22, సెప్టెంబర్ 2015, మంగళవారం

పద్య రచన - 1014

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:



  1. 1ఆ.వె: చిన్న తనము నందు చిన్న పిల్లలు చేరి
    చెక్క బొంగరముల చింత లేక
    నాకలనుచు రాక నరచేత త్రిప్పుచు
    నాడు చుండి రెల్ల నలుపు లేక.
    2.ఆ.వె: బొంగరాల యాట భూతకాలంబయ్యె
    ఆంగ్ల విద్య లెల్ల యాట లయ్యె
    దేశి యాట లెల్ల దేహపుష్టి యనెడి
    మాట మరచి రెల్ల మహిని జనులు

    రిప్లయితొలగించండి
  2. అరచేతను బొంగరమును
    గిరగిరఁ ద్రిప్పెడు పటిమను గెల్చితివౌరా!
    నిరతము శ్రమించి నంతనె
    ధరాతలమ్ముంచగలవు తపియించుమురా!

    రిప్లయితొలగించండి
  3. బొంగరముల ఆట బొమ్మలె మిగిలెను
    నేడు గాంచ లేము నేల మీద
    సెల్లు ఫోను లొకటె చెల్లును ధరలోన
    మిగత ఆట లన్ని మింటిగెగసె

    రిప్లయితొలగించండి
  4. అర చేతిన బొంగరమును
    గిరగిర త్రిప్పేటి నేర్పు గెలుపే నీకై
    స్థిరమై యుంటను దెలుపును
    ధరపై నిపుణతకు విలువతథ్యంబెపుడున్ !!!

    రిప్లయితొలగించండి
  5. గిరగిర తిరుగెడు బొంగర
    మరచేతిన నిలు పుకొనుటె యద్భుత మనుచున్
    మురిసెడు బాలుర కిలలో
    సరితూ గరు రాజులైన సంబర మందున్

    రిప్లయితొలగించండి
  6. ఆడుచుండెను బాలుడు చూడు మచట
    యుంగ రమ్మును వోలెను బొంగ రమును
    ద్రిప్పు చుండెను గిరగిర తిరుగు నటుల
    తనదు నఱ చేతి పైనను దన్మయతన

    రిప్లయితొలగించండి
  7. నేలను తిరిగెడు దానిని
    వీలుగ నరజేత బెట్టి వేడుక తోడన్
    మేలుగ నా బొంగరమును
    బాలకుడట దిప్పుచుండె ప్రావీణ్యముగన్!!!

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి
    (మిడిసి పడకుమోయి మానవా)

    గిర్రు గిర్రున తిరిగెడు బొంగరము వోలె :-
    కూలె దీవు తుదకు నేలపైన ,
    నెంత మిడిసి పడిన నెప్పుడో యొకసారి;
    మంచితనము గలిగి మనుము జీవ !

    రిప్లయితొలగించండి
  9. శైశవంపు క్రీడ లొసగు సంతసంబు
    వర్ష త్రయమున రయమున పాప ననుప
    మూల ధనమిచ్చి బడులకు ముద్దు గూల్చ
    బొంగరపుటాటలు గనము పురము లనిక

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమః

    బొంగరమే తనపాలిట
    బంగారమ్మనుచు నెంచె బాలుడు మదిలో
    చెంగున ద్రిప్పుచు రయమున
    భంగము వాటిల్లకుండ పట్టెను చేతన్

    రిప్లయితొలగించండి
  11. పద్మనాభుఁడే వడివెట్టు బాలుడవగ
    తరుణకరమధ్యబిందువు దధ్రువమన
    భ్రమణజనితనాదమె ప్రణవమగు పొల్కి
    తిరిగె బొంగరమ్ము తనర ధరణి కరణి.

    రిప్లయితొలగించండి
  12. బొంగరమువంటి జీవన
    పొంగులు గిరగిర దిరుగుచు పూర్తిగ బడు|ఈ
    సింగారపు జీవనమే
    బంగారంబనెడి యాశ బ్రమలె బాలా

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు మనవి....
    ప్రయాణంలో ఉండి మీ పద్యాలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. బాలపాపల కెల్ల బాల్యమునందున
    ........వేడుక కలిగించె నాడు నిద్ది
    బాలచంద్రునిలోని పౌరుషమ్మును లేపి
    ........యమరవీరుని జేసె నప్పుడిద్ది
    భూభ్రమణమ్మును పోలిక జెప్పగా
    ........నందముగా దోచు ముందు నిద్ది
    సంసార గుండాన సతమత మగుటను
    ........తిరిగెడు నిట్లని తెలుపునిద్ది

    మారె కాలమ్ము సర్వమ్ము మారె నేడు
    బాలపాపల బాల్యమ్ము చాల మారె
    నాటపాటల వయసుల నాక్రమించె
    మోయలేనట్టి భారమ్ము, మోటు క్రికెటు.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు మనవి....
    ప్రయాణంలో ఉండి మీ పద్యాలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి

  16. విద్వాన్ ,డాక్టర్,మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు
    టింగురంగ యనుచు బొంగరమును
    చేతి పైన ద్రిప్పె చిన్నవాడు;
    బొంగ రమ్ము వలెను భూమి తిరుగునన్న
    సత్య మెరుగ డోయి సత్తి బాబు .

    రిప్లయితొలగించండి
  17. విద్వాన్ ,డాక్టర్,మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు
    టింగురంగ యనుచు బొంగరమును
    చేతి పైన ద్రిప్పె చిన్నవాడు;
    బొంగ రమ్ము వలెను భూమి తిరుగునన్న
    సత్య మెరుగ డోయి సత్తి బాబు .

    రిప్లయితొలగించండి