28, సెప్టెంబర్ 2015, సోమవారం

దత్తపది - 82 (ఈగ-దోమ-పేను-నల్లి)

కవిమిత్రులారా,
ఈగ - దోమ - పేను - నల్లి
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

36 కామెంట్‌లు:

  1. జడను పేనుట మానిన జలజ నయన!
    ఈ గదాదండమున వాని సాగనంపి
    నీ కురులనల్లిన మగఁడు నేను కాదె?
    అవునొ కాదో మగువ నీవు నవధరించు!!

    రిప్లయితొలగించండి
  2. నీ తలఁపేను గంటి నవనీ పతి ! పాండు నృపాల పుత్రులన్
    జూతువె శత్రు భావమున? సోదరులీ గతిఁ గయ్యమూనఁగా
    నీతియె? నీవెదో మనసు నిమ్మళమొందక భేద బుద్ధి నీ
    రీతిఁ జరింతు! శాంతిఁ గొనరే? హితవౌ నిఁక సంధినల్లినన్!!!

    రిప్లయితొలగించండి
  3. ఈగా నీదొక సినిమా
    రాగల దికదోమ పేను రంగుల చిత్రం
    బాగుగ వంతగు నీదిక
    త్రాగుము రుధిరమ్ము నల్లీ దాహము తీరన్

    రిప్లయితొలగించండి
  4. క్షమించాలి
    పైన బారతార్ధమును గమనించ లేదు . మరియొక ప్రయత్నము చేయగలను

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పాశుపతము సాధించుట కొరకై తపములో నిమగ్నమైన పార్థుడు :

    01)
    ______________________________________

    ఈగలెన్నియొ ముఖముపై - నెగురుచున్న
    దోమలెన్నియొ యొడలిపై - తూగుచున్న
    పేను లెన్నియొ తలలోన - పేరుకొన్న
    నల్లి, పిల్లలు నజినము - నల్లుకొన్న
    తపము నాపడు పార్థుడు - త్రక్ష్యుగూర్చి
    పాశుపతమును పొందగా - ప్రతిన బూని !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  6. హిడింబాసుర వధ :

    02)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌______________________________________

    పట్టినట్టుగ నీగను - పట్టి వాని
    కొట్టినట్టుగ దోమను - కొట్టి , మొట్టి
    పీకినట్టుగ పేనును - పీకి శిరము
    నలిపి నట్టుల నల్లిని - నలిపి దాని
    భీకరాకారు హిడింబు - బెండుపఱచి
    భీకరాట్టహాసము జేసె - భీము డంత !
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌______________________________________

    రిప్లయితొలగించండి
  7. శ్రీకృష్ణుడు కౌరవులతో రాయబార సమయమున..

    నేనీగతి చెప్పిన మీ
    మానసమేదో 'మతిచెడి ' మాటను వినదే
    నేనల్లినదా ? నిజమిది
    తా నని చంపేను క్రీడి తప్పదు మిమ్మున్.

    రిప్లయితొలగించండి
  8. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    చక్కని పూరణ నందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    _/\_
    *****
    వసంత కిశోర్ గారూ,
    స్వార్థంలో దత్తపదుల ప్రయోగించిన మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    (అన్యార్థంలో అని ఇవ్వవలసింది. అయినా భారతంలో ఈగలు, దోమలు... ఎక్కడివి? అందరూ అన్యార్థంలోనే ప్రయోగిస్తారనుకున్నా!)
    రెండవపూరణ ఐదవపాదంలో గణదోషం. ‘భీకరాకారుడు హిడింబు...’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చంపేను’ అనడం వ్యావహారికం.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో యతి తప్పింది. ‘ఈ గజబలు డొక్కడు చాలడే మదాంధు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  9. ఈగజగమన మాలిని యెచటి చిన్న
    దోమదీయమనస్సును దోచె సుమ్మ
    సుందరపురూపు మునుపేను చూడలేదు
    వలపు మాలగనల్లి నా తలను వైచె

    రిప్లయితొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    (దూతగ వెడలిన శ్రీకృష్ణుఁడు దుర్యోధనునకు రాఁగల యపాయమునుం గూర్చి యుపదేశించు సందర్భము నిట ననుసంధానించుకొనునది)

    ఈఁగల యైదు నూళ్ళనిడి యిప్పుడు సఖ్యతఁ జూపకున్నచోఁ
    గాఁగల కార్య మెట్టులునుఁ గాఁకయు మాన దెదో! మహాత్మతన్
    దూఁగరు మీరు! కిన్క తగదోయి! యనిన్ గెలు పేను కూర్చి, స
    ద్యోగము నల్లి, పాండవుల యోగ్య మహీశులఁ జేతు నత్తఱిన్!

    రిప్లయితొలగించండి

  11. జడను బేనుకొ నుమయిక జాయ ! నేను
    ఈ గ దాదండ మునవాని సాగనంపి
    కురుల నల్లి నీ యవియిక గూర్తు ముదము
    మంచి గామఱి మనగదో మగువ !యిపుడు

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్కారములు

    రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు భీముని గురించి సభలొ చెబుతున్నట్టుగా నూహించిన పద్యమిది
    పొరపాట్లున్నచొ మన్నించమని మనవి

    ఈ గజబలుడొక్కడు చాలడే మదాంధు
    మదమణచ, రణమ్ము వలదో మాన్యు లార
    పేనుట మరచిన పడతి వేణి నల్లి
    పంతమునెరవేర్చు కొనడె వాయుసుతుడు.

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యానికి సవరణ సూచించే సమయంలో కేవలం యతిని చూసాను. అక్కడి ‘దోమ’ను గమనించలేదు.
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఎందరో మహాను భావులు నాకు తోచిన రీతిన
    సమయాను భావం వల్ల ఏదో రాయలన్న తపనచే
    రొండు పద్యాలు రాసాను. తప్పులుంటె క్షమించ గలరు.

    నల్లి బాధ మనకు నాలుగే నిముషాలు
    శకుని దలచి నంత చావు మూడు!
    పిల్లి వలెను వచ్చి భీష్ముని నిందించె
    కర్ణు డెరుగు శాప కారణాలు

    కౌరవాగ్రజుండు కాఠిన్య శీలిర
    దోమ రక్త ధార దోచు రీతి!
    దుష్ట కార్య నేత దుశ్శాస నుండదె
    ఈగ రీతి జనుల నేడిపించె!

    రిప్లయితొలగించండి
  15. శ్రీకృష్ణ రాయబార సమయములో ద్రోణుడు సుయోధనునికి చెప్పిన హితము:

    ఈగ దయ్యవా రడిగిన నింత పుడమి
    కలత జెందిన దోమరి కరము నరుని
    మనము విద్యల గఱపేను మరల వాని
    గరిమ నల్లిన వ్యూహము గలనె దాట

    హాస్యార్ధము: పాండవులు ఏకచక్ర పురమున వసించు సమయములో..
    కాకులు చనని వని వదలి
    ఏకచకుర పురిని దోమఈగలు కరవన్
    భీకర శీతల రాత్రిని
    యా కరముల నల్లి పేను లందరి గరచెన్

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! సవరణలకు ధన్యవాదములు !

    భారత కాలమునకు అనగా ద్వాపర యుగములో చీమలు దోమలు లేవని
    మీరు నిర్ధారణగా చెప్పగలరా
    నా పరిమిత ఙ్ఞానానికి తెలిసినంతవరకూ క్రిమి కీటకాదులు మానవుని కన్నా
    ముందే ఈ భూమి మీద ఆవిర్భవించినవి
    బొద్దింక వయసు కొన్ని కోట్ల సంవత్సరాలైతే
    మానవుని వయసు మాత్రం కొన్ని లక్షల సంవత్సరాలేనని చదివిన గుర్తు

    ఈ విషయముపై చిన్న చర్చ మన మిత్రులు జరిపితే బావుంటుందేమో

    సరే , అన్యార్థంలో మరొక పూరణకు ప్రయత్నిస్తాను

    రిప్లయితొలగించండి
  17. ఈ గజగామిని యూర్వశి
    కౌగిలి వలదో? మజా తగనటుల్ దూర
    మ్మేగ వెరపే? నునుపు నా
    తీగ నడుము నల్లి చెలఁగఁ దేలు నరవరా!

    రిప్లయితొలగించండి
  18. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అయితే దత్త పదాలను ఒకే పద్యంలో వ్రాయడం నియమం కదా!
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపూరనలో సవరణలకు లొంగని దోషాలు ఉన్నాయి.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరించిన విధానంలో ఏ దోషమూ లేదు. అన్యార్థంలో అని అడగలేదు కనుక మీకా స్వేచ్ఛ ఉంది. నేనేదో సరదాకు వ్యాఖ్యానించాను. మరోలా భావించకండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మజా’ అని అన్యదేశ్యాన్ని వాడారు.

    రిప్లయితొలగించండి
  19. ఈగలు దోమలు కొన్ని కోట్ల సంవత్సరాలనుండి ఉన్నాయి. బొద్దింక ది లివింగ్ ఫాసిల్.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారికి నమస్కారం. యుద్ధంలో వీరమరణం పొందిన కొడుకు అభిమన్యుని గురించి దుఃఖిస్తున్న అర్జునుని కృష్నుడు అభిమన్యుని వద్దకు తీసుకువెళ్ళినప్పుడు అభిమన్యుడు తండ్రికి భవబంధాలు శరీరానికే గానీ ఆత్మకు లేవని చెప్పే సంధర్భాన్ని సూచిస్తూ రాయాలని రాసిన తేటగీతి పద్యం. మీరు పరిశీలించి తప్పులు తెలుపగలరు.

    తే.గీ. వసుధనల్లిదగునుగదవావివరుస
    తండ్రియెవరు?యీగనెవరుతనకుబిడ్డ?
    మోహమనుతాడుపేనునీమోహనుండు
    మహినినలమినదోమహామాయక్రీడ!

    రిప్లయితొలగించండి
  21. ఈగలు దోమల బాదను
    రాగాను రాగములు మరచి రాత్రిం బవలున్
    భోగపు తలపేను మరచియు
    సాగిరి పాండవులు నడవి సహనము నల్లిన్

    రిప్లయితొలగించండి
  22. మరొక పూరణ ప్రయత్నించాను గురువుగారు. లక్క ఇంటిని చూసి అనుమానం తో భీముడు పలికినట్లు. తప్పులు చెప్పగలరు.
    తే.గీ
    ఇల్లులక్కది, ఆపైనఎచ్చునెయ్యి!
    ఈగదోమలెపుడుతిర్గ, ఏమదియని?
    మనసునల్లికలిగిశంకమధ్యముడనె
    పరులపోనీకనిలిపేను, పదునుగాను!!

    రిప్లయితొలగించండి
  23. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఈగదో మనకిక వైరమేల తండ్రి,
    మీరు స్నేహమునల్లి బల్ల్ మేలు గూర్చు
    టుత్తమంబని మునుపేను నుడివినాడ మనుగడకు చాలునైదూళ్లు మాకటంచు

    ఆర్యా! నిన్నటి నా పూరణలో అన్వయలోపం వున్నదేమోనన్న సందేహం వెలిబుచ్చారు. సర్వమత సామరస్యానికి ప్రఖ్యాతి గాంచిన మమ భారతదేశంలో ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీ ఆబ్దుల్ కలాము వర్యులే,మరల ముస్లిమ్ గా మన దేశంలో జన్మించి కీర్తి నినుమండింప జేయాలని కోరుతూ రహీమ్ వినాయకుని సాగనంపడానికి వచ్చేడనడమే నా పద్యం లోని అంతరార్ధం.

    రిప్లయితొలగించండి
  24. బల్ల్ కు బదులు బల్ అని చదువగోరెదను. ఇది అచ్చు తప్పు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీగురుభ్యోనమః

    ఘోషయాత్ర సమయమున దుర్యోధనుడు కర్ణునితో చెప్పినట్లుగా భావించి

    ఆగక దాడి జేసిరిట నా బల శౌర్య మదెట్టిదో మన
    న్నీగతి పాల జేయునని యెట్లు తలంతును ఘోషయాత్రలో
    బాగుగ నల్లిరీ వలలు బంధన జేసి రిదేమి చిత్రమో
    వేగమె సాగి పోక మునుపే నుసిజేయుము ప్రాణమిత్రమా!

    రిప్లయితొలగించండి
  26. .ఈగమనంబు గుర్తెరిగి నేర్పుగ పాండవ భాగామివ్వకన్
    లోగిలి కష్టబెట్టితిరి లోపము లెంచరు నల్లినట్టివే
    ఆగకజేయ బూనిన దయాకర దోమటి చిక్కబోదులే
    సాగిన దార్త రాష్ట్ర|అని సర్వవినాశమె పేనును కృష్ణదేల్పెదన్

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
    ఈ గజగామిని యూర్వశి
    కౌగిలి వలదో? మగువ తగనటుల్ దూర
    మ్మేగ వెరపే? నునుపు నా
    తీగ నడుము నల్లి చెలఁగఁ దేలు నరవరా

    రిప్లయితొలగించండి
  28. కీచకుడు ద్రౌపదితో
    కం: నినుగన నోగజ గామిని
    వినుమా నాదోమనవిట వేడుక తోడన్
    కనుమా! నా తలపేనున్
    నిను నల్లికవోలె జూతు నిక్కము తరుణీ
    అల్లిక==పూవు,తెల్లకలువ

    రిప్లయితొలగించండి
  29. ఒకానొక కారణాన మధ్యాహ్నం నుండి నా మనస్సు కల్లోలంగా ఉంది. ప్రశాంతత కోల్పోయాను. అందువల్ల మీ పూరణలను చదివి వెంట వెంట వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి.
    చక్కని పూరణలు పంపిన...
    వేదుల సుభద్ర గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    డా. బల్లూరి ఉమాదేవి గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    రేపటి వరకు మనస్సు కాస్త స్తిమితపడితే మీ పద్యాలను సమీక్షిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కీచకుడు ద్రౌపదితో
      కం: నినుగన నీగడియన్ చెలి
      వినుమా నాదోమనవిట వేడుక తోడన్
      కనుమా! నా తలపేనున్
      నిను నల్లికవోలె జూతు నిక్కము తరుణీ
      అల్లిక==పూవు,తెల్లకలువ
      పై పద్యంలో మొదటిపాదం తప్పుగా వ్రాశాను.సవరించిన పద్యమిది.
      మీ మనస్సు స్థిమితపడాలని మీకు మనోబలం కలగాలని ఆశిస్తున్నాను.

      తొలగించండి