16, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యా పూరణం - 1790 (కొఱవితోడను దల గోకికొనుట మేలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కొఱవితోడను దల గోకికొనుట మేలు.

28 కామెంట్‌లు:

 1. వలదు వలదన్న వినక యీ పను లొనర్చి
  జనుల చైతన్యులను చేయ సాహసించి
  వారిచేతనె వెలివేయ బడుటకన్న
  కొఱవితోడను దల గోకికొనుట మేలు

  రిప్లయితొలగించండి
 2. వలదు వలదన్న వినక యీపను లొనర్చి
  మాటి మాటికి విసిగించి మభ్య పెడుచు
  చిత్త మేరీతి తెలుపక విత్త మనక
  కొఱవి తోడను దలగోకి కొనుట మేలు

  రిప్లయితొలగించండి
 3. మిత్రులందఱకు నమస్సులు!

  (తన మాట వినక సీతనుఁ జెఱపట్టిన రావణునితో విభీషణుఁడు పలికిన పలుకులు)

  అన్న! వినుమన్న! యిఁకనైన నతివ సీత
  నాదరమ్మున నిడియు, స్నేహమ్మడుగుము!
  వానరయుత శ్రీరాముతోఁ బగల కన్నఁ
  గొఱవి తోడనుఁ దలగోకి కొనుట మేలు!!

  రిప్లయితొలగించండి
 4. ఒకే దెబ్బకు రెండు పిట్ట లన్నట్టుగా కవిమిత్రులు సమస్యాపూరణకు, పద్యరచనకు ఒకే పద్యాన్ని వ్రాసే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. సంతోషం!
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగునన్నది. అభినందనలు.
  ‘పెడుచు’ ప్రయోగం సాధువు కాదు. అది ‘పెట్టుచు’. అక్కడ ‘మభ్యపెట్టి’ అనండి.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. సుగ్రీవుని స్వగతం........

  అగ్రజుని దైత్యములడంచనాత్మ నెంచి
  మున్ను నిలచితి ధైర్యమ్ము సన్నగిలెను
  వాలినీడించ దలచెడు వాంచకన్న
  కిఱవి తోడను తల గోకికునుట మేలు.

  రిప్లయితొలగించండి
 7. దుష్టుడౌ వానితోడ పొత్తువలదెపుడు
  చెడిన కోతులు తప్పక చెరచు వనము
  కానివాని జత సుఖముఁగనుటకంటె
  కొఱివి తోడను తలగోకుకొనుట మేలు

  రిప్లయితొలగించండి
 8. గురువుగారికి నమస్కారములతో మీరిచ్చిన సమస్యకు మూడు పూరణలు చేయుచున్నాను తప్పులున్నచో మన్నించి సరిచేయగలరని మనవి

  క.
  గగన మందున దాగిన కరుణ లేని
  వరుణ దేవుని నమ్మి యీ వసుధ యందు
  సేద్యమనుజూద వృత్తినిఁ సేయు కంటె
  కొఱవి తోడను దలగోకి కొనుట మేలు

  చ. హనుమంతుడు రావణునకు నీతిని బోధిస్తున్నట్టుగా ఊహించి.....

  రావణా వేగ సీతను రాముఁ జేర్చి
  శరణు వేడుకొనినఁ జాలు కరుణఁ జూపు
  కోరుకొనకుము, రాముఁ తో పోరు కన్న
  కొఱవి తోడనుఁ దలకోకి కొనుట మేలు

  ట. రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణుడు రారాజు తో పలికిన పలుకులుగా ఊహించి.....
  పాండు పుత్రులనగ నీదు భాత్రులనుచు
  మరువ బోకుము రారాజ మాట వినుము
  కొదమ సింహాల తోపోరుఁ గోరనేల
  కోఱవి తోడను దలగోకి కొనుట మేలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారి సూచనమేరకు సవరించిన మూడవ పద్యము

   పాండు పుత్రులనగ నీదు భ్రాత లనుచు
   మరువ బోకుము రారాజ మాట వినుము
   కొదమ సింహాల తో పోరు గోరనేల
   కొఱవి తోడను దల గోకి కొనుట మేలు

   తొలగించండి
 9. మొండి దనము కర్కశమును మోటుదనము
  పుష్క లమ్ముగ గలిగినఁ బురుషుఁ గడుదు
  రాత్ము బుద్దులు మాపగ రాదుఁ దలుప
  కొఱవితోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి


 10. 'నెత్తిపై తేలు గలదని'మొత్తుకొనగ
  'ఐన నీచేతితో తీయుమనుచు'పలుకు
  జనుల తీరును గమనించ మనకు దోచు
  కొఱవితోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి
 11. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మూడవ పూరణలో ‘భ్రాత లనుచు’ అనండి.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మొండితనము’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు కృతజ్నతలు. దృతము లేనందుకేనా “ద” రానిది?

  రిప్లయితొలగించండి
 13. అంగదుడు రావణునితో...

  దీవిరాయడ! వినుమరి తెలివి తోడ
  రామచంద్రుని శరణంచు లక్షణముగ
  సీత నిడుమయ్య,లంకకు చేటు తప్పు
  దాశరథితోడ వైరమ్ము దగవు కన్న
  కొఱవి తోడనుఁ దలగోకి కొనుట మేలు!!!

  రిప్లయితొలగించండి
 14. బీదవడిఁగూడ సంసారమీదవచ్చు,
  తెలివిలేనట్టివారికి తెలుపవచ్చు,
  తెలివిగలమూర్ఖుఁతో జేయుచెలిమి కన్న
  కొరివితోడను తలగోకికొనుటమేలు.

  రిప్లయితొలగించండి
 15. ఆంగ్లవిద్యను గొప్పగ నాదరించి
  తనదు బాసను మఱచిన తప్పనుచును
  మూఢులకుఁ చెప్పబూనుట పొసగునయ్య? -
  కొఱవితోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీగురుభ్యోనమః

  తెలిసి తెలియక నెంతయో తెలిసినట్లు
  మూర్ఖవాదము జేసెడి మొరటు వాని
  చిత్తవృత్తిని మార్చెడు చేతకంటె
  కొఱవితోడను దల గోకికొనుట మేలు

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కారములతో
  గురుమూర్తి ఆచారి

  ఖలుని స్నేహము చేయుటకన్నగూడ
  కొఱివి తోడను తలగోకికొనిన మేలు
  కర్ణు డా కౌరవేశు సఖ్యమును గోరి
  పతనమొందగ లేదె భారతము లోన

  రిప్లయితొలగించండి
 18. వింత కోర్కులగోరెడి కాంత యున్న
  పేదరికముతో బాధపడు పెన్మిటేల
  శాంతితోనుండు నిత్యము సంగరమ్మె
  కొఱవితోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి
 19. శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తెలియక’ అన్నది కళ. కనుక ‘తెలియక యెంతయో’ అనవలసి ఉంటుంది.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. పెన్మిటి+ఏల అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘పేదరికముతో కుందెడి పెన్మిటి యెటు’ అనండి.

  రిప్లయితొలగించండి
 20. వలదు వలదన్న వినక యీ పనులొనర్చి
  రాష్ట్ర విభజన నష్టమ్ము ప్రజలు దెలిసి
  దెబ్బ తీయంగ తలచినసదిగులు కన్న
  కొఱవితోడను దల గోకికొనుట మేలు!

  రిప్లయితొలగించండి
 21. .వ్యసన మన్నది మనిషికి పసయటంచు
  బీడి,సిగరెట్టు గుట్కాలు తోడుగాగ
  కొఱవి తోడను దలగోకి కొనుట మేలు
  ఆశ నత్యాశ గామార్చి నాశబరచు.
  మూర్ఖ చిత్తుని రంజింప ముఖ్యమనుచు
  శాస్త్ర వేత్త ప్రయత్నముసాగుటనిన?
  కొఱవితోడను దలగోకి కొనుటమేలు
  అన్నసూత్రంబు రచియించి మిన్నకుండె.

  రిప్లయితొలగించండి
 22. మాట వినక తిరుగు చున్న మూర్ఖు తోడ
  వాదు లాడుచు నున్నచో ఫలము లేదు
  వాని బాగుకై యొనరించు పనుల కన్న
  కొఱవి తోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి
 23. గురువరులకు ధన్యవాదములు
  సవరించిన పద్యము .....
  వింత కోర్కులగోరెడి కాంత యున్న
  పేదరికముతో కుందెడి పెన్మిటెటుల
  శాంతితోనుండు నిత్యము సంగరమ్మె
  కొఱవితోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  శత్రునకు శత్రువే మన మిత్రు డనుచు
  నతని మిత్రత్వ మందిన నదియు ముప్పె;
  మరచి స్థనశల్య శోధన మనుట కన్న
  కొఱవితోడను దల గోకికొనుట మేలు.

  రిప్లయితొలగించండి
 25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి