21, సెప్టెంబర్ 2015, సోమవారం

సమస్యా పూరణం - 1795 (రాములందు గొప్ప రాముఁ డతఁడు)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాములందు గొప్ప రాముఁ డతఁడు.
(ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు)

44 కామెంట్‌లు:

 1. తండ్రి పలికి నంత తనరెడు వాడన
  రాములందు గొప్ప రాముఁ డతడు
  రాజ్య పాల నంబు రామరాజ్య మనిరి
  ఇలను లేడ నంగ నినకు లాబ్ధి

  రిప్లయితొలగించండి
 2. ధర్మమూర్తి యనగ ధరణిని పాలించి
  తల్లిదండ్రి మాట తలను దాల్చి
  సూర్యచంద్రులిలను శోభించు దాకను
  రాములందు గొప్ప రాముఁ తడు!
  (రాములు = పరశురాముడు, శ్రీరాముడు మరియు బలరాముడు)

  రిప్లయితొలగించండి
 3. రాములందున బలరాముండు నొక్కడే
  రాములందు పరశరాముడొకడె
  రాములెందరున్న రఘురాము డొక్కడే
  రాములందు గొప్ప రాముడతను!!!

  రిప్లయితొలగించండి
 4. తాటకి ప్రియ సుతుడు తా నిజముగ కను
  బ్రాము లందు గొప్ప రాముడతడు
  చేసె మోసమతడు శ్రీరామచంద్రుని
  జానకిఁజెరపట్టు సమయమందు

  తాటకి ప్రియ సుతుడు తాను నిజముగన
  రాములందు గొప్పరాముడతడు
  లంకరేని కొరకు రాముని వంచించె
  జానకిఁజెరపట్టు సమయమందు
  అరాముః దొంగ, కనుబ్రాముః మోసబుచ్చు, కనుగప్పు

  రిప్లయితొలగించండి

 5. పరశు రాము డొకడు బలరాము డొక్కడు
  వీర్య వంతు లుమఱి ధరణి యందు
  రాజ ! యా ద శరధ రాముడే యెన్నగ
  రాము లందు గొప్ప రాము డతడు

  రిప్లయితొలగించండి
 6. ఇనకులాబ్ధిజుండు నేకపత్నీవ్రతుం
  డెదురులేని వేరుఁడిలను జూడ
  ధర్మమును నెఱపు విధానంబు జూపిన
  రాములందు గొప్ప రాముఁ డతఁడు

  రిప్లయితొలగించండి
 7. గురువుగారికి నమస్కారం. నా పూరణ పంపుచున్నాను. తప్పులుంటే మన్నించండి.
  యమున దారి తిప్పె యదుకుల పాలుడు
  భాను వులను దునిమె భార్గ వుండు
  ధర్మ మెతన యాయు ధముగ దిరిగిన వాడగు
  రాము లందు గొప్ప రాము డతడు

  రిప్లయితొలగించండి
 8. ప్రజలు మెచ్చునట్టి పాలకుండాతడు
  సత్య ధర్మ వ్రతుడు సద్గుణుండు
  దశరధాత్మజుండు దాశరథి యొకడే
  రాము లందు గొప్ప రాముఁడతడు!!!

  రిప్లయితొలగించండి
 9. బామమునకు వశులు బలరాముడు,మరియు
  పరశురాము కన్న నరయ భువిని
  సత్య ధర్మ యుతుడు సాకేత రాముడు
  రాము లందు గొప్ప రాముఁడతడు!!!


  బామము = కోపము

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. కల్ప మందు మిగుల ఖ్యాతి నొందిన బల
   రాము కన్న పరశు రాము కన్న
   దశరథాత్మ జుండు ధరణిలో వెలసిన
   రాములందు గొప్ప రాముడతడు

   తొలగించండి
 11. లలితకావ్యవీథిచలితజనమనోభి
  రాములందు గొప్ప రాముఁ డతడు
  తెలుగుకైత కింపు తెన్నాలి రాముండు
  భవ్యమైన కృతిని పరగ జేసె

  రిప్లయితొలగించండి
 12. రాముడు పేరుతో తారకరాముని సినిమాలు చాలా ఉన్నాయని గుర్తొచ్చి సరదాగా ఈ పూరణ ప్రయత్నించాను. తప్పులుంటే మన్నించగలరు.

  అడవి రాము డైన, యగ్గి యయిన
  రాము డుమరి పిడుగు, రౌడి, బండ
  గాని, మేలు నటన గరపగ పలునట
  రాములందు గొప్ప రాముడితడు

  రిప్లయితొలగించండి
 13. పరసు రాము డంత పడతిఁ దల్లినిఁ జంపె
  మదమున పరసతుల మరగెను బల
  రాముడిట దశరధ రాముడు గుణరాశి
  రాములందు గొప్ప రాముఁ డతఁడు.

  రిప్లయితొలగించండి
 14. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఇనకులమణి’ అనండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘తలను దాల్చె’ అనండి. అన్వయం కుదురుతుంది.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  రెండు విధాలుగా వ్రాసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వేదుల సుభద్ర గారూ,
  మీ ప్రయత్నం ప్రశసనీయం. అభినందనలు.
  ‘భానువు’ శబ్దానికి సూర్యుడు, కిరణం అనే అర్థాలున్నాయి. అవి ఇక్కడ అన్వయించడం లేదు. ‘భూమిపతుల జంపె...’ అనండి. మూడవపాదం చివర గణదోషం. ‘ధర్మమె తన యాయుధముగ నెంచినవాడు’ అనండి.
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘దశరథాత్మజుండు’ అన్నా ‘దాశరథి’ అన్నా ఒకటే కదా! ‘తరణివంశజుండు దాశరథి...’ అనండి.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘...రాము కన్న పరశురాము కన్న...’ అనండి. (రాముఁ గన్న అంటే రాముని కన్నట్టి అనే అర్థం వస్తుంది).
  *****
  రవి గారూ,
  బహుకాల దర్శనం... సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  బలరాముడు పరసతులకు మరిగినట్లు ఎక్కడా వినలేదు.

  రిప్లయితొలగించండి
 15. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

  ధర్మమూర్తి యనగ ధరణిని పాలించి
  తల్లిదండ్రి మాట తలను దాల్చె
  సూర్యచంద్రులిలను శోభించు దాకను
  రాములందు గొప్ప రాముఁ డతఁడు

  రిప్లయితొలగించండి
 16. శ్రీగురుభ్యోనమః

  పరమశివుని గ్లిచె పరశురాముడు తాను
  పరమశివుడు గొలిచె పరవశమున
  రామ తారకమును, రమ్యము జూడగా
  రాములందు గొప్ప రాముఁ డతఁడు

  రిప్లయితొలగించండి
 17. నింగిసిగనుపువ్వు నిమ్మని భీష్మించ
  కైక యద్దమందు కాన నిచ్చె
  బువ్వ తినెను చూడు బుద్ధిగా బాల మా-
  రాములందు గొప్ప రాముడతడు.

  రిప్లయితొలగించండి
 18. టైపాటు సవరించి

  పరమశివుని గొలచె పరశురాముడు తాను,
  పరమశివుడు గొలిచె పరవశమున
  రామ తారకమును, రమ్యము జూడగా
  రాములందు గొప్ప రాముఁ డతఁడు

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. ఆత్మ గౌరవమ్ము యణగారి యుండగ
  అన్న నందమూరి అడుగు లేసి
  తెలుగు వారి బలము తెలియంగ జేసిన
  రాములందు గొప్ప రాముఁ డతఁడు.

  రామ పాత్ర వేసి రావణు జంపును
  రాము దతడె తానె రావణుండు
  అన్ని పాత్రలందు అతడి కతడెసాటి
  రాములందు గొప్ప రాముఁ డతఁడు.

  రిప్లయితొలగించండి
 21. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘గౌరవమ్ము+అణగారి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఆత్మగౌరవ మది యణగారి...’ అందామా?

  రిప్లయితొలగించండి
 22. పొరపాటు సవరించిన పూరణ ఇది గురువుగారు..
  1.యమున గతిని తిప్పె యదుకుల పాలుడు
  భూమి పతుల జంపె భార్గవుండు
  ధర్మ మెతన యాయుధ ముగనెం చినవాడు
  రాములందు గొప్ప రాముడతడు
  ఇది మరొక ప్రయత్నము:
  ఒక్క మాట నెపుడు యొక్కటె బాణము
  ఒక్క భామ తోడె యొప్పు ననుచు
  నీతి కీర్తు లెతన నీడగను నిలవగా
  రాములందు గొప్పరాముడతడు

  రిప్లయితొలగించండి
 23. వేదుల సుభద్ర గారూ,
  సవరించిన మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. సుభద్ర గారూ, మీ రెండవపద్యం మొదటి పాదంలో దోషం ఉంది. దానిని శంకరయ్యగారు చూడలేదనుకుంటా

  ఒక్కమాటనెపుడు యొక్కటె బాణము అన్నారు కదా ఎపుడు అనేది ఉకారాంతపదం దానిపక్కన యొక్కటి అని యడాగమం రాకూడదు. ఎప్పుడునొక్కటి అనండి సరిపోతుంది.
  అలాగే మూడోపాదంలో గణదోషం, నీడగ, లేదా నీడను నిలువగా అంటే సరి నీడగను అంటే దోషం.

  రిప్లయితొలగించండి
 25. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరు ఆ మాట అంటారని అనుకున్నాను. పోతనామాత్యుని ఆంధ్ర మహాభాగవతము లో దశమ స్కంధము ఉత్తర భాగము లో ఉంటుంది ఈ ఘట్టము.

  రిప్లయితొలగించండి
 26. తండ్రి మాట నిలుప దనయు డేగెను గదా
  అడవి బాట పట్టె అవని సుతతొ
  ధర్మమార్గ నిరతి దైవ భావముగను
  రాములందు గొప్ప రాము డితడు

  రిప్లయితొలగించండి
 27. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  కోడి రామ మూర్తి కోస్తాంధ్రలో గొప్ప
  భీముడనగ పొందె పేరు నటులె
  వీరుడనగ బఱగు విఖ్యాతుడల్లూరి
  రాములందు గొప్ప రాముఁ డతఁడు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  కోడి రామ మూర్తి కోస్తాంధ్రలో గొప్ప
  భీముడనగ పొందె పేరు నటులె
  వీరుడనగ బఱగు విఖ్యాతుడల్లూరి
  రాములందు గొప్ప రాముఁ డతఁడు.

  రిప్లయితొలగించండి
 29. 1.ఆ.వె:తండ్రి మాట మేర తల్లిని వధియించి
  ప్రతిథి పొందె నతడు వసుధ యందు
  ప్రభువు లంద రినిల పరిమార్చె నీతడు
  రాము లందు గొప్ప రాము డితడు.
  2.ఆ.వె:రోహిణీసుతుడౌచు రూఢిలో జనియించి
  కృష్ణు సోదరుడని కీర్తి బడసె
  తాను పెద్ద యైన తమ్ముడే గొప్పంచు
  రాము లందు గొప్ప రాము డతడు.
  3.ఆ.వె: తండ్రి మాట కొరకు తరుణితో వెడలెను
  దశరథతనయుండు ధాత్రిలోన
  రాజు లందు తానురాజసాన వెలుగొందె
  రాములందు గొప్ప రాము డతడు.

  రిప్లయితొలగించండి
 30. భూసారపు నర్సయ్య గారి పూరణ..

  ఆదిదైవమైన నా రామునందున
  నవతరించి తిరిగి యంతమౌదు
  రంతటఁ గనఁబడు నసలైన రాముడు
  రాములందు గొప్ప రాముఁ డతఁడు.

  రిప్లయితొలగించండి
 31. శ్రీఆదిభట్ల కామేశ్వర రావు గారూ,
  సుభద్ర గారి పద్యంలో నేను గమనించని దోషాలను పేర్కొని సవరణలను సూచించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  అవునా? ఇది నాకు తెలియని విషయం. ప్రస్తుతం నేను మూడవ స్కంధము పద్యభావాలు వ్రాస్తున్నాను. తెలియజేసినందుకు ధన్యవాదాలు.
  *****
  లక్ష్మణ మూర్తి గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సుతతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వాంతంగా వ్రాసారు. ‘అవనిజాతతోడ నడవి కేగె’ అందామా?
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరు ఉమాదేవి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  రెండవపూరణలో ‘రోహిణి సుతు డౌచు’ అనండి.
  మూడవ పూరణ మూడవ పాదంలో గణదోషం. ‘రాజసమ్మున వెల్గె’ అనండి.

  రిప్లయితొలగించండి
 32. భూసారపు నర్సయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. మిత్రులందఱకు నమస్సులు!

  ఒక సతి యొక మాట యొక బాణ నినదుఁడై
  యుండుఁ గాని యొండు నువిదఁ గనఁడు;
  రమణిఁ జెఱనుఁ బెట్టు రావణా దీంద్రియా

  రాములందు గొప్ప రాముఁ డతఁడు!

  రిప్లయితొలగించండి
 34. నా రెండవ పూరణము:

  పరశురాముఁడు, మఱి, బలరాముఁడైనచో
  జననిఁ జంపువాఁడె! యని విముఖుఁడె!
  మాతృహంత క్షాత్రమార్గోత్సృజులగు నా

  రాములందు గొప్ప రాముఁ డతఁడు!!

  రిప్లయితొలగించండి
 35. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 36. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మహోత్కృష్ట మైన పని కి పూనుకున్నారు. సంతోషకర మైన విషయము చెప్పారు.

  రిప్లయితొలగించండి
 37. విద్వాన్,డాక్టర్,మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు 7396564549
  *********==========888888**********==========
  రాము లెంద రైన రామతత్వ మొకటె ;
  ధర్మ నాశు లైన దనుజ తతిని ,
  అంత మొంద జేయు ఆరఘు రాముడే
  రాము లందు గొప్ప రాముడతడు .

  రిప్లయితొలగించండి
 38. విద్వాన్,డాక్టర్,మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు 7396564549
  *********==========888888**********==========
  రాము లెంద రైన రామతత్వ మొకటె ;
  ధర్మ నాశు లైన దనుజ తతిని ,
  అంత మొంద జేయు ఆరఘు రాముడే
  రాము లందు గొప్ప రాముడతడు .

  రిప్లయితొలగించండి
 39. ఆదిదైవమైనయారామునందున
  నవతరించి తిరిగియంతమౌదు
  రంతటనుగనపడునసలైనరాముడు
  రాములందుగొప్పరాముడితడు.

  రిప్లయితొలగించండి
 40. డా. మూలె రామముని రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి