రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శ్రీపతి శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, _/\_ ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘సర్వసిరులు’ దుష్టసమాసం. ‘సర్వధనములందు చదువు మిన్న’ అనండి. ***** డా. విష్ణునందన్ గారూ, విద్యాతత్త్వాన్ని మనోజ్ఞమూ, సహృదయరంజకమూ, శబ్దాలంకారశోభితమూ అయిన ఉత్పలమాలికలో రసబంధురంగా రచించి మాకు అనిర్వచనీయ కావ్యానందాన్ని అందించారు. శారదాసారదయాప్రసాదము వశ మ్మొనఁగూరుచుకున్న ధన్యులు మీరు! అభినందనలు, ధన్యవాదాలు. ‘విద్యాన్ సర్వత్ర పూజ్యతే’ అని రేపో మాపో పద్యరచనాంశంగా ఇవ్వాలనుకున్నాను. మీ పద్యం ఆ అవకాశం లేకుండా చేసింది! ***** పోచిరాజు కామేశ్వర రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘విద్యాధనుడు’ అని సమాసం చేయాలి. అక్కడ ‘విద్యయను ధన మొసఁగును విశ్వకీర్తి’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. మూలె రామముని రెడ్డి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. చివరిపాదంలో గణదోషం. ‘కోట్ల ధనముకూడ కొరత యగును’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ధనమది యెంత పంచినను తగ్గనిదై, మరియింతలౌను; నా శనమను మాట లేనిదయి సత్వర వృద్ధిని బుద్ధిఁ జూపుచున్, ఘనమగు కీర్తి నల్దెశల గౌరవమిబ్బడి ముబ్బడవ్వ జే సెనన యదేకదాచదువు! శ్రీ మరి యేదొకొ విద్య గానిచో!
శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** గుండు మధుసూదన్ గారూ, మీ శ్లోకం బాగుంది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** డా. విష్ణునందన్ గారి ఉత్పలమాలికను ప్రశంసించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ధనము యున్న యెడల దాచుకొనెడి యాశ ఆస్తి యున్న చోట నాస్తి ప్రేమ పంచి యిచ్చి నంత పెంచుకో దగినట్టి విద్య నేర్వ మనిషి విలువ పెరుగు. 2.దాచి పెట్ట బడున ధనమె యీ చదువని ఆర్యు లన్న మాట యక్షరాల నిజము,నెవ్వరైన నెగ్గుకు రాగల రవనిలోన తెలియ రండు వేగ. 3చదువు కొన్న వారి కధిక గౌరవమబ్బు అన్ని తావు లందు నాద్యుడగును యట్టి చదువు చదివి అధికుడ వగుమంచు తృప్తి తోడ తల్లి దీవె నొసగె
శ్రీ కంది శంకరయ్య గారు, ముందుగా మీకు నా ధన్యవాదాలు. ఎన్నో దినాల నుండి కవితా విద్యా ప్రాభవాన్ని వర్ణిస్తూ ఒక మాలిక వ్రాయాలనుకుంటూనే కాలం గడిచిపోయింది, నేటికి ఈ శంకరాభరణ వేదిక అందులకొక కారయితగా నూతమిచ్చినందులకు సంతోషం . మీ ప్రశంసా వాక్యాలకు శతథా కృతజ్ఞతలు . అలాగే శ్రీ సహదేవుడు గారికి , శ్రీ శంకరయ్య బొడ్డు గారికి ధన్యవాద పరశ్శతం.
సుకవి శ్రీ గుండు మధుసూదన్ గారికి వారి సహృదయపూర్వకాభినందనలకు యథోచిత ధన్యవాదములనర్పిస్తూ ఇచ్చట వారికొక రహస్యం వెల్లడించవలె - నేను తరచుగా ఉదయమే హాస్పిటల్ కు వెళ్లేలోగా శంకరాభరణ మొకపరి పారజూచి, నేను పూరింపగల సమస్యో, వ్రాయగల ఇతివృత్తమో ఏదైనా ఉంటే కాకితము మీద వ్రాసి, వరుసకు తమ్ముడై, కొంచెం డొక్క శుద్ధి గలిగిన వాడే కనుక ఇందులో టైపు చేసి ప్రచురింపమని ఇచ్చి వెళ్ళడం రివాజు. మళ్లీ రాత్రి వేళల్లో తీరిగ్గా సావకాశంగా సాహిత్యాధ్యయనం జరుగుతూంటుంది. అదిగో అప్పుడప్పుడు ఇలాంటి తకరారు వచ్చినప్పుడే బయటపడుతుంది ఈ విశేషం. నిపతత్ సుర నిర్ఝరిణీ అని వేరుగా వ్రాసిస్తే స్వతంత్రించి సంధి కల్పన చేయడం, తత్ జ్ఞులు అని విడదీసి వ్రాసిస్తే దాన్ని కూడా కలపడం ( తప్పు కాకపోయినప్పటికీ ) , ఇంకొక చోట ఒక అర సున్న ఎక్కువ అవడాన్ని గమనించాను ( ఆ అర సున్న వలన కూడా ప్రమాదమేం లేకుండా సరిగ్గానే సరిపోయింది ) - ఇదీ సంగతి. మీ మెచ్చుకోలుకు, మీ సౌమనస్యానికి మరోమారు ధన్యవాదాలు .
దొంగలు దోచని పెన్నిధి
రిప్లయితొలగించండిభంగము వాటిల్ల దెపుడు బహు యుక్తంబౌ
ఇంగము నేర్పెడి ధనమది
నింగిని దాటించు విద్య నిక్కము ఘనమౌ
--------------------------
ఇంగము = ఇంగితము , తెలివి ,అభిజ్ఞానము
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
ధనమున్నను లేకున్నను
కనుపాపై బ్రోచు విద్య కనకపు ధనమై
మనమున్నను లేకున్నను
ఘనకీర్తిని జగతి జాటి గౌరవమోసగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఓరోరి విశ్రామాధ్యాపక !
విద్యాభిక్ష నొసగిన అమాయకుడివి !
కాలము మారే !'డబ్బులకాలం'!
విద్యాధనం సర్వ 'ధనప్రధానం' !
జిలేబి
కవిమిత్రులకు నమస్కారములతో..
రిప్లయితొలగించండిగురుమూర్తి ఆచారి..
ధనము కన్నను మిన్న విద్యాధనమ్ము
లేశమయిన సందేహము లేదు; కాని
ధనము-జీవయంత్రమునకు+ఇంధనము; కాన
బ్రతుక నేర్చిన విద్య నేర్వవలె నోయి!
(జీవయంత్రము = జీవనమను యంత్రము)
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
_/\_
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చోరుల కశక్య మైనది
రిప్లయితొలగించండిగౌరవ మున్బుష్టి నిచ్చు గురువును జేయు
న్భారము గాదెప్పు డుమఱి
యారయ యిది గొప్ప ధనము నన్నిటి కంటెన్
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. సవరించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుణముఁ గల్గు వాని గుర్తింతురందరున్
రిప్లయితొలగించండిధనము గల్గు వాని దగ్గరౌచు!
యంగులీయకమున కందమై భాసిల్లు
రత్నమౌను విద్య రాజు మెచ్చ!
ప్రభువు దోచ లేడు పన్నురూపమ్ముతో
రిప్లయితొలగించండిమ్రుచ్చలించ లేరు మ్రుచ్చుడెవడు
పంచు చున్న కొలది ప్రాభవమ్మొందును
సర్వ సిరుల కన్న చదువు మిన్న
ప్రభువు దోచలేడు పన్నురూపమ్ముతో
తొలగించండిమ్రుచ్చలించలేడు మ్రుచ్చు డెవడు
పంచుచున్న కొలది ప్రాభవమ్మొందును
సర్వ ధనము లందు చదువు మిన్న
ప్రభువు దోచ లేడు పన్నురూపమ్ముతో
రిప్లయితొలగించండిమ్రుచ్చలించ లేరు మ్రుచ్చుడెవడు
పంచు చున్న కొలది ప్రాభవమ్మొందును
సర్వ సిరుల కన్న చదువు మిన్న
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచోరులు సంగ్రహింపని విశుద్ధ ధనమ్మిది - రాజులైన సం
రిప్లయితొలగించండిస్కారము వీడి లాగుకొన జాలని మేలి ధన మ్మభాజ్యమై
చేరిన యన్నదమ్ములకుఁ జిక్కని చక్కనిదీ ధనమ్మిఁకే
భారము గాదు మోయుటకుఁ బంచు కొలంది పెరుంగుచుండు వి
స్తారముగా విశేషముగ తామరతంపరగా సమృద్ధిగా;
భూరి వివేకమిచ్చి బుధపుంగవులన్ బొనరించు; వాక్చమ
