సమస్యను పరిష్కరించడంలో గోలి హనుమచ్ఛాస్త్రి గారు చూపిన ఒడుపు ప్రశంసనీయం. రాజేశ్వరమ్మ గారు,ఆ క్షణం అనే అర్థం లో తత్ +క్షణం అవుతుంది, కనుక ప్రాస తప్పుతుంది. తక్షణం అన్న పదానికి అస్తిత్వం లేదు.
రాజేశ్వరి అక్కయ్యా, మీ ప్రయత్నం ప్రశంసనీయం. భావం సందిగ్ధంగా, అసంపూర్ణంగా ఉన్నట్టుంది. ‘నగరాల విస్తరణలో అడవులు తరిగిపోగా, క్రూరజంతువులు ఊళ్ళమీద పడి గోవులను భక్షిస్తున్నాయి. ఇది పాపమెలా అవుతుంది?’ అని మీ భావం అనుకుంటాను. ప్రాసదోషాన్ని గురించి డా. విష్ణునందన్ గారి వ్యాఖ్య చూసారు కదా! ఆ పాదాన్ని ‘తరువుల| నాక్షణమే నరికి ధామ మచ్చట నిలుపన్’ అందామా? ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, పూరణలో మీరు చూపిన ఒడుపు డా. విష్ణునందన్ గారి ప్రశంసకు పాత్ర మయింది. చాల సంతోషం! మంచి పూరణ. అభినందనలు. ***** డా. విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. కానీ రెండవపాదానికి అన్వయం లేదు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
వి.యస్ ఆంజనేయులు శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవపాదంలో దోషమేమీ లేదు. కాని ‘బలహీనుల| శిక్షించుట సృష్టిధర్మ సిద్దాంతమెగా’ అంటే బాగుంటుందేమో!
పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘రాజు క్షుద్బాధ’ అన్నప్పుడు ‘జు’ గురుగు కాదు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. అన్నపరెడ్డి వారి అభ్యంతరం సహేతుకమే. సవరించండి. ****** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, ధన్యవాదాలు.
డా.విష్ణు నందన్ గారి వివరణ ఇప్పుడే చూసాను. నా పద్యము లో రెండు దోషాలు ఉన్నాయి. అందుకే సవరణ చేసి పంపుతున్నాను. ఈ పద్య రచన వలన విశేష విషయాలుతెలిసినవి. డా.విష్ణు నందన్ గారి కి మీకు కృతజ్నతాభివందనములు.
కె.ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'తక్షణ'మన్న పదం లేదు. అది 'తత్^క్షణము'. ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, క్ష సంయుక్తాక్షరం. దాని ముందున్న అక్షరం గురు వవుతుంది. 'వక్ష'లోని వ గురువే. తెలుగు పదం తర్వాత క్షతో మొదలయ్యే పదం ఉంటే ముందున్న అక్షరం గురువు కాదు. 'రాజు క్షుదబాధ' అన్నప్పుడు రాజు తెలుగు పదం కనుక జు గురువు కాదు. 'మృగరాజ క్షుద్బాధ' అన్నప్పుడు అది సంస్కృత సమాసం కనుక జ గురువవుతుంది. 'మత్ క్షుద్బాధ'అన్నప్పుడు మిగతా పాదాలలోను 'సత్ క్షత్రియ, మత్ క్షోభ...' ఇలా వ్రాయవలసి ఉంటుంది.
డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** దువ్వూరి రామమూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ***** భాగవతుల కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీరు కూడ 'తక్షణ' మన్నారు.
రక్షణ నిచ్చెడి తరువుల
రిప్లయితొలగించండితక్షణ మేనరికి యచట ధామము నిలుపన్
కుక్షిని నింపగ ప్రాణుల
బక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్
క్షమించాలి
రిప్లయితొలగించండి" భక్షించెను " అని ఉండాలి
రక్షించెద నే జూచిన
రిప్లయితొలగించండినక్షికి నగుపడగలేదు హరి ! మృగరాజే
కుక్షిని నింపగ తానే
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
రక్షించెద నే జూచిన
రిప్లయితొలగించండినక్షికి నగుపడగలేదు హరిహరి ! హరియే
కుక్షిని నింపగ తానే
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
సమస్యను పరిష్కరించడంలో గోలి హనుమచ్ఛాస్త్రి గారు చూపిన ఒడుపు ప్రశంసనీయం.
రిప్లయితొలగించండిరాజేశ్వరమ్మ గారు,ఆ క్షణం అనే అర్థం లో తత్ +క్షణం అవుతుంది, కనుక ప్రాస తప్పుతుంది. తక్షణం అన్న పదానికి అస్తిత్వం లేదు.
విష్ణునందన్ గారూ ! ధన్యోస్మి.....
రిప్లయితొలగించండిరక్షించ వలయు గోవుల
రిప్లయితొలగించండిభక్షించెను గోవు జంపి పాప మెటులగు
న్వీ క్షింతుము నరకంబును
నక్షయముగ బాపమొదవి యార్యా ! వినుమీ
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిఏ క్షితిలో మా భుక్తిగ
నిక్షేపము జేసె శివుడు నిజమని పులి తా
నా క్షుద్బాధల నోపగ
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
కుక్షికడుజ్వలించన్ హరి
రిప్లయితొలగించండిబక్షించెను గోవుఁజంపి పాపమెటులగున్
రక్షించును ప్రకృతి కరము
దక్షతతోడ సతతమ్ము ధర సత్త్వమ్మున్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం. భావం సందిగ్ధంగా, అసంపూర్ణంగా ఉన్నట్టుంది.
‘నగరాల విస్తరణలో అడవులు తరిగిపోగా, క్రూరజంతువులు ఊళ్ళమీద పడి గోవులను భక్షిస్తున్నాయి. ఇది పాపమెలా అవుతుంది?’ అని మీ భావం అనుకుంటాను.
ప్రాసదోషాన్ని గురించి డా. విష్ణునందన్ గారి వ్యాఖ్య చూసారు కదా! ఆ పాదాన్ని ‘తరువుల| నాక్షణమే నరికి ధామ మచ్చట నిలుపన్’ అందామా?
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పూరణలో మీరు చూపిన ఒడుపు డా. విష్ణునందన్ గారి ప్రశంసకు పాత్ర మయింది. చాల సంతోషం! మంచి పూరణ. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. కానీ రెండవపాదానికి అన్వయం లేదు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్షించుట బలహీనుల
రిప్లయితొలగించండివీక్షింపను సృష్టిధర్మ వేదమె యదియున్
కుక్షిని నింపు కొనగ పులి
భక్షించెను గోవుఁ జంపి పాపమెటులగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిభక్షించుట బలహీనుల
తొలగించండిశిక్షించుట సృష్టిధర్మ సిద్ధాంతమె గా
కుక్షిని నింపుకొనగపులి
భక్షించెను గోవుఁ జంపి పాపమెటులగున్
వి.యస్ ఆంజనేయులు శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో దోషమేమీ లేదు. కాని ‘బలహీనుల| శిక్షించుట సృష్టిధర్మ సిద్దాంతమెగా’ అంటే బాగుంటుందేమో!
ధన్యవాదాలు గురువు గారికి సవరిస్తాను
రిప్లయితొలగించండితీక్షణ జూపుల మృగరా
రిప్లయితొలగించండిజుక్షుద్భాధకు గురియగు చుగనియె గోవున్
తక్షణ మపైకురికిఁ దా
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
కుక్షిని నింపక తప్పదు
రిప్లయితొలగించండినీక్షితి నే జీవికయిన నిర్ద్వందముగన్
భక్షణమది కనుక పులియె
భక్షించెను గోవుఁ జంపి పాపమెటులగున్!!!
తీక్షణ పిపాసి మృగరా
రిప్లయితొలగించండిజుక్షుద్భాధకు గురియగు చుగనియె గోవున్
తక్షణ మపైకురికిఁ దా
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
శైలజ గారూ- తప్పదు/ (నీ)క్షితి - తప్పదు+ ఈ క్షితి - నకారము రాదుగదా అక్కడ.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కారములతో
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి
భక్షించు ప్రాణి బ్రాణియె
నీక్షితి ; "క్యాబినహి" యని, మతేతర బుద్ధిన్
వీక్షింపకుండ జాలిని
భక్షించెను గోవు జంపి పాపమెటులగున్ !!
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘రాజు క్షుద్బాధ’ అన్నప్పుడు ‘జు’ గురుగు కాదు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అన్నపరెడ్డి వారి అభ్యంతరం సహేతుకమే. సవరించండి.
******
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.
గురుమూర్తి ఆచారి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ప్రాణియె| యీక్షితి...’ అనండి.
పక్షి క్రిమి నేమి చేసెను?
రిప్లయితొలగించండినీ క్షితిని దురంతపాపి యెటు లొకఁ డయ్యెన్?
రక్షించినచో దీనుల?
భక్షించెను; గోవుఁ జంపి; పాప మెటు లగున్.
.అక్షయముగాని యాకలి
రిప్లయితొలగించండిభక్షించెను గోవుజంపి| పాపమెటులగున్?
కక్షయు గాదే తిండియె
రక్షణగాబట్టి”పులులురయమున జంపున్
2తక్షణ మాకలిజంపగ
బక్షించెను గోవుజంపి-పాపమెటు లగున్?
కుక్షిని కుదురుగ నిలుపగ
శిక్షణలో నేర్పు తల్లిసింహమువిధిగా
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
రిప్లయితొలగించండి“శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోము ఖాఙ్గేషు యే”
ఈ పాదము లో నన్నయ భట్టారకుడు “వక్షోము” లో వ గురువు గానే తీసు కున్నారు గదా !
సంశయము తీర్ప గోర్తాను.
తీక్షణ పిపాసి కేసరి
రిప్లయితొలగించండితత్ క్షుద్భాధకుగురియగు తరిగనె గోవున్
తక్షణమ పైకురికిఁ దా
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
నమస్కారములు
రిప్లయితొలగించండిపొరబాటును తెలిపి నందులకు గురువులు శ్రీ శంకరయ్య గారికి ,డాక్టర్ శ్రీ విష్ణునందన్ గారికీ ధన్య వాదములు
తీక్షణ పిపాసి కేసరి
రిప్లయితొలగించండికుక్షిన తాపమొ దవంగ గోవుం గనియెన్
వీక్షించి పైకురికిఁ దా
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.
డా.విష్ణు నందన్ గారి వివరణ ఇప్పుడే చూసాను. నా పద్యము లో రెండు దోషాలు ఉన్నాయి. అందుకే సవరణ చేసి పంపుతున్నాను. ఈ పద్య రచన వలన విశేష విషయాలుతెలిసినవి. డా.విష్ణు నందన్ గారి కి మీకు కృతజ్నతాభివందనములు.
“తత్ “ అను అక్షరము (నిన్, కున్ ల వలె ) ఒక్క అక్షరము గానే పరిగణ అవుతుంది కద. అప్పుడు ప్రాస స్థానము లో ” క్ష” ఉండవచ్చును గదా! అని నా అభిప్రాయము.
రిప్లయితొలగించండి"కుక్షిని నింపుట కొరకై
రిప్లయితొలగించండిభక్షించెను గోవు జంప పాప మెటులగున్"
రూక్షంబుగ గని యాహ
ర్యక్షము సమవర్తి నడిగెయాగ్రహ మొదవన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండికుక్షింభరి గోవొక వని
నక్షయ ఘాసమునుఁ దినఁగ, నవ్వేళనె హ
ర్యక్ష మొకం డట క్షుథఁ జని,
భక్షించెను గోవుఁ జంపి! పాప మెటు లగున్?
.
"కుక్షిని నింపుట కొరకై
రిప్లయితొలగించండిభక్షించెను గోవు జంప పాప మెటులగున్"
రూక్షంబుగ గని యాహ
ర్యక్షము సమవర్తి నడిగెయాగ్రహ మొదవన్.
ఈక్షితి మాంత్రికుఁడొక్కడు
రిప్లయితొలగించండివీక్షించగ జనులు పెక్కు వింతలనే ప్ర
త్యక్షముఁజేయుచునౌరా!
భక్షించెను గోవుఁజంపి పాపమెటులగున్.
ఈక్షితి మాంత్రికుఁడొక్కడు
రిప్లయితొలగించండివీక్షించగ జనులు పెక్కు వింతలనే ప్ర
త్యక్షముఁజేయుచునౌరా!
భక్షించెను గోవుఁజంపి పాపమెటులగున్.
దాక్షిణ్యముఁ గ్రూరమృగ
రిప్లయితొలగించండిమ్మీక్షితినన్ జూపకుండ మ్రింగగ బుట్టెన్
కుక్షిని నింపగ పులి యట
భక్షించెను గోవుఁ జంపి పాపమెటులగున్?
శ్రీ భాగవతుల కృష్ణారవు గారి పూరణ
రిప్లయితొలగించండికుక్షికి గోముఖ వ్యాఘ్రము
భక్షించెను గోవుజంపి; పాపమెటులగున్
రక్షకభటులది గాంచుచు
తక్షణమేదాని గూల్చి ధైర్యము జూపన్
రాక్షసుడు కానలోగని
భక్షించెను గోవుజంపి;పాపమెటులగున్
శిక్షించగ దుష్టునొకని
రక్షణ గల్పింప రామ రాజ్యమునందున్
కె.ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'తక్షణ'మన్న పదం లేదు. అది 'తత్^క్షణము'.
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
క్ష సంయుక్తాక్షరం. దాని ముందున్న అక్షరం గురు వవుతుంది. 'వక్ష'లోని వ గురువే. తెలుగు పదం తర్వాత క్షతో మొదలయ్యే పదం ఉంటే ముందున్న అక్షరం గురువు కాదు. 'రాజు క్షుదబాధ' అన్నప్పుడు రాజు తెలుగు పదం కనుక జు గురువు కాదు. 'మృగరాజ క్షుద్బాధ' అన్నప్పుడు అది సంస్కృత సమాసం కనుక జ గురువవుతుంది.
'మత్ క్షుద్బాధ'అన్నప్పుడు మిగతా పాదాలలోను 'సత్ క్షత్రియ, మత్ క్షోభ...' ఇలా వ్రాయవలసి ఉంటుంది.
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
దువ్వూరి రామమూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీరు కూడ 'తక్షణ' మన్నారు.
రిప్లయితొలగించండిరక్షణకై నుంచిన హ
ర్యక్షమ్మే మాయజేసి ఆమిషము దినెన్
కుక్షిని నింపుట కొరకై
భక్షించెను గోవు జంపి పాప మెటులగున్
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా సందేహ నివృత్తి జేశారు. కృతజ్నతలు.
రిప్లయితొలగించండిచివరిలో సవరించిన పద్యము సరిగానే ఉందిగదా.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించండిమీ సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
కాజీ ఉవాచ:
రిప్లయితొలగించండి"రక్షణ నీవే అల్లాహ్!
కక్షను గట్టినను తినము కాకిని పందిన్...
కుక్షిని నింపగ ముస్లిము
భక్షించెను గోవుఁ జంపి; పాప మెటు లగున్?"
రిప్లయితొలగించండికక్షయును లేదు క్రోధపు
తీక్షణతయు లేదు తనదు తిండి తనది యం
తే! క్షణమున సింహమురికె
భక్షించెను గోవుఁ జంపి పాప మెటులగున్!
జిలేబి