3, సెప్టెంబర్ 2015, గురువారం

సమస్యాపూరణ - 1778 (చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.
(వావిళ్ళ వారి ‘తెలుఁగు సమస్యలు’ గ్రంథంనుండి)

50 కామెంట్‌లు:

 1. గట్రా చూలియె దలచిన
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్
  పేట్రేగిన సతి తోడను
  కాట్రేఁడున కైనగాని కాదట వశమౌ

  కాట్రేఁడు = శివుడు

  రిప్లయితొలగించండి

 2. శ్రీగురుభ్యోనమ:

  తొట్రున కన్నప్పయె తను
  నిట్రిల్లుచు బక్తి గల్గి నేత్రము లిడుచున్
  రాట్రాట్టీ శివుడేనని
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.

  రిప్లయితొలగించండి
 3. ఆ ట్రీ వేపయె స్వీటగు
  నే ట్రైజేసిన కవితయె నిలుచును, నా పో
  యెట్రీనె మెచ్చు లోకము
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్!!

  రిప్లయితొలగించండి
 4. పెట్రేగి పోయె నొక్కడు
  తిట్రాని పలుకుల బూతు తిట్లను తిట్టన్
  సాట్రాని తిట్లు విన్నను
  చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్

  రిప్లయితొలగించండి
 5. అజ్ఞాతకవి పూరణ (వావిళ్ళవారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథంనుండి).....

  ఇట్రార యుక్తి చెప్పెద
  పట్రా యిది తాటిమట్ట పదిలముతోడన్
  కొట్రా నీ భుజశక్తిని
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.

  రిప్లయితొలగించండి
 6. నేదునూరి రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. పెట్రోలు ధరలు మండగ
  నిట్రాటను గట్టి ప్రభుత నిలువున జీల్చన్
  మెట్రో రైలును గాంచిన
  చట్రాతిని నారఁదీయఁ జయ్యన వచ్చున్

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  (అభినవ శకారుని కోఁతలు)

  "ఏట్రా! ధీరుఁడ నేనే!
  కోట్రెడ్డికిఁ దాఁటఁ దీతుఁ! గోటి బలుండన్!
  మాట్రో! వినుమిది, నాకున్
  జట్రాతిని నారఁదీయఁ జయ్యన వచ్చున్!"

  రిప్లయితొలగించండి
 10. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. నా మఱొక పూరణము:

  (అభినవ శకారుని కోఁతలు)

  "గట్రాచూలికి మఱియున్
  గాట్రేనికిఁ బెండ్లి జరిపి ఘనునైతినిరా!
  తోట్రాముఁ డన్న నాకున్
  జట్రాతిని నారఁదీయఁ జయ్యన వచ్చున్!"

  రిప్లయితొలగించండి
 12. శ్రీగురుభ్యోనమ:

  ఒక ఉపాధ్యాయుడు మొండి విద్యార్థితో

  కొట్రాదని చట్టము కద
  యిట్రమ్మన్నను పలుకవు హీనుడవకటా
  యెట్రా నీతో నేగుట
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.

  రిప్లయితొలగించండి
 13. కవిమిత్రులు శ్రీపతిశాస్త్రిగారూ,
  మీ పూరణము చమత్కార జనకముగ నున్నది. అభినందనలు.
  మూఁడవపాదమున "వేఁగుట" ననఁగలరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. సాట్రాని పిసిని గొట్టుని
  భట్రాజులు పొగడినంత పరవశు డౌతున్
  పట్రాయని దానమొసగ
  చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. సాట్రాని పిసిని గొట్టుని
   భట్రాజులు పొగడినంత పరవశు డగుచున్
   పట్రాయని దానమొసగ
   చట్రాతిని నారతదీయ జయ్యన వచ్చున్

   తొలగించండి

 16. శ్రీ మధుసూధన్ గారికి నమస్సులు.

  కొట్రాదని చట్టము కద
  యిట్రమ్మన్నను పలుకవు హీనుడవకటా
  యెట్రా నీతో వేగుట
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.

  అరసున్న టైప్ చేయలేకపోతున్నాను. కాపి చేసి పోస్ట్ చేసేందుకు కూడా కాలేదు. చక్కని సవరణ సూచించినారు. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి

 17. గట్రా చూలిగ దలతును
  చట్రాతిని, నారదీయ జయ్యన వచ్చు
  న్మట్టను జీల్చిన పిమ్మట
  బిట్టుగ మఱి శక్తి కొలది పీకుచు దానిన్

  రిప్లయితొలగించండి
 18. ఆర్యులు శంకరయ్య గారికి , ఇందు పాల్గొను కవీంద్రులకు నా వినయ పూర్వక నమస్కృతులు.
  నా పేరు పోచిరాజు కామేశ్వర రావు, సుబ్బారావు గారి సహోదరున్ని.
  నా పూరణ: సరిగా టైప్ రాకపోవడం వలన “ర్ర” పడింది.
  పేట్రేగు వరలు పోతును
  పట్రా యిటు దుడ్డుకర్ర పదునుగ పట్టిం
  గొట్రా వీని మదమడుగ
  చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్.

  రిప్లయితొలగించండి
 19. ఆర్యులు శంకరయ్య గారికి , ఇందు పాల్గొను కవీంద్రులకు నా వినయ పూర్వక నమస్కృతులు.
  నా పేరు పోచిరాజు కామేశ్వర రావు, సుబ్బారావు గారి సహోదరున్ని.
  నా పూరణ: సరిగా టైప్ రాకపోవడం వలన “ర్ర” పడింది.
  పేట్రేగు వరలు పోతును
  పట్రా యిటు దుడ్డుకర్ర పదునుగ పట్టిం
  గొట్రా వీని మదమడుగ
  చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్.

  రిప్లయితొలగించండి
 20. నిట్రాటు గుడిసె నేయగ
  పట్రారా తాటి మట్ట బావా! నిటకున్
  కాట్రేనికి దయకలిగిన
  చట్రాతిన నారదీయ జయ్యన వచ్చున్!!!

  రిప్లయితొలగించండి
 21. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పరవశు డగుచున్’ అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. ఈ ట్రా ప్రాసస్థానము
  మిట్రాతిగజేసె; దీనినిన్ పూరింపన్
  తొట్రయ్యె; ఇంతలోనన్
  చట్రాతిని నారదీయ చయ్యన వచ్చున్

  రిప్లయితొలగించండి
 23. పై పూరణ లో చిన్న లోపము వలన నా పూరణని మరల పంపుచుంటిని

  ఈ ట్రాప్రాస స్థానము
  నిట్రాతిగజేసె; దీనినిన్ పూరింపన్
  తొట్రయ్యె; ఇంతలోనన్
  చట్రాతిని నారదీయ చయ్యన వచ్చున్

  రిప్లయితొలగించండి
 24. తట్రది యెకండట నగా
  నట్రా చేయగఁ దలంచి నైపుణ్యమునన్
  చట్రమున బెట్టి బంగరు
  చట్రాతిని , నారఁ దీయఁ జయ్యన వచ్చున్!

  ఆభరణములు చేయడానికి సన్నని పోగులుగా
  బంగరు ముద్దను (రాతిని) తట్రది( బంగారు పనిచేసెడు వారు) తీయ నెంచి బంగరు రాతిని చట్రములో పెట్టి తీశాడను భావం.

  రిప్లయితొలగించండి
 25. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

  ఇట్రార యిక్క డుంటిని
  చట్రాతిని; నారఁ దీయఁ జయ్యన వచ్చున్
  పట్రా గట్టిగఁ గొమ్మను
  నిట్రాడుగఁ బనికివచ్చు నిలుపగ గుడిసెన్.

  రిప్లయితొలగించండి
 26. గురుమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. పెట్రోలు బోసి కాల్చిన
  చట్రోలే బూడిదయిన సమయము నందే
  కుట్రలు మానగ దుష్టుడు
  చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్|

  రిప్లయితొలగించండి

 28. పెట్రోల్ బావియె గలదట
  చట్రాతిని నార దీయ జయ్యన వచ్చున్
  బేట్రాయి స్వామి కృపకై
  కొట్రా టెంకాయ లింక కోర్కెలు దీరన్

  రిప్లయితొలగించండి
 29. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  గట్రాచూలియె కోరగ
  నట్రాజుని నంటు భటులు నాడెడు రీతిన్
  పట్రాయుని గాన సభను
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.

  రిప్లయితొలగించండి
 30. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఇసుక నుండి కూడా తైలం తీయగలిగిన
  దైవచింత, పాపభీతి లేని నేటి నేతలు
  చట్రాయి నుండి ఒక్క నారేమిటి ఏదైనా తియ్యగలరు గదా :

  01)
  __________________________________

  గట్రాచూలికి జడువక
  కుట్రలు,మోసముల తోడ - కుహనావాదుల్
  నిట్రాటల వలె నిలచుచు
  చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్
  __________________________________

  గట్రాచూలి = పార్వతి (దైవము )
  కుహనా = అర్థాపేక్షచేతనగు కపటచర్య.
  నిట్రాట = కంబము, కొట్టము కట్టుబడిలో మధ్య వేయు నిలువుగుంజ
  (సుస్థిరముగా పదవులు పట్టుకొని )

  రిప్లయితొలగించండి
 31. దైవ కృప ఉండాలే గాని - ఏదసాధ్యం

  02)
  __________________________________

  గట్రాచూలి కృప గలుగ ,
  మెట్రో రైలదె నడచును - మేఘముల పయిన్
  పెట్రోలే లేకుండగ ;
  చట్రాతిని నారఁ దీయఁ - జయ్యన వచ్చున్ !
  __________________________________
  మెట్రో రైలు = వాహనము
  పెట్రోలు = ఇంధనము

  రిప్లయితొలగించండి
 32. జుట్రాలుట ,తిరుపతివెం
  కట్ర్రాజునిజూడకుండగడపుట, యిట పా
  క్కుట్రల నాపుట కంటెన్
  చట్రాతిని నారదీయ జయ్యన వచ్చున్ !

  ( పాక్కుట్రల = పాకిస్తాన్ కుట్రల)


  రిప్లయితొలగించండి
 33. నెట్ రానప్పుడు - నార తీస్తే మంచిదే గదా :

  03)
  __________________________________

  నెట్రాని సమయ మందున
  జుట్రాలగ పీకి , పిచ్చి - జూచుట కన్నా
  కొట్రా మట్లను గట్టిగ
  చట్రాతిని, నారఁ దీయఁ - జయ్యన వచ్చున్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 34. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. ఏంట్రా చూచెద వటులను
  పట్రారా గోగులిటకు వలుచుటకై వెం
  కట్రావును పిలువుజతగ
  చట్రాతిన నారదీయఁ జయ్యన వచ్చున్

  రిప్లయితొలగించండి
 36. శంకరార్యా ! ధన్యవాదములు !

  గాడిదలు కాసే వాడిని పొగడ మంటే - భట్రాజులు :

  04)
  __________________________________

  భట్రాజులె యిట్లందురు
  "కాట్రేనిని మించి తీవు - గార్థభ రాజా
  నట్రాజే వెనుకాడిన;
  చట్రాతిని నారఁ దీయఁ - జయ్యన వచ్చున్ "!
  __________________________________

  రిప్లయితొలగించండి
 37. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో ప్రాస తప్పింది. ఈనాటి ‘ట్ర’ ప్రాస కారణంగా కొందరు మిత్రులు వ్యావహారిక, గ్రామ్య శబ్దాలను ప్రయోగించారు కనుక మీరు అక్కడ ‘ఏట్రా’ అనవచ్చు.
  *****
  వసంత కిశోర్ గారూ,
  మీ నాల్గవ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 38. ఒక కోతలరాయుని కోతలు :

  05)
  __________________________________

  కాట్రావుల పల్లె నొకడు
  పేట్రేగెను వింత వింత - ప్రేలాపనతో
  "కుట్రల్, కుయుక్తి సేయక
  చట్రాతిని, నారఁ దీయఁ - జయ్యన వచ్చున్ "!
  __________________________________

  రిప్లయితొలగించండి
 39. వసంత కిశోర్ గారూ,
  మీ ఐదవ పూరణ బాగున్నది. అభినందనలు.
  పైన ‘మీ మూడు పూరణలు బాగున్నవి’ అన్నప్పుడు మీ పేరు టైప్ చేయడం మరిచిపోయాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 40. ఆ కోతలరాయుణ్ణి సవాలు చేసిన చండీదాసు :

  06)
  __________________________________

  తుట్రకు ప్రక్కన నిలచిన
  చట్రాతిని చూపించుచు - చండీ దాసే
  "ఇట్రా ! యేవిధి జూపుము
  చట్రాతిని నారఁ దీయఁ - జయ్యన వచ్చున్ "!
  __________________________________
  తుట్ర = ఊడ్చిన కుప్ప

  రిప్లయితొలగించండి
 41. శంకరార్యా ! మరియొక మారు ధన్యవాదములు !

  మరచి పోయారంటే - నేను మీ మనసులో ఉండిపోయానన్న మాట

  రిప్లయితొలగించండి
 42. శ్రీకృషుణ్ణి బంధించమంటే చట్రాతిని నార దియ్యడమే :

  07)
  __________________________________

  పుట్రేపిళ్ళిన శకునియె
  కుట్రను బంధించ నెంచి - గోపాలకునిన్
  పేట్రేగిన రాజు దరమె ?
  "చట్రాతిని నారఁ దీయఁ - జయ్యన వచ్చున్ " ???
  __________________________________
  పుట్రేపిళ్లు = చెడ్డకు ప్రేరేపించుటలు

  రిప్లయితొలగించండి
 43. మేట్రెను దిట్టెననుచు నీ
  వా' ట్రీ'బట్టుకు దురుగుచు వదురుచు నున్నన్
  యా'ట్రే'లోటీ కాదిక
  చట్రాతిని నార దీయ జయ్యన వచ్చున్?

  రిప్లయితొలగించండి
 44. వసంత కిశోర్ గారూ,
  మీ ఆరవ, ఏడవ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి


 45. కోట్రెడ్డి నానబెట్టెను
  వేట్రాయని వాగులోన వాటెడు గోగున్
  పేట్రేగి లాగి బాదిన
  చట్రాతిని, నారఁ దీయఁ జయ్యన వచ్చున్.  రిప్లయితొలగించండి