19, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యా పూరణం - 1793 (వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె.

32 కామెంట్‌లు:

  1. భక్తి గొలిచిరి గొల్లలు పరమ ప్రీతి
    వాసు దేవునిఁ , గంసుఁడు పట్టి జంపె
    దేవకి సంతు నేడ్గుర దీను లనుచు
    దనుజ సంతతి వారలు దైత్యు లనగ

    రిప్లయితొలగించండి
  2. ప్రాణభయమున క్రుద్ధుడై పలువిధముల
    క్రూర రాక్షసులన్ పంపెఁ గూల్చనెంచి
    వాసుదేవునిఁ గంసుడు, పట్టి జంపె
    రొమ్ము పై గ్రుద్ది మామను రోసి చక్రి!

    రిప్లయితొలగించండి

  3. పుట్టినంతనె వసుదేవు పట్టియైన
    వాసు దేవునిఁ , గంసుఁడు పట్టి జంపె
    ఎనిమిదవ చూలు ఫలియించి కృష్ణుడైన
    వాసుదేవుడు కంసుని పట్టి చంపే

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కొంత అన్వయలోపం ఉంది. ‘దేవకి సంతు’ అన్నచోట గణదోషం. ‘దేవకీపుత్రు లేడ్గుర దీనులగుచు| చెల్లి బావయు వినుతులు సేయ వినక’ అందామా?
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    తననుఁ జంపెడి శిశువునుఁ దానె చంపఁ
    గోరి, దేవకి కన్నట్టి కూర్మి సుతుల
    నేడ్గుర వసుదేవుఁడిడఁగ, నీచతఁ బ్రతి
    వాసుదేవుని కంసుండు పట్టి చంపె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణముతో...

      (దేవకీదేవి కన్న యెనమండ్రు సంతానమందు నార్వురనుం గంసుఁడు చంప, సప్తమ గర్భమాదిశేషుని యంశయగు సంకర్షణుఁడు [బలరాముఁడు] రోహిణీగర్భగతుఁడాయె, నష్టమ గర్భము శ్రీకృష్ణుఁడని తెలియునది)
      *
      తననుఁ జంపెడి శిశువునుఁ దానె చంపఁ
      గోరి, దేవకి కన్నట్టి కూర్మి సుతుల
      నార్వుర వసుదేవుఁడిడఁగ, నందియుఁ, బ్రతి
      వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె! (1)


      మరణ భయమునఁ గ్రుద్ధుఁడై వరుసఁగఁ బ్రతి
      వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె!
      యోగమాయయుఁ దర్జించె "నొక్క బాలుఁ
      డంతమొందింప వ్రేపల్లియనుఁ గలఁ" డని! (2)

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. వాసు దేవుని గంసుడు పట్టి చంపె
    ననెడి వార్తను జాటించె నగర మంత
    జనులు తండోప తండంబు జనగ నగరు
    దుష్ట మామను దాజంపి దురిత మణచె!

    దుష్ట సంహారములుజేయు దుర్నిరీక్ష!
    నీదు యవతార మహిమల నిజము దెలియ
    జన్మ జన్మల బుణ్యము జాల దాయె
    మోక్ష ఫలముల నందించ మోద మయ్య!

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ, దాని కొనసాగింపు పద్యం బాగున్నవి.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. చంప యత్నము సలిపెను జంకుతోడ
    వాసుదేవునిఁగంసుడు, పట్టి చంపె
    బాలకృష్ణుడు వానిని లీలగాను
    సన్నుతించగ దేవతల్ సంతసమున

    రిప్లయితొలగించండి
  9. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. పోచిరాజు సుబ్బారావు గారు చెప్పారు

    పూజ జేయుడు నిత్యము పూల తోడ
    వాసుదేవుని, గంసుడు పట్టి జంపె
    సప్త వశువులు ననబడు సప్త శిశుల
    ప్రబల మగుటన నతనిలో ప్రాణ భీతి

    రిప్లయితొలగించండి
  11. తనని సంహరించెడువాడు ధరణిఁ బుట్టె
    ననుచు తెలియ నసురమూక నంపెఁ జంపఁ
    వాసుదేవునిఁ గంసుఁడు, పట్టి చంపె
    నసురకోటిఁ గృష్ణుని లీలలద్భుతమ్ము

    రిప్లయితొలగించండి
  12. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    మాధవుని చేత తనకగు మరణమన్న
    వార్త విని యెట్లైన జంపంగ దలచె
    వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె
    శిశువు లార్గుర భీతికి వశుడగుచునె

    రిప్లయితొలగించండి
  13. గర్భ మష్టమందు యశోద గనియె సుతుని
    వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె
    సుతుల నార్వుర చలమూని సుంత యైన
    కరుణ లేక కారణమది కంస వధకు

    రిప్లయితొలగించండి
  14. ఉలికిపడినాడు రామకృష్ణులను జూచి
    మల్లయుద్ధపు సమయాన మధుర రాజు
    తనకు మృత్యువు వీడని తలచి, మదిని
    వాసుదేవుని గంసుడు, పట్టి చంపె.

    రిప్లయితొలగించండి
  15. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘వార్తను విని యెట్లైన జంపంగ దలచె’ అనండి.
    ‘శిశువు లేడ్గుర’ అనాలనుకుంటాను.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగుంది. కాని వాసుదేవుడు దేవకీగర్భ జాతుడు కదా!
    ‘సుతుల నేడ్వుర’ అనాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీగురుభ్యోనమః

    విధి బలీయమై తప్పింప విడచె నొక్క
    వాసుదేవునిఁ, గంసుఁడు పట్టి చంపె
    పురిటి బిడ్డల నేడ్గురు పుట్టినంత
    చెల్లి మనసును నొప్పించి చెఱన బెట్టి

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. .కంసు నూహలు బెరుగంగ “కటకటాల
    జేర్చె తోడబుట్టినచెల్లి,చెంతనున్న
    వాసుదేవుని”గంసుడు పట్టిచంపె
    వారిసంతతి గలుగంగ దారిలేక”

    రిప్లయితొలగించండి
  20. మట్టు బట్టగ పిలచెను మధుర పురికి
    వాసుదేవుని కంసుడు, పట్టి జంపె
    వాని పాపమ్ము పండగ వసుధలోన
    మామ నప్పుడు పరిమార్చె మాధవుండు!!!

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
    కంసుడు ఆర్గురిని మాత్రమే చంపుతాడు. ఏడవ వాడు బల రాముడు. అతడు సంకర్షణుడు. కంసుడు గర్భ శ్రావమయిందను కుంటాడు. అష్టమ గర్భము లో దేవకి కి కృష్ణుడు,అక్కడ యశోద కు యోగ మాయ పుడుతారు. నేను పొరపాటున యశోద అని వ్రాసాను. దేవకి గా సవరి స్తు న్నాను.

    పడతి దేవకి ముదముగఁ బడసె సుతుని
    వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె
    సుతుల నార్వుర చలమూని సుంత యైన
    కరుణ లేక కారణమది కంస వధకు

    రిప్లయితొలగించండి
  22. భక్తి గొలిచిరి గొల్లలు పరమ ప్రీతి
    వాసు దేవునిఁ , గంసుఁడు పట్టి జంపె
    దేవకీ పుత్రు లేడ్గుర దీను లగుచు
    చెల్లి బావయు వినుతులు సేయ వినక

    గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  23. జగతిలో నెవరున్నరు చంప వేల్పు
    వాసుదేవునిఁ , గంసుఁడు పట్టి చంపె
    పాప మనకనేడుగురు పాపలను క్రూర
    ముగను, దేవకీ సంతతిన్ మూర్ఖ మతుడు.

    రిప్లయితొలగించండి
  24. శిష్ట జనులను గావంగ శిశువు నైన
    వాసుదేవుని గంసుడు పట్టి చంపె
    దనని పల్కుచు వానిచే తానె చంప
    బడియె ;దుష్ట శిక్షణ చేసె బాల శౌరి

    రిప్లయితొలగించండి
  25. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాని కంసుడు బంధించింది వసుదేవుణ్ణి... వాసుదేవుణ్ణి కాదు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    నిజమే. నేను పొరబడ్డాను. మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వర అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణలో అన్వయదోషం ఉంది. మీ పద్యాన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో....
    జగతిలో నెవరైనను చంపగలరె
    వాసుదేవునిఁ , గంసుఁడు పట్టి చంపె
    పాప మనకనేడుగురు పాపలను క్రూర
    ముగను, దేవకీ సంతతిన్ మూర్ఖు డతడు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి