25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సమస్యాపూరణం - 1799 (నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

51 కామెంట్‌లు:

  1. పలువురు నిండిన కొలువున
    తెలివిగ తాపనిని జేసి తేకువ నుండు
    న్నెలమిని మసలుచు పెద్దల
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే
    ------------------------------
    హమ్మయ్య సంతోషంగా ఉంది .సోదరులకు స్వస్థత చేకూరిందను కుంటాను.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. కలత లెరుంగని మిత్రులు
      లలిత సరిత మరి భవాని లాస్యల తోడన్
      గలగల మనిమా టాడుతు
      నలుగురి తోఁ దిరుగు పడతి నాయిల్లాలే

      తొలగించండి
  3. శ్రీగురుభ్యోనమః

    కులమత బేధము లెంచక
    పలువురకున్ మేలు సేయు పనులొనరింప
    న్నలుపెరుగక శ్రమకోర్చుచు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  4. కలవారింటను బుట్టియు
    పలువురితో కలిసి మెలసి పనులొనరించున్
    తలలో నాలుక రీతిగ
    నలుగురితో తిరుగు పడతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  5. కలవారింటను బుట్టియు
    పలువురితో కలిసి మెలసి పనులొనరించున్
    తలలో నాలుక రీతిగ
    నలుగురితో తిరుగు పడతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఇప్పుడు నా ఆరోగ్యం ఫరవాలేదు. ధన్యవాదాలు.
    *****
    వి. యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'కలతలు+ఎరుగని' అన్నప్పుడు యడాగమం రాదు. 'లలితా సరితా' అనడం సంబోధన లవుతున్నాయి. అక్కడ 'కలత లెఱుంగని మిత్రులు /లలిత సరిత మఱి భవాని....' అన్ని.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మిత్రులందఱకు నమస్సులు!

    తరుణుల సఖ్యత కొఱకయి
    తరుణీ మండలి నొకండు స్థాపింపంగన్
    దరహాసమునం బడఁతులు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. పొలుపుగ నింటిని దిద్దుచు
    కలుముల జవరాలు వోలె కమలాక్షులతో
    తులసమ్మచుట్టు నదివో
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే!!!

    రిప్లయితొలగించండి
  10. అలుపెరుగక, సతతమ్మున్
    తలుచుచు బడుగుల వ్యథలను, దక్షతతోడన్
    పలుసేవలనొన రించుచు
    నలుగురితోఁదిరుగు పడఁతి నాయిల్లాలే

    రిప్లయితొలగించండి
  11. పరమేశ్వర ఉవాచ:

    లలితా సహస్రనామముఁ
    బలుకుచు ముత్తైదువులట వందనమనగన్
    ఫలశ్రుతి దెలిపెడు విధమున
    నలుగురితోఁ దిరుగు పడఁతి నాయిల్లాలే!

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. జలజాక్షి మిత్రుఁ సోదరి
      నలుగురి తోఁ దిరుగు పడతి, నా యిల్లాలే
      వలదని వారించిన నే
      ఫలితము లేకుండ పోయె భామిని వినదే

      తొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వారించిననూ’ అనడం గ్రామ్యం. ‘వారించిన నే|ఫలితము...’అనండి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    అలుగక పతిపై ,సతతము
    నిలువక నొకచోట ,విద్యనిచ్చుట కొఱకై
    పలువురి మన్ననలొందుచు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నాయిల్లాలే!

    రిప్లయితొలగించండి
  15. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. ఇది పునర్దత్తమైన సమస్యగా అనిపించడానికేమి గానీ, శైలజ గారి పూరణ మనోఙ్ఞంగా ఉందని చెప్పడానికి నాలుగు మాటలు. శాబ్దికంగా కాదు కానీ, భావౌన్నత్యం కారణంగా. 'తిరగడం' అన్న మాటకున్న సామాన్యార్థం, కొండొకచో దురర్థాలను ప్రక్కకు పెట్టి, 'ప్రదక్షిణించడమనే' అసామాన్యార్థం తీసుకొచ్చినందుకు.

    'కలుముల జవరాలు ........' కాకుండా ' కలుముల జవరాలి లీల' అంటే బాగుంటుందని సూచన.

    రిప్లయితొలగించండి
  17. ఇది పునర్దత్తమైన సమస్యగా అనిపించడానికేమి గానీ, శైలజ గారి పూరణ మనోఙ్ఞంగా ఉందని చెప్పడానికి నాలుగు మాటలు. శాబ్దికంగా కాదు కానీ, భావౌన్నత్యం కారణంగా. 'తిరగడం' అన్న మాటకున్న సామాన్యార్థం, కొండొకచో దురర్థాలను ప్రక్కకు పెట్టి, 'ప్రదక్షిణించడమనే' అసామాన్యార్థం తీసుకొచ్చినందుకు.

    'కలుముల జవరాలు ........' కాకుండా ' కలుముల జవరాలి లీల' అంటే బాగుంటుందని సూచన.

    రిప్లయితొలగించండి

  18. కిలకిలమని నవ్వుచు పి
    ల్లల నందర నొకట జేర్చి లాలింపుచు వా
    రలకు సుశిక్షణ నిచ్చిన
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

    రిప్లయితొలగించండి

  19. కిలకిలమని నవ్వుచు పి
    ల్లల నందర నొకట జేర్చి లాలింపుచు వా
    రలకు సుశిక్షణ నిచ్చిన
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

    రిప్లయితొలగించండి
  20. అలకా పురమున జరిగెడి
    పలురకముల సభలయందు ప్రమదము తోడ
    న్గలగల మాటలు బలుకుచు
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

    రిప్లయితొలగించండి
  21. కలకల నగవులు నగుచుచు
    పలు నుడువుల నుడువుచు నట పరిణయ సాలన్
    కలసి మెలసి నెలత లచట
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  22. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కలకల నగవులు...’ అని సవరించారు కదా! సంతోషం. ‘పరిణయశాల’ టైపాటువల్ల ‘పరిణయసాల’ అయినట్టుంది.
    *****
    డా. విష్ణ్జునందన్ గారూ,
    ఈ సమస్యను ఇంతకు ముందు ఇచ్చినట్టు నాకైతే గుర్తు లేదు. వెదికితే దొరకలేదు. బహుశా పదాలలో మార్పు ఉండవచ్చు.
    శైలజ గారి పూరణను ప్రశంసించినందుకు, సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లాలించుచు’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
    కిలకిలమని నవ్వుచు పి
    ల్లల నందర నొకట జేర్చి లాలి0చుచు వా
    రలకు సుశిక్షణ నిచ్చిన
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

    రిప్లయితొలగించండి
  24. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. “సా” చూశాను గాని సవరించ లేదు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. నాటక సాల, పురిటి సాల అని ఉన్నాయి కదా అని అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  26. సమస్య: నలుగురితో తిరుగు పడతి నా యిల్లాలే
    అలకలు వదినకు నెక్కువ
    యలసట మరదలికి నధిక మందరి యిండ్లన్
    పిలువగ చాకిరి జేయుచు
    నలుగురితో తిరుగు పడతి నా యిల్లాలే.
    (కొందరు మగవాల్లు అన్నదమ్ముల భార్యలు పని చెయ్యరనీ తన భార్య ఎక్కువ కష్టపడుతోందనీ అనుకుంటూ ఉంటారు. మన సమస్యలో అలాంటి వాళ్లకి కూడా కాస్త స్థానం ఇచ్చి తెలుగు కుటుంబ వాతావరణాన్ని స్మరిద్దామని .)

    రిప్లయితొలగించండి
  27. కవుల ఆలోచనకి సానపెట్టి మరీ పూరణలు రప్పించే శ్రీ కంది శంకరయ్య గారు ఇంత తేలిక సమస్య ఇవ్వటం నాకు ఆశ్చర్యమనిపించింది.మా మీద సానుభూతి కలిగిందేమో !

    రిప్లయితొలగించండి
  28. కవుల ఆలోచనకి సానపెట్టి మరీ పూరణలు రప్పించే శ్రీ కంది శంకరయ్య గారు ఇంత తేలిక సమస్య ఇవ్వటం నాకు ఆశ్చర్యమనిపించింది.మా మీద సానుభూతి కలిగిందేమో !

    రిప్లయితొలగించండి
  29. శైలజగారు, ఎంతో అందమైన పద్యాన్ని అర్థవంతంగా సరళమైన పదాలతో చెప్పినందుకు అభినందనలు.
    గురువుగారు, తరుణీమండలి ..అన్న పద్యంలో ప్రాస పాటించబడలేదు.
    అలకల, మూతిబిగింపుల
    కలహములాడెడు చిరుతల కలతలు తొలగన్
    వలయమునందా బిడ్డలు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  30. పాత్యాశ్చ దేశాలలో ఆలుమగలు నీ పిల్లలు నాపిల్లలని కొట్టారు / మన పిల్లలని కొట్టారు అని పోట్లాడుకుంటారుట.

    కలడొకసుతుండు నాకున్
    గలరామెకిరువురు సుతలు గతమున, మాకున్
    గలిగెనిపుడొకడు, పిల్లలు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    -----------------
    ఇలువేలుపు దయ చేతను
    తొలిచూలుఁ గవకవలగుట తోయజ ముఖికిన్
    గిలకిల నగవుల పిల్లలు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  31. కలుషితభావన లెరుగని
    పలుకులు-పతిభక్తి యున్న పద్ధతు లందే
    మెలిగెడి మిత్రుల జతగా
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే
    2.విలువగు నాభరణంబులు
    గలిగియు గనుపించు నట్లు కలగొలుపులుగా
    పలుకులు బంచెడిదై |నట
    నలుగురితో దిరుగు పడతి నాయిల్లాలే

    రిప్లయితొలగించండి
  32. ధనికొండ రవిప్రసాద్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఈ బ్లాగులో పద్యాలు వ్రాస్తున్న వారిలో ఎక్కువమంది ఔత్సాహికులే. అందువల్ల సమస్యలు సాధారణంగా సులభంగా ఉండాలనే నా ప్రయత్నం.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ఊకదంపుడు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. అలుపెరుగక ప్రతి దినమున
    పలు సేవా కార్యములను భావోన్నతితో
    నిల జనులు మెచ్చ జేయుచు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    నేఁడు నా పూరణమున ’ల’ ప్రాసమునకు బదులుగా ’ర’ ప్రాసముతోఁ బ్రకటించితిని. దానినిట్లు సవరించి ప్రకటించుచుంటిని.

    నా సవరించిన పూరణము:

    నెలఁతల సఖ్యత కొఱకయి
    లలనా మండలి నొకండు లలి నడుపం దాన్
    బొలుపార నగుచుఁ బడఁతులు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే!

    రిప్లయితొలగించండి
  35. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. గురువుగారికి నమస్కారం. మీ ఆరోగ్యం బాగుందని ఆశిస్తాను. నా ఈ క్రింది పూరణ పరిశీలించగలరు.
    కం:
    కలతల బెట్టని నెలతల
    చెలిమిని తిరుగుచు నొద్దిక చెలువము కాగా
    పలువురి మనసుల గెలిచియు
    నలుగురితో దిరుగు పడతి నా యిల్లాలే!

    రిప్లయితొలగించండి
  37. వేదుల సుభద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా ఆరోగ్యం ఇప్పుడు ఫరవాలేదు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  38. గురువు గారూ,
    ధన్యవాదములు,

    వేదుల సుభద్ర గారూ,
    "నొద్దిక" వద్ద గణభంగము. ఒకసారి సరి చూడండి.

    రిప్లయితొలగించండి
  39. అలకల దీర్చుచు, దువ్వుచు
    నలకల, ముద్దిడుచు, కూడి యాడుచు నదె న
    వ్వులతో ముంగిట పిల్లలు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

    రిప్లయితొలగించండి
  40. డాక్టర్ విష్ణునందనుల ప్రశంసల నందిన శైలజ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  41. వేదుల సుభద్ర గారూ,
    మీ పద్యంలోని గణదోషాన్ని గుర్తించలేదు. ఊకదంపుడు గారు తెలియజేసారు. అక్కడ ‘చెలిమిని నొద్దిక దిరుగుచు...’ అనండి.
    *****
    ఊకదంపుడు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  42. తప్పక సరిచేస్తానండీ. ఆరవగణము నియమము కదా. ధన్యవాదాలు. సరిచేసిన పద్యమిదిగోనండి.
    కం:
    కలతల బెట్టని నెలతల
    చెలిమిని నొద్దిక తిరుగుచు చెలువము కాగా
    పలువురి మనసుల గెలిచియు
    నలుగురితో దిరుగు పడతి నా యిల్లాలే!

    రిప్లయితొలగించండి
  43. కలుగగ స్వయంవరమ్మున
    సులభముగా ద్రుపదు తనయ సూక్ష్మపు నియతి
    న్నలుగక యనుంగు తమ్ముల
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే

    రిప్లయితొలగించండి
  44. అల భాగ్యనగరి మాలున
    నలుపగు జీన్సును ధరించి నల్లని టాపున్
    కిలకిల నవ్వుచు గంతుచు
    నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే

    రిప్లయితొలగించండి