10, సెప్టెంబర్ 2015, గురువారం

పద్య రచన - 1004 (గాలిమేడలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం....
“గాలిమేడలు”

15 కామెంట్‌లు:

  1. నీలి నీడల దిరుగుచు నిష్ట లేక
    వలపు వాకిళ్ళ ముంగిట ప్రాక టముగ
    గాలి మేడలు గట్టిన కూలి పోవ
    నేటి యువతకు పరిపాటి నిజము నమ్ము

    రిప్లయితొలగించండి
  2. ఉన్న దానితో దృప్తిని నొందు చుండి
    జీవ నంబును సాగించు నెవరు నైన
    సుఖము శాంతుల తోడన శోభి లుదురు
    కాక యూహను గాలిలో కట్టు నట్టి
    మేడ లన్నియు గూలును మిగలదేది
    కాన గాలిమే డల నిక కట్ట కెపుడు

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    గాలి మాటలతో ప్రొద్దుగడుపు చీవు
    గాలికి వదలి భాధ్యతల్-కష్టపడక
    గాలిమేడలు కట్టిన కూలిపోవె?
    చాలు నీ యతి తెలివిక కాలిపోను

    రిప్లయితొలగించండి
  4. గాలి లోన మేడ లన్ని గడియ కూడ నిలువవే!
    కూలి పోవు గాదె కట్టి కుములు టేల జెప్పుమా!
    నేల విడిచి సాము చేయ నేర్చు కోకు నేస్తమా!
    మూలములను మరచి పోవ ముప్పు తప్ప దెప్పుడున్!!!

    రిప్లయితొలగించండి
  5. ఊహలెప్పుడు చదలుపై కురుకు చుండ
    కాలునిలునదా మనిషికి నెలపైన
    గాలిమేడలు రయమునఁగూలిపోవు
    కష్టపడినచో ఫలితముఁగాంచ వచ్చు

    రిప్లయితొలగించండి
  6. అంత రిక్షాన విహరించు ఆశలున్న
    కాలు కదలదు పడకింటి గడప దాటి
    విత్త మార్జింప పెడదారి వెదకు వాడు
    కట్టు గాలిమే డలుఁ గూలు కాలగతిన

    రిప్లయితొలగించండి
  7. ఊపు నుయ్యాలలో నూగెడి పాపాయి
    -----దేలులే నిదురలో గాలిమేడ
    విద్యార్థి దశలందు విలువైన విద్యచే
    ----కళల కలనుగట్టు గాలిమేడ
    యవ్వనమందున నవ్వెడి పువ్వులా
    ----గంధ బంధమునందు గాలిమేడ
    వృద్దాప్య దశలందు సిద్దుడుగామారి
    ----మేలుజరుగు నను గాలిమేడ
    గాలిమేడను గట్టని కర్మజీవి
    తిండిలేకున్నగుండెతోడుండువాడె|
    ఆశ నత్యాశగామార ?అవనియందు
    బ్రతుక సాధ్యముగాదులే బ్రమల చెంత|

    రిప్లయితొలగించండి
  8. అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
    మతి జేయంగ దలంచి వేసెనొక బ్రహ్మాండంబనిందల్చుచున్
    ప్రతిపాద్యంబుఁ బ్రణాలికం ఘనుడు సౌభాగ్యోద్ధరీయంచికం
    బ్రతికూలంబవ నాటి యూహనకటా ప్రత్యాశ యయ్యెంగదా!
    [ దాన కర్ణుడవాలని , గొప్ప ధనవంతుడవ్వాలని, పెద్ద వ్యూహారచయతవ్వాలని గాలి మేడలు.]

    రిప్లయితొలగించండి
  9. ఏ పునాదులు లేకుండు నైపుణమున
    తేలి యాశలఁ గట్టిన గాలిమేడ
    కలిసి వచ్చిన నాడౌను గట్టి మేడ
    కష్ట పడిన జీవితమున కలిసివచ్చు

    రిప్లయితొలగించండి
  10. అతి దంభంబున దానధర్మముల దా నత్యంత వేగంబునన్
    మతి జేయంగ దలంచి వేసెనొక బ్రహ్మాండంబనిందల్చుచుం
    బ్రతిపాద్యంబుఁ బ్రణాలికం ఘనుడు సౌభాగ్యోద్ధరీయంచికం
    బ్రతికూలంబవ నాటి యూహనకటా ప్రత్యాశ యయ్యెంగదా!

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. లక్షలొచ్చు నంచు లాటరీలనుగొన
    ఆస్తు లెల్ల పోగ నప్పు మిగిలె
    గాలియందు మేడ గట్టిన నిలుచినా
    పనులు చేసి బ్రతుకు ఫలము దక్కు

    రిప్లయితొలగించండి
  13. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వచ్చు’ను ‘ఒచ్చు’ అన్నారు. ‘లక్ష లబ్బు ననుచు లాటరీలను గొన’ అనండి.

    రిప్లయితొలగించండి