తనదు పిల్లల నోటన తల్లి సీత రామ కధ విని మురిసెను, రాక్షసుండు ఆ హిరణ్య కశిపు డు దా ననుమ తించె దనదు కొమరుడు ప్రహ్లాదు దండ జేయ విష్ణు భక్తుడు నగుటన విసుగు జెంది
కవిమిత్రులకు నమస్కృతులు. ఈనాటి సమస్యలో టైపాటువల్ల ‘మురిసెను’... ‘మరిసెను’ అయింది. (మా అక్కయ్యవాళ్ళ గ్రామంలో ఉండి, సెల్‌ఫోన్‌లోని చిన్న కీపాడ్‍లో అక్షరాలు టైపు చెయ్యడానికి ఇబ్బందిపడుతూ, నెట్‍వర్క్ సిగ్నల్స్ సరిగా అందీ అందక సతాయిస్తుంటే ఎలాగో ఈనాటి సమస్యను మాత్రం షెడ్యూల్ చేశాను. పద్యరచన శీర్షికను పోస్ట్ చేయలేకపోయాను). మిత్రులు హెచ్చరిస్తే సవరించాను. ఒకరిద్దరు ‘మరిసెను’ అన్న పదంతో పూరణలు చేసినట్టున్నారు. జరిగిన పొరపాటుకు క్షమించవలసిందిగా అందరికీ మనవి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** జిలేబీ గారూ, “?”.... _/\_ (మీరందించిన భావం అర్థం కాలేదు. మామ ఎవరు? తనను వదలుమని రావణుని వేడుకొన్న తపస్వి ఎవరు? లింక్ ఏమిటి? అన్నీ ప్రశ్నలే!) ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తప్పు+అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పటంచు’ అనండి. ***** వి.యస్. ఆంజేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. అక్కడ ‘మురిసెను’ అన్న పదమే అన్వయానికి కుదురుతున్నది. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘రాక్షసుడగు| నా హిరణ్యకశిపుడు...’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘తనివి తీరగా...’ అనండి. ***** గురుమూర్తి ఆచారి గారూ, నిన్నటి సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు. చివరిపాదంలో గణదోషం.. ‘దురదృష్టహతుండు తినక దుఃఖితు డయ్యెన్’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం : అన్న పరకాంతఁ దెచ్చిన చిన్నబోయి తమ్ముడు విభూషణుండది తప్పటంచు ధర్మ మూర్తిగా రాముని తత్వమరసి రామకథ విని మరిసెను రాక్షసుండు
భూసారపు నర్సయ్య గారూ, ఆంజనేయులు శర్మ గారి పూరణను ప్రశంసించినందుకు ధన్యవాదాలు. మీ వంటి పెద్దలు ఇలా కవిమిత్రుల పద్యాల గుణదోషాలను సమీక్షిస్తే ఇంకా చక్కని పద్యాలు వ్రాయడానికి ఉత్సాహం చూపుతారు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘శింశుపాభూరుహచ్ఛాయ సీత యంత’ అనండి.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిసమస్య
రామకథ విని మురిసెను రాక్ష సుండు అనుకుంటాను
టైపోడు వలన ము రి సె ను బదులు మ రి సె ను అని వుంది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహనుమ పూజించి భజియించు ననవ రతము
రిప్లయితొలగించండిరామకధ విని మురిసెను , రాక్ష సుండు
యుద్ధ మందున నోడించ బద్ధ వైరి
కలలు గాంచును వరమంది గెలువ నెంచి
కడలి తీరాన సంపాతి కపులుచెప్పు
రిప్లయితొలగించండిరామకథ విని మురిసెను;రాక్షసుండు
సీత మనము గెలువ నెంచి చీద రింప
బడుచు మరణించె రణమున పాడి దప్పి.
మామా పద సంహారమున కన
రిప్లయితొలగించండిరామకథ విని మరిసెను; రాక్షసుండు,
తపము జేసికొను నను వదులుము
రావణా అని హిత బోధ జేసెను ఆతనికి !
శుభోదయం
జిలేబి
(మరిసెను - దారి మార్చెను ; దిశ మార్చెను )
రామ గాథను చెప్పగా రాజ్యమందు
రిప్లయితొలగించండినొక్క భృత్యు విభీషణు డూరు బంపె
వాడు రాగము సలుపుచు పాడగాను
రామకథ విని మురిసెను రాక్షసుండు.
రిప్లయితొలగించండిరామలక్ష్మణుల్ సీతతో రాజ్యము విడి
అష్టకష్టముల్ పాలయి యడవి నుండ
రావణుడు,సీతను హరించి లంక నుంచు
రామకథ విని మురిసెను రాక్షసుండు
విభీషణుడు శ్రీరాముని గుణముల గురించి వినడము
రిప్లయితొలగించండి.......
ధీరుఁడనుపమ తేజస్వి శూరుఁడఖిల
ధర్మ శాస్త్రావగాహనోత్తముఁడు జయవి
శేషయుక్తంబుగానుండిశ్రీకరమగు
రామకథ విని మరిసెను రాక్షసుండు
అన్న పరకాంతఁ దెచ్చిన చిన్నబోయి
రిప్లయితొలగించండితమ్ముడు విభూషణుండది తప్పు యనుచు
ధర్మ మూర్తిగా రాముని తత్వమరసి
రామకథ విని మరిసెను రాక్షసుండు
అసుర సభకుఁ దెచ్చిన కపి హనుమ నోట
రిప్లయితొలగించండిరామకథ విని మరిసెను రాక్షసుండు
రావణానుజుఁడు, శరణు రామ పాద
మనుచు రఘురామ సన్నిధి కరిగె నతడు
మరిసెను అనగా దిశను మార్చి అను భావముతో
తొలగించండితనదు పిల్లల నోటన తల్లి సీత
రిప్లయితొలగించండిరామ కధ విని మురిసెను, రాక్షసుండు
ఆ హిరణ్య కశిపు డు దా ననుమ తించె
దనదు కొమరుడు ప్రహ్లాదు దండ జేయ
విష్ణు భక్తుడు నగుటన విసుగు జెంది
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితనివితోడును మారుతి తననుతానె
రిప్లయితొలగించండిరామకథవిని మరిచెను, రాక్షసుండు
ధరణి పుత్రిని చెరబట్టి దర్పమునను
రామచంద్రుని చేతిలో లయమునొందె (మ్రగ్గిపోయె)
కవిమిత్రులకు నమస్కారములతో
రిప్లయితొలగించండినిన్నటి పద్యరచన పంపుచుంటిని.. స్వీకరించవలసిందిగా మనవి..
గురుమూర్తి ఆచారి..
(దురాశా పరుని వరము శాపమగును)
వరమయ్యె శాపమయ్యెను
"పరమేశా ! నేను తాకు ప్రతి వస్తువు బం
గరు కావలె" నని కోరిన
దురాశాపరుడు తినలేక దుఃఖితుడయ్యెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యలో టైపాటువల్ల ‘మురిసెను’... ‘మరిసెను’ అయింది. (మా అక్కయ్యవాళ్ళ గ్రామంలో ఉండి, సెల్‌ఫోన్‌లోని చిన్న కీపాడ్‍లో అక్షరాలు టైపు చెయ్యడానికి ఇబ్బందిపడుతూ, నెట్‍వర్క్ సిగ్నల్స్ సరిగా అందీ అందక సతాయిస్తుంటే ఎలాగో ఈనాటి సమస్యను మాత్రం షెడ్యూల్ చేశాను. పద్యరచన శీర్షికను పోస్ట్ చేయలేకపోయాను). మిత్రులు హెచ్చరిస్తే సవరించాను. ఒకరిద్దరు ‘మరిసెను’ అన్న పదంతో పూరణలు చేసినట్టున్నారు. జరిగిన పొరపాటుకు క్షమించవలసిందిగా అందరికీ మనవి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
“?”.... _/\_ (మీరందించిన భావం అర్థం కాలేదు. మామ ఎవరు? తనను వదలుమని రావణుని వేడుకొన్న తపస్వి ఎవరు? లింక్ ఏమిటి? అన్నీ ప్రశ్నలే!)
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తప్పు+అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పటంచు’ అనండి.
*****
వి.యస్. ఆంజేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కడ ‘మురిసెను’ అన్న పదమే అన్వయానికి కుదురుతున్నది.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రాక్షసుడగు| నా హిరణ్యకశిపుడు...’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తనివి తీరగా...’ అనండి.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
నిన్నటి సమస్యకు మీ పూరణ బాగుంది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం.. ‘దురదృష్టహతుండు తినక దుఃఖితు డయ్యెన్’ అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిఅన్న పరకాంతఁ దెచ్చిన చిన్నబోయి
తమ్ముడు విభూషణుండది తప్పటంచు
ధర్మ మూర్తిగా రాముని తత్వమరసి
రామకథ విని మరిసెను రాక్షసుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిమూడు జన్మల వైరము ముగిసి నంత
త్వరితగతి విష్ణుదేవుని ద్వారమందు
నిలువ గలమను భావంపు దలపు రాగ
రామకథ విని మురిసెను రాక్షసుండు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాలిఁ జంపి సుగ్రీవాది వానరులను
రిప్లయితొలగించండిగూడి జలధి సేతువు సమగూర్చి దాట
సాధు తర భాషణుడు విభీష ణుడు గూర్మి
రామకథ విని మురిసెను రాక్షసుండు.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
రామకథవిని మురిసెను|రాక్షసుండు
రిప్లయితొలగించండిరావణాసుర తమ్ముడే.రాముడనిన
భక్తి సుగ్రీవునకు| తగుయుక్తియందు
వాలివధజేసె రాముడే జాలిదలచి.
నారదుడుఁజెప్ప వాల్మీకినయముమీర
రిప్లయితొలగించండిరామకథవిని మురిసెను;రాక్షసుండు
రావణాసురుచర్యల వ్రాయునపుడు
కలతఁజెందితాకన్నీరుఁగార్చెనేమొ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశింశుఫారుహ ఛాయలో సీతయంత
తొలగించండిపవన సుతుడొనరించెడు పావనమగు
రామకథ విని మురిసెను, రాక్షసుండు
తననపహరించె ననుమాట దాను మరచె
శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
రిప్లయితొలగించండిరామ బాణమునకు తూలి రాలిపోక
బడిన మారీచు డబ్దిని పడగ బోక
నెరిగె రాముని చరిత మసురుల వలన .
రామకథ విని, మురిసెను రాక్షసుండు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
భూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వృక్ష+ఛయ=వృక్షచ్ఛాయ' అవుతుంది. 'రాక్షసుండు+అపహరించిన'అన్నప్పుడు యడాగమం రాదు.
****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులందరికి నమస్కారములు.
రిప్లయితొలగించండిఅందరిపూరణనలుబాగున్నవి.
అంజనేయులుశర్మగారూ..చక్కని అనుభూతినికలుగ జేసినారు.మంచిపూరణ.
భూసారపు నర్సయ్య గారూ,
రిప్లయితొలగించండిఆంజనేయులు శర్మ గారి పూరణను ప్రశంసించినందుకు ధన్యవాదాలు. మీ వంటి పెద్దలు ఇలా కవిమిత్రుల పద్యాల గుణదోషాలను సమీక్షిస్తే ఇంకా చక్కని పద్యాలు వ్రాయడానికి ఉత్సాహం చూపుతారు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘శింశుపాభూరుహచ్ఛాయ సీత యంత’ అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివినయమున రాముఁ జేరి, విభీషణుండు
మిత్రుఁడై భక్తి సేవింప, మిత్రసుతుఁడు
రామకథ నప్డు బహుసుందరముగ వినిచె!
రామకథ విని మురిసెను రాక్షసుండు!!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.