24, సెప్టెంబర్ 2015, గురువారం

సమస్యాపూరణం - 1798

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అన్నదానమ్ము సేయువా రధము లిలను.

నిన్న రాత్రినుండి మూత్రనాళంలోని రాయివల్ల విపరీతమైన నొప్పి. సాధారణంగా ఇంజక్షన్ తీసుకుంటే తగ్గిపోయేది.ఈసారి ఎందుకో తగ్గడం లేదు. చూడాలి... రేపటికి ఎలా ఉంటుందో?
స్వస్థత చేకూరే వరకు 'పద్యరచన' శీర్షిక ఉండదని గమనించ మనవి.

37 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పరుల హింసించి వంచించి సిరులు వొందు
      పాపకర్ములు దుష్టులు స్వార్థ పరులు
      కేలు మోడ్చుచున్ నటియించి కీర్తి కోరి
      యన్న దానమ్ము సేయువారధము లిలను

      తొలగించండి
  2. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'కొరకు+అన్నదాన' మని విసంధిగా వ్రాసారు. అక్కడ 'కీర్తి కోరి| యన్నదానమ్ము' అనండి.

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ ! మీకు త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించుచున్నాను.

    రిప్లయితొలగించండి
  4. నల్ల ధనమును దేశాల ఎల్ల దాటి
    బ్యాంకులందున దాచేడి పాతకుండు
    పల్లె దత్తత యనుపేర పాడు పనులు
    అన్న దానమ్ము సేయువారధము లిలను

    రిప్లయితొలగించండి

  5. సర్వ సౌభాగ్యములతో డ వర్ధిలుదురు
    అన్న దానమ్ము సేయువా ర,ధము లిలను
    బనియు పాటలు లేకుండ బ్రతుకు వారు
    వారు బ్రదుకుట వ్యర్ధము వారి జాక్ష !

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమః

    పేదవారిని పీడించి భిక్షమెత్తి
    పెద్దవారిని మెప్పింప విందులిడుచు
    స్వార్థ పూరితమైనట్టి వాంచ తీర
    యన్నదానమ్ము సేయువా రధము లిలను.

    భిక్షమెత్తి = చందాలు సేకరించి
    పెద్దవారు = నాయకులు లేదా అధికారులు

    గురువుగారి ఆరోగ్యము మెరుగుచెంది స్వస్థత చేకూరాలని కోరుకొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'పనులు అన్నదానము' అని విసంధిగా వ్రాసారు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  8. guruvulu shankarayya gariki namaskaramulato.....

    మూత్ర పిండపు రాళ్ళను మొదట గానె
    తెలిసి కొనుచును గ రగించి తీయ వలయు
    మందు దానికి తెలియుడు ముందు గాను
    ద్రా గ వలయును నీటిని దనివి దీర
    యార్య ! శంకర ! ద్రాగుడు నీరము మఱి
    కరగి పోవును రాళ్లన్ని , కనబ డవిక .

    రిప్లయితొలగించండి
  9. కన్న వారి పట్లన్ కనికరము లేక
    ధనము కొరకని యభిమానధనము వీడి
    బానిస బతుకు బతుకుదౌర్భాగ్యులెల్ల
    రన్న దానమ్ము సేయువారధము లిలను.

    రిప్లయితొలగించండి
  10. అన్న! దానమ్ము చేయువా రధములిలను
    కాదు బడుగువారలకెప్డు కరము తుష్టి
    దానధర్మములఁజలుప తప్పకుండ
    మంచిజరుగును వారల కంచితముగ

    రిప్లయితొలగించండి
  11. కూడు గూడు గుడ్డలు లేక కుములు వారి
    వీడి నొరులకు చందాలు విరివి నీయఁ
    గీర్తి గోరి వదాన్యుల కెల్ల మిన్న
    యన్న, దానమ్ము సేయువా రధము లిలను.

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులకు నమస్సులుః

    తెల్ల యులవల పిండిలో తేనెఁకలిపి
    మూడుసార్లు సేవించిన ముచ్చటగను
    కరిగిపోవును రాళ్ళన్ని ఖచ్చి తముగ
    నేడుదినముల కాలము నెవరికైన
    (ఏ ఉలవలైనా పరవాలేదు. తెల్ల ఉలవలని కేవలం యతికోసం వ్రాశాను)

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి

    ప్యాషను వికృతంపు వేషము దాల్చెను;
    బీరు బ్రాంది రమ్ము విస్కి త్రాపి,
    మటనుకూర్మ నిడుటె మంచి డిన్నరనుచు
    నన్నదానము సేయువా రధము లిలను

    రిప్లయితొలగించండి
  14. కంది శంకరయ్య గారు ! మీరు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ మందుల తో పాటు “Berberis vulgaris – 30 “ 2 doses (4 or 5 pills) వేసు కుంటే గుణము కన్పిస్తుంది. రాళ్ళు కరుగుతాయి.

    రిప్లయితొలగించండి

  16. అన్ని దానమ్ములన్ మిన్న అన్నదాన
    మన్న,దానము సేయువా రధము లిలను
    పాత్ర తెరుగక జేసినన్,పరుల ధనము
    దాన మొనరించి కీర్తిని బడయు వారు

    రిప్లయితొలగించండి
  17. భూరిగావిరాళముఁ దెచ్చి పూట కూళ్ళ
    శాలలో కులజనులకే కూడు యనుచు
    ఆక లనెడు యన్నార్థుల కన్నమిడక
    నన్నదానమ్ము సేయు వా రధము డిలన

    రిప్లయితొలగించండి
  18. పోచిరాజు సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఛందోబద్ధంగా మీ రిచ్చిన సలహా బాగున్నది. అవశ్యం ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా రుగ్మతకు తగిన సూచన ఇచ్చినందుకు ధన్యవాదాలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    సమస్య తేటగీతిలో ఉంటే మీరు ఆటవెలదిలో పూరణ చెప్పారు. భావం బాగుంది. దానిని ఇలా చెప్తే ఎలా ఉంటుందంటారు?
    ప్యాషను వికృత వేషముల సంబరమునంది,
    బీరు బ్రాంది వోడ్కా రమ్ము విస్కి త్రాపి,
    మటనుకూర్మల డిన్నరే మంచి దనుచు
    నన్నదానము సేయువా రధము లిలను.

    నా స్వస్థతను కోరుకున్నందుకు ధన్యవాదాలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులకు నమస్సులు. కొండపిండిమొక్కలను తెప్పించటానికి ప్రయత్నిస్తాను.
    కొండపిండి మొక్కఁగొనివచ్చి వ్రేళ్ళతో
    మంచి నీళ్ళ లోన మరగ కాచి
    చిక్కనైన జలము చక్కగా గొన్నచో
    కరిగిపోవునంద్రు గిరులు కూడ

    రిప్లయితొలగించండి
  20. దానముల నేమి చేసిన ధర్మమగును
    సద్గుణోన్నతులాకలి జాలి దీర్చ
    అన్నదానమ్ము సేయువా రధము లిలను
    దాన మనుమాట నెరుగరు ద్రవ్యమున్న.

    రిప్లయితొలగించండి
  21. కవి మిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి..
    శంకరయ్య గారు ! నా పూరణను సవరించినందుకు ధన్యవాదములు

    నా రెండవ పూరణను స్వీకరించగలరు

    కన్న తల్లిదండ్రుల పైన కరుణ లేక
    కూడువెట్టక పంపించి కొంపనుండి
    మెహరుబాణికై ఈ రీతి నహముతోడ
    నన్న దానము సేయువా రధములిలను

    రిప్లయితొలగించండి
  22. ప్రణామములు గురువుగారు.. ఇప్పుడే బ్లాగ్ చూసాను.. మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  23. దొంగతనమున పరుల సొత్తును గడించి
    స్వార్థములదీర్చుకొనుచు విచారమేది
    లేక యుండి, దొంగలు మీరు గాక యెవ్వ
    రన్న, దానమ్ము సేయువా రధము లిలను

    గురువుగారికి ప్రణామములు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నను గురువుగారు.

    రిప్లయితొలగించండి
  24. నీటి సలివేంద్రములుమాని నేర్పుగాను
    పూట కూళ్ళను బెట్టించి హోట లనుచు
    లాభమాశించు వారిడులక్ష్య మెరిగి
    అన్న|దానమ్ము సేయువారధము లిలను|
    2.అన్న దానంబు నడిగెడి అర్థి లేడు
    విద్య దానంబు కంటెను విలువ లనుచు
    కళ్ళ దానంబు జేయుట కద్దునేడు
    అన్న దానంబు సేయువా రధము లిలను
    దానమన్నది ధర్మాన దాగియుండు|
    3.అన్నదానంబు సేయువారధము లిలను
    అన్నమాట లసత్యమే నాప్తులున్న
    చెట్ల కున్నట్టిదానమే చేర్చకున్న?
    దక్ష తన్నది మనిషికి తరుగుటగును.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ

    కన్నవారికి కడగండ్లు కలుగ జేసి
    భార్య బిడ్డల కష్టాలపాలుజేసి
    గుప్త దాన మొసంగును గొప్పఫలము
    లన్న,దానము సేయువారధములిలను

    రిప్లయితొలగించండి
  26. శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ

    కన్నవారికి కడగండ్లు కలుగ జేసి
    భార్య బిడ్డల కష్టాలపాలుజేసి
    గుప్త దాన మొసంగును గొప్పఫలము
    లన్న,దానము సేయువారధములిలను

    రిప్లయితొలగించండి
  27. నమస్కారములు
    గురువులు త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుతూ దీవించి అక్క

    రిప్లయితొలగించండి
  28. అన్ని దానము లందున మిన్న యయిన
    అన్న దానము జేయంగ నవని యందు
    కోటి యజ్ఞ ఫలమ్ము చేకూరు , కారు
    అన్న దానమ్ము సేయు వారధములిలను!!!

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    తనకు మున్నుఁ బుట్టినవాఁడు తన కెవరగు?
    క్షేమమునుఁ గూర్పఁ గర్ణుండు నేమి సేయు?
    హిత మిడం గీడుఁ జేయువా రెవ్వ రుర్వి?
    నన్న, దానమ్ము సేయు,వా రధము లిలను!

    రిప్లయితొలగించండి
  30. అన్నమోరామచంద్రాయనంచునడుగు
    పేద వారికి యన్నంబు పెట్టకుండ
    ధనము గల్గిన వారికే దగ్గరుండి
    అన్నదానము చేయు వా రధములిలను!

    రిప్లయితొలగించండి
  31. గురుదేవులకు ఆరోగ్యము ప్రసాదించగా భగవంతుని ప్రార్థిస్తూ. ..

    ప్రజల సొమ్మును దోచెడు ప్రతిభఁ దెలిసి
    తిరిగి యధికారమందెడు తృష్ణ తోడ
    ' ఓటు ' పర్వము ముగిసెడు నాటి వరకె
    యన్న దానమ్ము జేయువారధములిలను!

    రిప్లయితొలగించండి
  32. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ధన్యవాదాలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ధన్యవాదాలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. గురువుగారికి నమస్కారం. మీరు తొందరగా కోలుకోవాలని మనసారా కొరుకుంటున్నాను. అరటి దూట తినడం మంచిదని చెప్తారు, వీలుంటే ప్రయత్నించండి.
    ఈ రోజు ఆఫీస్ పని ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటివరకూ పూరణ చేయలేదు. తల్లి తండ్రులకు బ్రతికుండగా సరీయిన భోజనం కూడా పెట్టక, వారు గతించిన పిమ్మట ఘనంగా ఆబ్దికాలను నిర్వహించేవారిని దృష్టిలో పెట్టుకుని నాకు చేతనైన పూరణ చేశాను. తప్పులు చెప్పగలరు.

    తే.గీ కన్న వారుండ గనెపుడు కడుపు నిండ
    కూడు పెట్టక సతతము కుముల బెట్టి
    ఆబ్ది కమ్ముల పేరిట అనయముగను
    అన్న దానము చేయువారధములిలను

    రిప్లయితొలగించండి
  34. వేదుల సుభద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా స్వస్థత కోరుతూ సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి