వియస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. పద్యం ఉత్తరార్ధంలో అన్వయలోపం ఉంది. 'వారి యుక్కడరంగన్' అనాలి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. 'పశుపతి యాజ్ఞగ' అనండి.
నా 3వ పూరణ రెండవ పాదంలో యతి కూడా తప్పింది "సృణి బావగ నాటకమున - శివుడే వేయన్ " అంటే సరిపోతుంది !
మరొక చిన్న సందేహం చ ఛ జ ఝ శ ష స - లకు యతి మైత్రి గలదు గాని ప్రాస మైత్రి లేదు గదా కొందరు మిత్రులు పై అక్షరములకు ప్రాస మైత్రి పాటించారు ! అది సమ్మతమేనా ? ఏ ఏ అక్షరములకు ప్రాస మైత్రి గలదో వివరించండి
వసంత కిశోర్ గారూ, మీరు google transilaration ప్రయత్నించండి. దానిని ఇన్‍స్టాల్ చేసుకుంటే ఎక్కడైనా నేరుగా తెలుగులో టైప్ చేయవచ్చు. కాపీ, పేస్ట్ ఇబ్బంది ఉండదు. క్రింది లింక్ చూడండి. తెలుగు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
వయసులో పెద్దే గాని - పఠనములో శిశువైతే :
01)
_______________________________
పశురక్షణ సేయు నపుడు
శిశువౌటను పఠనమునను - స్నేహుల తోడన్
పశుపాలుడు పలికె నిటుల
"శిశుపాలునిఁ జంపినట్టి - శివునకు జేజే "
_______________________________
పశుపాలుఁడు = a herdsman;
స్నేహి = స్నేహితుడు
శిశువే - పలవరిస్తూ - పాఠం వల్లె వేసుకుంటుంటే :
రిప్లయితొలగించండి02)
_______________________________
నిశిరాతిరి నిదుర మునిగి
శిశువొక్కడు పలవరించె - చిత్రంబిటులన్
"పశుపాలుని నిందించిన
శిశుపాలునిఁ జంపినట్టి - శివునకు జేజే "
_______________________________
పశుపాలుఁడు = శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుని వేషం వేసిన - శివుణ్ణి మెచ్చుకుంటూ :
రిప్లయితొలగించండి03)
_______________________________
పశివేదల గ్రామంబున
శశి బావగ నాటకమున - శివుడే వేయన్;
కుశలత మెచ్చిన జనులనె
"శిశుపాలునిఁ జంపినట్టి - శివునకు జేజే "
_______________________________
శశి బావ = విష్ణువు(శ్రీకృష్ణుడు )
పరీక్షలలో పొరపాట్లు - శ్రీహరి యనబోయి శివుడని వ్రాస్తే:
రిప్లయితొలగించండి04)
_______________________________
నిశితముగా జదివియు మరి
ప్రశితుండొక డిట్లు వ్రాసె - పరీక్షనందున్;
"నిశితము గల చక్రంబున
శిశుపాలునిఁ జంపినట్టి - శివునకు జేజే "
_______________________________
ప్రశితుడు = శిష్యుడు(విద్యార్థి)
శివ కేశవుల కబేధము గదా - కేశవు డనబోయి శివుడంటే :
రిప్లయితొలగించండి05)
_______________________________
అశనంబది మెక్కి పిదప
ప్రశస్తముగ కథల జెప్పు - పౌరాణికుడే
వశవర్తుడు సుర, కనె నిటు
"శిశుపాలునిఁ జంపినట్టి - శివునకు జేజే "
_______________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవపూరణ మూడవపాదాన్ని ‘కుశలత మెచ్చి జను లనిరి’ అనండి.
నాల్గవపూరణ రెండవపాదంలో (పరీక్ష- జగణం) గణదోషం. ‘ప్రశితుం డొక ప్రశ్న కిట్లు వ్రాసె పరీక్షన్’ అందామా?