త్కారము సందడించు కవితా వనితాభిరతి ప్రసక్తి సం
స్కారముఁ జూచు వారలకుఁ గన్నులఁ గట్టిన యట్లు జేసి మేల్
గౌరవ కీర్తులిచ్చుఁ ; ద్రిజగజ్జన మాన్యత గూర్చు ; సత్పుర
స్కారములందజేయు ; కనకమ్ములు సొమ్ములు వాహనమ్ములున్
జేరి విశేష రీతి విలసిల్లవె ? యిందిర గజ్జె కట్టి సం
చారము సేయదే పరవశమ్మున నిమ్ముగ నా గృహమ్ములో
ధీర వరేణ్యుఁడొక్కఁడు సుధీవరుఁడుండిన ; రాజ రాజులే
కోరి భజింపరే ? జనులు కూరిమి మ్రొక్కరె ? యే సభాస్థలిన్
జేరినఁబో సభాసదులు చెంగట నిల్చి కరంబు మోడ్చి స
త్కారము సేయరే బుధ ప్రకాండుని ధాటికి సాటి యేమి ? వా
గ్ధారలు శంభు శీర్ష నిపతచ్ఛుర నిర్ఝరిణీ ప్రవాహ సం
భార విలాస లాస్య విభవ ప్రభఁ జూప హృదంతరాళమం
దారటమెల్ల మానవలె ; హాయి లభింపవలెన్ ; గృపా రస
స్ఫార వచో వికాసమిఁక సారెకు సారెకుఁ జిల్కరింప దృ
క్పూరము కాల్వఁ గట్టవలెఁ ; బూనుచు హాస్య రసమ్ముఁ బల్క గం
భీరత మోము మాడ్చుకొను వెఱ్ఱియు నవ్వవలెన్ బదే పదే
మీరిన యట్టహాసములు మిన్నులు దాకఁగఁ బొట్ట చెక్కలై ;
నేరుపుతోడ రౌద్ర రస నిష్ఠ వచింపఁగఁ గాటికిన్ బదాల్
జేరిచి నింటి మూలకటఁ జేరిన వృద్ధుడు గాని క్రుద్ధుడై
పౌరుషమావహింప కరవాలముఁ బూని రణాంగణమ్ములో
వీర విహారమూనవలె ద్విట్సమవాయము సంహరించి దు
ర్వారుఁడునై చెలంగవలె ; వాసిగ శాంత రసమ్ముఁ దెల్పుచో
శూర వరేణ్యుఁడైనఁ బరశు ప్రతిపాదిత కీర్తిశాలి యా
ధీరుఁడు భార్గవుండయినఁ దీక్షణ వీక్షణముల్ నశింపఁగాఁ
దీరిన యార్తితో మనము దేట పడన్ గని శాంతి మంత్రముల్
నేరిచి ముందుకేగవలె నిక్కువమింక నయమ్ము మీర శృం
గార రసమ్ము నోటఁ బలుకన్ బలుకానక కానలందునన్
దూరి తపంబు సేయు నవధూతలు యోగులు నైనఁ జొక్కి బం
గారపు చాయతోడ నయగారముఁ జిల్కుచు గోట మీటఁ బా
ల్గారెడు గబ్బి గుబ్బల నెలంతుల డాసి యనంగ కేళిలోఁ
గూరుకుపోవలెన్ గద ! యకుంఠితమైనది వాక్కు ! శారదా
సార దయా ప్రసాదము , వశమ్మొనఁగూరుచుకున్న వానికిన్
గోరినవెల్ల దక్కు నిదిగో వచియించెద నార్యులార యో
సూరివరేణ్యులార ! పరిశోధన జేసి యబద్ధమో నిజ
మ్మో రహి మీరెరుంగవలె ! మోహన రీతి వచించినాఁడ వి
ద్యా రమణీయ తత్వమును తద్జ్ఞులు మీరలె సాక్ష్యమిద్ధరన్ !
************** ************** ***************
_/\_ _/\_ _/\_
తొలగించండివిద్య ధనునకు సమకూరువిశ్వ కీర్తి
రిప్లయితొలగించండివిద్య దానమీయ పెరుగు వింత గొలుప
విద్య యొనగూర్చుజనులకు వినయ ధనము
విద్య యొసగుగ దసకల విత్త ములను
డా.విష్ణునందన్ గారి పద్యం అద్భుమై శంకరాభరణంలో అలరించుచున్నది.
రిప్లయితొలగించండిదోచు కొనగదొరకదది దొంగలకును
రిప్లయితొలగించండిఖ్యాతి భోగ భాగ్యములను కలుగజేయు
నన్నిసుఖముల కలిగించు ననవరతము
విద్య మించిన సిరిలేదు విశ్వమందు
విద్యాధనం సర్వధన ప్రధానం
రిప్లయితొలగించండి((((((((()))))))))
విద్యయే మనుజుల వికసింప జేసెడు
మహిత సాధనంబు; మనుజులందు;
''దానకర్ణ''బిరుదు దక్కెనా రాజుకు?
కోట్ల ధనము కూడా కొరగాదొకప్పుడు.
విద్వాన్ ,డాక్టర్ , మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూర్ కడప జిల్లా 7396564549
విద్యా ధనం సర్వ ధన ప్రధానం
రిప్లయితొలగించండి(((((((******))))))))
ధనము లెన్ని యున్న దక్కవు సౌఖ్యముల్
విశ్వ మంత వెలుగు విద్య ధనము ;
కూడ బెట్ట వోయి కొండంత విద్యను
విద్య ధనమె మిన్న వెఱ్ఱి నాన్న .
విద్వాన్.మూలె . రామమునిరెడ్డి ;ప్రొద్దుటూరు ,కడప జిల్లా 7396564549
మీ పద్యములు అర్థవంతంగా ఉన్నాయండీ మిమ్మల్ని ఓ సారి కలవాలని ఉంది.నేను కూడ ప్రొద్దుటూరులోనే ఉంటున్నాను.ఎక్కడ కలవగలమో చెపితే మీ కడకు రాగలవాడను.
తొలగించండిఅక్ష రాస్యత బాధ్యతా పక్షమైన
రిప్లయితొలగించండివిద్య నవివేక మే మాన్ప?విధులయందు
స్వార్థ చింతన లేక నిస్వార్థమందు
ధనము ధాన్యము దరిజేరు|ఘనత బెరుగు|
2.”విద్య వివేకముంచి తమ వేదన మాన్పెడి నౌష దంబగా
అద్యయనాన నాయువును నాదరణంబును భక్తి భావమున్
విద్య సుగంధ బంధమును వేల్పుగ జేర్చుచు” మానసాన సద్
విద్య ధనంబు గూర్చినవివేకము మాన్పగ సర్వ సౌఖ్యముల్.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘సర్వసిరులు’ దుష్టసమాసం. ‘సర్వధనములందు చదువు మిన్న’ అనండి.
*****
డా. విష్ణునందన్ గారూ,
విద్యాతత్త్వాన్ని మనోజ్ఞమూ, సహృదయరంజకమూ, శబ్దాలంకారశోభితమూ అయిన ఉత్పలమాలికలో రసబంధురంగా రచించి మాకు అనిర్వచనీయ కావ్యానందాన్ని అందించారు. శారదాసారదయాప్రసాదము వశ మ్మొనఁగూరుచుకున్న ధన్యులు మీరు! అభినందనలు, ధన్యవాదాలు.
‘విద్యాన్ సర్వత్ర పూజ్యతే’ అని రేపో మాపో పద్యరచనాంశంగా ఇవ్వాలనుకున్నాను. మీ పద్యం ఆ అవకాశం లేకుండా చేసింది!
*****
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘విద్యాధనుడు’ అని సమాసం చేయాలి. అక్కడ ‘విద్యయను ధన మొసఁగును విశ్వకీర్తి’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
చివరిపాదంలో గణదోషం. ‘కోట్ల ధనముకూడ కొరత యగును’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సంశయము తోనే "విద్యధను" పదము వాడాను. మీ సవరణకు కృతజ్నతలు.
రిప్లయితొలగించండివిద్యయె నిగూఢ యోగము
రిప్లయితొలగించండితధ్యముగా నిచ్చు నదియె ధనమును యశమున్
విద్యయె వివేక మిడుచున్
సద్యోజాతుడుని దెలియు సన్మతి నీయున్!!!
విద్యయె కీర్తియు కనకము
విద్యయె చుట్టము గురుండు విశ్వపుడదియే
విద్యయె వీడని నేస్తము
విద్యయె నీ నీడ గాదె విశ్వము నందున్ !!!
విద్వత్కవిమిత్రులు డా.విష్ణునందన్ గారూ!
రిప్లయితొలగించండివిద్యాధనమ్ము సర్వధనప్రధాన మెట్టులగునో యుత్పలమాలికావృత్తవిరచనా ద్వారమున సమర్థవంతముగ నిరూపించినారు. శృంగారహాస్యకరుణావీరరౌద్రశాంతరసాన్వితాకుంఠితవాక్ప్రభావమును మనోరంజకముగ రసికజనమనోఽభిరామముగ నద్భుతమైన రీతిన భాసింపఁజేసినారు. సకలసూరివరేణ్యులు విద్యారమణీయతత్త్వము నవలీలగ నెఱుంగునట్లు మోహనరీతి వచించి భళీయనఁ దలలూపఁజేసినారు. మీ పద్యరచనాకౌశల మనన్యసామాన్యము! మీ కివే నా శుభాభినందనలు!
మీవంటి విద్వద్వరేణ్యుల యెదుట నాకొక చిన్న సందేహము గలదని చెప్పుటకు వెనుకాడుచు ధైర్యముసేసి చెప్పుచున్నాఁడను. మీ యుత్పలమాలికావృత్త పంచమభాగ ప్రథమపాదమందు ... "...వాగ్ధారలు శంభు శీర్ష నిపతచ్ఛుర నిర్ఝరిణీ..." యనుచోట...
’నిపతచ్ఛుర’...నిపతత్ + సుర...యనియా లేక...నిపతత్ + శుర...యనియా యని సందేహము కలిగినది. బహుశః నా సందేహము భ్రమచే కలిగినది కావచ్చును. సాహసించినందులకు మన్నింపఁగలరు. సందేహమునుం దీర్పఁగలరు. మఱొక్కమాఱభినందనలతో...
స్వస్తి.
విద్యవివేక మేర్పరచు,వింతగుయుక్తిని పంచి పెంచు|మీ
రిప్లయితొలగించండిఉద్యమమార్గమున్ దెలుపు,నుజ్వలకీర్తికి మూలమౌనుగా
అద్యయనంబుబాల్యమను నప్పటిభావన మార్చి వేసియున్
విద్య వయస్సుబేధమును వేరుగ జూడదు నేర్వ మంచి దౌ
2అక్షరంబునందు నణగిన శక్తియే
అణువుకన్నమిన్న |నధికశక్తి
యంత్ర మంత్రములకు తంత్రపు విద్యయే
నేర్వకున్నమనిషి నెగడ నగున?
3చదువన సంస్కరణంబే
పదవులు జేకూర్చి మంచి భావన లెన్నో
హృదయము జేర్చెడి మార్గము
అదనముగాసంతసంబు నందించుసుమా|
బుద్దిబునాదికే చదువు భుక్తికి,ముక్తికి శక్తి యుక్తికిన్
నొద్దిక నందు జేర్చు తగు యోర్పున నేర్పున కూర్పులుంచు,మీ
సుద్దికిసూక్ష్మతల్ నొసగు సోమరిగాకనురక్షజేయుయే
బద్దకమైన మాన్పు బడి బాటను వీడకు బాల్యమున్నచో
మిత్రులకు నమస్సులు!
రిప్లయితొలగించండి(నేను సంస్కృతమ్మున వ్రాయుట యిదియే ప్రథమము. ఈ భాషపై నంతగఁ బట్టు లేకున్నను సంస్కృతమ్మున వ్రాయవలె ననెడి యుత్సాహముతో సాహసించి వ్రాసితిని. ఇందు దొరలిన దొసఁగు లేమైన యున్నఁ దద్జ్ఞులు తెలిపినచో వినమిత వదనుండనై సవరించుకొనగలను...స్వస్తి)
ఇంద్రవజ్ర:
రాజ్ఞాధిసేవ్యం రమణీయ భాగ్యం
హర్తు ర్నచోర్యం వితర త్ప్రవృద్ధం
కల్పే ష్వదూరం వరకీర్తిదం త
ద్విద్యాధనం సర్వధనప్రధానమ్!
ధనమది యెంత పంచినను తగ్గనిదై, మరియింతలౌను; నా
రిప్లయితొలగించండిశనమను మాట లేనిదయి సత్వర వృద్ధిని బుద్ధిఁ జూపుచున్,
ఘనమగు కీర్తి నల్దెశల గౌరవమిబ్బడి ముబ్బడవ్వ జే
సెనన యదేకదాచదువు! శ్రీ మరి యేదొకొ విద్య గానిచో!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ శ్లోకం బాగుంది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారి ఉత్పలమాలికను ప్రశంసించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
ధనము యున్న యెడల దాచుకొనెడి యాశ
రిప్లయితొలగించండిఆస్తి యున్న చోట నాస్తి ప్రేమ
పంచి యిచ్చి నంత పెంచుకో దగినట్టి
విద్య నేర్వ మనిషి విలువ పెరుగు.
