29, సెప్టెంబర్ 2015, మంగళవారం

సమస్యాపూరణం - 1802 (ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

29 కామెంట్‌లు:

 1. నటనము జేయక గనుడీ
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా
  చిటిచిటి పిల్లల కొఱకట
  అటునిటు పరుగిడెడు బొమ్మ లాట లనంగా

  రిప్లయితొలగించండి
 2. గురువు గారికీ కవిమిత్రులకు ప్రణామములతో ఈనాటి నా పూరణలు తప్పులుంటే మన్నిస్తారని విన్నవించుకుంటూ.....

  1.
  అటకెక్కిన చదరంగపు
  పటాలమును కోరినంత బావయె తెలిపెన్
  భటులును పావులు లేవొక
  ఘటమున నేనుగుల మంద గలదు ముకుందా.

  2.
  చిటపట లాడకు సోదర
  కటువుగ మాటాడ బోకు కలమున్నదిగా!
  పటమున చిత్రించితి గను
  ఘటమున నేనుగుల మంద గలదు ముకుందా!

  3.
  పటిమగల వారు నేడు వి
  రటుని కొలువు జేరిరంట రాజస మేవీ
  డుటగన విధినే మందుము
  ఘటమున నేనుగులమంద గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 3. తనవారెందరున్నా కాపాడు వాడు శ్రీహరే అంటూ మొర పెడుతున్న గజేంద్రుడు.
  కం:అటమట చెందుచు నుంటిని
  కటకట పడుచును మురహరి కావుము స్వామీ
  తటపట లాడక,నచ్చో
  ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందఱకు నమస్సులు!

  నటనల సూత్రముఁ దాలిచి
  యటమట మెది లేక జనుల కానంద మిడన్
  దిటవుఁ గను నీ జఠరమను
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీగురుభ్యోనమః

  అటు గాంచుము పరికించుము
  వటవృక్షపు ప్రక్కలోన వంకను గీచెన్
  పటమున నొక చోటను ఘన
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 7. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 8. నట రాజు ప్రతిమ యుండెను
  ఘటమున, నేనుగుల గుంపు గలదు ముకుందా !
  యటవీ ప్రాంతపు హద్దుల
  జటిలంబగు మార్గమగుట జనగన శక్యమే

  రిప్లయితొలగించండి
 9. పాండవులు విరాట రాజు కొలువు లో ఉన్న సందర్భము:

  పటుతర బాహుపరాక్రమ
  ఘటికులు దివ్యాస్త్ర శస్త్ర ఘనులు నరేభు
  ల్లట విర టు నిల్లు జనిరట
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 10. గురువుగారికి నమస్కారం. అటూ ఇటూ మరి ఏ ఇతర ఆలోచనలు లేకుండా, మితమనేది తెలియక ఎప్పుడూ తినడమే పనిగా ఉండేవారి శరీరములో యేనుగులగుంపు ఉండునేమో, అందుకే అంత అతిగా తింటారన్న భావనలో రాశాను. భావము సరికాకున్నా, పద్యములో దోషములున్నా మన్నించి తప్పులు తెలియచేయగలరు.

  అటునిటు తలచక, మితమన
  నిటులుం డుననియు నెరుగక నాబగ నెపుడూ
  పటపట భుజించు యాకలి
  ఘటమున నేనుగులగుంపుగలదు ముకుందా

  రిప్లయితొలగించండి
 11. అటు జూడుము కురుసేనల
  ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా!
  కటకముల నడుమ రథమును
  ఘటిల్ల చేయుమని పల్కె గాండీవి వెసన్

  రిప్లయితొలగించండి
 12. ఇటునటు తిరుగుచు చూచెద
  వటవిని కనరాక నీవు హస్తుల కొరకై
  వటవృక్షపు దాపున నొక
  ఘటమున నేనుగులగుంపు కలదు ముకుందా!

  (ఘటము = పాడుపడిన నుయ్యి)

  రిప్లయితొలగించండి
 13. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరిపాదంలో గణదోషం. ‘జన శక్యంబే’ అనండి.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  వేదుల సుభద్ర గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ...
  అటునిటు తలచక, మితమన
  నిటులుండు ననియు నెరుగక నెప్పుడు నాబన్
  పటపట భుజించు నాకలి
  ఘటమున నేనుగులగుంపుగలదు ముకుందా.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. నటనలు చాలించుము భూ
  పటలము నీ కుక్షి నుండ పద్మాక్షుండా!
  అటునిటు చూడకు మరి నీ
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా

  రిప్లయితొలగించండి
 15. శ్రీ ఆంజనేయులు శర్మ గారి పూరణ స్పూర్తితో
  సరదాగా పూరించినది
  (చదరంగపు సెట్టును అడగడానికి వచ్చిన ముకుందుని తో మిత్రుడు )

  అటుకున చదరంగ పటము,
  కిటికి సమీపమున మంత్రి, కిచనున రాజున్
  భటులొంటెలుతురగంబులు,
  ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా !!!

  రిప్లయితొలగించండి
 16. ఘటమగు మనదేహములో
  పటుతర బాధ్యతలు బంచు భగవంతుడిలో
  నిటలాక్షుడు,బ్రహ్మ,హరియు,
  ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా|

  రిప్లయితొలగించండి
 17. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మాండలికంలో అటుకు అంటాము కాని అది 'అటక'. అక్కడ 'అటకను' అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

  కుటిలురు కౌరవ సేనల
  ఘటమున నేనుగుల గుంపు గలదు ముకుందా
  త్రుటిలో గూల్చగ జేయుము
  పటహము నిస్సహణ వాద్య పటిమల, నాచే

  రిప్లయితొలగించండి
 19. గురువుగారు,
  ఈ వ్యాఖ్యను ఇప్పుడే చూస్తున్నాను.
  సత్కవులు, తత్త్వసారం తెల్సినవారు అయిన భూసారపు నర్సయ్య గారి ఆత్మీయ ఆశీర్వాదములు నన్ను ధన్యురాలను చేశాయి. పద్యాలు వ్రాయగలుగుతున్నందుకు ఆధారం గురుదేవులైన మీ అపార కరుణాదృష్టి తప్ప మరేమీ కారణం కాదు. వలదు వలదన్న అనగానే యశోదమ్మే గుర్తుకు వచ్చిందంటే అది నా అదృష్టంగా భావించి వ్రాశాను.
  నమస్కారములతో
  లక్ష్మీదేవి.

  రిప్లయితొలగించండి
 20. గురువుగారు,
  పద్యరచన 1009 నాటి ఆ వ్యాఖ్యను ఇప్పుడే చూస్తున్నాను.
  సత్కవులు, తత్త్వసారం తెల్సినవారు అయిన భూసారపు నర్సయ్య గారి ఆత్మీయ ఆశీర్వాదములు నన్ను ధన్యురాలను చేశాయి. పద్యాలు వ్రాయగలుగుతున్నందుకు ఆధారం గురుదేవులైన మీ అపార కరుణాదృష్టి తప్ప మరేమీ కారణం కాదు. వలదు వలదన్న అనగానే యశోదమ్మే గుర్తుకు వచ్చిందంటే అది నా అదృష్టంగా భావించి వ్రాశాను.
  నమస్కారములతో
  లక్ష్మీదేవి.

  రిప్లయితొలగించండి
 21. కటకటలకుఁ బాలైతిని,
  యెటులైనను నిన్నుఁ జేరనెంతును, గతివై
  కుటిలపుటరులనుఁ ద్రుంచవె,
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  లోని యరివర్గమును గురించి దేవదేవునితో మొఱలిడుట.

  రిప్లయితొలగించండి
 22. శరీరమను ఘటములోని యరివర్గమును గురించి దేవదేవునితో మొఱలిడుట.

  రిప్లయితొలగించండి
 23. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ వ్యాఖ్య నాకు సంతోషాన్ని కలిగించింది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. ఎటుజూచిన నా వారలె
  కఠినమ్ముగఁ జంపలేను!కదిలెద నయ్యా!
  తటపటలుగ పొగరెక్కియు
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  రిప్లయితొలగించండి
 25. తటములు సంద్రములు నదులు
  పటుతరమగు శిలలు గనులు పర్వత శ్రేణుల్
  అటవులు వనములలో నీ
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  ఘటము = శరీరము

  రిప్లయితొలగించండి


 26. వటపత్రశాయి! యవనా
  రి!టముకు వేసిరయ నేడు రెక్కల గుర్రం
  బటనెక్కి చూచినాడను!
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  ఘటము - శిఖరము

  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. పటువుగ దాగుచు కడుపున
  చటుకన దూరుచును రెండు చంకలలోనన్...
  ఇటు చూసిన నటు చూసిన
  ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

  ఘటము = శరీరము

  రిప్లయితొలగించండి