4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

న్యస్తాక్షరి - 33 (య-తి-ప్రా-స)

అంశము- ఛందోబద్ధ కవిత్వము
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘య - తి - ప్రా - స’ ఉండాలి.

32 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    సరిగె లౌగద యతి, ప్రాస - చందమునకు

    01)
    __________________________________

    యతియె ప్రాణము పద్యము - నల్లుటందు !
    తిలక ముంచుట మరచిన - తీరె యగును
    ప్రాస లేకున్న పద్యంపు - పాదములను !
    సరిగె లౌగద యతి, ప్రాస - చందమునకు !
    __________________________________
    సరిగె = ఆభరణము

    రిప్లయితొలగించు
  2. యతిని విడనాడి వ్రాసిన మతులు బోవు
    తిక్తము గనుండు చదువంగ తిక్క రేగు
    ప్రాణ మైనది ఛందస్సు పద్య మునకు
    సరస వ్యాకృతి నందున సఫల మగును

    రిప్లయితొలగించు
  3. 1.తే.గీ:యతిగ రూపును దాల్చిన యర్జునుండు
    తిరుగు చుండె,మందాకినీ తీరమందు
    ప్రాణమునకు ప్రాణంబైన భామ కొరకు
    సవ్య మైన సమ యమున శౌరి పిలిచె.

    2 .తే.గీ:యముని తోడను పోరాడి యతివ తన ప
    తిని,కనుగవలా కాపాడి దీవెనందె
    ప్రాణములను గొంపోవగ వచ్చి నతడె
    సత్యవంతుని బ్రతికించి చనియె తాను.

    రిప్లయితొలగించు
  4. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యాలు బాగున్నవి కాని, వ్రాయమన్నది ‘ఛందోబద్ధ కవిత్వం’ గురించి.

    రిప్లయితొలగించు
  5. మిత్రులందఱకు నమస్సులు!

    తులుఁ బ్రాసలుఁ బద్యాని కంద మయ్య!
    తిరములై ధారణమునకుఁ దెరువుఁ జూపు!
    ప్రాణమౌ నివి లేకున్నఁ బద్యమునకు
    వ్యమౌ రూప సౌష్ఠవ సరణి యేది?

    రిప్లయితొలగించు
  6. మన్నించండి గురువుగారు మామూలుగా వ్రాశాను.
    ఆ.వె: యతులు ముఖ్యమఖిల పద్య గతుల యందు
    తిరముగా నుండ వలయు యతి ఖచితముగ
    ప్రాస నియమంబె పద్యపు శ్వాస,యన్ని
    సరిగ నున్న నడక ఛంద మౌను.

    రిప్లయితొలగించు
  7. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించు
  8. నిన్నటి సమస్యకు నా పూరణ

    కోట్రెడ్డి నానబెట్టెను
    వేట్రాయని వాగులోన వాటెడు గోగున్
    పేట్రేగి లాగి బాదిన
    చట్రాతిని, నారఁ దీయఁ జయ్యన వచ్చున్.    రిప్లయితొలగించు
  9. శ్రీగురుభ్యోనమ:

    యతికి దండము, కృతులకు యతియె హితము
    తివిచు గణముల పొందిక తీరు దెలిసి
    ప్రాస నియమము బాటించవలసి యుండు
    సహజ ధర్మముల్ చందస్సు శాస్త్రమందు

    రిప్లయితొలగించు
  10. యతియు ప్రాసయె పద్యాని కాద్యమగుచు
    తిరముగానుండు నడకతో పరిఢవిల్లు
    ప్రాణమైనట్టి నివియున్న పద్యరచన
    సరస రసధారయై సాగు చందమందు!!!

    రిప్లయితొలగించు
  11. యముని మెప్పించి సావిత్రి హర్ష మునన
    తిరిగి యిచ్చు నటుల జేసె దీయ నైన
    బ్రాణములు భర్తవి యముని బారి నుండి
    సతులు జేయలే నిదిలేదు జగము నందు

    రిప్లయితొలగించు
  12. యతిని మన్నించి ప్రాసమ్ము నాదరించి
    తిరముగా గణమ్ములఁ బేర్చి సరళ శైలి
    ప్రాపణీయముగాఁ గవిత్వము వచింప
    సమ్మతించి నుతింపరే సరసులెల్ల!

    రిప్లయితొలగించు
  13. యతి నవశ్యమ్ముఁ నిలిపి నయముగ మరి ప్ర
    తి చరణమునఁ దప్పక ప్రాసఁ తిరముకొలుప
    ప్రాణమునుఁ బోసికొని నిల్చుఁ బద్యఁ మపుడు
    సరస భావయుక్త మగుచో, శంకరార్య !

    రిప్లయితొలగించు
  14. యదుకుల తిలకిందీవర శ్యాము దురిత
    తిమిర సంహారు లోకేశు దీన బంధు
    ప్రాణికోటి నతిదయ గాపాడు వాని
    సన్ను తింతును మమ్మిల సాకుకొరకు.

    రిప్లయితొలగించు
  15. భూసారపు నర్సయ్య గారి పూరణ......

    యతిని నతికించి గణపు నియతిని గూర్చి
    తివిరి శబ్దార్థ భూషిత తిలక మలఁది
    ప్రాణ సమమైన దన్నట్లు ప్రాస నుంచి
    సహజ సుందర మందురు సరసకవులు.

    రిప్లయితొలగించు
  16. యశముఁ బడసె పద్యమ్మది యతియె చెలఁగి
    తిరిగి మొదలెట్టు చోటున తిరము నుండ
    ప్రాస లయగూర్చి నడకకున్ శ్వాసనీయ
    సరళమై మాట మంత్రమౌ ఛందమందు.

    రిప్లయితొలగించు
  17. యతులవేల యనెడు వాదమెంత యున్న
    తిరము కాదది, యొక్కటే తీరు మనదు.
    ప్రాస గలిగించు శబ్దపు పైడి సడులు
    సరస హృదయమ్ముఁ బన్నీటి చలువ ముంచు.

    రిప్లయితొలగించు
  18. యతులు మైత్రిని కోల్పోయి వెతలు మిగులు
    తిక్క రేగును గణముల తీరు గనిన
    ప్రాసకోసమై నే పడు పాట్లు చూడు
    సవ్యముగ పద్యమును వ్రాయ సత్త నాస్తి.

    రిప్లయితొలగించు
  19. యతులు మైత్రిని పాటించి యతికి నట్లు
    తిన్న నైనట్టి గణముల తీరు మెరసి
    ప్రాస భాసించ చక్కగా శ్రావ్యమైన
    సత్కవిత్వము పద్యాల సరము కాదె?

    రిప్లయితొలగించు
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ
    ి
    నిన్నటి సమస్యకు మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. కాని అంశం ఛందోబద్ధ కవిత్వం. మీరు గమనించినట్టు లేదు.

    రిప్లయితొలగించు
  21. యతియె యందమ్ము శృతియు పద్యమునకు, సుద
    తితనువున జేరు పరువాల తీరు కులుకు
    ప్రాసయున్ ప్రాసయతియును ప్రాణ మగుచు
    సరస హృదయుల రంజింపు చక్కగాను

    రిప్లయితొలగించు
  22. యతియు లేనట్టిపద్యాల గతులుమారు
    తిరుగులేనట్టి పద్యాలు దెలుప నెంచ?
    ప్రాసపట్టున యతినిల్పిపలుకుటన్న
    సరస మందున ముద్దులా సాగాగలదు
    2.యతులులేనట్టి పద్యాలు యతుల సొగసు
    తిరిగివచ్చెడి ప్రాసయే మరులు గొల్పు
    ప్రాస చందస్సు ప్రాణ మౌ పద్యములను
    సర్వు లెంచగ?కవులనుసాకినట్టె|

    రిప్లయితొలగించు
  23. యతుల ఛందస్సు సూత్రపు గతుల నరసి
    తికమక నొనర్చు గణముల తీరు నెరిగి
    ప్రాసయే వృత్తములకు ప్రాణ మంచు
    సత్కవు లెరిగి పల్కుట సఖుడ నిజము

    రిప్లయితొలగించు
  24. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    యమున గంగ నుచేరు ప్రయాగ లోన
    తిమిరమున తానమాడగ దిగులు గలిగి
    ప్రాణ భయ మెటు గల్గునో పద్యమల్ల
    సవ్య ఛందస్సు లేకున్న చవిని జూపు

    యతులు మాత్రలు గణముల గతుల నెరిగి
    తిరముగా భావ ధారల తీరు దెలిపి
    ప్రాసలవసరమగు చోట పడని కైత
    సరిగమలు లేని సంగీత సరణి యగును

    రిప్లయితొలగించు
  25. డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీరు మీ అగ్రజుల వలె పొరబడ్డారు. అంశం ‘ఛందోబద్ధ కవిత్వం’.
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తిలకు నిందీవరశ్యాము’ అనవలసింది. ‘యదుకులతిలకు నంబుదశ్యాము...’ అనండి.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మొదలెట్టు’ అన్నదాన్ని ‘మొదలిడు’ అనండి.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో యతి తప్పింది.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించు
  26. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    యశముఁ బడసె పద్యమ్మది యతియె చెలఁగి
    తిరిగి మొదలిడు చోటున తిరము నుండ
    ప్రాస లయగూర్చి నడకకున్ శ్వాసనీయ
    సరళమై మాట మంత్రమౌ ఛందమందు.

    రిప్లయితొలగించు
  27. యతి చతుర్ధ గణంబుననాది దినప
    తిగణమొండురెండుసురపతినపతులును
    ప్రాసనియమంపు బాధలు పరగకుండు
    సరస తేటగీతి యనగ సాగుచుండు.

    రిప్లయితొలగించు
  28. గురువుగారు, పొరబాటు జరిగినది. మన్నించండి.

    యతులవేల యనెడు వాదమన్నదొకటి
    తిరము కాదది, యొక్కటే తీరు మనదు.
    ప్రాస గలిగించు శబ్దపు పైడి సడులు
    సరస హృదయమ్ముఁ బన్నీటి చలువ ముంచు.

    రిప్లయితొలగించు
  29. నా మఱియొక పూరణము:

    (యతి, ప్రాస యను పదములను నిషేధించి చేసిన పూరణము)

    త్నమునఁ బద్యపాదాల నన్నిట నియ
    తిఁ దొలి మలి యక్కరంపు మైత్రినిడిన నది
    ప్రాకటమ్ముగనుం బునిస్త్రీకి వలెను
    సిని మంగళ సూత్రంపు సరణి మెఱయు!

    రిప్లయితొలగించు
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    ("లావొక్కింతయు లేదు")

    యమ దురంతము ఛందస్సు క్షమత పోయె
    తిక్క తిరిగెను నాకిక త్రిప్పటయ్యె
    ప్రాణముల్పోయె వెదకగ ప్రాస యతులు
    సఖియ! శంకరాభరణాన సుఖము లేదు :)

    రిప్లయితొలగించు


  31. యతులవి మనకేలనయా సయాటగా ప్ర
    తి పదమూ మన దారిని తిరము గాన
    ప్రాసలవి మన కేల సుభాషితముగ
    సత్య మైన పలుకు సరసంబు గాన

    జిలేబి

    రిప్లయితొలగించు