2.దాచి పెట్ట బడున ధనమె యీ చదువని
ఆర్యు లన్న మాట యక్షరాల
నిజము,నెవ్వరైన నెగ్గుకు రాగల
రవనిలోన తెలియ రండు వేగ.
3చదువు కొన్న వారి కధిక గౌరవమబ్బు
అన్ని తావు లందు నాద్యుడగును
యట్టి చదువు చదివి అధికుడ వగుమంచు
తృప్తి తోడ తల్లి దీవె నొసగె
డా బల్లూరి ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ధనము+ఉన్నచోట’ అన్నప్పుడు యడాగమం రాదు.‘ధనము లున్నచోట’ అనండి.
శ్రీ కంది శంకరయ్య గారు, ముందుగా మీకు నా ధన్యవాదాలు. ఎన్నో దినాల నుండి కవితా విద్యా ప్రాభవాన్ని వర్ణిస్తూ ఒక మాలిక వ్రాయాలనుకుంటూనే కాలం గడిచిపోయింది, నేటికి ఈ శంకరాభరణ వేదిక అందులకొక కారయితగా నూతమిచ్చినందులకు సంతోషం . మీ ప్రశంసా వాక్యాలకు శతథా కృతజ్ఞతలు . అలాగే శ్రీ సహదేవుడు గారికి , శ్రీ శంకరయ్య బొడ్డు గారికి ధన్యవాద పరశ్శతం.
రిప్లయితొలగించండిసుకవి శ్రీ గుండు మధుసూదన్ గారికి వారి సహృదయపూర్వకాభినందనలకు యథోచిత ధన్యవాదములనర్పిస్తూ ఇచ్చట వారికొక రహస్యం వెల్లడించవలె - నేను తరచుగా ఉదయమే హాస్పిటల్ కు వెళ్లేలోగా శంకరాభరణ మొకపరి పారజూచి, నేను పూరింపగల సమస్యో, వ్రాయగల ఇతివృత్తమో ఏదైనా ఉంటే కాకితము మీద వ్రాసి, వరుసకు తమ్ముడై, కొంచెం డొక్క శుద్ధి గలిగిన వాడే కనుక ఇందులో టైపు చేసి ప్రచురింపమని ఇచ్చి వెళ్ళడం రివాజు. మళ్లీ రాత్రి వేళల్లో తీరిగ్గా సావకాశంగా సాహిత్యాధ్యయనం జరుగుతూంటుంది. అదిగో అప్పుడప్పుడు ఇలాంటి తకరారు వచ్చినప్పుడే బయటపడుతుంది ఈ విశేషం. నిపతత్ సుర నిర్ఝరిణీ అని వేరుగా వ్రాసిస్తే స్వతంత్రించి సంధి కల్పన చేయడం, తత్ జ్ఞులు అని విడదీసి వ్రాసిస్తే దాన్ని కూడా కలపడం ( తప్పు కాకపోయినప్పటికీ ) , ఇంకొక చోట ఒక అర సున్న ఎక్కువ అవడాన్ని గమనించాను ( ఆ అర సున్న వలన కూడా ప్రమాదమేం లేకుండా సరిగ్గానే సరిపోయింది ) - ఇదీ సంగతి. మీ మెచ్చుకోలుకు, మీ సౌమనస్యానికి మరోమారు ధన్యవాదాలు .
శ్రీగురుభ్యోనమః
రిప్లయితొలగించండిశ్రీవిష్ణునందనాద్భుత
మావిష్కృతోత్పల సుకుసుమ హారము దాల్చన్
శ్రీవాణి యభిలషించును
దీవించి కవికి నొసగును దివ్యవరంబుల్
కావేరీ నది హొయలున్
దేవేరీ దీవెనలను తేనియ పలుకున్
మీ వాక్కున మిళితంబై
మా వీనుల విందు జేసె మాన్యా! సుకవీ
శ్రీ విష్ణునందన్ గారి ఉత్పలమాలిక,శ్రీ గుండు మధుసూధన్ గారి సంసృత శ్లోకము అద్భుతము. వారికి నా ప్రశంశాపూర్వక నమస్కారములు.
ధన్యవాదములు శ్రీపతి శాస్త్రిగారూ!
తొలగించండి