

    రిప్లయితొలగించండి
  8. అధ్యయనము జేయుచుదను
    నధ్యా పన జేయునతడు నధ్యా పకుడౌ
    మిధ్యా లాపము గలిగిన
    న ధ్యా పకు డనగ నెవ్వ డజ్ఞాని గదా

    రిప్లయితొలగించండి
  9. పూరణ;1.బాధ్యత నేర్పక స్వార్ధ
    మ్మేధ్యేయముగా విదేశ మే మేలనుచు
    న్నధ్యయనము నొనరించెడి
    అధ్యాపకు డెవ్వడనిన నజ్ఞాని గదా
    2.వధ్యులు,హింసావాదుల,
    సాధ్యుల దండింప బూన సౌజన్యముతో
    న్నధ్యాత్మనీతి గరపిన
    అధ్యాపకు డెవ్వడనిన నజ్ఞాని గదా

    రిప్లయితొలగించండి
  10. విద్యాబుద్ధులను దెలుపు
    నధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ? డజ్ఞానిగ, దా
    నధ్యయనము జేయించక
    విద్యార్థుల మేలుకొలిపి వివరణ లిచ్చున్.

    రిప్లయితొలగించండి
  11. బాధ్యత మరచుచు,నాశ
    మ్మేధ్యేయమ్మౌ పరాయి మ్లేచ్ఛుల వశుడౌ
    వధ్యుడు 'యఫ్జల్గురు'వనె
    డధ్యాపకు డెవ్వడనిన నజ్ఞాని గదా!

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు,కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ప్రణామములు
    నిన్నటి న్యస్తాక్షరికినాపద్యము .దయచేసి మీవ్యాఖ్య తెలుపగలరు
    04.09.2015.శంకరాభరణము
    న్యస్తాక్షరి:అ౦శము ఛ౦దోబద్ధ కవిత్వము ‘య’,’తి’.’ప్రా’.;స’.
    పదములు ప్రతి పాదములో మొదటి అక్షరాలుగా నుపయోగిస్తూ
    తేట గీతి లో పద్యము వ్రాయండి
    పద్యము ;’య’తులు గ్రహములై తమ కక్ష్యయానమందు
    ‘తి’మిర రిపుని కీర్తించుచు తిరుగుచు౦డి
    ‘ప్రా’స నీడగ చంద్రుడై వరలు చు౦డ
    ‘స’త్కవిత ఛ౦ద యుతము ప్రశస్తి గాంచు

    రిప్లయితొలగించండి
  14. విద్యయన బ్రహ్మ విద్యయె
    మిధ్య డుకృంకరణులన్ని మేటిగ జెప్పన్
    విద్యాధికుడని యన్యున్
    అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా

    రిప్లయితొలగించండి
  15. మిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.a

    రిప్లయితొలగించండి
  16. అధ్యయనము జేయకనే
    సాధ్యమ్మని బోధనమ్ము సలుపుచు నెపుడున్
    భాధ్యతగా బోధించని
    అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా !

    రిప్లయితొలగించండి
  17. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    అధ్యయనము తా జేయక
    మధ్యస్తముగా లభించు మాత్రల పొత్తం
    బధ్యయనము జేయమనెడి
    అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నుపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

    విధ్యుక్త సహిత విద్యా
    ద్యధ్యయన విశేష సులభతర శిక్షా వై
    రుధ్యుండౌ మూర్ఖుండగు
    నధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా!

    రిప్లయితొలగించండి
  19. విద్యను బోధించుచు నా
    విద్యార్ఠుల మదిని గెలుచు విజ్ఞానులెగా
    అధ్యాపకులది తప్పిన
    అధ్యాపకు డనగ నెవ్వడజ్ఞాని గదా

    రిప్లయితొలగించండి
  20. మిధ్యావాదులు కొందరు
    బాధ్యతను మరచిదీయు పైశాచిక చి
    త్రాధ్యాయములందకటా!
    అధ్యాపకు డనగ నెవ్వ డజ్ఞాని గదా.

    రిప్లయితొలగించండి
  21. గురువులకు, సత్కవులకు మరియు బ్లాగు వీక్షకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  22. విద్యా బుద్దులు నింపును
    అధ్యాపకుడనగ-నెవ్వడజ్ఞాని?గదా
    విద్యలు నేర్వక,మూర్ఖుడు
    మధ్యమ మందున బ్రతుకగ-మహిలో నతడే
    2.విద్యా వ్యాపారంబున
    విద్యార్థుల శ్రమకు దగ్గ విలువలు నడకీ
    మధ్యనగల –వ్యసన పరుడు
    అద్యాపకుడనగ నెవ్వ డజ్ఞానిగదా

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులకు నమస్కృతులు.
    హైదరాబాదులో "తెలుగు భాగవతం. ఆర్గ్" వారి ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చాను. కావున మీ పూరణలను, పద్యాలను సమీక్షించలేక పోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  24. హృద్యముగా విద్య నొసగు
    నద్యాపకుడనగ,నెవ్వడజ్ఞాని గదా
    నధ్యయనము జేయకనే
    పద్యములను జెప్పువాడు పండితుడగునే!!!

    రిప్లయితొలగించండి
  25. అధ్యయనము తా జేయుచు
    నధ్యాపన మెన్న నియతి నానందముతో
    విధ్యుక్త రీతి జేసెడు
    నధ్యాపకు డెవ్వ డనిన నజ్ఞాని! కదా?

    రిప్లయితొలగించండి
  26. సమస్యాపూరణ కవిమిత్రులకు సాహితీ వందనాలు
    =====++++++======+++++++===========

    అధ్యయ నంబొనరింపక

    విద్యల సారము నెరుగక విజ్ఞుల మంచున్ ;

    విద్యల గరపెడి యొజ్జను

    నధ్యాపకుడన నెవ్వడ జ్ఞానికదా!

    విద్వాన్ ,డాక్టర్ మూలే రామముని రెడ్ది ప్రొద్దుటూరు కడప జిల్లా . 7396564549

    రిప్లయితొలగించండి
  27. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ ‘న్యస్తాక్షరి’ పూరణ బాగున్నది.
    ఈనాటి సమస్యాపూరణ బాగుంది. అభినందనలు.
    ‘అన్యున్ అధ్యాపకు’డని విసంధిగా వ్రాయరాదు. ‘అన్యుని| నధ్యాపకు’ డనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మీ ‘వ్యస్తాక్షరి’ పూరణ కూడ బాగుంది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. మూలె రామముని రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. అధ్యక్షుని కాళ్ళు పిసికి
    బాధ్యత్వములన్ని నాకు బంధము లనుచున్
    మధ్యాహ్నము తూగునిడెడి
    యధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా

    రిప్లయితొలగించండి