కృష్ణా! రాధాలోలా! ననుదయను వీక్షించుము హరీ! కృష్ణా! గోవిందా! నా హృదయవని నీ క్రీడ కొఱకే కృష్ణా! గోపాలా! నీ పదములను నా కేల గొననీ కృష్ణా! కంసారీ! నా దరి నిలుము నీగీత గురియౌ.
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘రంజిల్లంగన్+ఈ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రంజిల్లగఁ దా| నీ...’ అనండి. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘జనించ నానందముతో’ అనండి. ***** శ్రీ స్వామి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు. కొన్ని లోపాలున్నవి. మీ పద్యానికి నా సవరణ..... ధైర్యమిచ్చెదీవు "దామోదర"యనిన నభయమిచ్చుచుందు వచ్యుత యన సత్యరూపుడ వయి నిత్యముండెదవంట సజ్జనులను కాచు సత్యరూప. ***** శైలజ గారూ, మీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. విష్ణునందన్ గారూ, అద్భుతమైన కృష్ణస్తుతిని అందించి అలరింపజేసారు. అభినందనలు, ధన్యవాదాలు. ***** భూసారపు నర్సయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రవికాంత్ మల్లప్ప గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** ఊకదంపుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** కొప్పరపు లక్ష్మి గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిరాధాకృష్ణ జయంతికి
రాధాకృష్ణుడిని గొల్తు రంజిల్లంగన్
యీ ధీమంతుడు గురువై
బోధించెను తత్వగీతి బుధులై నిలువన్
మిత్రులందఱకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిజోజో సాధుజనావన!
జోజో ఖగరాజ గమన! జోజో కపిలా!
జోజో దనుజ బలాంతక!
జోజో కంజాతనేత్ర! జోజో కృష్ణా! (1)
జోజో పంకజనాభా!
జోజో బ్రహ్మేంద్ర వినుత! జోజో కేశా!
జోజో ముకుంద! మాధవ!
జోజో కరుణాంతరంగ! జోజో కృష్ణా! (2)
జోజో జగదీశ! హరీ!
జోజో పూర్ణేందుముఖ! విశుద్ధ హృదబ్జా!
జోజో పన్నగశయనా!
జోజో గిరిధారి! జిష్ణు! జోజో కృష్ణా! (3)
జోజో దివ్యకృపాకర!
జోజో సర్వాత్మక! జలజోదర! చక్రీ!
జోజో వైకుంఠేశా!
జోజో కమలేశ! విమల! జోజో కృష్ణా! (4)
జోజో కైటభ వైరీ!
జోజో మధుసూదన! కపి! జోజో శార్ఞ్గీ!
జోజో నారాయణ! విధి!
జోజో విరజా! విలాసి! జోజో కృష్ణా! (5)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగీతఁ జెప్పి జనుల గీతనే మార్చెను
రిప్లయితొలగించండిధర్మ పక్ష పాతి మర్మయోగి
నీలదేహు డతడు లీలలెన్నియొ జూపె
జగతి గురువు యతడె శరణు మనకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅష్టమి రోహిణి పొద్దున
రిప్లయితొలగించండిన ష్టమ గర్భుడు గ పుట్టె కృ ష్ణుడు మహిలో
న్ని ష్టముగ పూ జ చేసిన
కష్టము లిక మనకు తొల గు కన్నని దయచేన్ .
కం:శిష్టుల గావగ భువిలో
రిప్లయితొలగించండి1 అష్టమి దినమున జనించ యానందముతో
కష్టములు దీరె ననుచును
శిష్టులు ముదమున పొగడగ సేమం బొదవెన్..
2.ఆ.వె:కష్ట పెట్టు చున్న కాళీయుని యణచె
కొండ నెత్తి కాచె గోకులంబు
అసుర వరుల జంపి యమరుల కాచిన
నంద గోపబాల వందనమ్ము.
3.తే.గీ:చెప్పువాడను యేనయ్య చిన్న వాడ
వినుము కర్తవ్య మొనరించు విడక నీవు
ఫలము నొసగెడి వాడను పార్థ నేను
మోహమును వీడి మసలంగ ముక్తి దొరకు
ఆ.వె
రిప్లయితొలగించండిధైర్యమిచ్చెదావు "దామోదర"యనిన
అభయమిచ్చె నీవునచ్యుతునికి
సత్యమెనుక నీవు నిత్యముండెదవంట
సజ్జనులను కాచె సత్యరూప..
రావయ్యా మురళీధర
రిప్లయితొలగించండిరావయ్యా నల్లనయ్య రాధాకృష్ణా
రావయ్యా వెన్నదినగ
రావయ్యా మమ్ము బ్రోవ రాగుణజాలా!!!
దేవకి నందన కృష్ణా
యోవారిజ పత్ర నేత్ర యో యవనారీ
రావేల దీన భాంధవ
గోవర్ధన ధారి నీకు కూర్నినిషాతుల్!!!
వందనము భక్తవరదుడ
వందనము మురారి శౌరి వంశీధరుడా
వందనమో మైందహనుడ
వందనము యశోద తనయ వందన మయ్యా!!!
దేవకి నందన ధీరజ ! కృష్ణా !
శ్రీవర దాయక శ్రీకర ! కృష్ణా !
గోవులు గాచిన గోపతి! కృష్ణా !
బ్రోవవె మమ్ము సుపూజితకృష్ణా!!!
వారిజ లోచన వందిత కృష్ణా!
ధారుణి గాచిన దాతవు కృష్ణా!