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిపశుకాపరి గోవిందుని
నిశితంబగు చక్రమందు నిలచినవాడై
పశుపతి యా లయకారుడు
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసమాన నటుడు శివుడే
రిప్లయితొలగించండికుశలత తో నటన జేసె గోపాలునిగా
కృషిగని ప్రేక్షకు లనిరట
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పశుగాపని గోపాలుని
రిప్లయితొలగించండినిశితముగా దూఱు నతని నేమము జెల్లన్
విశదముగా కేశునిచే
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే!!!
కుశలముగ చక్రి కినుకకు
రిప్లయితొలగించండివశుడై వేగ శిశుపాలు వధియించె నటన్
వశమే తప్పులు గాయన్
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే.
కవిమిత్రులందరికి అభివాదములు.
రిప్లయితొలగించండిఅందరిపూరణలు అలరిస్తున్నావి.
శ్రీపతిశాస్త్రిగారూ..లయకారుడైన శివున్ని చక్రాయుధమునందారోపించి శిశుపాలుని సమ్హారమును
చెప్పుట చక్కటి భావన.మంచి అన్వయము.కవికి భావన ముఖ్యము.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నైది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశిశుపాలుడు కంసుడు గను
రిప్లయితొలగించండిపశుపాలుడుగాను శివుడు పాత్రలు వేయన్
కుశలత గాంచి జనులనిరి
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే
రిప్లయితొలగించండిపశువుల కాపరి చంపెను
శిశుపాలుని ,జంపినట్టి శివునకు జేజే
దిశలెల్ల దద్ద రిల్లగ
నిశినిం జరియించువారి నిక్క డ రగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివియస్. ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యం ఉత్తరార్ధంలో అన్వయలోపం ఉంది. 'వారి యుక్కడరంగన్' అనాలి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'పశుపతి యాజ్ఞగ' అనండి.
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిశశి నామ పండితుండనె
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే
శిశువైన శిష్యుడిట్లనె
శిశుపాలుని జంపె నాడు శ్రీహరియె కదా?
శ్రీ బూసరపు నరసయ్యగారికి కృతజ్ఞతాభివందనములు.
రిప్లయితొలగించండి.పశుపతి యాజ్ఞగ కృష్ణుడు
రిప్లయితొలగించండిశిశు పాలుని జంపినట్టి|శివునకుజేజే
దశలుగ తప్పులు జేయగ
పసుపాలుడు సంహరించె పలువురు జూడన్|
భాగవతుల కృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
రిప్లయితొలగించండినా 3వ పూరణ రెండవ పాదంలో యతి కూడా తప్పింది
"సృణి బావగ నాటకమున - శివుడే వేయన్ "
అంటే సరిపోతుంది !
మరొక చిన్న సందేహం
చ ఛ జ ఝ శ ష స - లకు యతి మైత్రి గలదు గాని ప్రాస మైత్రి లేదు గదా
కొందరు మిత్రులు పై అక్షరములకు ప్రాస మైత్రి పాటించారు ! అది సమ్మతమేనా ?
ఏ ఏ అక్షరములకు ప్రాస మైత్రి గలదో వివరించండి
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమూడవపూరణలోని యతిదోషాన్ని నేను గమనించలేదు. సవరించినందుకు సంతోషం.
ఇక శ,స ప్రాస విషయం... (ఛందస్సు వర్గంలో ‘ప్రాసభేదాలు’ పాఠం చూడండి).
శకార ప్రాస -
ఊష్మాలైనందువల్ల శసలకు అభేదం చెప్పబడుతున్నది. పూర్వకావ్యాలలో వీనికి ప్రాసమైత్రి చెల్లిన ప్రయోగాలు ఉన్నందున శకారప్రాస స్వీకరింపదగినదే అని కొందరి అభిప్రాయం.
ఉదా.
అ) నాసికాస్యాంగ దృక్ *భ్రూశిరోజ (భాగ. 2-158)
ఆ)
మీసలు మెలిబెట్టుచుఁ గడు
రోసమ్ములు గ్రమ్ముకొనఁ బురోభాగములం
దాశ లద్రువ కేక లిడుచు
దూసిన కత్తులను ... (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలసము - 789)
అయ్యో యిప్పుడు ప్రాస నుసి యైనది
రిప్లయితొలగించండి"శిశిరకరుని బావగ ,నట - శివుడే వేయన్ "
అంటే సరిపోతుంది
నట = నట్టువుడు(నటుడు)
రిప్లయితొలగించండికొందరు -ష- అక్షరం వాడారు
అది కూడా సమ్మతమా ?
ప్రాస మైత్రి గల అక్షరములు యివి యేనా ? యింకేమైననూ గలవా ?
రిప్లయితొలగించండిథ ద ధ
న ణ
ర ఱ
లళ
శ స
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిశ, ష లకు ప్రాసలేదు. క్రింది ప్రాసభేదాన్ని గమనించండి.
ఉభయ ప్రాస -
వ్యాకరణసూత్రాలను బట్టి స, న లకు ష, ణలు ఆదేశమౌతాయి. ఆదేశ షకారానికి సహజ షకార సకారాలు, ఆదేశ ణకారానికి సహజ ణకార నకారాలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
అ) విషమ (వి+సమ) లోని ఆదేశ షకారానికి సహజ ష, సలతో ప్రాసమైత్రి ...
వసుధా .... సా, రసదళ ...., విసరాంబుజ ....., విషమ (సాంబవిలాసము)
ఆ) ప్రాణ (ప్ర+ఆన) లోని ఆదేశ ణకారానికి సహజ న, ణలతో ప్రాసమైత్రి ...
i) ప్రాణములఁ బాపె నాహవ*క్షోణియందుఁ
బ్రాణవల్లభఁ గొని చన్న *దానవేంద్రు (అప్ప. 3-332)
....ఇంకా కొన్ని ప్రాసభేదాలు ఉన్నాయి.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిశిశు వా యశోద మాతకు,
వశవర్తుఁడు భక్తులకును, వల్లవ రతుఁడున్,
పశుపతికిన్ సఖుఁడౌ నా
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే!
(శివుఁడు = శుభంకరుఁడు)
.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరార్యా ! శ్రమనుకోకుండా చింత దీర్చినందులకు సంతోషం
రిప్లయితొలగించండిఆంజనేయ శర్మ గారు - కృషి గని - అని వాడారు
అది ఆదేశ - ష - అవుతుందా
మన్నించండి
రిప్లయితొలగించండిసంధుల విషయములో నేను పరమ అఙ్ఞానిని
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిశర్మ గారి ప్రయోగం తప్పే. అక్కడ ఉన్నది ఆదేశ షకారం కాదు.
అయినా ఆదేశ షకారానికి సకారంతోనే ప్రాస చెప్పబడింది. శష లకు ఎక్కడా (నాకు తెలిసినంతలో) ప్రాసమైత్రి చెప్పబడలేదు.
రిప్లయితొలగించండిSaMkarAryA ! dhanyavAdamulu
రిప్లయితొలగించండిaMdari pUraNalU alariMchu chunnavi
haThAttugA nA right mouse button panicheyyaDaM mAni vEsiMdi
copy and paste vIlupaDalEdu
aMduchEta Alasyamainadi
ikkaDa DirectgA telugu type cheyyagala upAya mEmainA galadA ?
nEnu verE chOTa Type chEsi paste chEstuMTAnu
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీరు google transilaration ప్రయత్నించండి. దానిని ఇన్‍స్టాల్ చేసుకుంటే ఎక్కడైనా నేరుగా తెలుగులో టైప్ చేయవచ్చు. కాపీ, పేస్ట్ ఇబ్బంది ఉండదు. క్రింది లింక్ చూడండి.
తెలుగు
పసివాడని చేరిన ర
రిప్లయితొలగించండిక్కసి చనుగుడుచుచు రయమున కాలునిఁజేర్చెన్
విసిగించిన మేనల్లుని
శిశుపాలునిఁజంపినట్టి శివునకు జేజే