2, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణ - 1777 (రోగము లొసంగు జనులకు భోగములను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రోగము లొసంగు జనులకు భోగములను.
(ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు)

25 కామెంట్‌లు:

  1. బాగుగ సుఖములకలవడి
    సాగించిన జీవనమ్ము శ్రమ చేయకనే
    రోగము లొసంగు జనులకు -
    భోగములను వీడ వలెను బుద్ధిగ యెపుడున్

    రిప్లయితొలగించండి
  2. తె.గీ.తెలియనివిషయమెల్లయుగేలిజేసి
    తామెరిగినసత్యంబెసత్యమనియెంచు
    వ్యర్ధభావనాచతురులవాక్కుమాయ
    రోగము లొసంగు జనుల, కుభోగములను.
    (విషయపరిజ్ఞానము లేని వారి మాటలు జనులకి 'కుభోగము=చెడుభోగము' నిచ్చును.)

    రిప్లయితొలగించండి
  3. తూగుచు సిరి సంపదలను
    వీగుచు స్నేహితుల నడుమ వేడుకలందున్
    రోగము లొసంగు జనులకు
    భోగము లనుమాని నంత భూరి సుఖమ్ముల్


    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బుద్ధిగ నెపుడున్’ అనండి.
    *****
    పిరాట్ల వెంకట శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. సవరించండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుభ్యోనమ:

    పనులు జెప్పరు, మృదువుగ పలకరించి
    ఫలములను దెచ్చి యిత్తురు, పరుపు పైన
    నుపశమింపగ నగు నపుడపుడు చిన్న
    రోగము లొసంగు జనులకు భోగములను.

    (Office లో సెలవు లభించనప్పుడు జ్వరమని చెప్పి తప్పించుకునే వారి నుద్దేశించి సరదాగా)

    రిప్లయితొలగించండి

  6. జలకమాడగ వయసు వసంతమందు
    తాప మెగసెను వేసవి,తడిసి వలపు
    వాన,శరదిందు రాత్రిలో ప్రణయ జనిత
    రోగము లొసంగు జనులకు భోగములను

    రిప్లయితొలగించండి
  7. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మద్యమును త్రాగ,పొగపీల్చ మానవులకు
    రోగము లొసంగు; జనులకు భోగములను
    గూర్చు నారోగ్య సూత్రముల్ నేర్చి బ్రతుక
    సాత్వికాహార వ్యాయామ సరణి యొకటె

    రిప్లయితొలగించండి
  8. ఈగలు దోమలు విరివిగ
    మూగిన పర్యావరణము మురికిగ మారున్
    రోగము లొసంగు జనులకు
    భోగములను నీరుగార్చు భూగోళమునన్!!!

    రిప్లయితొలగించండి
  9. మురికి కాలువ,దోమలున్ ముసిరియుండ
    చెత్త పెత్తన మంతట చేరియుండ
    రోగములొసంగు జనులకు|”భోగములను
    బొంద వచ్చును శుబ్రత పొందుబరచ.

    రిప్లయితొలగించండి

  10. క్రుళ్ళి నటువంటి భోజ్యము ల్గుడుచు నెడల
    రో గములొసంగు జనులకు, భోగములను
    గలుగ జేయును రోగాలు గలుగు నెడల
    నాసు పత్రుల యందున హాయి గాను

    రోగముల వలన గలుగు రోదనములు
    రోగములపహరించును రొక్కములిల
    గార్య హానియు జేకురు గాక,యెట్టి
    రోగము లొసంగు జనులకు భోగములను ?

    పై పద్యము మాతమ్ముడు కామేశ్వర రావు చే వ్రాయ బడినది

    రిప్లయితొలగించండి
  11. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

    మోసమునఁ దిన్న యన్నంబు పొసఁగఁజేయు
    రోగము; లొసంగు జనులకు భోగములను
    సద్యసముపార్జనము గదా సత్య మిద్ది
    దీని మించిన యోగమ్ము లేనె లేదు.

    రిప్లయితొలగించండి
  12. ప్రాసయతి లక్షణములు దెల్పగ వచించె
    భోగములొసంగు జనులకు రోగములను
    పదము తడబడి మారెను వాక్యమిటుల
    రోగము లొసంగు జనులకు భోగములను

    రిప్లయితొలగించండి
  13. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పుడమిని జూడన్/ పుడమిన్ జూడన్’ అనండి.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఆహార వ్యాయామ’ అన్నప్పుడు ‘ర’ గురువై గణదోషం. సవరించండి.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా, చమత్కార జనకంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. భూసారపు నర్సయ్య గారు ఫోన్‍లో తమ పూరణ వినిపించినపుడు నేను తప్పుగా విని ‘సత్య’ను ‘సద్య’గా టైప్ చేసాను. సవరించిన పూరణ ఇది.....

    మోసమునఁ దిన్న యన్నంబు పొసఁగఁజేయు
    రోగము; లొసంగు జనులకు భోగములను
    సత్యసముపార్జనము గదా సత్య మిద్ది
    దీని మించిన యోగమ్ము లేనె లేదు.

    రిప్లయితొలగించండి
  15. రోగము లొసంగు జనులకు
    భోగములను కోరుకున్న భూరిగ మహిలో
    రాగము నశించి చివరకు
    సాగింతురు జీవనమ్ము శాంతియె కరువై!!!

    రిప్లయితొలగించండి
  16. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. హౄదయ శాంతియె సౌఖ్యము నిడును నీకు
    భాగ్యమేటికి పొందుమారోగ్య ధనము
    బ్రతికియుండిన శుభముల బడయనగు +అ
    రోగములొసంగు జనులకు భోగములను

    రిప్లయితొలగించండి
  18. గురుమూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. రోగములొసంగు జనులకు
    భోగములను పొందగోరు బుద్దియుబెరుగన్
    ఆగని యాశా దోషము
    సాగించిన ?సంతసంబు సరసకు రాదే|

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    (మానవ నైజ సామాన్యీకరణము)

    "స్వర్గలోకమ్మునకుఁ జన ససిగ నప్స
    రో గములొసంగు జనులకు భోగము"లను
    కాంక్షతోడుతఁ బుణ్యసక్తాత్ములగుచు
    దానముల్సేయుచుందురు మానవులిల!

    రిప్లయితొలగించండి
  21. తే.గీ: తినవలదనుచున్న వినక తినుచు యున్న
    రోగములొసంగు;జనులకు భోగములను
    నొసగు సాత్త్వికాహారము నుభుజి యింప
    కలుగు శాంతియు సౌఖ్యము ఖచిత మిదియ

    రిప్లయితొలగించండి
  22. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    వైవిధ్యమైన విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తినుచు+ఉన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వినక తినిన తిండి| రోగము లొసంగు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ చిన్న సందేహమండి.
    ఇచ్చిన సమస్య తేటగీతి కదా.మరో పద్యంగా మార్చి వ్రాయొచ్చా

    రిప్లయితొలగించండి
  24. ' రోగము లొసంగు జనులకు
    భోగములవి'యని లిఖించ పొత్తము నందున్
    ' రోగము లొసంగు జనులకు
    భోగములన'ని చదివె నొక పోకిరి వెధవే!

    రిప్లయితొలగించండి
  25. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    ఇచ్చిన సమస్యను మార్చకుండా ఏ ఛందంలోనైనా పూరింపవచ్చు. పైగా అది కవియొక్క ప్రతిభానైపుణ్యాలను తెలియజేస్తుంది. ప్రశంసాపాత్ర మవుతుంది.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి