7, సెప్టెంబర్ 2015, సోమవారం

పద్య రచన - 1001

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. విద్వాన్, డాక్టర్, మూలె రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు 7396564549
  ++++++++**********+++++++++++*********++++++++++*********===========

  నాట్య కత్తెల శృంగార నర్తనమ్ము

  మదుల దోచెను రసికుల మంజులముగ ;

  సంతసంబున చప్పట్లు సభను నిండ ,

  నర్తకీ మణుల్ మురిసిరి కీర్తి మెరయ

  రిప్లయితొలగించండి
 2. సిగ్గు విడిచిన గోపికల్ యెగ్గుగొనక ,

  శ్రీ కృష్ణు మురిపింపదలచి, సింగరించి,

  హావ భావాల సొగసుల అలరజేసి,

  హరికి క్రీడాభిరామాన హారతిచ్చె.
  విద్వాన్ డాక్టర్ ,మూలె. రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు

  రిప్లయితొలగించండి
 3. రాస లీలల దేలెడు మోసగాడు
  చీర లెత్తుకు పోయిన చిలిపి దొంగ
  కన్నె మనసును దోచిన వన్నేకాడు
  చిద్వి లాసుని బ్రేమకై చెలగి ఆడె.

  రిప్లయితొలగించండి
 4. రాస లీలల దేలెడు మోసగాడు
  చీర లెత్తుకు పోయిన చిలిపి దొంగ
  కన్నె మనసును దోచిన వన్నేకాడు
  చిద్వి లాసుని బ్రేమకై చెలగి ఆడె.

  రిప్లయితొలగించండి
 5. డా. మూలె రామముని రెడ్డి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  రెండవపద్యంలో ‘గోపికల్+ఎగ్గు’ అన్నప్పుడు యడాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం. ‘సింగారించు’ సాధుశబ్దం. ‘సింగరించు’ శబ్దం లేదు.

  రిప్లయితొలగించండి
 6. సుందరాంగుల చిందు చూసి సిగ్గిలెనేమొ
  అంబరమ్మున దాగెనప్సరసలు
  నట్టువాంగననన్న బెట్టుతాశిఖివీడి
  చెట్టుపుట్టలసీమ పట్టిపోయె
  వీక్షింప సురరాజు వేయికన్నులుగోరె
  చక్షులార్ప మరచె యక్షులెల్ల
  నడకలో లయగాంచి నడనేర్వగానెంచి
  అంచకూటమి వారి పంచజేరె

  భరతమునికి వీరు గురుతు భారతమందు
  కూచిపూడిగన్న కూనలందు
  కనగ వీరి చిందు కన్నుదోయికి విందు
  భామినులనుజూడ బల్ పసందు.

  రిప్లయితొలగించండి

 7. ముద్దు గుమ్మలు నాట్యము ల్ముద్దు లొలుక
  చేయు చుండిరి చూడుము చిత్ర మందు
  వారి నృత్యభం గిమము ల నా ర యంగ
  కూచి పూడిని దోచెను కోమ లాంగి !

  రిప్లయితొలగించండి
 8. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  ‘బల్‌పసందైన’ పద్యాన్ని అందించారు. అభినందనలు.
  ‘దాగి రప్సరసలు, నట్టువాంగన గన్న, చక్షు లార్పగలేరు యక్షులెల్ల (యక్షులు బహువచనమైతే మీరు ‘మరచె’ అని ఏకవచనాన్ని ప్రయోగించారు)’ అని ఉండాలనుకుంటాను.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘నృత్యభంగిమలను నరసి చూడ’ అనండి.

  రిప్లయితొలగించండి
 9. ముగ్గురు భామలు ముందుగ
  దిగ్గునఁగూర్చుండి నాట్యతీరులుఁజూపన్
  మొగ్గలఁ బోలిన యైదుగు
  రగ్గలముగ నాడిపాడి రానందముగన్

  రిప్లయితొలగించండి
 10. ముగ్గురు భామలు ముందుగ
  దిగ్గునఁగూర్చుండి నాట్యతీరులుఁజూపన్
  మొగ్గలఁ బోలిన యైదుగు
  రగ్గలముగ నాడిపాడి రానందముగన్

  రిప్లయితొలగించండి
 11. అష్ట నాట్య దిగ్గజాతివలు భరత
  నాట్య కోవిదులు సునయనలు నతి
  సుందర వదనులును సుశ్రోణులువివిధ
  భంగిమల నలరిరి భామలిపుడు

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులకు నమస్కారములతో...
  గురుమూర్తి ఆచారి

  మధురహాసము చిలికించు మగువలార!
  హావభావము లొలికించు అతివలార!
  భరతనాట్యము చెసెడు భామలార!
  కూచిపూడిని నటియించు కొమ్మలార!
  లలిత కళను పోషించెడు లలనలార!
  అందచేతుము మీకభివందనములు

  రిప్లయితొలగించండి
 13. కదలుచు కంటిపాపలు –సకాలమునందున నాట్య మాడగా
  వదనమునందె భావనలు వాలగ?నేమరు పాటు లేకనే
  పదముల నందియల్ “పలుకుపాటకు తాళము వేయుచుండగా
  సుదతుల సుందరాకృతుల శోయగ మిచ్చట చూడ ముచ్చటే|
  2.అబలల నాట్య భంగిమలు నద్భుత శక్తుల కూర్పు నేర్పులే
  సబలగ మార్చు|మానస-ప్రశాంతికి నాట్యమె నౌషదంబుగా
  ప్రబలగ “గీత మాలికల భావన భాగ్యమె|వేష భూషణా
  విబుధుల విశ్వ శ్రేయమును విజ్ఞత లందున పంచుమార్గమే.

  రిప్లయితొలగించండి

 14. ననలవిలుకాని పంచబాణముల వంటి
  పంచభంగిమల్ నటన జూపించి తుదకు
  మూడు మోముల నెలనవ్వు పులకరించ
  లాస్య మొనరించి యర్చించె రమణి శివుని

  రిప్లయితొలగించండి
 15. అంగనల నాట్య మందున
  భంగిమల ఘనత నెంచ బహు రమ్యమటన్
  నింగిని దాగిన నెలతలు
  ఛంగున దిగివచ్చి రనగ సౌరులు విరియన్

  రిప్లయితొలగించండి
 16. భరతనాట్య మన్న భామల కెల్లను
  మక్కు వెక్కు వుండు మహిని జూడ
  హావ భావములను యభినయంబులగని
  జనులు మెచ్చు చుండ జయము గల్గు.


  రిప్లయితొలగించండి
 17. అష్టవిధ భంగిమలతోడ నద్భుతముగ
  కోమలంత నర్తిలు చుండ్రి కూచిపూడి
  జూచు వారికి కనువిందు చోద్యమొప్ప
  మెఱుగు బోడుల మెచ్చరే ధరణి జనులు!!!

  రిప్లయితొలగించండి
 18. సుందర నాట్య ప్రదర్శన
  మెందులకో తెలిసె మాకు నీ క్షణమందే
  సందడిగా పద్యరచన
  మందగ వెయ్యిన్నొకటి నానందముగన్!

  రిప్లయితొలగించండి
 19. భూసారపు నర్సయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  ధన్యవాదాలు.
  మీ వలె కవిమిత్రులందరూ మిగిలినవారి పూరణలను, పద్యాలను ప్రశంసిస్తే వారికి ప్రోత్సాహం లభించి మునుముందు చక్కని పద్యాలు వ్రాస్తారు.
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****

  రిప్లయితొలగించండి
 20. భారతీయ కళల ప్రాభవంబును చాటు
  నృత్యరీతు లెన్నొ నిండియున్న
  కళల ధాత్రి భరత కల్పమే ఘనమురా
  విశ్వమందుమేటి విమల ధరణి

  రిప్లయితొలగించండి
 21. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి