12, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యాపూరణ - 1786 (ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు.

35 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమః

    గురువు దుర్బోధ జేసిన గుమిలిపోక
    దానమును జేయ మదిలోన దాను దలచె
    భళిబళీయని పొగడగ బలికె చెందు
    ధర్మ మార్హము దప్పడు దానవుండు

    రిప్లయితొలగించండి
  2. మానవత్వము గలిగిన మనుజు డెపుడు
    ధర్మ మార్గము దప్పడు, దానవుండు
    పాప కార్యముల్ జేయుచు వసుధలోన
    నడచు దుర్నీతిపథమున నందముగను!!!

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    అంచితమ్ముగఁ బ్రహ్లాదుఁ డనవరతము
    హరిని మనమునఁ దలఁచుచు, నర్భకులకుఁ
    బరఁగ హరిభక్తిఁ గలిగించె! భక్తిచేత
    ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!!

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చెందు’...?
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘...దుర్నీతిపథమున నయము వీడి’ అంటే బాగుంటుందేమో?
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. నా రెండవ పూరణము:

    "వచ్చినది హరి! దాన మీ వల" దటంచు
    శుక్రుఁ డెన్ని సైఁగలఁ జేయ సుంతయు బలి
    మనముఁ దిరుగక లక్ష్యమ్ము మదిని నిలిపె!
    ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!!

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. దానమిచ్చిన మరణము తథ్యమనుచు
    తేట పర్చెనా శక్రుడు తెల్లముగను
    మాట పైనె నిల్చిమరణ మందె గాదె
    ధర్మ మార్గము దప్పడు దానవుండు.

    రిప్లయితొలగించండి
  8. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నా రెండవ పూరణము:

    "వచ్చినది హరి! దాన మీ వల" దటంచు
    శుక్రుఁ డెన్ని సైఁగలఁ జేయ సుంతయు బలి
    మనముఁ దిరుగక లక్ష్య సమ్మతినిఁ దెలిపె!
    ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!!

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారూ,
    ‘లక్ష్యసమ్మతి’ సవరణతో మీ రెండవ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  11. వలదనిగురువు తెలిపినా బలి యొస౦గె
    త్రి పదములమేర దానమ్ము శ్రీధరునకు
    తనదు రాజ్యమ్ము కోలుపోయినను గాని
    ధర్మ మార్గము దప్పడు దానవుండు

    రిప్లయితొలగించండి
  12. సంత తమ్ము హరిని గొల్చు సజ్జనుండు
    ధర్మమార్గముఁదప్పడు, దానవుండు
    సక్రమమగు మార్గమువిడి వక్ర బుద్ధి
    తోడ పయనించు చున్ కడు దుష్టు డగును

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ఉత్తమ గుణసంపన్నుడు ఉర్వియందు
    వినయ శీలుడు విజ్ఞాని విమల మతియు
    ధర్మ మార్గముఁ దప్పఁడు, దానవుండు
    దమన నీతిని విడువడు దయను లేక

    రిప్లయితొలగించండి
  15. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  16. శ్రీగురుభ్యోనమః

    లోకహితమైన ధర్మమె నీకు నైన
    హితము గూర్చును రావణా యెన్నడైన
    ననుచు పలికె విభీషణు డనుజుతోన
    ధర్మమార్గము దప్పడు దానవుండు

    గురువుగారూ "చెందు" = చెందును (వర్తించును)అనే అర్థముతో వ్రాసినాను. చెందు బదులుగా "తగును" అంటే సరిపోతుందనుకొంటాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పూరణలో ‘చెందు/ తగును’ శబ్దాలకు అన్వయం కుదరడం లేదు.

    రిప్లయితొలగించండి
  18. రావణాసురుని గురించి....

    సర్వశాస్త్రవిదుండును శర్వభక్తుఁ
    డఖిలసురభయంకరశౌర్యాతిశయుఁడు
    నై పరాంగనాపహరణ మనెడి యసుర
    ధర్మమార్గము దప్పడు దానవుండు.

    రిప్లయితొలగించండి
  19. ఒకానొక రాక్షసుని గురించి నారదుడు శ్రీమహావిష్ణువుతో ........

    ముని తపంబులకాటంకముల మిగుల్చు
    స్త్రీల మానాభిమానముల్ చెఱపఁజూచు
    దేవతారాధకులను బాధించువాడ
    ధర్మ మార్గమ్ము దప్పఁడు దానవుండు

    వాడు + అధర్మ

    రిప్లయితొలగించండి
  20. ఒకానొక రాక్షసుని గురించి నారదుడు శ్రీమహావిష్ణువుతో ........

    ముని తపంబులకాటంకముల మిగుల్చు
    స్త్రీల మానాభిమానముల్ చెఱపఁజూచు
    దేవతారాధకులను బాధించువాడ
    ధర్మ మార్గమ్ము దప్పఁడు దానవుండు

    వాడు + అధర్మ

    రిప్లయితొలగించండి
  21. వినడు మారీచు మాటలు వింత యేమి?
    సోదరుని వాక్కు లెక్కవు చోద్యమేమి?
    హనుమ హిత వసహ్యమ్మాయె నచ్చెరువె? అ
    ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు.

    రిప్లయితొలగించండి
  22. స్త్రీవిమోహము , సురలపై ద్వేషబుద్ది ,
    క్రౌర్యచి౦తన మొక్కి౦త.
    కలిగియు౦డు
    న౦తియే ! తదితర
    విషయముల య౦దు
    ధర్మమార్గము తప్పడు
    దానవు౦డు !!

    రిప్లయితొలగించండి
  23. జప, తపము లెరిగిన మహాజ్ఞాని యైన
    రమణి సీతను చెరబట్టె రావణుండు!
    లక్షణమ్మది బుద్ధియై రాక్షసమను
    ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు!

    రిప్లయితొలగించండి

  24. మానవత్వము గలిగిన మానవుండు
    ధర్మ మార్గము దప్పడు, దానవుండు
    దమన మార్గాన జనులపై దాడి జేసి
    చంపి భక్షించు నది వాని జాతి వృత్తి

    రిప్లయితొలగించండి
  25. దేవ దేవునిఁ జింతలఁ దినముఁ గడపు
    పాప కర్మలు విడనాడి భాగవతుడు
    ధర్మమార్గముఁ దప్పడు, దానవుండు.
    భిన్న మార్గమునఁ జరించు భీకరముగ

    రిప్లయితొలగించండి
  26. గురువుగారు మొదటి పద్యములో యతి తప్పడముతో
    సవరించి మరల వ్రాశాను .
    జన్మతో పుట్టు గుణములు జన్యువైన
    మార్చ లేడిట్టి ధరణిలో, మహిత వాక్కు
    లెన్ని చెప్పిన గాని వినడెప్పు డతడ
    ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారికి
    నమస్కారములతో
    నా రెండవపూరణము
    రావణుడు సీతతో పలికిన మాటలుగా ఊహించి పూరణ చేసిన పద్యము

    మనసు పడిన మానినిఁ వొందు మగటిమగల
    ధీరుడన్ గదా హరిణాక్షి తెలిసికొనుము
    తరుణుల హరింప ధర్మమే దానవులకు
    ధర్మ మార్గముఁ దప్పఁడు దానవుండు

    రిప్లయితొలగించండి
  28. 1)
    దార చెవినిజోరీగయై పోర నైన,
    మునులు దెల్పనైనఁ గలుగు ముప్పు, ప్రాణ
    హాని హితులునెచ్చరించ నైన, బో, స్వ
    ధర్మ మార్గముఁ దప్పఁడు దానవుండు
    2)
    మును హరినికట్టెదుట నిత్యమున్నుగనినఁ
    బరగ పరమశివుని ఘనభక్తుడయినఁ
    బూర్వగాధలనెరిగినఁ బుడమి దైత్య
    ధర్మ మార్గముఁ దప్పఁడు దానవుండు.

    రిప్లయితొలగించండి
  29. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    నిత్య సత్యవ్రతుండయి నెగడు వాడు
    కర్మ ఫలమును పొందుటె మర్మ మనుచు
    ధర్మమార్గముఁ దప్పఁడు ; దానవుండు
    దుర్మతుండయి సలుపును దురితములను

    రిప్లయితొలగించండి
  30. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదాన్ని ‘దేవదేవుఁ జింతించుచు దినము గడుపు’ అంటే బాగుంటుందేమో?
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ‘ఊకదంపుడు’ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. పరుల సొత్తుఁ గోరు పరుల భార్యఁ గోరు
    పరలు భాధపడినతాను పొంగిపోవు
    ఫలము లేనిదే చేయడే పనియు నిట్ల
    ధర్మ మార్గముఁ దప్పఁడు దానవుండు.

    రిప్లయితొలగించండి
  32. వల్లూరు మురళి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో ‘పరులు’ టైపాటు వల్ల ‘పరలు’ అయింది.

    రిప్లయితొలగించండి
  33. కర్మబద్ధుడు,కలుషిత మర్మహితుడు
    పరుల బాధలు జూచెడి కరుణ లేని
    జాతిజాగృతు లందున జరుపగల-న
    ధర్మ మార్గము దప్పడు దానవుండు

    రిప్లయితొలగించండి
  34. కె.ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి