20, సెప్టెంబర్ 2015, ఆదివారం

పద్య రచన - 1012

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

23 కామెంట్‌లు:


 1. ఆ.వె: బుజ్జి గణపతయ్య భోషాణ మిదియయ్య
  మౌసు నొక్క గానె మాట లాడు
  సకల విషయములను గక్కగా వివరించు
  కనుల తోడ నెల్ల గాంచ వచ్చు.

  రిప్లయితొలగించండి
 2. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. దీన జనుల గాచు దీక్షయే మయ్యెనో?
  గణన యంత్ర మందు మునిగి నావు,
  మిక్కి మౌజు పైన మక్కువేల కుదిరె?
  వలదు స్వామి విడుము. వ్యసన మదియు.

  రిప్లయితొలగించండి
 4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
  విశేషణము తోనే ముగించాలనే తపన తో నిన్నటి పద్యానికి చేసిన సవరణ తిలకించ గోర్తను.

  న్యాస తటీ నగరాజ వి
  లాసితమున్ స్వాదుతర జలాశయ రాజున్
  భాసిత కోకనదాశ్రిత
  కాసారము నట గనుండు కమలాకరమున్

  రిప్లయితొలగించండి
 5. మన దృష్టి పథము లో లేకున్నా, అచట చెరువులో ఉన్నాయి యనే తలపుతో వ్రాసాను.

  రిప్లయితొలగించండి
 6. చదువుట సంస్కారణాలను
  మదిలోదాచుటకు ,మంచి మమతలునింపే
  కదలిక లబ్బును|గనుకనె
  చదువుచువిఘ్నేషు డుండి సర్వులకొరకే

  రిప్లయితొలగించండి
 7. విఘ్న నాయక నినుగొల్తు విఘ్నములవి
  యీయ కయ్య గజానన యివియె నాదు
  వంద నమ్ములు ముదముగ వరము లీయ
  వయ్య ప్రీతిని నాపూజ లందు కొనుమ

  రిప్లయితొలగించండి
 8. పూజ లందు కొ నంగను ముదము కలిగి
  లాపు టాపున సౌందర్య లహరి చదువు
  చుండె ను శివుని మదిలోన చూచు కొనుచు
  పరమ శివునిపై గలయట్టి భక్తి తోడ

  రిప్లయితొలగించండి
 9. ఎలుక కాన రాక యెక్కడున్ననుగాని
  యెరుగ గల్గు నట్టి యేలికతఁడు!
  గుగులు గూర్చి పొగడ గ్లోబు గ్లోబంతయున్
  సర్చ్ చేయు చుండె సర్వసాక్షి!

  రిప్లయితొలగించండి
 10. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ నిన్నటి పద్యం ప్రబంధంలోని పద్యంవలె చక్కగా ఉంది.
  ఈనాటి చిత్రానికి మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. లాపుటాపు లోన లయకరుని సుతుడు
  కాంచుచుండె జగతి కరము తుష్టి
  నరులపూజనముల మరచిపోయెనుసుమ్మ
  అంకమందు యంత్ర మమరియుండ

  రిప్లయితొలగించండి
 12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. వ్యాసుడు నుడు వగనె భారతమును వ్రాసి
  తివట. ! కాని, య౦త. తేలి కగునె
  లాపు టాపు నొక్క. ? ల౦బోదరా ! హాయి
  గూరు చొనక నిట్టి కోర్కె లేల. ? ?

  రిప్లయితొలగించండి
 14. గంగా ధరుతన యుడనని
  చెంగలు వలపూజ లేక చేసిరి గరికన్
  భంగము కలిగెను తటముల
  ఖంగున నేవెదకి జూతు గణయంత్ర మునన్
  ------------------------------------
  గద్దెను నెక్కిన గణపతి
  ముద్దుగ తాతెలుసు కొనగ మూషిక మెంచున్
  వద్దనగను తిని పించిరి
  ముద్దలు చప్పిడి పిండి మోదకము లనన్

  రిప్లయితొలగించండి
 15. గణనాధుడు వెడల మౌసున
  గణుతింపగ జనుల భక్తి గణయంత్ర మునన్
  పణముగ బెట్టిరి కుడుములు
  నణకువ లేకుండి రంత నాగరిక మటన్

  రిప్లయితొలగించండి
 16. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  రెండవపద్యం చివరిపాదంలో గణదోషం. ‘ముద్దలు చప్పిడివి పిండి...’ అనండి.
  మూడవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘గణనాథు డరుగ మౌసున’ అనండి.

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులందరికీ అభినందనలు..
  నా మొన్నటి పద్యమునే మరల ఉంచుతున్నాను.  సీసము:
  మాత పంచెను నీకు "మదరుబోర్డ్ సాఫ్ట్వేరు"
  హరుడిచ్చె గజశిర "హార్డువేరు"
  ముల్లోకముల "నెట్టు" లల్ల "కనెక్షన్లు"
  మూషికమేగాగ "మౌసు" నీకు
  ఓం నమః లే "డాటు కాం"లుగా మారగా
  దేవతల "వెబ్ సైట్ల" త్రోవ నీవు
  పన్ను "రైటరు డిస్కు" పిన్నుగానే జేసి
  వ్యాస భారతమీవు వ్రాసినావు

  ఆటవెలది:
  గణనయంత్రములను ఘన "కంప్యుటరు" వీవు
  గణముల పతి నీవె గణన నాథ !
  మంచి "సైట్ల" నీవు మాతోడ తెరిపించి
  "వైరసు" దరి రాని వరమునిమ్మ.

  రిప్లయితొలగించండి

 18. పద్య రచన:ల్యాప్ టాప్ గణపతి
  బుద్దిసిద్ది సతుల పొత్తును గూర్చిన
  ల్యాపు టాపు నెలుక యమరజేయ
  భక్త జనము గోరు వరము లొసంగుచు
  నందు కొనుము పూజ లగజ సుతుడ

  రిప్లయితొలగించండి
 19. నేటి వినాయకుం డితడు నీటుగ దాలిచి పైడిదట్టి దా
  వాటము మీర వామపద భాగము నుంచుక దక్షిణోరుపై
  మీటెడి లాపుటాపు పయి మేదిని నెచ్చట మందిరమ్ములో
  గాటపు వేడుకన్ చవితి కన్నుల పండుగ వోలె జేతురో
  చాటుచు భక్తిభావమును చక్కగ గూగులునందు చూచి యా
  చోటికి పోయి యుత్సవపు శోభల పాల్గొన నెంచి నెమ్మదిన్.

  రిప్లయితొలగించండి
 20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పునరుక్తమైనా మీ పద్యం మనోరంజనం కలిగించింది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ షట్పాద పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. ముల్లోకములు తిప్పు మూషిక రాజమే
  ......మౌసు గా తానయ్యి మహిని జూప
  ఘంటమ్ము బట్టక గణనాధు డీవేళ
  ......గణనయంత్రము బట్టె కాల మహిమ
  బాహుబలిగ తన బలమును జూపిన
  .......జనుల తెలివి జూసి జడుపు బుట్టి
  ఇంటిపట్టున యుండి ఇంటరునెట్టున
  .......ధరను జూచుచునుండె కరివదనుడు

  మట్టి ప్రతిమలుంచి మంచిగా బూజించు
  భక్త జనుల గాంచి భళిర యనుచు
  చవితి యుత్సవముల సంబరాలు గనుచు
  మోదకములు దినుచు మురియుచుండె

  రిప్లయితొలగించండి
 22. శైలజ గారూ,
  మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
  ‘ఇంటిపట్టున నుండి’ అనండి.

  రిప్లయితొలగించండి