కోరి భజించెద గోపిక కృష్ణా !
నేరము లెంచకు నిర్మల కృష్ణా!!!
భారతావని కౌరవ పాండవ సమ
రిప్లయితొలగించండిరమున విశ్వరూపము జూపి రాగ పాశ
జనిత మోహంబు నరునకు చక్రి బాప
పలుకు చున్నాడు పార్థుడు వందనములు.
యదు వంశాంబుధి సోమం
రిప్లయితొలగించండియశోదానంద కారణం
వ్రజైక మండనం దేవం
కృష్ణం వందే జగద్గురుం !
దేవకీ వసుదేవ దివ్య సంతోషదం
******నవనీత చోర ! కృష్ణం నమామి !
నంద యశోదా మనః పద్మ భాస్కరం
******నయనాభిరామ ! కృష్ణం నమామి !
రాధా నిరంతరారాధనీయం గుణా
******ర్ణవ! దేవ దేవ ! కృష్ణం నమామి !
శిఖి పింఛ మౌళినం శ్రీ వేణు ధారిణం
******నవ నీల దేహ ! కృష్ణం నమామి !
గోపికా చిత్త హారి ! గోకుల విహారి !
యఘ దురిత దూరి ! గోవర్ధనాద్రి ధారి !
పాహి ముర వైరి ! భవ బంధ భయ విదారి !
చల్లగాఁ బ్రోవుమోయి కంసారి ! శౌరి !
నిన్ను నీవెఱుఁగుటె నిజమైన జ్ఞానమ్ము
రిప్లయితొలగించండినన్ను జూచి నీవు నిన్నెఱుంగు
మింతకంటె యుండ దిదియె జీవన్ముక్తి
కర్మయోగి వౌట ఘనత గలుగు.
పోరాడు వేళ నీకీ
రిప్లయితొలగించండివైరాగ్యమ్మేల పార్థ! పరమోన్నతమౌ
ధారుణిఁ గర్తవ్య నిరతి
రో!రథి కమ్మనె జగద్గురుఁడు సారథియై!
జగతికి గురువే యీతడు
రిప్లయితొలగించండిప్రగతికి మూలంబు యితడు పరమాత్ముండే
భగవద్గీతాచార్యుడు
భగవంతుడు, కృష్ణుని మది భక్తిని గొల్తున్
గురుదేవులకు, కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.a
రిప్లయితొలగించండిచిత్ర మయ్యది జూడగ జిత్త మందు
రిప్లయితొలగించండితోచె మఱి నాకు కృష్ణుని తోడ కవ్వ
డి,పలు కుచు వందనం బులి డియు న టులుగ
బాండు సూనుని నమ్రత వరలె నిట్లు
శ్రీరుక్మిణీపతిని, నగ
రిప్లయితొలగించండిధారిని, నవనీతచోరు, దానవ వైరిన్,
నారయణతీర్ధ వందిత
నారాయణుని మదిగొల్తు నయముగ నిపుడున్.
గురువులకు, సత్కవులకు మరియు బ్లాగు వీక్షకులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువుల బంధు మిత్రులను గూల్చుట ధర్మమ?చింతజేయగా
రిప్లయితొలగించండికరుణయు లేనియుద్దమన కాంక్షలుదీరవుకృష్ణబావ నే
మరలెద నన్న నర్జనుని మానసమందలి చింత దీర్చ-ఆ
తరుణము నందె గీత పరితాపముమాన్పగదెల్పె కృష్ణ్డుడే
2.యుద్దమందున నర్జును నూహమార
గీత సారంబు బోధించె కృష్ణు డచట
నేనె కర్తను, కర్మను నీవుగాదు
ధర్మ కర్మలునావెగ మర్మ మనెను.
తనవారైనను దురితులు
రిప్లయితొలగించండిజనహితము మరచి చరింప నణచుట ధర్మం
బౌ, నే జగతికి కర్తను
చెనకుము కుమతుల ధీరతన జయము నీకున్ !
!
సడలువిచారము పార్థా
రిప్లయితొలగించండివిడు మది సందేహమింక వీరవరేణ్యా
నడిపెడి వాడను నేనే
నడిపించెడి వాడ నేనె నమ్ము నరుండా!!!
రిప్లయితొలగించండికృష్ణా! రాధాలోలా! ననుదయను వీక్షించుము హరీ!
కృష్ణా! గోవిందా! నా హృదయవని నీ క్రీడ కొఱకే
కృష్ణా! గోపాలా! నీ పదములను నా కేల గొననీ
కృష్ణా! కంసారీ! నా దరి నిలుము నీగీత గురియౌ.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘రంజిల్లంగన్+ఈ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రంజిల్లగఁ దా| నీ...’ అనండి.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘జనించ నానందముతో’ అనండి.
*****
శ్రీ స్వామి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
కొన్ని లోపాలున్నవి. మీ పద్యానికి నా సవరణ.....
ధైర్యమిచ్చెదీవు "దామోదర"యనిన
నభయమిచ్చుచుందు వచ్యుత యన
సత్యరూపుడ వయి నిత్యముండెదవంట
సజ్జనులను కాచు సత్యరూప.
*****
శైలజ గారూ,
మీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నవి. అభినందనలు.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
అద్భుతమైన కృష్ణస్తుతిని అందించి అలరింపజేసారు. అభినందనలు, ధన్యవాదాలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రవికాంత్ మల్లప్ప గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
ఊకదంపుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
కొప్పరపు లక్ష్మి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.