సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటిపద్యంలో ‘నాశము+ఈప్రయత్న’మన్నప్పుడు యడాగమం రాదు. ‘నా ప్రయత్నమున్|చెఱపకు...’ అందామా? రెండవపద్యంలో ‘నిల్పజూతు’ అన్నదానిని ‘నిల్పలేరు/ము’ అనండి. అన్వయం చక్కగా సరిపోతుంది.
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. పోతన పద్యాన్ని చూపినందకు ధన్యవాదాలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. కొంత అన్వయలోపం ఉంది. ‘సాగుచుండ(న్)’ ద్రుతాంతం. కొద్ది సవరణతో మీ పద్యం..... కురునృప! పాండునందను లకుంఠితధీక్షయె ధర్మమార్గమై జరిగెడి యుద్ధ తంత్రమున జన్మకు సార్థక మబ్బ గెల్వ త చ్చరితమె సాక్ష్యమై నిలచు! సద్గుణ సారము సాగుచుండ నే మరకను భాగ మిచ్చుటయె మంచి దటంచును దెల్పె కృష్ణుడే. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవపాదం ప్రారంభంలో గణదోషం. టైపాటు కావచ్చు. ‘స్థిరులును’ అని ఉండాలి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కురునృప! పాండునందను లకుంఠిత దీక్షను ధర్మబుద్ధితో
రిప్లయితొలగించండిచురుకుగ సాగుచుందురిక చూడుము వారికి కష్టమందకన్
త్వరపడి నైదుగ్రామముల తప్పక నీయుము లేదులేదనన్
బెరుకదిలేక గెల్తురిక భీషణ యుద్ధమునందు తప్పకన్.
కురునృప! పాండునందను లకుంఠిత దీక్షను ధర్మబుద్ధితో
రిప్లయితొలగించండిచురుకుగ సాగుచుందురిక చూడుము వారికి కష్టమందకన్
త్వరపడి నైదుగ్రామముల తప్పక నీయుము లేదులేదనన్
బెరుకదిలేక గెల్తురిక భీషణ యుద్ధము దైవ సాక్షిగా
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
కురు నృప ! పాండు నందను లకుం ఠిత భక్తిని ,ధర్మ బుద్ధితో
రిప్లయితొలగించండినిరత ముసేవ జేయుదు రునీ చ రణాల కుగాదె ? వారి
న్నరసి ముదంబు నొప్పగ ,దయన్గలు గంగ, సగర్వ ముగాగ
న్నిరవుగ వారి భాగపు మహిన్దగ నిమ్ము సుబుద్ధితో నికన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
౨,౪ పాదాలలో గణదోషం. ‘వారి వా| క్కరసి ముదంబు నొప్పగ దయన్ గని గర్వము పోవఁద్రోచి నీ| విరవుగ....’ అనండి.
****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ఎన్నన్’ ద్రుతాంతం కదా. ‘బలాఢ్యు లెన్న నే|యరమర...’ అనండి.
శ్రీకృష్ణపరమాత్ముఁడు రాయభారమునందు........
రిప్లయితొలగించండికురునృప! పాండునందను లకుంఠిత ధర్మపరాయణత్వ సం
భరితులు, వారి భాగములఁ వారికినిచ్చుట శ్రేష్ఠమౌను సం
గరము ఘటించ తప్పదిక కౌరవనాశము యీప్రయత్నమున్
చెఱపకు, సంధి సంధిలఁగ శ్రీకరమౌ భరతప్రజాళికిన్.
కురునృప! పాండునందను లకుంఠిత ధైర్య పరాక్రమోద్ధత
స్పురదరి సైన్య కూటములఁ శూన్యమొనర్చెడివార లందు సు
స్థిరతర కీర్తిసాధకులు దివ్యశరంబులు గల్గువారినే
తెఱగున నిల్పజూతు వినుతించెద మీదు శుభాభిలాషినై.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యంలో ‘నాశము+ఈప్రయత్న’మన్నప్పుడు యడాగమం రాదు. ‘నా ప్రయత్నమున్|చెఱపకు...’ అందామా?
రెండవపద్యంలో ‘నిల్పజూతు’ అన్నదానిని ‘నిల్పలేరు/ము’ అనండి. అన్వయం చక్కగా సరిపోతుంది.
కురునృప! పాండునందను లకుంఠిత దీక్షను శాస్త్రబద్ధులై
రిప్లయితొలగించండికురుకుల గర్వమౌచు, సరి క్రొత్తగు వీరముఁ జూపుచుండ ,నా
సరి యెవరంచు నీదు ప్రియ సంతు సుయోధనుడెల్లవేళలన్,
పరులని యెంచి వారలను బాధల పెట్టెడు ;బుద్ధి నేర్పుమా!
వారి గురువు, ధృతరాష్ట్రునితో అన్న మాటలుగా..
రిప్లయితొలగించండికురునృప! పాండు నందనులకుంఠిత దీక్ష నరణ్య వాసమున్
రిప్లయితొలగించండివరముగఁదల్చి చేసిరిక వారల భాగమునిచ్చి కావుమీ
కురుకులమీవు గూర్చగను కూర్మి ప్రశాంతియు సౌఖ్యమెల్లెడన్
దురమిక తప్పదన్నతరి దుర్మరణమ్ములు నీదు పక్షమౌ
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ప్రియసంతు’ అని సమాసం చేయరాదు కదా! ‘సరి యెవరంచు దుష్టజనసంగి సుయోధను...’ అంటే ఎలా ఉంటుంది?
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాగుంది గురువుగారు,
రిప్లయితొలగించండికురునృప! పాండునందను లకుంఠిత దీక్షను శాస్త్రబద్ధులై
కురుకుల గర్వమౌచు, సరి క్రొత్తగు వీరముఁ జూపుచుండ ,నా
సరి యెవరంచు దుష్టజనసంగి సుయోధనుడెల్లవేళలన్,
పరులని యెంచి వారలను బాధల పెట్టెడు ;బుద్ధి నేర్పుమా!
కురునృప! పాండునందను లకుంఠిత దీక్షఁ విశేష విద్యలన్
రిప్లయితొలగించండిస్థిరమతి తోడ నేర్పున విచిత్ర పుటస్త్ర సశస్త్ర రీతులన్
గురువరు కుంభసంభవు నిగూఢు ద్విజోత్త మపార కౌశులున్
కురుకులవృద్ధ భీష్మడ లగూర్పగనేర్చిరికౌర వేయులున్
[పోతనామాత్యుని పద్యము:
“కురు నృప పాండు నందనులకుంఠిత కేళిఁ జమూసమేతులై
యరిగి రణోర్వి నెవ్వని ముఖాంబు రుహామృత మాత్మలోచనో
త్కరములఁ గ్రోలి పార్ధ విశిఖ ప్రకర క్షత పూత గాత్రులై
గురుతర మోక్ష ధామమునకుం జని సౌఖ్యము నొందిరో గదా!”]
కురునృపపాండునందలకుంఠితబాహుబలాఢ్యులెన్ననే
రిప్లయితొలగించండియరమరలేకఁబిల్వుమిటవారిని వారిదివారికివ్వుమో
కరిపురనాథ;యుద్ధమునుగోరుట సేమముగాదుచూడగన్
గురుకులసార్వభౌమ;యిటకూర్మినిగూర్చుముగావుమెల్లరన్
కురునృప|పాండునందనులకుం ఠీతధీక్షయె ధర్మ మార్గమై
రిప్లయితొలగించండిజరిగెడి యుద్ధ తంత్రమున జన్మకు సార్థక మబ్బు వారికిన్
చరితకు సాక్ష్యమై నిలచు |సద్గుణ సారముసాగుచుండ|యే
మరువకభాగమివ్వుటయె మంచి దటంచునుదెల్పె కృష్ణుడే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి కవిమిత్రులకు నమస్కరిస్తూ ::
రిప్లయితొలగించండికురునృప పా౦డున౦దను లకు౦ఠిత
ధర్మపరుల్ ,పరాక్రమ.
స్థిరులు, శా౦తశూరులు ,విశేషముగా :-
నతిదీనచిత్తులై
కరములు చాచి మా కయిదు గ్రామము
లిచ్చిన చాలన౦గ. స౦
గరమున కుత్సహి౦చ తగునా?
మన నిమ్ము సుఖాన వారలన్
...........
.
.
్థరు
శా౦తశూరులు , విశేషముగా :-ి
్
కురునృప పాండు నందను లకుంఠిత దీక్షను బూని కానలన్
రిప్లయితొలగించండిదిరుగుచు ఖేద మొందకనె ధీరత నొందుచు ధౌమ్యు బోధలన్
విరియగ నస్త్ర శాస్త్రముల వేలుగ నేర్చిరి వీరు లేయనన్
కరుణను వారి భాగమును కాదన కిచ్చిన న్యాయ మందురే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి(1)
కురునృప! పాండునందను లకుంఠిత శౌర్య సుధీ బలాఢ్యులై
నిరుపమ యుద్ధనైపుణిని నీదు సుత ప్రకరమ్ములన్ వడిన్
గరము దురంత దుఃఖ మిడు కయ్యము నందునఁ గూల్చుచుండఁగన్
ద్వరితగతిన్ యమున్ దమకు దాఁపునఁ గాంతు రధర్మవర్తనుల్ !!
(2)
కురునృప! పాండునందను లకుంఠిత సత్యపరాక్ర మోన్నతుల్
దురమునఁ గృష్ణు సాయమున దుర్జనులౌ భవదీయ సూనులన్
వరుసగఁ జంపఁ బూని యమ బాధలఁ ద్రోయుచుఁ గాలు పాలికిన్
దరుమగ, నీకుఁ దోడెవఁ? డధర్మ నిఘృష్వము వీడు మిమ్మెయిన్ !
.
కురునృప! పాండునందను లకుంఠిత భక్తిని వాసుదేవునే
రిప్లయితొలగించండినిరతము నమ్మియుండిరిక నీ సుతులో తుదిలేని వంచనల్
గరువము కండకావరము కల్మషమున్ నెర నమ్మి యుంటచే
పరువును మాసి నీల్గిరని పల్కెను సంజయు డయ్యెడన్ సుధీ!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
పోతన పద్యాన్ని చూపినందకు ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కొంత అన్వయలోపం ఉంది. ‘సాగుచుండ(న్)’ ద్రుతాంతం. కొద్ది సవరణతో మీ పద్యం.....
కురునృప! పాండునందను లకుంఠితధీక్షయె ధర్మమార్గమై
జరిగెడి యుద్ధ తంత్రమున జన్మకు సార్థక మబ్బ గెల్వ త
చ్చరితమె సాక్ష్యమై నిలచు! సద్గుణ సారము సాగుచుండ నే
మరకను భాగ మిచ్చుటయె మంచి దటంచును దెల్పె కృష్ణుడే.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదం ప్రారంభంలో గణదోషం. టైపాటు కావచ్చు. ‘స్థిరులును’ అని ఉండాలి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కురునృప! పాండునందను లకుంఠిత నమ్మిక తోడ మీరలు
రిప్లయితొలగించండిన్నిరతము వారిసేమముల నెంచుటచే సగభాగమీయగన్
మరిమరి కోరి దూతగను మమ్ములబంపరి సంధిజేయగన్
సరిపడదన్న నైదుగురు చాలు పురమ్ముల నైదటంచుచున్